Posts Tagged ‘Aloe Vera’

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కలబంద…

images

జుట్టు పెరుగుదలకు: ఖచ్చితంగా అలోవెర జెల్ తో జుట్టు పెరుగుదల సాధ్యం అవుతుంది. అలోవెరాను తలకు పట్టించడం వల్ల తలలో ఉండే డెడ్ స్కిన్సెల్స్ తొలగిస్తుంది. డీప్ గా పోషణను అందిస్తుంది. దాంతో హెయిర్ ఫోలిసెల్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి అలోవెరా జుట్టు పెరుగుదలకు, జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.

అలోవెర జెల్ ను కండీషనర్ గా: అలోవెరా నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది హనికలిగించే రసాయనిక హెయిర్ కండీషనర్స్ కంటే చాలా మంచిది. కాబట్టి అలోవెరా జెల్ ను మీ కేశాలకు, తల మాడుకు బాగా పట్టించి, మర్దన చేసిన తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కొబ్బరి నూనె మరియు జోజోబా ఆయిల్ తో చేర్చి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. అధినపు పోషణను అందిస్తుంది.

వేసవిలో రోజూ 3 లీటర్ల నీరు తాగండి… మజ్జిగ, కొబ్బరినీళ్లు తప్పనిసరి…

drinking-water
వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే.. రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. స్నాక్స్‌ను పక్కనబెట్టి.. మజ్జిగ, కొబ్బరి నీరు సేవిస్తుండాలి. పండ్లు, తాజా పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. శరీర ఉష్ణాన్ని తగ్గించుకునేందుకు వారానికి రెండు సార్లు ఆయిల్ బాత్ చేయాలి. జుట్టుకు మెంతులు, పేరుగు పేస్టును పట్టించాలి. సమ్మర్‌కు తగ్గట్టు హెయిర్ కట్ చేసుకోవాలి.
ఇక వేసవిలో పెదవుల పగుళ్లకు నిద్రించేందుకు ముందు పాల మీగడను పెదవులపై రాస్తే సరిపోతుంది. చర్మ సమస్యల నివారణకు కలబంద పేస్టును ఉపయోగించాలి. నిద్రించేందుకు ముందు వాస్లిన్ లేదా కొబ్బరి పాలును ముఖాని రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మ సమస్యలుండవు. వేసవి కాలంలో బయటికి వెళ్లాల్సి వస్తే బండిలో వెళ్తే తలకు హెల్మెట్ వేయడం, గొడుగు పట్టుకెళ్లడం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పరగడుపున అలోవెరా జ్యూస్ త్రాగితే పొందే సర్ప్రైజింగ్ బెనిఫిట్స్…

download (33)

1. జాయింట్ పెయిన్ నివారిస్తుంది: అలోవెర జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి జాయింట్ పెయిన్ మరియు వాపులను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతున్నాయి. అలోవెరా జ్యూస్ ను ఓరల్ గా తీసుకొన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మరియు మరియు జాయింట్ పెయిన్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. వయసు పైబడినవారికి సైతం, శరీరంలోని మలినాలను పోగొట్టి ఒత్తిడి తగ్గిస్తుంది. కీళ్ళ అరుగుదల, కీళ్ళనొప్పులవంటివి తగ్గించి కీళ్ళు బాగా పనిచేసేలా శరీర కణాలను ఉత్పత్తిచేస్తుంది.

2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: అలోవెరా జ్యూస్ ను త్రాగడానికి ఉత్తమ ప్రయోజనం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దాంతో హార్ట్ మరియు స్ట్రోక్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అలోవెరజ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం, చిన్న ప్రేగులు న్యూట్రీషియన్స్ గ్రహించేలా చేస్తుంది. ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయోరియా వంటివి తగ్గుముఖం పడతాయి.

4. ఓరల్ హెల్త్: అలోవెరా జ్యూస్ అనేక రకాల దంత సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా దంత క్షయం, చిగుళ్ళ సమస్యలు, డిజార్డర్స్ ను నివారిస్తుంది. అలోవెరా జ్యూస్ ను మౌత్ వాష్ గా కూడా తీసుకోవచ్చు. మరియు ఇది దంతాలు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ భారీన పడకుండా సహాయపడుతుంది. దంతక్షయాన్నిదూరం చేస్తుంది.

5. బరువును తగ్గిస్తుంది: ప్రతి రోజూ ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్ త్రాగడం వల్ల అది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు ఒక క్రమమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ కలబంద రసం కడుపు మరియు జీర్ణశ్రయ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది. దాంతో శరీరంలో బరువు పెరగడానికి కారణం అయ్యే అవాంఛిత పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గవచ్చు. ఇంకా ఇది హ్యాంగోవర్ సమస్యలను నివారిస్తుంది.

ఆకర్షణీయమైన కనుబొమ్మలు పొందడానికి ఎఫెక్టివ్ హోం రెమిడీస్…

download (31)

– ఆముదం: కనుబొమ్మలు అందంగా పెరగడానికి పూర్వం నుంచి ఉపయోగిస్తున్న మార్గాలలో ఆముదము ఒకటి. ఐబ్రోస్ కి ఆముదాన్ని రోజూ రాసుకుంటే అవి దట్టంగా పెరుగుతాయి. రోజు పడుకునే ముందు క్యాస్ట్రో ఆయిల్‌ రాసుకుంటే.. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

– కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను జుట్టు పెరగడానికే కాదు.. కనుబొమ్మలు పెరగడానికి ఉపయోగపడతాయి. రాత్రి పడుకోవడానికి ముందు కాస్త కొబ్బరినూనె తీసుకుని కనుబొమ్మలపై మసాజ్ చేస్తే.. వేగంగా కనుబొమ్మలు మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది.

– ఉల్లిపాయ: ఉల్లిపాయలలో సల్ఫర్‌ అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల అది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఉల్లిపాయ రసం రాయటం ద్వారా మీ కనుబొమ్మల జుట్టు వేగంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

– కొబ్బరి నూనె, నిమ్మ తొక్క: కొబ్బరి నూనె, నిమ్మ తొక్క కనుబొమ్మలు పెరిగేలా చేస్తాయి. రెండు చెంచాల కొబ్బరినూనెలో నిమ్మ తొక్కను వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఐబ్రో పలుచగా ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని రాస్తే ఐబ్రోస్ పెరుగుతాయి.

– అలోవెరా జెల్: పలుచటి ఐబ్రోస్ ఉన్నవాళ్లు అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ జెల్ రాసుకుని సున్నితంగా మర్దనా చేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే రిజల్ట్స్ మీకే తెలుస్తాయి.