Posts Tagged ‘besan’

అప్పర్ లిప్ హెయిర్‌ను తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

download (15)

– షుగర్, నిమ్మరసం: ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్‌గా మారిన తర్వాత అప్పర్ లిప్ మీద అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. స్ర్కబ్ చేసిన 15నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– పసుపు, పాలు: పసుపు, పాలను ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేయాలి. పేస్ట్‌లా చేసుకున్నాక, ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయాలి. 10నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

– ఎగ్ వైట్: అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి ఎగ్ వైట్ బాగా సహాయపడుతుంది. ఎగ్ వైట్‌లో కొద్దిగా షుగర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పై పెదవుల మీద అప్లై చేసి డ్రై అయిన అరగంట తర్వాత పీలింగ్‌లా తొలగించాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– శెనగపిండి: కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. శెనగపిండిలో కొద్దిగా పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

అరిటికాయ బజ్జీలను ఎలా తయారుచేయాలో చూద్దాం…

crispy-snack-recipe-aratika

కావల్సిన పదార్థాలు:

పచ్చిఅరటి కాయలు: 2 లేదా 3(పొట్టు తీసి, పలుచగా కావల్సిన ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి)

శెనగపిండి: 2cup

బియ్యం పిండి: 1tbsp

కారం: 1tsp

బేకింగ్ సోడా : చిటికెడు

అజ్వైన్(వామ్ము): 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో, శెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము, బేకింగ్ సోడా మరియు సరిపడా నీళ్ళు పోసి మరీ చిక్కగా, మరీ పల్చగా కాకుండా మీడియంగా కలిపి పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి, వేడయ్యాక మంటను మీడియం తగ్గించి పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ముందుగా పలచగా చక్రల్లా కట్ చేసి పెట్టుకొన్నపచ్చి అరిటికాయ ముక్కలను శెనగపిండి మిశ్రమంలో డిప్ చేసి అన్ని వైపులా శెనగపిండి అంటేలా డిప్ చేయాలి.

4. శెనగపిండిలో డిప్ చేసిన అరిటికాయ బజ్జీలను కాగుతున్న నూనెలో 4-6 వరకూ వేసి(సైజును బట్టి, కాగేనూనెలో వేయాలి) అవి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.

5. బజ్జీలు నూనెలో వేగుతున్నప్పుడు కాస్త మంటను పెంచుకోవచ్చు. అప్పుడు లోపలి భాగం కూడా పూర్తిగా ఉడుకుతుంది. అరటికాయ బజ్జీలు బ్రౌన్ కలర్ లోనికి మారగానే వాటిని తీసి నూనె పీల్చుకొనే పేపర్ మీద ఒకటి రెండు నిముషాలు వేసి తర్వాత వెంటనే సర్వ్ చేయాలి. అంతే అరిటికాయ బజ్జీ రెడీ.

ఎగ్ బోండా ఎలా తయారుచేయాలో చూద్దాం…

images-5

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 5

శెనగపిండి: 1/2cup

కారం: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 1cup

తయారుచేయు విధానం:

1. ముందుగా గుడ్లను ఉడికించి తర్వాత ఔటర్ షెల్ తొలగించి పక్కన పెట్టుకోవాలి. అవసరం అయితే మీరు ఒక గుడ్డును రెండుగా కట్ చేసుకోవచ్చు. లేదా పూర్తిగా ఒక గుడ్డు కావాలనుకుంటే అలాగే ఉపయోగించుకోవచ్చు.

2. ఒక మిక్సింగ్ బౌల్లో శెనగపిండి, నీళ్ళు, కారం, మరియు ఉప్పు వేసి, చిక్కగా, కొత్తిగా జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, మీడియం మంట మీద కాగనివ్వాలి, తర్వాత ఉడికించి పక్కన పెట్టుకొన్న గుడ్డును శెనపిండిలో డిప్ చేసి గుడ్డుకు బాగా అంటుకొనేలా చేయాలి.

