కళ్ళ క్రింద ముడుతలను మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

177019026_XS

– రోజ్ వాటర్: రోజ్ వాటర్ చర్మ రక్షణలో తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి రెండు కాటన్ బాల్స్ (పత్తి ఉండలు)రోజ్ వాటర్ లో ముంచి అలసిన కళ్ళ మీద పెట్టుకోవాలి. తర్వాత అలాగే స్ట్రెయిట్ గా వెనకకు కూర్చొని, పది నిముషాల పాటు ఏదైనా మ్యూజిక్ వింటూ విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఐస్ ప్యాక్ ను తొలగించిన తర్వాత మీ కళ్ళు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

– కీరదోశకాయ: కళ్ళ మీద రెండు చక్రాలాంటి కీరదోశకాయ ముక్కలను రెండు కళ్ళమీద పెట్టి, పది పదిహేను నిముషాల పాటు కళ్ళు మూసుకొని విశ్రాంతి పొందడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న అలసిన చర్మాన్ని కీరదోస చల్లబరిచి, ముడుతలను పోగొడుతుంది.

– సాండిల్ వుడ్ పేస్ట్: చర్మానికి సాండిల్ వుడ్ పేస్ట్ చాలా సున్నితమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కళ్ళ చుట్టూ ఉన్న చర్మానికి రక్షణ కల్పించి ప్రకాశవంతంగా మార్చుతాయి. కాబట్టి కొంచెం సాండిల్ వుడ్ పేస్ట్ కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల అలసిన చర్మం తొలగిపోయి ఫ్రెష్ గా కనబడుతారు.

Be the first to comment

Leave a Reply