Posts Tagged ‘Benefits’

ఓట్స్ మీల్ ను బ్యూటికి ఏవిధంగా ఉపయోగించుకోవాలి?

 

download (26)

ముఖానికి ఓట్ మీల్: చర్మానికి తగినంత తేమను అందించి మాయిశ్చరైజ్ గా సహాయపడుతుంది. మరియు చర్మ రంద్రాల్లోని మురికిని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించి, డీప్ గా శుభ్రపరుస్తుంది.

ఫేస్ వాష్: ఓట్ మీల్లో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మంలో మురికిని మరియు ఆయిల్ ను తొలగిస్తుంది. మీరు చాలా త్వరగా ఓట్ మీల్ తో క్లెన్సర్ ను తయారు చేసుకోవచ్చు. అందుకు రెండు చెంచాలా ఓట్ మీల్, ఒక చెంచ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి గుండ్రంగా ముందుకు వెనకు మర్దన చేయాలి . 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేనె బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

స్పాట్ ట్రీట్మెంట్: మొటిమలు మరియు మచ్చలతో బాధపడుతున్నట్లైతే ఓట్స్ మీల్ మీ సమస్యను నివారిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మంలోని అదనపు ఆయిల్ గ్రహిస్తుంది మరియు చర్మానికి చల్లదనాన్ని తీసుకొస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ ను నీటిలో వేసి ఉడికించి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరియు సన్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది.

తమలపాకు యొక్క బ్యూటీ బెనిఫిట్స్…

images (90)

తమలపాకు:

తమలపాకు యొక్క బ్యూటీ బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. తమలపాకును మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా కొబ్బరి పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి తర్వాత శుభ్రం చేసుకుంటే స్కిన్ కంప్లెక్షన్ నివారిస్తుంది . అయితే ఇది సెన్సిటివ్ చర్మానికి అంత మంచిది కాకపోవచ్చు.

 

మొటిమలను, మచ్చలను నివారించే సున్నిపిండి…

download

మొటిమలను నివారిస్తుంది : బ్లాక్ గ్రామ్(సున్నిపిండి) లో చర్మాన్ని శుభ్రపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అంతే కాదు చర్మంలోని బ్యాక్టీరియాను నివారించే యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే సున్నిపిండి మొటిమలను నివారిస్తుంది.

మచ్చలను తగ్గిస్తుంది : బ్లాక్ గ్రామ్(సున్నిపిండి) లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంలో మచ్చలను తగ్గిస్తుంది. మీ చర్మం యంగ్ గా కనబడుతుంది. రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

సన్ బర్న్ నివారిస్తుంది : బ్లాక్ గ్రామ్(సున్నిపిండి)లో చర్మంను కాంతివంతంగా మార్చే లక్షణాలు, చర్మ సమస్యలను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సన్ బర్న్ ను నివారిస్తుంది. సున్నిపిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా సన్ బర్న్ నివారిస్తుంది.

అల్సర్‌ను దూరం చేసే గ్రీన్ బనానాస్..

images (25)

అలర్స్‌ను దూరం చేసుకోవాలా అయితే రోజూ ఓ గ్రీన్ బనానా తీసుకోండి. పేగు సంబంధిత వ్యాధులు, పొట్టనొప్పికి చెక్ పెట్టాలంటే పచ్చరంగు అరటి పండ్లను వారానికి రెండు సార్లైనా తీసుకోవాలి. రోజూ రాత్రి నిద్రించేందుకు ముందు గ్రీన్ బనానా తీసుకుంటే ఉదర సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

ముల్తానీ మట్టి యొక్క గొప్ప సౌందర్య ప్రయోజనాలు…

images (67)

చర్మం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది దీనికి సహజంగా పిల్చే గుణం కలిగి ఉంటుంది. ముల్టానా మట్టిని జిడ్డు చర్మం నుంచి అధిక నూనెను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మ రంద్రాలను క్లాగ్ లేకుండా చేస్తుంది. అలాగే చర్మం యొక్క సహజ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనిని సాదారణంగా ఇంటిలో ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు.

* ముల్టానా మట్టి,రోజ్ వాటర్,గంధం పొడి ఈ మూడింటిని సమాన మొత్తాలలో తీసుకోని కలపాలి.

