Posts Tagged ‘basmati rice’

హైదరాబాది కచ్చి గోష్ట్ బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (6)

కావాల్సిన పదార్థాలు :

మటన్: 1kg

బాస్మతి రైస్: 1kg

పెరుగు: 200grms

లెమన్ జ్యూస్: 3tsp

మసాలా దినుసులు: 20grms

చిల్లీ పౌడర్: 2tsp

ధనియాల పౌడర్: 3tsp

జింజర్ గార్లిక్ పేస్ట్: 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

గరం మసాలా: 11/2tsp

నూనె: సరిపడా

ఫ్రైడ్ ఆనియన్: 1cup

తరిగిన కొత్తిమిర: 1/2cup

తరిగిన పుదీనా: 1/2cup

బే లీవ్స్: 1

వెన్న: 150grms

నీళ్ళు: 5ltrs.

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక కేజీ మాసం తీసుకుని అందులో లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, తరిగిన కొతిమిర, పుదీనా, ధనియాల పౌడర్, నూనె కలిపి రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి.

2. తర్వాత 5 లీటర్ల నీటిని ఒక బౌల్‌లో తీసుకుని 25 నిమిషాల పాటు మరగబెట్టాలి.

3.తరువాత ఇందులో పైన సూచించిన మోతాదులో ఉప్పు, 10గ్రా. గరం మసాలా, బేలీవ్స్ కలపాలి.

4. ఇప్పుడు గంటపాటు నాన బెట్టిన బాస్మతి రైస్‌ని మరగించిన నీటికి కలపాలి. ఇప్పుడు సగం బిర్యానీ తయారు అయినట్లే.

5. ఈ రైస్‌ని తీసుకుని పైన సూచించిన విధంగా బాగా నాన బెట్టిన మటన్‌పై వేయాలి. రైస్ పైన వెన్న, గార్లిక్ కలపాలి. ఇలా తయారైన బిర్యానీపై మూత ఉంచి గోధుమపిండితో మూతను సీల్ చేయాలి(ఆవిరిబయట పోకుండా)20-25 నిమిషాల పాటు గ్యాస్‌ని సిమ్‌లో ఉంచి ఉడకబెట్టాలి.

6. తరువాత మూతపై 20 నిమిషాల పాటు వేడి వేడి నిప్పులు పోయాలి. తరువాత మూత తీస్తే ఘుమ ఘుమలాడే బిర్యానీ మనకు నోరూరిస్తుంది. దీనికి తరిగిన కొతిమిర, పుదీనా, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్, మిర్చీ ముక్కలు కలపాలి.

7. అంతే మనకు కావల్సిన కచ్చి గోషి బిర్యానీ తయారైంది. ఇలా వేడి వేడిగా ఉన్న బిర్యానీని టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరు.

ఫిష్ ఫ్రైడ్ రేస్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

బోన్ లెస్ ఫిష్: 1/2kg

వండిన అన్నం: 3 cups

సన్నగా తరిగిన క్యాప్సికమ్: 2cups

ఉల్లిపాయలు: 3మీడియం

కొత్తిమీర: 1/2cup

ఫిష్ సాస్: 1tbsp

చిల్లీ సాస్: 2tbsp

వెల్లుల్లి రెబ్బలు: 3-4

సోయాసాస్: 3tsp

అల్లం తురుము: 1tbsp

క్యారెట్: 2 చిన్నవి

పెప్పర్ పౌడర్: 1tsp

కార్న్ స్టార్చ్- 1tbsp

నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చేపలను మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగి తడి ఆరే వరకూ ఉండి. వాటికి చిల్లీ సాస్ మరియు పెప్పర్ పౌడర్ ను చిలకరించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. చేపలను మ్యారినేట్ చేసిన తర్వాత 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత అందులో కార్న్ స్ట్రార్చ్ పౌడర్ ను ఫ్రై చేయడానికి ముందుగా చేప ముక్కల మీద చిలకరించి పెట్టుకోవాలి.

4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ 10 నిముషాలు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.

