బాదం కా హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

badam-ka-halwa

కావల్సిన పదార్థాలు:

బాదం: 1/2cup(రాత్రంతా నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి)

పంచదార: 1/2cup లేదా 3/4cup(రుచికి సరిపడా)

పాలు: 1cup

నెయ్యి: 1/2cup

కుంకుమ పువ్వు: కొద్దిగా (పాలలో నానబెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:

1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పాన్ మొత్తం స్పెడ్ చేయాలి. అలా చేస్తే హల్వా పాన్ కు అంటుకోకుండా ఉంటుంది.

2. తర్వాత అదే పాన్ లో 1/4నీళ్ళు పోసి కాచాలి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో పంచదార వేసి, కరిగే వరకూ కలియబెట్టాలి.

3. తర్వాత అందులో బాదం పేస్ట్, మిగిలిన పాలు, కుంకుమపువ్వు కూడా వేసి మీడియం మంట మీద ఉడికించాలి. మొత్తం మిశ్రమాన్ని అడుగు అంటకుండా కలియబెడుతుండాలి.

4. మీడియం మంట మీద ఉడుకుతూ చిక్కబడుతున్నప్పుడు, పాన్ యొక్క చివర్లు డ్రై అవుతున్నట్లు కనబడుతుంది, అప్పుడు మిగిలిన నెయ్యి కూడా పోసి మరో 10 నిముషాలు కలియబెడుతూ ఉడికించుకోవాలి.

5. నెయ్యి పూర్తిగా హల్వా గ్రహిస్తుంది. తర్వాత పాన్ చివర్లకూడా అంటుకోకుండా చేస్తుంది. అప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత కూడా మరికొద్దిగా నెయ్యి వేయడం వల్ల బాదం హల్వా చాలా సాఫ్ట్ గా మారుతుంది. హల్వా చల్లబడిన తర్వాత, చక్కగా సెట్ అవుతుంది. అంతే బాదం హల్వాను చల్లగా లేదా రూం టెంపరేచర్లో సర్వ్ చేయాలి.

Be the first to comment

Leave a Reply