Posts Tagged ‘almonds’

గసగసాలతో స్వీట్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (4)

కావల్సిన పదార్థాలు:

గసగసాల : 100grms

చక్కెర: 1/2cup

పాలు: 2cups

నెయ్యి : 1/2cup

ఏలకులు : 4-5(పొడి చేసుకోవాలి)

బాదం: 5-6(గార్నిష్ చేయడానికి)

తయారుచేయు విధానం:

1. ముందుగా గసగసాలను శుభ్రంగా కడిగి, సన్నగా ఉన్న మట్టి, దుమ్మును తొలగించాలి. (చాలా చిన్నగా ఉండటం వల్ల కాఫీ ఫిల్టర్ లేదా కాఫీ స్ట్రెయినర్‌లో వేసి శుభ్రం చేయాలి)

2. తర్వాత నీరు పూర్తిగా కారిపోయే వరకూ అలాగే ఉంచాలి.

3. తర్వత స్టౌ మీద మంద పాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో గసగసాలు వేసి, తక్కువ మంట మీద అవి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ అలాగే ఉండనివ్వాలి.

4. ఇప్పుడు అందులో పాలు పోసి మరిగించాలి. అలాగే యాలకలపొడి వేసి మీడియం మంట మీద మొత్తం పాలు గట్టిగా ఇమిరిపోయే వరకూ మీడియం మంట మీద ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

5. పాలు బాగా మరుగుతున్నప్పుడే, అందులో షుగర్ కూడా జోడించి బాగా మిక్స్ చేయాలి. పాలు చిక్కబడి, గసగసాలతో కలిసిపోయి మొత్తగా ఉడికి హల్వ లా తయారైనప్పుడు బాదంతో గార్నిష్ చేయాలి.

ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు… తింటే ఏమవుతుంది?

108693
గుండె జబ్బులు వయసుతో సంబందం లేకుండా వస్తున్నాయి. వీటిని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
జీడిపప్పు : గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో లభ్యమవుతుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో ఉన్నాయి కాబట్టి దీనిని విరివిగా వాడండి.
బాదం : బాదం పప్పులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ బాదం పప్పలు తింటే శరీరంలో హానికర కొవ్వునిల్వలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండే ఫోలేట్, ఇతర బి విటమిన్లు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధిస్తాయి.
వాల్‌నట్స్ : ఒమెగా-3 ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అధిక రక్తపోటునూ హానికర కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రిస్తుంది. వీటికుండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి. కొన్నిరకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి.
ఎండుద్రాక్ష : వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం ఎముకలపై దుష్ప్రభావం చూపి ఆస్టియోపోరోసిస్‌కి దారితీస్తుంది. అలాకాకుండా, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరాన్ అనే ఖనిజలవణం ఎండు ద్రాక్షలో లభ్యమవుతుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

అటుకుల పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం…

poha-kheer

కావలసిన పదార్థలు:

పాలు: 1/2ltr

వెన్న : 50grm

అటుకులు : 100grm

జీడిపప్పు : 10grm

కిస్‌మిస్ : 10grm

బాదం పప్పు : 10grm

ఏలకుల పొడి : 1tsp

కొబ్బరి తురుము : 1cup

బెల్లం తురుము : 1/2kg

తయారు చేయు విధానం:

1. ఒక గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి.

2. తరవాత అందులో బెల్లం తురుము వేసి బాగా కలిసిన తరవాత అందులో అటుకులు వేసి సుమారు పావుగంట సేపు ఉడికించాలి.

3. అంతలోపు చిన్న పాన్ లో నెయ్యి వేసి కరిగిన తరవాత అందులో జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పు వేసి వేయించి ఉడుకుతున్న పాయసంలో వేసి ఒక నిముషం ఉంచి దించే ముందు ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే అటుకుల పాయం రెడీ.

