వంటింటి చిట్కాలు

టేస్టీ క్యాప్సికమ్ వ్రాప్ ఎలా తయారుచేయాలో చూద్దాం...హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి...

2018-02-23 08:19:28 prabu

images (18)

కావల్సిన పదార్థాలు:

గోధుమలు పిండి: 2 cups

క్యాప్సికమ్: 2 (పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటాలు: 2(మీడియంసైజువి సన్నగా తరిగినవి)

ఉల్లిపాయలు: 1 (చిన్న, చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

బ్లాక్ మిరియాలు పొడి: 1tsp

జీలకర్ర పొడి: 1tsp

పసుపు పొడి: ½ tsp

టమోటో కెచప్: 1tbsp

ఉప్పు : రుచికి సరిపడా

నూనె: 2tbsp

నీరు- 2 cups

తయారుచేయు విధానం:

1. ముందుగా గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు నీళ్ళు పోసి మృదువుగా కలిపి పెట్టుకోవాలి.

2. 10-15నిముషాల తర్వాత పిండి నుండి కొద్దిగా తీసుకొని, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లి పాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పెప్పర్ పౌడర్, జీలకర్ర, పసుపు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.

5. తర్వాత టమోటో, పచ్చిమిర్చి మరియు టమోటో కెచప్ కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. మొత్తం ఫ్రై అయిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసి , మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.

7. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

8. తర్వాత పాన్ ను వేడి చేసి రుద్దిపెట్టుకొన్న చపాతీలను ఒక టీస్పూన్ నూనె చిలకరిస్తూ పాన్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి.

9. ఒక వైపు కాలిన తర్వాత ఆ చపాతీని మరో వైపు కూడా రెండు నిముషాలు కాల్చుకోవాలి.

10. చపాతీ రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని ఈ చపాతీ రోల్ ల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న క్యాప్సికమ్ స్టఫ్ ను పెట్టి రోల్ చేయాలి.తర్వాత చేత్తో రెండు వైపులా కవర్ చేయాలి.

11. ఇలా మొత్తం చపాతీలను స్టఫ్ చేసి క్యాప్సికమ్ రోల్స్ తయారుచేసుకోవచ్చు. అంతే టేస్టీ క్యాప్సికమ్ రిసిపి రెడీ.

Posted in: వంటకాల చిట్కాలుTagged in: breakfastcapsicumcapsicum wrapcooking tipsgreen chillioniontamoatoTasty Capsicum Wrap For Breakfastwheat flour Read more... 0 comments

బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

2018-02-22 16:23:16 prabu

d18ab2dd369a82c4bdcbd63ca08ae9cd

కావాల్సిన పదార్ధాలు:

కేక్ కోసం:

చాకొలేట్ కేక్ – 1

మెత్తని క్రీమ్ – 4 కప్పులు (బీట్ చేసింది)

కాన్ చెర్రీలు – 16 (ముక్కలుగా కట్ చేసినవి)

పంచదార సిరప్ కోసం :

పంచదార – ½ కప్పు

నీళ్ళు – ¾ వంతు కప్పు

అలంకరణకు:

చాక్లెట్ కర్ల్స్ – 1 ¼ కప్పు

కాండ్ చెర్రీలు – 10 (మొత్తం)

తయారుచేసే విధానం:

1. ఒక చాకొలేట్ కేక్ కొనండి. ఎగ్ లేనివి కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి. దాన్ని 3 పొరలుగా కట్ చేయండి. ఇప్పుడు, మీరు పంచదార సిరప్ ని తయారుచేసి అందులో ఈ కేక్ ని ముంచండి. ఒక గిన్నెను తీసుకుని అందులో నీరు, పంచదార వేయండి. పంచదార నీటిలో కరిగే వరకు మరగనివ్వండి.

2. ఫ్లేవర్ కలపడానికి, మీరు బ్రాందీ, రమ్ వంటి ఎటువంటి లిక్కర్ నైనా కలపొచ్చు. మరగనిచ్చి స్టవ్ ఆపేయండి. షుగర్ సిరప్ గది ఉష్ణోగ్రతకు వచ్చే దాకా చల్లారనివ్వండి. ఇప్పుడు, పెద్ద గిన్నె తీసుకుని, క్రీమ్ ని బాగా కలపడం మొదలుపెటండి. ఆ క్రీమ్ నురగగా, మృదువుగా అయ్యేవరకు కలపండి.

3. కేక్ స్టాండ్ తీసుకుని, దానిలో ఒక కేక్ లేయర్ పెట్టండి. ఇప్పుడు, దానిమీద పంచదార సిరప్ పోయండి, దానిమీద బీట్ చేసిన క్రీమ్ ని కూడా రాయండి.

4. కేక్ పొరల మీద క్రీమ్ ని బాగా మందంగా పూయండి. ఇప్పుడు, కేక్ లేయర్ మీద చేర్రీస్ పెట్టండి. మీరు చెర్రీ మొత్తాన్ని పెట్టొచ్చు లేదా ముక్కలుగా చేసి పెట్టొచ్చు.

5. రెండవ పోరని పెట్టండి, మళ్ళీ పైలాగే అప్లై చేయండి. అలాగే మూడవ పొరను కూడా పెట్టి పై విధానాన్ని అనుసరించండి. తరువాత, కేక్ మొత్తాన్ని క్రీమ్ తో కవర్ చేసి, మృదువుగా ఉండేట్టు చేయండి. చాకొలేట్ బర్ నుండి చాకొలేట్ కర్ల్స్ తయారుచేసి, కర్ల్స్ తో కేక్ అలంకరించి, చేర్రీస్ తో కేక్ ని అలంకరించండి.

