Posts Tagged ‘beauty tips’

జుట్టుకు మంచి కండీషనర్ కోసం…

download (56)
పావుకప్పు యాపిల్ గుజ్జులో కోడిగుడ్డులోని తెల్లసొనా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల జట్టు కండీషనర్ అయ్యి చిట్లడం వంటి సమస్యలు దరిచేరవు.

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కలబంద…

images

జుట్టు పెరుగుదలకు: ఖచ్చితంగా అలోవెర జెల్ తో జుట్టు పెరుగుదల సాధ్యం అవుతుంది. అలోవెరాను తలకు పట్టించడం వల్ల తలలో ఉండే డెడ్ స్కిన్సెల్స్ తొలగిస్తుంది. డీప్ గా పోషణను అందిస్తుంది. దాంతో హెయిర్ ఫోలిసెల్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి అలోవెరా జుట్టు పెరుగుదలకు, జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.

అలోవెర జెల్ ను కండీషనర్ గా: అలోవెరా నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది హనికలిగించే రసాయనిక హెయిర్ కండీషనర్స్ కంటే చాలా మంచిది. కాబట్టి అలోవెరా జెల్ ను మీ కేశాలకు, తల మాడుకు బాగా పట్టించి, మర్దన చేసిన తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కొబ్బరి నూనె మరియు జోజోబా ఆయిల్ తో చేర్చి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. అధినపు పోషణను అందిస్తుంది.

మొటిమలను ఎట్టి పరిస్థితుల్లో గిల్లకూడదనడానికి కారణాలు…

images (16)

మచ్చ: మొటిమను గిల్లడం వల్ల తర్వాత మచ్చ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన మచ్చను కాస్మొటిక్స్‌తో కనపడకుండా చేయడం కూడా కష్టమే. కాబట్టి పింపుల్స్‌ని న్యాచురల్‌గా తొలగించే ప్రయత్నం చేస్తే ఎలాంటి మచ్చలు లేని ఫేస్ సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫెక్షన్‌: మొటిమను గిల్లడం వల్ల చీము బయటకు వస్తుంది. ఇది చుట్టూ ఉండే చర్మంపై దుష్ర్పభావం చూపుతుంది. దీని ద్వారా వచ్చే బ్యాక్టీరియా స్కిన్ ఇన్ఫెక్షన్‌కి కారణమవుతుంది.

ఇన్ల్ఫమేషన్: మొటిమను బాగా పిండటం వల్ల చర్మం చాలా డ్యామేజ్ అవుతుంది. మొటిమ చుట్టూ వాపు ఇంకా పెరిగి అది మరింత పెద్దగా కనిపిస్తుంది. ఇది మొటిమ కంటే అసహ్యంగా ఉంటుంది.

పొక్కులు ఏర్పడవచ్చు: మొటిమలను గిల్లడంతో అయిపోతే తర్వాత దానిపై పొక్కులా ఏర్పడి మీ ఆకర్షణను మొత్తం అసహ్యంగా మారుస్తాయి. ఇలా ఏర్పడిన దాన్ని కాస్మొటిక్స్ కూడా ఏం చేయలేవు.

ఉపశమనానికి సమయం: సాధారణంగా మొటిమ మాయం అవడానికి వారం పడుతుంది. కానీ గిల్లడం వల్ల అది తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎక్కువ మొటిమలకు కారణం: పింపుల్స్‌ని గిల్లకూడదు అనడానికి ప్రధాన కారణం అవి ఎక్కువ అవుతాయి. ఒక పింపుల్‌ని సింపుల్‌గా న్యాచురల్ రెమిడీతో తొలగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దాన్ని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్ చుట్టూ వ్యాపించి కొత్తగా మొటిమలు రావడానికి కారణమవుతుంది.

చర్మం పూర్తీగా మారిపోవచ్చు: చాలామంది చేసే పొరపాటు వల్ల చేతులపై ఉండే బ్యాక్టీరియా చర్మానికి తగిలి చర్మం డార్క్‌గా మారుతుంది. మొటిమలు గిల్లిన తర్వాత చర్మం పిగ్మెంటేషన్‌కి గురవుతుంది.

