Posts Tagged ‘almond’

పెసరపప్పు పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం…శ్రావణ మాసం స్పెషల్…

images

కావల్సిన పదార్థాలు:

పెసరపప్పు: 2 cup

కొబ్బరి – 1 cup

బెల్లం – 1 cup

యాలకలు – 4 to 5

పాలు –  2 cup

ఎండు ద్రాక్ష – 10

జీడిపప్పు – 10

నెయ్యి:- 5 tbsp

1. ప్రెజర్ కుక్కర్లో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో పెసరపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

2. . తర్వాత అందులో ఒక కప్పు పెసరపప్పుకు మూడు కప్పుల నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

3. మరో పాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకూ కలియబెడుతుండాలి. ఈ బెల్లంను నీళ్ళను స్టౌ మీద పెట్టి కొద్ది సమయం ఉడికించి తర్వాత క్రింద దింపుకొని చల్లార్చుకోవాలి.

4. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి తురుము మరియు యాలకలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

5. తర్వాత కుక్కర్ లో ఆవిరి తగ్గి చల్లబడిన తర్వాత మూత తీసి అందులో బెల్లం మిశ్రమం మరియు కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి.

6. అలాగే ఇందులో రెండు కప్పుల పాలు పోసి మిక్స్ చేయాలి.

7. మరో చిన్న పాన్ లో నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, వేగించుకొని తర్వాత పెసరపప్పు కుక్కర్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే హాట్ అండ్ టేస్టీ మూగ్ దాల్ స్వీట్ రిసిపి రెడీ.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బటర్ ఫేస్ ప్యాక్…

images (21)

బటర్ – పాలు : ఆయిల్ స్కిన్ కు ఉత్తమ మార్గం బటర్ ఫేస్ ప్యాక్. ఒక బౌల్ మిల్క్ లో కొద్ది బటర్ మిక్స్ చేసి , ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బటర్ – పెరుగు : బటర్ ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

బటర్ – బాదం పొడి : గుప్పెడు బాదంను పొడి చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. కొద్ది సమయంలోనే ప్రకాశవంతమైన చర్మఛాయను మీరు పొందవచ్చు.

స్ట్రాంగ్ హెయిర్ కోసం…బాదం తినండి…

images (61)
స్ట్రాంగ్ హెయిర్ కోసం.. మష్రూమ్స్ బాదం తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మష్రుమ్స్‌లో విటిమన్స్ అధికంగా ఉన్నాయి. తృణధాన్యాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ బి2 అధికంగా ఉండటం వల్ల వీటిని స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ పొందడానికి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బయోటిన్ అధికంగా ఉండే ఫుడ్స్ ఉల్లిపాయ, బాదం, సెరల్స్, ఈస్ట్, అరటి, సాల్మన్ వంటి ఫుడ్స్ వంటివి తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. స్ట్రాంగ్ హెయిర్ కోసం ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫుడ్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్, జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది. ఇవి హెయిర్ ఫాల్ అరికడుతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ పాటించండి…

download (34)
అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాంటి హై ప్రోటీన్స్ డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో హై ప్రోటీన్సే కాకుండా క్యాలరీలు, పోషక విలువలు, ఫైబర్ కలిగి ఉంది. అందువల్ల రెగ్యులర్ డైట్‌లో ఎండుద్రాక్ష, బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి వాటిని చేర్చుకోండి.

విటమిన్-ఇతో కాలుష్యం నుంచి ఊపిరితిత్తులు సేఫ్!…

images (64)

కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను విటమిన్-ఇ తో కాపాడుకోవచ్చునని తాజా పరిశోధనలో వెల్లడైంది. పెరుగుతున్న వాహనాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. యాంత్రికయుగం కారణంగా వాహనాల్లో హడావుడి ప్రయాణం, కాలుష్యంతో అనవసరపు అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నాం. అయితే వాతావరణ కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే.. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని బ్రిటీష్ పరిశోధకులు అంటున్నారు.

విటమిన్ ఇ పుష్కలంగా లభించే.. ఆలివ్ ఆయిల్, బాదం పప్పు, సన్ ఫ్లవర్ గింజలు, అవకడోలు తీసుకోవాలి. వీటిని అధికంగా తీసుకునే వారిలో కాలుష్యంతో ఊపిరితిత్తుల్లో ఏర్పడే సమస్యలను చాలామటుకు తగ్గాయని పరిశోధనలో తేలింది. రొయ్యలు, చేపలు, బ్రొకోలీ, గుమ్మడి, ఆకుకూరల్లోనూ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

డేట్స్ , బాదం & హనీ బాల్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

img_6358_2

కావలసిన పదార్థాలు:

ఖర్జూరాలు: 1cup

బాదం: 1/2cup

నువ్వులు: 1/2cup(వేయించినవి)

ఎండుకొబ్బరి తురుము : 1/2cup

కొబ్బరి పొడి : 1/2cup

తేనె : మిశ్రమాన్ని బాల్స్ చేయడానికి తగినంత

తయారు చేయు విధానం:

1. ముందుగా బాదం పప్పును, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి(పొడి కాకూడదు, పలుకుగా ఉండాలి).

2. తర్వాత అందులో ఎండు ఖర్జూరంలోని గింజలు తీసివేపి ఖర్జూరం తొనలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి.

