ఆరోగ్యానికి చిట్కాలు

శీతాకాలం వచ్చేసింది... ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి...

2018-02-23 07:18:20 prabu

tips-for-glowing-skin-in-winter-season

సాధరణంగా మనకు ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఐతే శీతాకాలంలో కాఫీ తాగడం వల్ల కఫం పేరుకుంటుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కనుక కాఫీ, హెర్బల్‌ టీలకు దూరంగా ఉండండి. ఇంకా నీళ్లు ఎక్కువ తాగండి.

ఆకుకూరలు అధికంగా తీసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకోండి. అవసరమైతే మందులు వాడండి. ఉదయం వాకింగ్‌ చేయండి. త్వరగా నిద్రపోండి. శరీరానికి మాయిశ్చర్‌ అప్లై చేయండి. యోగాసనాలు వేయండి. తక్కువగా వేగించిన ఆహారపదార్థాలను తీసుకోండి. ఇలా చేస్తే శీతాకాలంలో అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
Posted in: ఆరోగ్యానికి చిట్కాలుTagged in: Drink Waterhealth tipswalkingwinter health tipsyoga Read more... 0 comments

భోజనం ఇలా చేస్తే ఆరోగ్యం... తెలుసుకోండి...

2018-02-22 20:19:05 prabu
lean_family_lead
చాలామందికి అసలు భోజనం ఎలా చేయాలో తెలియదు. అంటే, తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐతే భోజనం ఎలా చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భోజనం చేసే సమయంలో కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళలు ఆహారం తీసుకునేటప్పుడు కడుపును నాలుగు భాగాలుగా భావించి రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకు, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవాలి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
అయితే పెరుగును తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని, ఉసిరిక కలుపుకుని తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు గుణం వల్ల వాపును, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Posted in: ఆరోగ్యానికి చిట్కాలుTagged in: health tipsHealthy Meals Read more... 0 comments

భోజనం తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా?

2018-02-22 19:28:06 prabu
hand-washing-2
“అన్నం పరబ్రహ్మ స్వరూపం”.. సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణా దేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదీ అన్నానికి ఉన్న గొప్పదనం. అందుకే భోజనం చేయడమంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు.. వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకే వస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాంటప్పుడు ఆహారం తినేప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో? ఓ సారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్ధాం.
భోజనం ఆరగించిన తర్వాత చేతులని కంచం లేదా పళ్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడుగరాదు. తిన్నాక కేవలం చేతులని వేరొక చోట మాత్రమే కడగాలి.
అన్నం ఆరగించిన కంచాన్ని ఎప్పుడూ కూడా తిన్నచోటే వదిలేయకూడదు.
అలాగే, భోజనం పూర్తయ్యాక ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం.. ఒక్క చేత్తోనే కదా తినేది రెండు చేతులు ఎందుకు అనే లాజిక్‌ని పాటిస్తారు. కానీ, భోజనం ఆరగించిన తర్వాత తప్పకుండా రెండు చేతులూ పరిశుభ్రంగా కడుక్కోవాలి.
చివరగా అన్నం ఆరగించి, చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత చేతులతో పాటు.. మూతిని పరిశుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. అపుడే భోజనం పుష్టిగా ఆరగించినట్టు లెక్క.
Posted in: ఆరోగ్యానికి చిట్కాలుTagged in: Eatingfoodhealth tips Read more... 0 comments

గోంగూరలో ఏముందో తెలుసా?

2018-02-22 14:17:37 prabu
gongurapappucopyrightedimage1
– గోంగూర తింటే చలవ చేస్తుంది అంటుంటారు. అయితే గోంగూర వల్ల ఎన్నో లాభాలున్నాయి. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉండును. ఆక్సలిన్‌ ఆసిడ్‌ ఉన్నందున కొంచెం వగరుగా ఉంటుంది.
గోంగూరలోని విటమిన్‌ ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రేచీకటిని కూడా తగ్గిస్తుంది. చాలా తక్కువ కొవ్వు, క్యాలరీస్‌ ఉండి, మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఉన్నందున గోంగూర శరీర అధిక బరువు తగ్గించును. యాంటీ ఆక్సిండెంట్స్ సమపాళ్లలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి రక్తపోటుని సక్రమంగా ఉంచును.
ఒక కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒక రోజుకి కావాల్సిన విటమిన్‌ సి లో 53 శాతం లభించును. అందువల్ల గోంగూర చర్మ సంబంధమైన సమస్యలు పరిష్కరించును. ఎండిన గోంగూర ఆకులు పేస్ట్ చేసి గజ్జి, తామరపై రాసిన కొంతకాలానికి మంచి ఫలితం వస్తుంది. తాజా ఆకులు పేస్టు చేసి పేస్‌ప్యాక్‌‌లాగా వాడిన చర్మపు ముడతు తగ్గి గట్టిగా కాంతివంతం అవుతుంది.
గోంగూరని క్రమంగా వాడితే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గును. ప్రతి రాత్రి నిద్రకు ముందు కప్పు గోంగూర రసం తాగితే మంచి నిద్రపడుతుంది. గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది. గోంగూరలోని కాల్షియమ్‌ ఎముకలు తగ్గిపడటంలో మంచి ఫలితం ఇస్తుంది.
ముఖ్యంగా మూడు పదులు దాటినా మహిళలు గోంగూర ఒక వరం. ఐరన్‌, సోడియం, పొటాషియం అధిక పాళ్ళలో ఉన్నందున గోంగూర క్రమంగా ఇతర ఆహారంతో కలిపి తీసుకున్నచో, మహిళలకు రుతుక్రమ సమయంలో తగ్గిన శక్తి వస్తుంది.
Posted in: ఆరోగ్యానికి చిట్కాలుTagged in: gogu leavesGogu Leaves Health Benefitsgongurahealth benefitshealth tips Read more... 0 comments

దంతపుష్టి కోసం వేరుశెనగ...

2018-02-22 11:18:36 prabu
yer-fistigi-144838144030
వేరుశెనగపప్పులో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటుంది. కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. వేరు శెనగమిక్కిలి బలవర్థకమైన ఆహారం. దీనిలో బి విటమిన్‌ కూడా అధికంగా ఉంటుంది. వేరుశెనగ గింజలను పాలను కూడా కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తుంటారు.
పాలలో వేయించిన వేరు శెనగపప్పు, బెల్లం కలిపి పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆహారంగా ఇస్తుంటే మంచి టానిక్కులుగా పనిచేస్తాయి. పచ్చివేరుశెనగ పప్పులో కొంచెం ఉప్పు కలిపి తింటుంటే పండ్లు గట్టిపడడమే కాకుండా దంతాలపైన ఉండే ఎనామిల్‌ను కాపాడుతుంది.
లావుగా ఉండేవారు ఆహారానికి ఒక గంట ముందుగా గుప్పుడు వేరుశెనగపప్పులు తిని ఒక కప్పు కాఫీ గానీ టీ గానీ త్రాగితే ఆకలి మందగిస్తుంది. ఈవిధంగా ప్రతిరోజూ చేస్తుంటే కొద్దికాలంలో శరీర బరువు తగ్గిపోతుంది. జీర్ణశక్తి సరిగా లేని వారు పచ్చకామెర్లు వ్యాధి గల వారు వేరుశెనగపప్పును వైద్య సలహాలేకుండా తినకూడదు. గుండెజబ్బులవారు ఎక్కువ రక్తపోటు ఉన్నవారు వేరుశెనగలను ఎక్కువగా వాడరాదు.
Posted in: ఆరోగ్యానికి చిట్కాలుTagged in: ground nutshealth benefitshealth tipspeanut Read more... 0 comments