అందానికి చిట్కాలు

ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలంటే సింపుల్ టిప్...

2018-08-22 21:36:09 suprajakiran

images (78)

గోరువెచ్చని పాలలో కాటన్ బాల్‌ను డిప్ చేసి కనుబొమ్మల మీద అప్లై చేయాలి. మిల్క్ డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ సింపుల్ హోం రెమెడీని 5 రోజులు క్రమంగా పాటించి ఫలితాలను గమనించవచ్చు.

Posted in: అందానికి చిట్కాలుTagged in: beautybeauty tipseyebrowseyesTips To Thicken Scanty Eyebrows Read more... 0 comments

సమ్మర్ ఎఫెక్ట్ కారణంగా తలలో చెమట, దురద చికాకు పెడుతున్నాయా?

2018-08-17 14:29:58 suprajakiran

images (85)

– ఆయిల్: ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె మరియు ఆల్మండ్ ఆయిల్ ఈ మూడు ఆయిల్స్ చాలా మంచివి. కాబట్టి సమ్మర్‌లో ఈ ఆయిల్స్‌తో తలకు బాగా మసాజ్ చేయడం వల్ల జుట్టు డ్రై అవకుండా, రాలకుండా కాపాడుతుంది.

– కండిషనర్: మీ జుట్టు చాలా డ్రైగా, రఫ్‌గా మారింది అంటే హోంమేడ్ కండిషనర్‌లతో స్కాల్ఫ్, రూట్స్ బలంగా తయారవుతుంది. కాబట్టి ఇంట్లోనే ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచిది. రాత్రి మెంతులు నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి పెరుగు కలిపి పట్టించుకోవడం వల్ల చల్లటి అనుభూతి కలుగుతుంది.

– జుట్టుని లూజుగా వదిలేయడం: సమ్మర్‌లో జుట్టుని ఎక్కువసేపు టైట్‌గా ముడివేసుకోకూడదు. జుట్టుని కట్టుకోవడం వల్ల తలలో చెమట ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టుని వదిలేసి ఎంజాయ్ చేయండి.

– తలకు రక్షణ: సూర్యకిరణాలు డైరెక్ట్‌గా తలపై పడటం వల్ల జుట్టు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి జుట్టుని ప్రొటెక్ట్ చేయడం చాలా అవసరం. బయటకు వెళ్లినప్పుడల్లా ఖచ్చితంగా జుట్టుని కవర్ చేసుకోవాలి.

– కీరదోసకాయ: కీరదోసకాయ చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. మీ స్కాల్ఫ్ చల్లగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అయితే కుకుంబర్ జ్యూస్‌తో మీ జుట్టుని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోండి. లేదా దోసకాయ హెయిర్ ప్యాక్ వేసుకున్నాజుట్టు షైనింగ్‌గా, అందంగా కనిపిస్తుంది.

– నీళ్లు: జుట్టుకి నీళ్లు మంచి మెడిసిన్‌లా పనిచేస్తాయి. వారానికి రెండుసార్లు నీటితో తలను శుభ్రం చేసుకోవడం వల్ల సమ్మర్‌లో మీకు చల్లటి అనుభూతి కలుగుతుంది. ఇన్ఫెక్షన్స్, జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.

Posted in: అందానికి చిట్కాలుTagged in: beautybeauty tipshair careHair Care Tricks For The Summersummer Read more... 0 comments

ఆయిల్ స్కిన్ వారిలో సన్ టాన్ నివారించే బెస్ట్ హోం మేడ్ స్క్రబ్...

2018-08-16 21:13:08 suprajakiran

download (5)

ఆయిల్ స్కిన్ కోసం ఇది ఒక బెస్ట్ టానింగ్ స్క్రబ్. ఒక బౌల్లో గందం మరియు పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేయాలి . దీనికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి దీన్ని టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి డ్రై ఆయిన తర్వాత పూర్తిగా కడిగేసుకోవాలి.

Posted in: అందానికి చిట్కాలుTagged in: beauty tipsBest Tan Removal Scrubs For An Oily Skinhome remediesoily skinscrubskin careSun Tan Read more... 0 comments

చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే...

2018-08-16 20:34:34 suprajakiran
 capelli-neri
చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే… ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.
Posted in: అందానికి చిట్కాలుTagged in: beauty tipscurry leaveshairhair careWhite Hair Read more... 0 comments

ముడుతలకు చెక్ పెట్టే అలోవెర మరియు బొప్పాయి ప్యాక్...

2018-08-16 15:35:45 suprajakiran

How-to-Make-Papaya-and-Aloe-Vera-Face-Mask

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌కు 2 టేబుల్ స్పూన్ల పండిన బొప్పాయి గుజ్జు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత కోల్డ్ వాటర్‌తో శుభ్రం చేసుకుంటే ముడుతలను మాయం చేసుకోవచ్చు.

Posted in: అందానికి చిట్కాలుTagged in: alovera gelbeauty tipspapaya pasteskin carewrinkles Read more... 0 comments

Be the first to comment

Leave a Reply