3. ఇప్పుడు ఈ మిశ్రమాన్నిగిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి.

4. తర్వాత ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. అంతే డేట్స్, బాదం, హనీ లడ్డు రెడీ.

అలసటకు గుడ్ బై చెప్పే ఎనర్జిటిక్ ఫుడ్స్…

download (24)

– గుమ్మడి విత్తనాలు: గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి కండర నిర్మాణం, కండర శక్తికి బాగా సహాయపడుతాయి. విటమిన్స్ మరియు హెల్తీ ఫ్యాట్, మెగ్నీషియం వంటివి ఎనర్జీని పెంపొందిస్థాయి.

– వాల్ నట్స్: మన శరీరంలోని కణజాలాలకు అవసరం అయ్యే శక్తిని అంధించడానికి నట్స్‌లో అనేక ఎంజైములు ఉన్నాయి. కాబట్టి, రోజులో కాస్త అలసట అనిపించినప్పుడు ఈ నట్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవడం చాలా ఉపయోగకరం. తక్షణ శక్తిని అంధిస్తాయి. అలసటను దూరం చేస్తాయి. మనస్సును ఉత్తేజపరుస్తాయి.

– ఓట్స్: ఓట్స్ ఫర్ఫెక్ట్ ఫుడ్ ఇది అలసటను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ బాగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ మరియు మజిల్స్‌కు అవసరం అయ్యే కార్బోహైడ్రేట్స్‌ను అందిస్తుంది. దాంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు విటమిన్ B1 పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతాయి.

– పెరుగు: పెరుగు ఎనర్జీ బూస్టింగ్ స్నాక్‌గా చెబుతారు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణిక్రియకు అద్భుతంగా సహాయపడుతాయి. ఇవి నిస్సత్తువు కలిగి వ్యాధినిరోధక క్రియతో పోరాడి ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది.

– పుచ్చకాయ: పుచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి హైడ్రేషన్ మాత్రమే కలిగించడం కాదు. పుచ్చకాయలో ఉండే అధిక శాతం నీరు, తగినంత హైడ్రేషన్‌తో పాటు ఎనర్జీని అంధించే B విటమిన్స్, పొటాషియం మరియు ఫ్రక్టోస్ పుష్కలంగా ఉంటుంది.

– అరటిపండ్లు: అరటి పండ్లలో అధిక శాతంలో పొటాషియం మరియు B విటమిన్స్ కలిగి ఉండటం వల్ల అరటిపండ్లు జీర్ణవ్యవస్థను నిదానం చేస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. అలసిన శరీరానికి గ్లూకోజ్‌ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది. రక్తంలోని హేమోగ్లోబిన్ అవసరమైన ఐరన్ అందిస్తుంది. ఎంతో శక్తి కలిగి భావిస్తారు.

– బాదం: బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం మరియు విటమిన్ B12 వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్ జాబితాలో చేర్చబడింది. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి మరియు ఆందోళను దూరంగా ఉంచడానికి సహాయడపతుంది.

– గ్రీన్ టీ: ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అది మానవ మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్‌గా ప్రభావం చూపెడుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి ఉపయోగపడే ఫేస్‌ప్యాక్…

images-2

చర్మ సంరక్షణకు బాదంను ఉపయోగించడం మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే బాదం, షుగర్ పౌడర్ ను కొద్దిగా నీటితో మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేసి, స్ర్కబ్ చేయడం వల్ల స్క్రబ్బింగ్ గా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి చర్మం తెల్లగా మారడానికి సహాయపడుతుంది.

బాదంపప్పు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

download (45)

బాదంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్‌కి, బ్రెయిన్‌కి మరియు స్కిన్‌కి మంచిది. అలాగే ఆల్మండ్స్‌లో విటమిన్ E, మెగ్నీషియం మరియు  పొటాషియం ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదంపప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

చీజ్ అండ్ బాదం బిస్కెట్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (74)

కావల్సిన పదార్థాలు:

గోధుమపిండి – 2 cups

చీజ్ తురుము – 1 cup

బాదం – 1 cup (సన్నగా తురుముకోవాలి)

పంచదార – 1/4th cup

బట్టర్ – 1/2 cup

పాలు – 1/2 cup

బేకింగ్ సాల్ట్: 1/4tsp

తయారుచేయు విధానం:

1. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, బట్టర్, షుగర్ మరియు బేకింగ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.

2. తర్వాత చీజ్ మరియు బాదం తురుము కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.

3. ఇప్పుడు అందులోనే పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, అందులో కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని పోసి ఒక అంగుళం మందంగా ఒకే లెవల్లో పాన్ మొత్తం సర్ధాలి.

5. ఇప్పుడు కుక్కీస్ కటర్ ఉపయోగించి పిండిని సమంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బిస్కెట్ ట్రే లేదా బేకింగ్ ట్రేలోకి మార్చుకోవాలి.

6. ఈ ట్రేను ఓవేన్ లో పెట్టి 180డిగ్రీల్లో 15-18నిముషాలు బేక్ చేసుకోవాలి.

7. 15 నిముషాలు అయిన తర్వాత ఓవెన్ లో నుండి బస్కెట్స్ ను బయటకు తియ్యాలి. అంతే సర్వింగ్ ప్లేట్ లో అమర్చి ఇంట్లో వారికి సర్వ్ చేయాలి.