* ఈ మిశ్రమంతో మీ ముఖానికి ఫేస్ ప్యాక్ వేయాలి.

* ఇది సహజంగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

* జిడ్డు చర్మం కలవారు ఈ ప్యాక్ ను ప్రతి రోజు వేయాలి. ఒక మోస్తరు జిడ్డు చర్మం కలవారు వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ ను వేయాలి.

మందారం (హైబిస్కస్) టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు…

 

images (30)

మందారం టీలో ఆకట్టుకునే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. తద్వారా ఇది గుండె వ్యాధులకు వ్యతిరేకంగా రక్షించడానికి, రక్త నాళాల నష్టం నుండి రక్షించడానికి మరియు శరీరం నుండి “చెడు” LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సహాయపడుతుంది.

మందారం టీలో ఉండే హైపోలిపిదేమిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు మధుమేహం వంటి చక్కెర రుగ్మతలతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

టైప్ II డయాబెటిస్ రోగులలో నిర్వహించిన ఒక పరిశోధనలో మందార పుల్లని టీ వినియోగం వలన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజెరైడ్స్ మరియు ఊహించలేని వ్యాధులను నిర్వహించడానికి సహాయపడుట మరియు తక్కువ సాంద్రత లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని తెలిసింది.

అంతేకాక మందారం టీ రక్తపోటును తగ్గించే లక్షణాలను కలిగి ఉంది.

మూత్రకోశంలో రాళ్ళను కరిగించే ఉలవలు…

horse_gram_bnc
ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఉలవలు ఇళ్ళలో తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఉలవలు గుగ్గిళ్ళుగా చేసుకొని తినడమో లేక చారు తయారుచేసుకుని వాడడమో చేస్తే వారు పేదవారై ఉండేవారు. కానీ నేడు ఉలవలు – ఉలవచారు విందు వినోదాలలో వాడడం స్టేటస్‌ సింబల్‌ అనడంలో అతిశయోక్తి లేదు. ఉలవచారు నేడు అత్యంత ఖరీదైన వంటకం.
ఉలవలను ముఖ్యంగా చారు రూపంలో వాడతారు. ఇవి వేడిచేసే గుణం కలవి. ఉలవచారు చిక్కగా ఎర్రని లేక ఇటుకరాయి రంగులో ఉంటుంది. తినడానికి ఉలవచారు కమ్మగా ఉన్నప్పటికీ వాతము చేసే గుణము ఉన్న వారు దీనిని ప్రత్యేకించి వాడవచ్చు. ఉలవలు మూత్రకోశంలోని రాళ్ళను కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి మూత్రాశయ వ్యాధులలో దీనిని ఇతర మందులతో పాటుగా ఆహారంలో వాడవచ్చు.
ఉలవలు స్త్రీలలో ఋతు స్రావమును జారీ చేసే గుణం కలిగి ఉంది. ఋతువు సరిగా రాని వారు ఉలవలు వాడటం వల్ల ఉపయోగంగా ఉంటుంది. అధికంగా చెమటలు పడుతున్న వారు ఆహారంలో ఉలవలు వాడటం వల్ల చెమటలు హరించిపోతాయి.
ఉలవలు మంచి ప్రొటీన్లను కలిగి ఉన్నాయి. నీరసమును పోగొడుతాయి. నిస్సత్తుతోను, రక్తహీనతతోనూ బాధపడేవారు ఉలవలు తరచూ ఆహారంలో తీసుకుంటే మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అజీర్తిని పోగొడుతుంది. కడుపులో వాతమును త్వరగా తగ్గిస్తుంది. అజీర్తి విరేచనాలు అయ్యేవారు ఉలవచారు వాడటం వల్ల మేలు జరుగుతుంది.
గమనిక: ఉలవచారు కుక్క కరిచిన వారు అసలు తీసుకోకూడదు. కుక్క కరిచి చాలా రోజులయినప్పటికీ ఉలవచారు వాడారంటే వారి పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. రేబిస్‌ వైరస్‌ విజృంభించి ప్రాణాపాయం కలిగించవచ్చు.