5. తర్వాత అదే పాన్ లో ఉన్నవేడి నూనెలో అల్లం వెల్లుల్లి తరుగు వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యాప్సికమ్ మరియు క్యారెట్ ను వేసి 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసిన చేపలు వేసి ఫ్రై చేయాలి.

8. తర్వాత అందులోనే ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని సలాడ్ తో సర్వ్ చేసుకోవచ్చు.

బెంగాల్ స్టైల్ ఫ్రైడ్ కిచిడి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (55)

బాస్మతి బియ్యం: 1cup

పెసర పప్పు: 1cup

బిర్యానీ ఆకు:2

యాలకులు: 2

లవంగాలు: 2

దాల్చిన చెక్క: చిన్న ముక్క

ఎండుమిర్చి : 2

ఉల్లిపాయ : 1(పెద్దది, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి)

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tsp

టమోటా: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

బటానీలు: ½cup

క్యారెట్: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

బంగాళాదుంప: 1(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పసుపు: 1tsp

కొబ్బరి తురుము: 1/2cup

చక్కెర: 1tsp

జీడిపప్పు: 1tbsp

ఎండు ద్రాక్ష: 1tbsp

ఉప్పు: రుచికి సరిపడా

వెచ్చని నీరు: 4 cups

నెయ్యి: 2tbsp

స్పైస్ (మసాలా) పౌడర్ కోసం:

ఎండు మిర్చి: 2

గ్రీన్ ఏలకులు: 2

లవంగాలు : 4

దాల్చిన చెక్క: 2

జీలకర్ర: ½tsp

ఉల్లిపాయ విత్తనాలు: ½tsp

మెంతులు: ¼tsp

సోంపు గింజలు: ¼tsp

ఆవాలు: ½tsp

ధనియాలు:1tbsp

హింగ్ (ఇంగువ) : చిటికెడు

తయారుచేయు విధానం:

1. ముందుగా పెసరపప్పును లైట్‌గా వేగించి, చల్లార్చి పెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత మసాల పౌడర్ కోసం సిద్దం చేసుకొన్న వస్తువులన్నింటిని లైట్‌గా వేగించుకొని, చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి.

3. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ద్రాక్షవేసి లైట్‌గా వేగించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి.

4. తర్వాత స్టౌ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి, అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు, ఎండుమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.

5. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అలాగే పచ్చిబఠానీ, క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.

6. తర్వాత టమోటో కూడా వేసి వేగించాలి. ఒక నిముషం తర్వాత అందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకొన్న బియ్యం, పసుపు, మసాలా పౌడర్ వేసి 5నిముషాలు వేగించాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, ఉప్పు, పంచదార, ద్రాక్ష మరియు జీడిపప్పు వేసి మరో 5నిముషాలు వేగించాలి.

7. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి, మూత పెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

8. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్లో ఆవిరి పూర్తిగా తగ్గే వరకూ అలాగే ఉండి, తర్వాత మూత తీసి, కిచిడి సర్వింగ్ బౌల్లోనికి మార్చుకోవాలి. అంతే బెంగాలీ స్టైల్ ఫ్రైడ్ కిచిడి రెడీ. మీకు నచ్చిన సైడ్ డిష్‌తో సర్వ్ చేయాలి.

స్పైసీ జీడిపప్పు అండ్ ఎగ్ బిర్యానీ రిసిపి ఎలా తయారు చేయాలో చూద్దాం…

images (5)

కావలసిన పదార్థాలు:

కోడిగుడ్లు: 4 (ఉడికించి, పై పొట్టు తీసినవి)

బాస్మతి రైస్: 2cups

జీడిపప్పు(కాజు): 10(వేయించినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp

ఉల్లిపాయ: 1(ముక్కలుగా కట్ చేయాలి)

దాల్చిన చెక్క: చిన్న ముక్క

లవంగాలు: 3

నూనె: సరిపడా

నీళ్లు: 31/2cup

పచ్చిమిర్చి: 6-8 (నిలువు, అడ్డం చిన్న ముక్కలుగా కట్ చేయాలి)

పసుపు: పావు టీ స్పూన్

ఉప్పు: రుచికి తగినంత

కొత్తిమీర: అలంకరణకు తగినంత

తయారు చేయు విధానం:

1. ముందుగా బియ్యం శుభ్రం చేసి మంచినీళ్ళతో కడిగి పక్కపెట్టుకోవాలి.

2. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి మూడు నిమిషాలు వేయించుకోవాలి.

3. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో నీళ్లుపోసి, ఉప్పు కలిపి కడిగిన బియ్యం వేసి ఉడకనివ్వాలి.

4. బియ్యం కాస్త పలుకుగా ఉన్నప్పుడు కోడిగుడ్లు, జీడిపప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే కాజు ఎగ్ బిర్యాని రెడీ.

ఆలూ గ్రీన్ చట్నీ పులావ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావల్సిన పదార్థాలు:

నూనె: 2tbsp

బిర్యానీ ఆకు: 1 పెద్దసైజు

నల్లని ఇలాచి: 1(పొడిచేసి వేయాలి)

పచ్చిఇలాచి : 4(పొడిచేసి వేయాలి)

లవంగాలు: 4

దాల్చిన చెక్క: 1

అంగుళం జపత్రి: 1 లేదా 2

ఉల్లిపాలు : 2(సన్నని ముక్కలుగా కట్ చేసుకొన్నవి)

ఉడికించి పొట్టు తీసి పొట్టుకొన్న బంగాళదుంపలు: 10

పాలకూర పూరీ(పాలకూరను మెత్తగా పేస్ట్ చేసుకన్నది): 4tbsp

గ్రీన్ చట్నీ : 5tbsp

బాస్మతి రైస్: 11/2cup(కడిగి అరగంట పాటు నానబెట్టుకొన్న బాస్మతి రైస్)

నీళ్ళు సరిపడా: 2cups

ఉప్పు : రుచికి తగినంత

తయారుచేయు విధానము:

1. ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, గ్రీన్ ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. తర్వాత అందులోనే పాలక్ పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పాలక్ పూరీ పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులో ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకొన్న ఆలూ, గ్రీన్ చట్నీ కూడా వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. గ్రీన్ చట్నీ వేగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకొన్న బియ్యంను అందులో వేసి మొత్తం కలగలిసేలా కలపాలి.

6. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆలూ చట్నీ పులావ్ రిసిపి రెడీ.

మటన్ కోఫ్తా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం…

i-1

కావల్సిన పదార్థాలు:

రైస్ తయారీకి కావల్సినవి:

బాస్మతి రైస్ – 4 cups

కరవే సీడ్స్ – ½ tsp

గరం మసాలా :

పెప్పర్ కార్న్స్ – 7

లవంగాలు – కొద్దిగా

యాలకలు – 5

షాజీర – 1 tsp

దాల్చిన చెక్క – 1 inch

కుంకుమపువ్వు – చిటికెడు పాలలో నానబెట్టాలి

ఉప్పు : రుచికి సరిపడా

కోఫ్తా తయారీకి కావల్సినవి:

మటన్ ఖీమా – 500 g

ఉల్లిపాయ- 1 (paste)

గరం మసాలా పౌడర్ – 1 tsp

ఉప్పు : రుచికి సరిపడా

గసగసాలు – 1 tsp (finely ground)

అల్లం పేస్ట్ – 1 tbsp

వెల్లుల్లి పేస్ట్ – 1 tbsp

ఫ్రెష్ క్రీమ్ – 1 tbsp

కారం – 1 tsp

కొబ్బరి తురుము – 1 tsp

కొత్తిమీర తరుగు – 1 cup (finely chopped)

శెనగపిండి(besan) – 1 tbsp

నట్ గమ్ పౌడర్ – ½ tsp

బ్రెడ్ – 1 slice (soaked in milk)

కర్రీ తయారీకి కావల్సినవి:

