మోచేతులు మృదువుగా, కోమలంగా మారాలంటే…

how-to-get-rid-of-dark-elbows-and-knees-2
మోచేతులు మృదువుగా, కోమలంగా తయారవ్వాలంటే ఈ టిప్స్ పాటించండి. మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఆ సమస్య నుంచి బయట పడాలంటే చెంచా తేనెలో చక్కెర, కాస్త నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి, నలుపుదనం కూడా తగ్గుతుంది.
నిమ్మరసంలో సహజ బ్లీచింగ్‌ గుణాలు ఉంటాయి. నిమ్మకాయను సగానికి కోసి చక్కెరలో అద్ది మోచేతులపై రుద్దాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగి తేనెతో సున్నితంగా మర్దన చేయాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజింగ్‌ గుణాలను అందించి నలుపు తగ్గిస్తుంది.
రెండు బంగాళాదుంపల్ని గుజ్జుగా చేసి అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు పూతలా రాయాలి. కాసేపయ్యాక మర్దన చేసి కడిగేస్తే చర్మం చక్కగా నిగారింపును సంతరించుకుంటుంది.
అలాగే సెనగపిండి, పెరుగూ సమపాళ్లలో తీసుకుని పూతలా వేసుకోవాలి. పొడిగా అయ్యాక కాసిని నీళ్లు చల్లి మర్దన చేసుకుని కడిగేయాలి. సెనగపిండి నలుపును తగ్గిస్తుంది.

Be the first to comment

Leave a Reply