గర్భిణీ స్త్రీలు జీరా వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్…

download (40)

1. అనీమియాను నివారిస్తుంది: రెగ్యులర్‌గా జీరా వాటర్ తాగడం వల్ల అనీమియా తగ్గిస్తుంది మరియు హీమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. దాంతో రక్తకణాలు రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. వీటిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల పాలిచ్చే తల్లులకు కూడా బాగా సహాయపడుతుంది.

2. పుట్టుక లోపాలను నివారిస్తుంది: రోజూ జీరావాటర్ త్రాగడం వల్ల పుట్టభోయే బిడ్డలో ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడుతుంది.

3. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది: బ్లడ్ ప్రెజర్‌ను నార్మల్ చేయడంలో జీరా వాటర్ బాగా సహాయపడుతుంది. జీరావాటర్‌లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల హైపర్ టెన్షన్ నివారిస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల ఫీటస్‌కు ప్రమాధం ఉంది.

4. వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది: జీరావాటర్‌లో ఉండే ఐరన్ కంటెంట్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ A, విటమిన్ C మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

5. ఎసిడిటి తగ్గిస్తుంది: జీర వాటర్‌ను తాగడం వల్ల గర్భిణీలలో ఎసిడిటి, హార్ట్ బర్న్ నివారిస్తుంది. మరియు కడుపుబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది. జీరా వాటర్ ఇలాంటి పరిస్థితుల్లో బాగా సహాయపడుతుంది.

6. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: గర్భిణీలు రోజూ జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

7. లాలాజంను ఉత్పత్తి చేస్తుంది: జీరా వాటర్ రోజూ తాగడం వల్ల సలివా ఎక్కువగా స్రవిస్తుంది. ఇది ఆకలి కోరికలను తగ్గించడం మాత్రమే కాదు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

8. మలబద్దకం నివారిస్తుంది: జీరా వాటర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. అందుకే చాలా మంది గర్భిణీలు ఈ వాటర్‌ను తాగుతారు.

9. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నివారిస్తుంది: బ్లడ్ షుగర్ లెవల్స్‌ను క్రమబద్దం చేయడంలో బాగా సహాయపడుతుంది. బ్లడ్‌లో షుగర్ ఉండటం వల్ల తల్లికి మరియు శిశువుకు కూడా కొద్దిగా ప్రమాదం. ఇటువంటి ప్రరిస్థితిలో జీరవాటర్ బాగా సహాయపడుతుంది.

10. ఇతర సాధారణ సమస్యలను నివారిస్తుంది: గర్భిణీలో ఇతర సమస్యలు, వికారం, డయోరియా, మార్నింగ్, సిక్ నెస్ మొదలగు లక్షణాలను నివారిస్తుంది. అందువల్ల జీరా వాటర్‌ను గర్భిణీ స్త్రీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

పోషకాలకు కేర్ ఆఫ్ బీరకాయ…పోషకాలేంటో తెలుసుకోండి…

images (31)
బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.
సెల్యులోజ్, నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడేవారికి బీరకాయ తినడం చక్కటి పరిష్కారం.
రక్తంలోనూ మూత్రంలోనూ చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే మంచిది.
బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.
బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, యాక్నె సమస్యలు తొలగిపోతాయి. దేహం నుంచి ఆల్కహాల్ కారక వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజూ ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

స్పాట్ లెస్ స్కిన్ పొందడానికి పెరుగు, క్యారెట్ తో హోం మేడ్ ఫేస్ ప్యాక్ …

lifestyle-soft-spotless-skin-to-achieve-the-1-55057-3750-skin2

కావల్సినవి:

క్యారెట్ 1

పెరుగు 1 టేబుల్ స్పూన్

శెనగపిండి 1 టేబుల్ స్పూన్

తయారీ:

క్యారెట్ కు తొక్క తీసి, కడిగి, తురుముకోవాలి. ఈ క్యారెట్ తురుమును ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకుని, అందులో మిగిలిన ఆ రెండు పదార్థాలు కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత ముఖం, మెడకు పూర్తిగా అప్లై చేయాలి.

అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అద్భుతమైన మార్పు కనబడుతుంది. ఈ ఫేస్ మాస్క్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హెల్తీ, స్పాట్ లెస్ స్కిన్ ను పొందుతారు.