Posts Tagged ‘baking soda’

బాదుషా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (20)

కావల్సిన పదార్థాలు:

మైదా: 3cups

బట్టర్ : 1/2cup

బేకింగ్ పౌడర్: 1tsp

బేకింగ్ సోడ: 1చిటికెడు

పాలు: 1cup

పంచదార: 2కప్పులు

డ్రై కోకనట్ (తురుముకోవాలి): గార్ణిష్ కోసం కొద్దిగా

నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3కప్పుల మైద మరియు 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులోనే బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే పాలు కూడా వేసి పిండిని సాఫ్ట్ గా కలుపుకొని 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

3. 10 నిముషాల తర్వాత పిండిలో కొద్దిగా తీసుకొని బాల్ షేప్ చేసుకోవాలి. లేదా ట్రైయాంగిల్ షేప్ లో చుట్టుకోవచ్చు.

4. ఇలా అన్ని తయారుచేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాచాలి.

5. ఇప్పుడు కాగుతున్న నూనెలో రౌండ్ గా చుట్టి పెట్టుకొన్న మైదా పిండిని (పచ్చిబాదుషాను) వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. అంతలోపు మరో పాన్ స్టౌ మీద పెట్టి 3-4 కప్పుల నీళ్ళు పోసి రెండు కప్పుల పంచదార వేసి బాయిల్ చేయాలి.బాగా మరిగిస్తుంటే, షుగర్ సిరఫ్ చిక్కగా రెడీ అవుతుంది .

7. ఇప్పుడు నూనెలో వేగించుకొన్న బాదుషాలను షుగర్ సిరఫ్ లో వేయాలి. తర్వాత వాటి మీద డ్రై కోకనట్ పౌడర్ గార్నిష్ చేయాలి . అంతే ఈ ఫెస్టివల్ సీజన్ లో వేడిగా లేదా చల్లగా బాదుషాను సర్వ్ చేయవచ్చు.

తెల్లటి దంతాల కోసం హైడ్రోజన్ పెరాక్సయిడ్…

images (40)

మీ దంతాలను తెల్లగా మార్చాలి అనుకుంటే ఒక్కటే మార్గం, ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా వంటసోడాని తీసుకొని, అందులో 5 చుక్కల ‘హైడ్రోజన్ పెరాక్సయిడ్’ కలపండి. అది పేస్ట్’ల అయ్యే వరకు వేచి ఉండండి. ఈ మిశ్రమాన్ని రోజు పేస్ట్’ల వాడండి. బ్రెష్’తో తోమి 5 నిమిషాల పాటు వేచి ఉండండి. నీటితో కడిగి వేసిన తరువాత జరిగే ఫలితాలను గమనించండి.

మెరిసే గోళ్ళ కోసం బేకింగ్ సోడా…!

images

ప్రతిరోజూ గోళ్ళ రంగు వేసుకునే వాళ్ళకి, గోళ్ళు పసుపు పచ్చగా మారుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు బేకింగ్ సోడాలో కొద్దిగా పెరాక్సైడ్‌ను కలిపి గోళ్ళను రుద్దితే తెల్లగా ప్రకాశవంతంగా మారుతాయి.

సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి చిట్కాలు…

images (39)

ప్రతి రోజూ సిల్వర్ ప్లేట్స్ పాలిష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రెగ్యులర్ గా శుభ్రం చేయడం వల్ల సిల్వర్ నాశనం అవుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక మృదువైన వస్త్రం లేదా మృదువైన పళ్ళు ఉన్న బ్రెష్ తో తుడిచి శుభ్రం చేయాలి. ఇంకా మీరు కొన్ని సోప్ నీళ్ళు ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చు. మరకలు తొలగిపోతాయి. నీటితో శుభ్రం చేసిన తర్వాత ఒక మృదువైన వస్త్రం ఉపయోగించి నీటిని పూర్తిగా తుడవడానికి నిర్ధారించుకోవాలి.

బేకింగ్ సోడా : బేకింగ్ సోడా సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి మరో క్లినింగ్ ట్రిక్. గోరువెచ్చని నీటిలో ఒక గుప్పెడు బేకింగ్ సోడా వేసి, నీటిలో బేకింగ్ సోడా పూర్తిగా కరిగిపోయేవరకూ రెండు మూడు నిముషాలుండి, తర్వాత అందులో సిల్వర్ ప్లేట్స్ వేసి, నీటిలో కిద్దిసేపు నానబెట్టాలి. పదినిముషాల తర్వాత ఆ నీటిలో నుండి తీసి ఒక ఒక మృదువైన పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి.