ముఖంలో చర్మ రంద్రాలను మాయం చేసే నేచురల్ టిప్స్…

images

చర్మంను శుభ్రపరుచుకోవడానికి మొదట చేయాల్సిన పని ముఖానికి ఆవిరి పెట్టడం. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మంలో, చర్మ రంద్రాల్లో ఉండే దుమ్ము, ధూళి తొలగిపోతుంది. చర్మం క్లియర్ అవుతుంది.

ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత స్క్రబ్ చేయాలి. ఆవిరి పట్టిన వెంటనే స్ర్కబ్బింగ్ చేయడం వల్ల చాలా సులభంగా చర్మం ఎక్స్ ఫ్లోయేట్ అవుతుంది.

ఎక్స్ ఫ్లోయేట్ చేసుకొన్న తర్వాత ముఖ్యమైన పని, ఐస్ క్యూబ్స్ తీసుకొని మీ ముఖం మీద రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంద్రాలు మాయం అయ్యి, చర్మం టైట్ అవుతుంది మరియు చూడటానికి అందంగా కనబడుతారు.

కొద్ది సమయం తర్వాత, చర్మానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. సాధారణంగా స్ర్కబ్బింగ్ వల్ల నేచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. కాబట్టి, ఎక్సఫ్లోయేషన్ తర్వాత ఎస్ఎఫ్ పి క్రీములతో చర్మానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి.

ముఖం మీద రంధ్రాల నివారణ చిట్కాలు:

ముఖం శుభ్రం చేసుకోకుండా నిద్రించకూడదు, ప్రతి రోజూ సాయంత్రం ఖచ్చితంగా మేకప్ తొలగించి, మేకప్ వేసుకొనే అలవాటు లేకపోయినా మీరు మీ ముఖాన్ని నిద్రించడానికి ముందు శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ రంద్రాల్లో డస్ట్ చేరకుండా నివారిస్తుంది.

మీ చర్మ తత్వానికి సూట్ కానివి మీ చర్మానికి ఉపయోగించకండి, అలా చేయడం వల్ల చర్మ రంద్రాలు మరింత పెద్దవిగా మారుతాయి.

వృద్ధాప్య లక్షణాలను నివారించి చర్మ సౌందర్యం పెంచే చందనం…

images (68)

చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా చేయాలంటే, గుడ్డు సొనలో తేనె, చందనం మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రాంగ్ హెయిర్ కోసం…బాదం తినండి…

images (61)
స్ట్రాంగ్ హెయిర్ కోసం.. మష్రూమ్స్ బాదం తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మష్రుమ్స్‌లో విటిమన్స్ అధికంగా ఉన్నాయి. తృణధాన్యాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ బి2 అధికంగా ఉండటం వల్ల వీటిని స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ పొందడానికి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బయోటిన్ అధికంగా ఉండే ఫుడ్స్ ఉల్లిపాయ, బాదం, సెరల్స్, ఈస్ట్, అరటి, సాల్మన్ వంటి ఫుడ్స్ వంటివి తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. స్ట్రాంగ్ హెయిర్ కోసం ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫుడ్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్, జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది. ఇవి హెయిర్ ఫాల్ అరికడుతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఒత్తైన జుట్టు పొందడానికి హెల్తీ హెయిర్ ప్యాక్స్…

images (36)

ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ హెయిర్ ప్యాక్: 3 చెంచాల ఆలివ్ ఆయిల్ తీసుకొని రెండు గుడ్లు మిశ్రమంలో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఒత్తైన జుట్టు మీరు పొందడానికి ఒది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

అరటి, తేనె మరియు బాదం హెయిర్ ప్యాక్: రెండు చెంచాలా తేనెలో కొన్ని చుక్కల బాదం నూనె మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అరటిపండు గుజ్జులో వేసి మిక్స్ చేసి తలకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకొకసారి చేస్తే ఒత్తైన జుట్టును మీరు పొందవచ్చు.

పెరుగు హెయిర్ ప్యాక్: పెరుగు బాగా స్మూత్ గా స్పూన్ తో మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. పెరుగు జుట్టుకు పోషణ అందిస్తుంది మరియు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఇది ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ ప్యాక్.