నూనె – ½ a cup

పచ్చిమిర్చి – 2 (chopped)

ఉల్లిపాయ – 1 (chopped)

టమోటోలు – 2 (pureed)

అల్లం పేస్ట్ – 1 tbsp

వెల్లుల్లి పేస్ట్ – 1 tbsp

జీలకర్ర – ½ tsp

పసుపు – ¼th tsp

పెరుగు – 3 tbsp

గరం మసాలా – ½ tsp

కారం – 2 tsp

ఉప్పు – రుచికి సరిపడా

క్విరా వాటర్ – 1 tbsp

పుదీనా – 1 cup (chopped)

ఎల్లో ఫుడ్ కలర్ – a pinch

నట్ గమ్ పౌడర్ – ¼th tsp

గ్రీన్ కార్డమ్ పౌడర్ – ¼th tsp

తయారుచేయు విధానం రైస్ తయారీ:

1. ముందుగా బియ్యంను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నీరు మరిగించి పెట్టుకోవాలి.

3. నీరు మరుగుతుండగా, అందులో గరం మసాలా జోడించాలి.

4. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం అందులో వేసి, బియ్యంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలబెట్టి, ఉడికించుకోవాలి.

5. బియ్యం ¾th, ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ ను వంపేసి పక్కన పెట్టుకోవాలి.

కోప్తా తయారీ:

1. కోప్తా కోసం సిద్దంగా ఉంచుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2. అన్ని ఒక్కసారిగా పొడి చేసుకోలేకపోతే, రెండు మూడు పదార్థాలు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు.

3. కోఫ్తా కోసం సిధ్దం చేసుకున్న పదార్థాలను గ్రైండ్ చేసుకున్న పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసి రిఫ్రిజరేటర్ లో 30 నుండి 40 నిముషాల వరకూ ఉంచాలి.

4. 40 నిముషాల తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.

5. చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. పాన్ మొత్తం నూనెను చేతులతో అప్లై చేయాలి.

6. ఇప్పుడు ఫ్రిజ్ లో నుండి తీసిన మీట్ మిశ్రమంను చేత్తో చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.

7.మీట్ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకున్నాక తిరిగి రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.

కర్రీ తయారీ :

1. ఒక పాన్ స్టౌ మీద పెట్టి, వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి. వేగిన తరవ్ాత అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి.

2. ఉల్లిపాయలు ట్రాన్సరెంట్ గా వేగిన తర్వాత అందులో టమోటో పేస్ట్, గ్రీన్ చిల్లీ, పసుపు మరియు ఉప్పు వేసి, మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఫ్రై చేయాలి .

3. అసవరమయితే కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సాప్ట్ గా కలుపుకోవాలి.

4. ఇప్పుడు మంట తగ్గించి, ఇందులో రిఫ్రిజరేటర్ లో పెట్టుకున్న కోఫ్తాలను వేయాలి.

5.అలాగే చిక్కగా చిలికిన పెరుగు కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టాలి.

6. మొత్తం మిశ్రమం ఉడకడం ప్రారంభించాక, 20 నిముషాలు ఉడికించుకోవాలి.

7. ఇప్పుడు అందులోనే నట్ మగ్ పౌడర్, పుదీనా, కొత్తిమీర ఆకులు తరుగు వేసి కలుపుకోవాలి.

బిర్యానీ :

1. డీప్ బాటమ్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి రాసి, రైస్ ను ఒక లేయర్ గా సర్ధాలి. తర్వాత కోఫ్తా కర్రీని మరో లేయర్ గా సర్దాలి.

2. తిరిగి రైస్ లైయర్, కోఫ్తా లేయర్ రెండు మూడు లేయర్స్ గా సర్ధుకోవాలి.

3. ఫైనల్ గా కెవరా వటర్ ను, పాలలో నానబెట్టిని కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలర్ ను చిలకరించుకోవాలి.