బేకింగ్ సోడాలోని అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్…

images (85)

చర్మం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది:

ఒక చెంచా బేకింగ్ సోడాను అరకప్పు నీటిలో వేసి మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి స్ర్కబ్ చేయడం వల్ల ఇది డెడ్ స్కిన్ తొలగించి చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది అంతే కాదు, మోచేతులు మరియు మోకాళ్ళ యొక్క నలుపు తగ్గించి నునుపు చేస్తుంది.

సన్ బర్న్ ను నివారిస్తుంది:

ఒక గ్లాసు నీళ్ళలో రెండు చెంచాల బేకింగ్ సోడా మిక్స్ చేసి కాటన్ క్లాత్ డిప్ చేసి, ఈ క్లాత్ ను సన్ బర్న్ కు ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది చాలా త్వరగా రిలీఫ్ అందిస్తుంది మరియు రాషెస్ ను తొలగిస్తుంది.

మిక్సర్ గ్రైండర్ ను శుభ్రం చేయడానికి చిట్కాలు…

 

download (2)

నిమ్మ తొక్క:

నిమ్మ కాయ నుండి నిమ్మరసంను పూర్తిగా పిండుకొన్న తర్వాత ఆ తొక్కను ఉపయోగించుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్ నుండి వచ్చే చెడు వాసనను తొలగించడానికి నిమ్మతొక్క బాగా సహాయపడుతుంది. నిమ్మతొక్కతో మిక్సీ జార్ మీద బాగా రుద్ది 15నిముషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల వాసనతొలగిపోతుంది.

మరకలను తొలగించే వెనిగర్ :

కొన్న వెజిటేబుల్స్ వల్ల మిక్సీ జార్ల మీద మొండి మరకలు ఏర్పడుతాయి. వీటిని తొలగించడానికి వెనిగర్ బాగా సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ మరియు నీళ్ళు మిక్స్ చేసి మిక్సర్ గ్రైండర్ లో పోసి రెండు సెకండ్లు అలాగే ఉంచి తర్వాత తిరిగా అదే పద్దతిని అనుసరించి తర్వాత మంచి నీటితో కడిగి శుభ్రం చేయాలి.

బేకింగ్ పౌడర్ :

కొద్దిగా నీళ్ళు తీసుకొని, బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను మిక్సర్ గ్రైండర్ , జార్లకు పట్టించి 15నిముషాలు అలాగే పక్కన పెట్టి, ఆతర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.

డిటర్జెంట్ లిక్విడ్:

ఒకటి లేదా రెండు చుక్కల డిటర్జెంట్ లిక్విడ్ ను మిక్సర్ గ్రైండర్ లో వేసి, కొద్దిగా నీటిని చిలకరించి రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. మిక్సర్ గ్రైండర్ శుభ్రం చేయడానికి ఇది కూడా ఒక ఉత్తమ మార్గం.

దుస్తులపై టీ మరకలను తొలగించడానికి చిట్కాలు…

images (13)

1.వేడి నీళ్ళు : మరకలు పడ్డ ప్రదేశంలో వెంటనే వేడినీళ్ళను పోయాలి. ఇలా చేయండం వల్ల టీ లోని ఫైబర్ తొలగిపోతుంది. దాంతో మరక తేలిక పడుతుంది.

2. వెనిగర్ గ్రేట్ స్ట్రెయిన్ రిమూవర్ : కొన్ని కప్పుల నీటిలో ఒకటి రెండు స్పూన్ల వెనిగర్ ను మిక్స్ చేసి మరకలు పడ్డ ప్రదేశంలో నేరుగా స్ప్రే చేయాలి . తర్వాత చేత్తో బాగా రబ్ చేసి శుభ్రం చేస్తే టీ మరక తొలగిపోతుంది.

3. కాటన్ ఫ్యాబ్రిక్ మీద పడ్డ టీ మరకలను తొలగించడానికి కొంచెం బేకింగ్ సోడాను చిలకరించి రెండు చేతులతో బాగా రబ్ చేసి కొంత సమయం అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయడం వల్ల టీ మరకలు మాయం అవుతాయి.

4. గుడ్డులోని పచ్చసొనను గిలకొట్టి తర్వాత టీ స్పూన్ తో మరకలు పడ్డ ప్రదేశంలో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత ట్యాప్ క్రింద రన్నింగ్ వాటర్ తో శుభ్రం చేయాలి. కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఈ మరక అలాగే ఉన్నట్లైతే మరో సారి ఇలానే ప్రయత్నించండి.

5. టూత్ పేస్ట్ : టీ మరకలు పడిన వెంటనే తొలగించాలంటే టూత్ పేస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టీ మరకలు పడిన చోట కొద్దిగా టూత్ పేస్ట్ ను రుద్ది తర్వాత చల్లటి నీటితో కడిగి శుభ్రం చేయాలి.