మగవారి సౌందర్యం పెంపొందిచుకోవడానికి మేకప్ ట్రిక్స్…

images (73)

కన్సీలర్: 

పురుషులకు కన్సీలర్ ఒక అద్భుతమైనటువంటి సాధారణ మేకప్. చాలా మంది టీవీ స్టార్స్, పిల్మిం స్టార్స్ అందరూ ముఖం మీద ఉన్న చర్మం లోపాలను దాచడానికి దీన్ని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. సాధారణంగా కళ్ల క్రింద నల్లటి వలయాలు కనిపించకుండా కన్సీలర్లను వాడుతారు. లేత బంగారు రంగు కన్సీలరయితే నల్లటివలయాల్ని బాగా కప్పేస్తుంది. లేతరంగు కన్సీలర్ వాడితే బాగుంటుంది. ఫౌండేషన్ వేసుకున్నా లేకపోయినా కన్సీలర్ వాడొచ్చు. చర్మం అంతా ఒకటే రకంగా కనిపించాలంటే, కన్సీలర్‌ రాయాలి.

ఫౌండేషన్:

పురుషులు ఫౌండేషన్ కాస్మోటిక్ వాడటం అనేది కన్సీలర్ వంటిదే, అయితే శరీరపు ఛాయను బట్టి ఫౌండేషన్ రంగును ఎంచుకోవాలి. అందంగా కనబడాలంటే మేకప్ లో మొదట ఫౌండేషన్ తప్పనిసరి. పౌండేషన్ మృదువుగా వుండేలా చూసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసేటప్పుడు అంతటా సమనంగా వుండేలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖంపై మొటిమలు, మచ్చలు, కళ్లకింది నల్లటి వలయాలను కప్పిపుచ్చుకునేందుకు చాలామంది ఫౌండేషన్‌ను మందంగా రాసుకుంటుంటారు. అయితే దీనివల్ల అనుకున్న ఫలితం రాదు. కాబట్టి అలాంటి వారు ఇకమీదట కన్సీలర్‌ను వాడిచూస్తే తేడా ఇట్టే అర్థమవుతుంది. చిన్న మొటిమను కనిపించకుండా చేయాలంటే, ఫౌండేషన్‌కు బదులుగా ముందు కన్సీలర్‌ వాడాలి. ముడతలు కనిపించకుండా ఉండేందుకు మాయిశ్చరెైజర్‌, ఫౌండేషన్‌లను కలిపి రాసుకుంటే సరిపోతుంది.

చర్మం తేమగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

download (6)
చర్మం తేమగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. వాల్‌నట్స్ తీసుకోవాలి. చర్మం తేమగా ఉంచేందుకు వాల్ నట్స్ బాగా సహాయపడుతాయి. అందువల్ల డైట్‌లో వాల్ నట్స్ తీసుకోవాలి. అలాగే కొబ్బరిని, కొబ్బరి నూనె కూడా ఉపయోగించాలి. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాట్ శరీరంలోపల నుండి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
డ్రై స్కిన్ నివారించే ఒక ఉత్తమ ఆహారం సాల్మన్. ఈ బోన్ లెస్ ఫిష్‌ను వింటర్లో తప్పక తీసుకోవాలి. అలాగే చర్మం తేమగా ఉండాలంటే కీరదోస ముక్కలు, సిలికా ఉండే కొత్తిమీరను చేర్చుకోవాలి. కొత్తిమీర మంచి మాయిశ్చరైజ్‌గా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అందమైన కళ్ళ కోసం ఆల్మండ్ నూనె…

images (14)

చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా కళ్ళ చుట్టూ ఏర్పడే ముడతలను, వలయాలను నివారించుకొని అందంగా తయారు చేసుకోవచ్చు.

– ఆల్మండ్ నూనె మరియు ఆలివ్ నూనెతో కంటి చుట్టూ ఉండే చర్మాన్ని సున్నితంగా మర్దన చెయ్యడం ద్వారా చర్మంలో తేమ ఏర్పడి మృదువుగా తయారవుతుంది.

– పాల మీగడ చర్మానికి పట్టించడం ద్వారా కూడా చర్మం మృదువుగా మారుతుంది.

– కంటి రెప్పలపై, నొసలపై ఆల్మండ్ నూనె రాసి మసాజ్ చేస్తే వెంట్రుకలు రాలిపోకుండా నిగ నిగా మెరుస్తాయి.

– కంటికి అతిగా మేకప్ చెయ్యడం కూడా చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.