Posts Tagged ‘apple paste’

జుట్టుకు మంచి కండీషనర్ కోసం…

download (56)
పావుకప్పు యాపిల్ గుజ్జులో కోడిగుడ్డులోని తెల్లసొనా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల జట్టు కండీషనర్ అయ్యి చిట్లడం వంటి సమస్యలు దరిచేరవు.

చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చే స్క్రబ్…

Article-3_Picture-3_Oatmeal-exfoliating-face-mask

ఆపిల్ గుజ్జులో గోధుమ పొట్టు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ స్క్రబ్ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.

మొటిమల తాలూకు మచ్చల సమస్య కు చిట్కాలు…

images
మొటిమల తాలూకు మచ్చలతో ముఖం కాంతి విహీనంగా కనిపిస్తున్నప్పుడు, టేబుల్ స్పూన్ యాపిల్ గుజ్జులో స్పూన్ చొప్పున తులసి పొడీ, తేనె కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె, తులసి పొడీ రెండూ యాంటీ బ్యాక్టీరియల్‌గా పని చేస్తాయి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

నలుపురంగు తగ్గి, కాంతివంతంగా మెరిసే చర్మం కోసం…

images

యాపిల్ ని గుజ్జుగా చేసి ఉడకబెట్టాలి. దానికి కొంచెం పాలల్లో నానబెట్టిన ఓట్స్‌ని జత చేసి, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ అవిసె గింజల నూనెని కలపాలి. దీన్ని మెత్తని మిశ్రమంలా చేసుకుని ముఖానికీ, మెడకీ పూతలా వేయాలి. పది నిమిషాలాగి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మంపై నలుపురంగు తగ్గిపోవడమే కాకుండా కాంతివంతంగా మెరిసిపోతుంది.