6. కేక్ పక్కల వైపు చాకొలేట్ కర్ల్స్ పుల్లలు పెట్టడం మరవకండి. మీరు ఇంట్లో చేసిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారైనట్టే.

7. దాన్ని కట్ చేసి, మీ అతిధులకు సర్వ్ చేయండి.

Posted in: వంటకాల చిట్కాలుTagged in: Black Forest Cake Recipecakecooking tipssnackssweetsvegetarian recipe Read more... 0 comments

మేతి టమోటో రైస్ బాత్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

2018-02-22 13:21:34 prabu

images

కావల్సిన పదార్థాలు:

టమోటోలు: 3 (chopped)

మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped)

అన్నం: 3 cups (cooked)

ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup

వెల్లుల్లి పేస్ట్: 2tsp

పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit)

పసుపు: 1tsp

కారం: 1tsp

జీలకర్ర: 1tsp

ధనియాలపొడి: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

జీలకర్ర: 1tsp

ఆవాలు: 1tsp

కరివేపాకు : రెండు రెమ్మలు

నూనె: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

2. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులో టమోటోలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో మెంతిఆకులు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకులు మెత్తగా ఉడికే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి నిధానంగా మొత్తం మిశ్రం కలగలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

7. అంతే హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, మేతి టమోటో రైస్ బాత్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు.

Posted in: వంటకాల చిట్కాలుTagged in: cooking tipscumin seedsgarlicgreen chilimethiMethi Tomato Rice Bath Recipeonionricetomatovegetarian recipe Read more... 0 comments

చికెన్ సమోసా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

2018-02-22 12:18:13 prabu

vegetable_samosa

కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1 కప్పు

రెడ్ చిల్లీ పెప్ప్ పౌడర్: 2టీస్పూన్స్

గరం మసాల: 1tsp

పసుపు: 1/2tsp

సోంపు పౌడర్: 1tsp

పెప్పర్ : 1/2tsp

ధనియాలపొడి: 2 tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె : డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా

ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగినవి)

అల్లం పేస్ట్ : 1tbsp

వెల్లుల్లి పేస్ట్ : 1tbsp

పచ్చిమిర్చి : 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

గుడ్డు: 1

మైదా : 2 కప్పులు

నీళ్ళు సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ మిన్స్ ను జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలగుపుకోవాలి.

2. ఈ మొత్తం మిశ్రమం బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, పిండి, గుడ్డు మరియు చిటికెడు ఉప్పు , మైదా వేసి మెత్తగా , మ్రుదువుగా పిండి కలిపి పెట్టుకోవాలి. 15 నిముషాల తర్వాత ఈ పిండి నుండి కొద్దిగా చేతిలోకి తీసుకుని, చిన్న బాల్స్ లా చేసి, ప్లాట్ గా రోల్ చేయాలి. చపాతీల్లా చుట్టుకుని, తర్వాత మద్యలో చికెన్ స్టఫ్ ను నింపి, అన్ని వైపుల క్లోజ్ చేస్తూ సమోసాల్లా ఒత్తుకోవాలి.

3. ఇలా కొన్ని సమోసాలు తయారుచేసుకున్న తర్వాత, డీప్ బాటమ్ పాన్ తీసుకుని, నూనె పోసి, వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సమోసాలను వేసి బంగారువర్ణంలోకి మారే వరకూ వేగించి, తీసి బౌల్లో పెట్టుకోవాలి.

4. నూనె ఎక్కువగా ఉన్నట్లైతే పేపర్ టవల్ మీద వేసి, కొద్దిసేపటి తర్వాత వేరే ప్లేట్ లోకి మార్పుకుని, వేడి వేడిగా సర్వ్ చేయాలి. చట్నీ , సాస్ మర్చిపోకండి.

Posted in: వంటకాల చిట్కాలుTagged in: chickencooking tipsDelicious Chicken Samosanon vegetariansamosasnacksnack recipe Read more... 0 comments

ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

2018-02-22 01:19:56 prabu

french-omelette-004

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 4 (whites only)

పాలు: 1tbsp

పెప్పర్: 1tsp

పాలక్: 1 sprig (chopped)

మెంతి: 1/2tsp

ఆయిల్: తగినంత

కొత్తిమీర: 1 sprig (chopped)

పుదీనా: 5 (chopped)

ఉప్పు: రుచికి సరిపడా

ఆలివ్ ఆయిల్: 1tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. పచ్చసొనను మీరు వేరే వంటకానికి ఉపయోగించుకోవచ్చు లేదా పడేసేయండి.

3. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న పాలాకు, మెంతి, కొత్తిమీర, పుదీనా అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

4. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి అయ్యాక అందులో బీటెన్ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి రెండు నుండి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

5. మూడు నాలుగు నిముషాల తర్వాత ఆమ్లెట్ ను ఫోల్డ్ లేదా రోల్డ్ చేసి మరి రెండు నిముషాలు ఫ్రై చేయాలి. అంతే ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ రెడీ. ఈ ఆమ్లెట్ ను ఫ్రెగా కట్ చేసిన టమోటో, లేదా కీరకాయ ముక్కలతో బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది.

Posted in: వంటకాల చిట్కాలుTagged in: cooking tipsEggEgg White Omelette With Spinachmenthimilknon vegetarian recipeoilpalakpeppersalt Read more... 0 comments