చీజ్ మష్రుమ్ పకోడా ఎలా తయారుచేయాలో చూద్దాం…

mushroompak-1

చీజ్(జున్ను): 1/3 cup(తురుము కోవాలి)

పుట్టగొడుగులను : 15 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిరపకాయలు : 4 (చిన్న ముక్కలుగా తరగాలి)

వెల్లుల్లి : 4 (పేస్ట్ చేయాలి)

శెనగపిండి : 1/3

కార్న్ ఫ్లోర్ : 2tbsp

బేకింగ్ సోడా : ½tsp

బ్రెడ్ ముక్కలు : 1cup

నల్ల మిరియాలు : ½tbsp

ఉప్పు: రుచికి సరిపడా

వేయించడానికి నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా ఇక బౌల్ తీసుకొని అందులో చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్ మరియు పచ్చిమిర్చి వేసి, బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత మరో గిన్నె తీసుకొని అందులో శెనపిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడా, నూనె వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

3. తర్వాత మష్రుమ్ కాడలు తీసేసి, ముందుగా మిక్స్ చేసి పెట్టుకొన్న చీజ్ మిశ్రమాన్ని అందులో ఫిల్ చేయాలి.

4. ఇప్పుడు శెనగపిండి, కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో డిప్ చేసి, బ్రెడ్ పొడి దొర్లించి, కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే చీజ్ మష్రుమ్ పకోడా రెడీ. వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.

అరిటికాయ బజ్జీలను ఎలా తయారుచేయాలో చూద్దాం…

crispy-snack-recipe-aratika

కావల్సిన పదార్థాలు:

పచ్చిఅరటి కాయలు: 2 లేదా 3(పొట్టు తీసి, పలుచగా కావల్సిన ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి)

శెనగపిండి: 2cup

బియ్యం పిండి: 1tbsp

కారం: 1tsp

బేకింగ్ సోడా : చిటికెడు

అజ్వైన్(వామ్ము): 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో, శెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము, బేకింగ్ సోడా మరియు సరిపడా నీళ్ళు పోసి మరీ చిక్కగా, మరీ పల్చగా కాకుండా మీడియంగా కలిపి పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి, వేడయ్యాక మంటను మీడియం తగ్గించి పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ముందుగా పలచగా చక్రల్లా కట్ చేసి పెట్టుకొన్నపచ్చి అరిటికాయ ముక్కలను శెనగపిండి మిశ్రమంలో డిప్ చేసి అన్ని వైపులా శెనగపిండి అంటేలా డిప్ చేయాలి.

4. శెనగపిండిలో డిప్ చేసిన అరిటికాయ బజ్జీలను కాగుతున్న నూనెలో 4-6 వరకూ వేసి(సైజును బట్టి, కాగేనూనెలో వేయాలి) అవి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.

5. బజ్జీలు నూనెలో వేగుతున్నప్పుడు కాస్త మంటను పెంచుకోవచ్చు. అప్పుడు లోపలి భాగం కూడా పూర్తిగా ఉడుకుతుంది. అరటికాయ బజ్జీలు బ్రౌన్ కలర్ లోనికి మారగానే వాటిని తీసి నూనె పీల్చుకొనే పేపర్ మీద ఒకటి రెండు నిముషాలు వేసి తర్వాత వెంటనే సర్వ్ చేయాలి. అంతే అరిటికాయ బజ్జీ రెడీ.

మీ పాదాలు అందంగా…సాఫ్ట్ గా…కాంతివంతం చేసే సింపుల్ టిప్స్…

images (72)

లెమన్ అండ్ సాల్ట్:

నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మచెక్క మీద ఉప్పు చిలకరించి పాదాల మీద 10-15నిముషాల పాటు స్క్రబ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ స్ర్కబ్:

ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ లో ఒక చెంచా పంచదార మిక్స్ చేసి రెండు చెంచాల పాలు జోడించి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పాదాలకు అప్లై చేసి 15 నిముషాల పాటు బాగా మర్ధన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సాఫ్ట్ అండ్ ఫెయిర్ ఫీట్ ను మీరు పొందవచ్చు.

బేకింగ్ సోడా మరియు షాంపు:

ఒక టబ్ గోరువెచ్చని నీటిలో 4 చెంచాల బేకింగ్ సోడా మిక్స్ చేసి పాదాలను ఈ నీటిలో డిప్ చేయాలి. అదే టబ్ లో కొద్దిగా షాంపును కూడా వేసి నిధానంగా రుద్ది కడగాలి.