బాదంపప్పును నానబెట్టి తినండి.. బరువు తగ్గండి…

download (5)
ఆరోగ్యానికి బాదంపప్పు ఎంతో మంచిది. ముఖ్యంగా నానబెట్టిన బాదంపప్పు అయితే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. బాదంలోని విటమిన్ E, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్లు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా ఉంచుతాయి. అంతేగాకుండా చక్కటి రక్త ప్రసరణకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు, కండరాలు, నరాల పనితీరు సవ్యంగా సాగేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది.
బాదం పప్పును నీళ్లలో నానబెట్టడం ఎందుకంటే..  బాదంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదేకనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. తద్వారా జీర్ణక్రియ సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని ఒంచి వేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. ఇలా బాదం పప్పును నానబెట్టి తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. గుండెను పదిలం చేసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సగ్గుబియ్యం(సాబూదాన) – క్యారట్ పాయసం ఎలా తయారుచేయాలో చుద్దాం…

images (6)

కావలసినపదార్థాలు:

సగ్గుబియ్యం (సాబూదాన్) – 1/2cup

పాలు – 1/2ltr

పంచదార – 250grms

క్యారట్ తురుము – 1cup

బాదంపప్పులు – 1/2cup (దోరగా వేయించి పొడి చేయాలి)

ఏలకుల పొడి – 1tsp

కుంకుమపువ్వు – 1/4tsp

నెయ్యి – 2tbsp

జీడిపప్పు, కిస్‌మిస్ – గార్నిషింగ్ కు సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి.

2. తర్వాత పాలను మరిగించాలి.

3. అదే సమయంలో సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి.

4. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి.

5. అదే పాన్ లో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి.

6. ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి.

7. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి 10 నిముషాలు ఉంచాలి.

8. చివరగా వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి. అంతే క్యారెట్ సాబుదాన పాయసం రెడీ.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ డ్రైఫ్రూట్ ఇడ్లీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

Idli

కావలసిన పదార్థాలు:

ఖర్జూరాలు: 6 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)

జీడిపప్పులు: 20 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)

కిస్‌మిస్: 20 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)

బాదం పలుకులు: 10 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)

ఇడ్లీపిండి: పది ఇడ్లీలకు సరిపడేంత

నెయ్యి: 2tbsp

పచ్చికొ బ్బరి తురుము: 1/2cup

చెర్రీస్: 6

క్యారట్ తురుము: 1/2cup

తేనె: 4tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలలో వేసి స్టౌ మీద ఉంచాలి. తర్వాత మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

2. ఇడ్లీలు సగం ఉడికిన తరువాత ఒకసారి మూత తీసి, కట్ చేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు ఇడ్లీల మీద వేసి మళ్లీ మూత పెట్టేయాలి.

3. బాగా ఉడికిన ఇడ్లీలను టిఫిన్ ప్లేట్లలోకి తీసుకొని పైన కొద్దికొద్దిగా నెయ్యి వేసి దాని మీద క్యారట్ తురుము, కొబ్బరి తురుము, తేనె వేసి, చెర్రీస్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. వీటిని పిల్లలు బాగా ఇష్టపడతారు. అంతే కాదు పిల్లల టిఫిన్, లంచ్ బాక్స్ లకు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ఇడ్లీ బాగా నప్పుతుంది.

క్యారెట్ బర్ఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

carrot_burfi (1)

కావలసిన పదార్థాలు:

క్యారెట్ తురుము – 1 cup

కొబ్బరి తురుము – 1 cup

పంచదార – 1cup

నెయ్యి / డాల్డా – 100 grms

ద్రాక్ష – 25 grms

యాలకలు – 4

జీడిపప్పు – 25 grms

బాదం – 25 grms

పిస్తా – 25 grms

తయారు చేయు విదానం:

1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి తురిమి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి అందులో వేసి కొంచెం దోరగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి.

2. అదే పాన్ లో మరి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఒక బౌల్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి, యాలకల పొడి చల్లి బాగా కలపాలి కొద్దిగా వేడి అయిన తర్వాత వేయించి పెట్టుకొన్న డ్రై ఫ్రూట్స్ లో సగ బాగాన్ని అందులో వేసి బాగా కాచి ముదురు పాకం వచ్చేవరకు స్పూన్ తో కలుపుతూ ఉండాలి.

4. పంచదార పాకం దగ్గర పడే సమయంలో అందులో వేయించి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి తురుము అందులో వేసి కొద్దిగా గట్టిపడ్డాక, ఆ మిశ్రమాన్ని తీసి మందపాటి వెడల్పైన ప్లేటుకు కొద్దిగా నెయ్యి రాసి అందులో వేసి దాని మీద కూడా డ్రై ఫ్రూట్స్ చల్లి ఆరిన తర్వాత మనకు కావలసిన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేయవచ్చు.