ఇంట్లో ఉండే ఔషదాలు

జీర్ణశక్తిని కలిగించి ఆకలిని పుట్టించే వేపపూత...

2018-10-15 21:36:27 suprajakiran
good-for-digestive-health
వేపపూతకు బెల్లం, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా నీరు కలిపి నూరండి. దీనిని పచ్చడిలా ఆహారంలో తీసుకుంటే కడుపులో క్రిములు పోవడమే గాక జీర్ణశక్తిని కలిగించి ఆకలిని పుట్టిస్తుంది.
ఎండిన వేపపూతను దోరగా తగినంత నేతిలో వేయించి ఉప్పు, కారం చల్లి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Posted in: ఇంట్లో ఉండే ఔషదాలుTagged in: Good For Digestive Healthhome remediesneem flowertips Read more... 0 comments

ఎముకల పటుత్వానికి రాగి మాల్ట్ తాగండి...

2018-10-15 19:51:14 suprajakiran
ragi-malt
రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.
మధుమేహవ్యాధికి రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది.
రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్టును తాగడం మంచిది. రాగి మాల్టు ఎముకల పటుత్వానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Posted in: ఇంట్లో ఉండే ఔషదాలుTagged in: bone healthhome remediesragi maltRagi Malt Health Benefitsragi or millettips Read more... 0 comments

కరక్కాయతో కలిగే ఉపయోగాలు...

2018-10-11 22:18:02 suprajakiran
terminalia-chebula-haritaki-pictures
కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు.
పిప్పిపన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ ఖల్వంలో నూరి గోరుచుట్ట మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరుచుట్ట పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటుంటే రక్తమొలలు తగ్గిపోతాయి.
కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున రెండు పూటలా ఆముదంతో కలిపి ప్రతి నిత్యం తీసుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం రెండు భాగాలకు వేయించిన పిప్పళ్ల చూర్ణం ఒక భాగం కలిపి, మోతాదుకు పావు చెంచాడు చూర్ణం (1 గ్రాము), తేనెతో కలిపి ప్రతి 4 గంటలకూ ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది.
కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు, తేనెతో కలిపి ప్రతిరోజూ రెండు పూటలా ఇస్తూ నూనెలూ, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పథ్యం చేయిస్తే ఒకటి రెండు వారాల్లో కామెర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులనూ, మామిడిజీడిలోని పలుకులనూ సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి, తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది.
Posted in: ఇంట్లో ఉండే ఔషదాలుTagged in: haritakihealth benefitshome remediesKarakkayaKarakkaya Health Benefitstips Read more... 0 comments

వేపపూత తేనె మిశ్రమాన్ని కలిపి ప్రతిరోజూ తీసుకుంటే..

2018-10-11 13:54:35 suprajakiran
neem-tree-flower-benefits
ఎండిన వేపపూతను చూసి తేనెలో వేసి ఎండలో కొన్నాళ్ళుంచి గట్టిపడిన తర్వాత ప్రతిరోజూ ఉదయాన ఒక చెంచా చొప్పున తీసుకుంటే కఫ దోషం పోయి జీర్ణశక్తిని కలిగించడమే గాకుండా ఆకలిని పుట్టిస్తుంది.
Posted in: ఇంట్లో ఉండే ఔషదాలుTagged in: Good For Digestive Healthhome remedieshoneyneem flowertips Read more... 0 comments

జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే...

2018-10-11 12:34:19 suprajakiran
milk-pakwangali_520_092016115340
విటమిన్‌ ఎ, సిలు అధికంగా ఉండే జీలకర్రను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.
Posted in: ఇంట్లో ఉండే ఔషదాలుTagged in: good sleephome remediesjeera powdermilktips Read more... 0 comments

Be the first to comment

Leave a Reply