4. మంట ఎక్కువగా పెట్టి 10 నిముషాలు తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. తర్వాత ఆవిరి మీద 10 నిముషాలు ఉడికించుకోవాలి.

5. అంతే మటన్ కోఫ్తా బిర్యానీ రిసిపి రెడీ. రైతా లేదా గ్రీన్ సలాడ్ తో ఎంజాయ్ చేయొచ్చు.

రుచికరమైన కాలీఫ్లవర్ పులావ్ రిసిపి ఎలా తయారు చేయాలో చుద్దాం…

download (42)

కావల్సిన పదార్థాలు:

బాస్మతి రైస్: 1cup

కాలీఫ్లవర్: 1(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)

గ్రీన్ బటానీలు: ½cup

ఉల్లిపాయ: 1 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)

టమోటో: 3(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp

పచ్చిమిర్చి: 2 (మధ్యలోకి కట్ చేసుకోవాలి)

పసుపు: ½ tsp

కారం: 1tsp

జీలకర్ర పొడి: 1tsp

గరం మసాలా పొడి: 1tsp

పెప్పర్ పౌడర్: ½tsp

జీలకర్ర: 1tsp

చెక్క: 1

యాలకులు: 2

బిర్యానీ ఆకు: 1

ఆయిల్: 1tbsp

నీటి: 2 cups

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా బియ్యంను నీళ్ళు వేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత డీప్ బాటమ్ పాన్ స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3,4నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. అంతలోపు చిన్నగా విడిపించి పెట్టుకొన్న కాలిఫ్లవర్ పువ్వులను వేడినీళ్ళలో ఒక నిముషం వేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పడు పాన్ లో ఫ్రై అవుతున్న మసాలా దినుసుల్లో ఈ కాలీఫ్లవర్ ను మరియు పచ్చిబటానీ, పచ్చిమిర్చిలను వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

6. అలాగే అందులో టమోటో, పసుపు, కారం, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్, గరం మసాలా, వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. తర్వాత అందులో బాస్మతి రైస్ కూడా వేసి, రెండు, మూడు నిముషాలు ఫ్రై చేయాలి.

8. ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, పాన్ కు మూత పెట్టి 10-15నిముషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

9. 15నిముషాల తర్వాత మూత తీసి మెత్తగా ఉడికనట్లైతే, స్టౌ ఆఫ్ చేసి, సర్వింగ్ ప్లేట్ లోనిక పులావ్ ను మార్చుకొని, సర్వ్ చేయాలి. అంతే, తినడానికి కాలీఫ్లవర్ పులావ్ రెడీ. ఈ కాలీఫ్లవర్ పులావ్ ను మీకు నచ్చిన గ్రేవీతో తినవచ్చు.

స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

images (4)

బాస్మతి రైస్ : 250 gms(అరగంట నీటిలో నానబెట్టుకోవాలి)

కార్న్ : 2 cup

ఆనియన్ : 1 cup

క్యాప్సికం : 1 cup

అల్లం : 1/4 tsp

వెల్లుల్లిపేస్ట్ : 1/4 tsp

బంగాళదుంప : 1 cup

పచ్చిమిర్చి: 4 to 5

గరం మసాలా : 1 tsp

పసుపు: 1/4 tsp

జీలకర్ర: 1/4 tsp

నూనె: సరిపడ

తయారు చేయు విధానం:

1. ఉల్లిపాయలను సన్నగా తరిగి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన బియ్యం, బంగాళదుంప, క్యాప్సికం మరియు స్వీట్ కార్న్ వేయాలి. అలాగే కొద్దిగా నూనె మరియు సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసి మూత పెట్టి 3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

3. మరో పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, మరియు పచ్చిమిర్చి వేసి వేగించాలి.

4. అంతలోపు కుక్కర్ లో స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ లోని ఆవిరి మొత్తం తగ్గనివ్వాలి.

5. కుక్కర్లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత స్వీట్ కార్న్ రైస్ ను బయటకు తీసి పాన్ లో వేగుతున్న మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే స్వీట్ అండ్ స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రిసిపి రెడీ.