మ్యాంగో కుల్ఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

fb2ce5cf-c504-4499-bf6e-9e1ee55938f8

కావల్సిన పదార్థాలు:

పాలు: 3cups

కండెన్స్డ్ మిల్క్: 1/2cup

మామిడి గుజ్జు: 1cup

మిల్క్ పౌడర్: 1/2cup

యాలకులు: 1tsp

పంచదార: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా డీప్ బాట్ వెజల్ తీసుకొని, అందులో పాలు, కండెన్డ్స్ మిల్క్, పంచదార మరియు మిల్క్ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి స్టౌ మీద పెట్టి బాగా ఉడికించి కోవాలి.

2. కొదిసేపు బాగా ఉడికిన తర్వాత మంట పూర్తిగా తగ్గించి 15-20నిముషాలు ఉడికించుకోవాలి.

3. ఈ మిశ్రమం ఉడుకుతుండగానే అందులో యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

4. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

5. ఒక్కసారి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో మామిడి గుజ్జును వేసి బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్పీ మౌల్డ్స్ (కుల్ఫీ అచ్చుల్లో)పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. కుల్ఫీ సెట్ అయ్యే వరకూ కనీసం 6-8గంటల సమయం ఫ్రిజ్ లో ఉంచాలి.

7. 8గంటల తర్వాత కుల్ఫీ సెట్ అవ్వగానే ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మౌల్డ్స్ ను కుల్ఫీలను వేరు చేసి, సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో కుల్పీ రెడీ.

Be the first to comment

Leave a Reply