4. ఇప్పుడు కాగుతున్న నూనెలో వేయాలి. మంటను తగ్గించి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మద్యమ్యదలో వాటిని తిరగేస్తుండాలి.

5. ఎగ్ బోండా ఫ్రై అయినట్లు అనిపిస్తానే వాటీని నూనె నుండి వేరుచేసి తీసి సర్వింగ్ బౌల్ లేదా సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. ఇలా మొత్తం గుడ్లును తయారుచేసుకొన్న తర్వాత అదనంగా ఆయిల్ ఉన్నట్లు మీరు గమనించినట్లైతే పేపర్ టవల్ మీద వేసి అదనపు నూనె పీల్చుకొనేలా చేయాలి. అంతే ఎగ్ బోండా రెడీ. అంతే ఈ ఎగ్ బోండాను టమోటో కెచప్ లేదా కోరియాండర్ చట్నీతో సర్వ్ చేయాలి.

స్పాట్ లెస్ స్కిన్ పొందడానికి పెరుగు, క్యారెట్ తో హోం మేడ్ ఫేస్ ప్యాక్ …

lifestyle-soft-spotless-skin-to-achieve-the-1-55057-3750-skin2

కావల్సినవి:

క్యారెట్ 1

పెరుగు 1 టేబుల్ స్పూన్

శెనగపిండి 1 టేబుల్ స్పూన్

తయారీ:

క్యారెట్ కు తొక్క తీసి, కడిగి, తురుముకోవాలి. ఈ క్యారెట్ తురుమును ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకుని, అందులో మిగిలిన ఆ రెండు పదార్థాలు కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత ముఖం, మెడకు పూర్తిగా అప్లై చేయాలి.

అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అద్భుతమైన మార్పు కనబడుతుంది. ఈ ఫేస్ మాస్క్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హెల్తీ, స్పాట్ లెస్ స్కిన్ ను పొందుతారు.

కొబ్బరి వడలను ఎలా తయారుచేయాలో చూద్దాం…

oetuqkiefcdjj_bigger

కావల్సిన పదార్థాలు:

కొబ్బరి: 2 cups(తురిమినది)

సూజి: ½cup

శెనగపిండి: ½cup

ఆవాలు: 1tsp

పచ్చిమిర్చి: 7(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

కరివేపాకు: రెండు రెమ్మలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

నెయ్యి: 1tbsp నూనె: 2 cups

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా కొబ్బరి తరుగు, శెనగపిండి మరియు సూజి రవ్వ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మూడింటిని బాగా మిక్స్ చేయాలి.

2. ఇప్పుడు అందులో అరకప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి, వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఒక సెకను వేగించుకొన్న తర్వాత వీటిని కలిపి పెట్టుకొన్న పిండిమిశ్రమంలో వేయాలి.

4. తర్వాత అందులో ఉప్పు మరియు పచ్చిమిర్చి తరుగు వేసి, చేత్తో మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద ఒక డీప్ బాటమ్ పాన్ పెట్టి, ఆయిల్ వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని వడలులాగా తట్టుకొని కాగేనూనెలో వేసి డీప్ ఫ్రైచేసుకోవాలి.

6. అంతే కొబ్బరి వడలు రెడీ. ఈ క్రిస్పీ కొబ్బరి వడలను కొత్తమీర చట్నీ లేదా రెడ్ చిల్లీ చట్నీతో సర్వ్ చేయాలి.

పాలక్ పకోడా ఎలా తయారుచేయాలో చూద్దాం…

maxresdefault

పాలకూర: 1కట్ట

శెనగపిండి: 250grms

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

అజ్వైన్: 1tsp(సోంపు)

జీలకర్ర: 1tbsp

కారం: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్ళు: 1cup

నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాలకూరను శుభ్రంగా కడగాలి. తర్వాత పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అజ్వైన్, జీలకర్ర, మరియు ఉప్పు వేయాలి.

3. అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న పాలకూర కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా పిండిని కలుపుకోవాలి. చిక్కగా జారుడుగా అయ్యే వరకూ కలుపుకోవాలి.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, చేతిని నీటిలో ముంచి తడిచేసుకొని, శెనగపిండి, పాలక్ మిశ్రమాన్ని చేత్తో కొద్దికొద్దిగా కాగే నూనెలో విడవాలి. పకోడాను నిధానంగా కాగేనూనెలో విడవాలి. ఎలా పడితే అలా వేస్తే నూనె చేతుల మీద ఎగిరే ప్రమాదం ఉంది.

5. పకోడాను అన్ని వైపులా కాలి, క్రిస్పీగా మరియు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. వేగిన తర్వాత వాటిని తీసి పేపర్ టవల్ మీద వేయాలి. అంతే పాలక్ పకోర రెడీ. కొత్తిమీర చట్నీ, టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి. అలాగే మీరు చింతకాయ చట్నీ కూడా ట్రై చేయవచ్చు.

‘ప్యాజ్’ డెలిషియస్ బెంగాలి స్నాక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (27)

కావల్సిన పదార్థాలు:

శెనగపిండి: 1cup

ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

కాలా జీర(ఉల్లిపాయ విత్తనాలు): 1tsp

కారం: 1/4tsp

బియ్యం పిండి: 1tbsp

నూనె: డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా

నీళ్ళు: 1/2cup

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నూనె మినహాయించి మిగిలిన పదార్థాలన్నింటిని వేసి మొత్తం బాగా కలగలుపుకోవాలి.

2. సరిపడా నీళ్ళు పోసి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు డీఫ్ ఫ్రైయింగ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగనివ్వాలి.

4. తర్వాత ఈ పిండి మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకొని, ఉండలా చేసి అరచేతిలో పెట్టుకొని కట్ లెట్‌లా ఒత్తుకోవాలి.

5. ఇలా కొన్ని కట్ లెట్స్‌ను తయారుచేసుకొన్నాక కాగుతున్ననూనెలో వేసి మీడియం మంట మీద గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. ఇలా మొత్తం తయారుచేసుకోవాలి. అంతే హాట్ అండ్ క్రిస్పీ ప్యాజ్ స్నాక్ రెడీ . ఈ రుచికరమైన స్నాక్ రిపిసిని మీకు నచ్చిన చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేయవచ్చు.

స్పైసీ బీరకాయ బజ్జీని ఎలా తయారుచేయాలో చూద్దాం…

shutterstock_194798582-potato-bajji

కావలసిన పదార్థాలు: బీరకాయలు:

2 సెనగపిండి: 1cup

బియ్యప్పిండి: 1/2cup

నూనె: 2 cups

వంటసోడా: చిటికెడు

కారం: 2tsp

ఉప్పు: రుచికి తగినంత

జీలకర్ర పొడి : 1tsp

తయారుచేసే విధానం:

1. ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి.(చేదు లేకుండా చూసుకోవాలి)

2. బియ్యప్పిండి, సెనగపిండి, ఉప్పు, కారం, సోడా కలిసి నీళ్లు పోసి జారుగా కలపాలి.

3. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె పోసి బాగా కాగిన తరవాత ఒక్కో బీరకాయ ముక్కని సెనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి. ఎర్రగా వేయించి తీశాక టొమాటో సాస్‌తో వడ్డించాలి. అంతే బీరకాయ బజ్జీ రెడీ.

నెయ్యి మురుకులు ఎలా తయారుచేయాలో చూద్దాం…

798f5a62ef9fb366e3ebe8eb62bce2aa_1024x1024

కావల్సిన పదార్థాలు:

బియ్యం పిండి: 4cups

శెనగపిండి: 2cups

కారం: 3tbsp

వాము: 1tsp

తెల్ల నువ్వులు: 2 లేదా 3tbsp

ఉప్పు: రుచికి సరిపడా

జీలకర్ర: 2tbsp

బేకింగ్ సోడా: చిటికెడు

నెయ్యి: 2టేబుల్ స్పూన్లు

నూనె: చిన్న కప్పుతో ఒక కప్పు(పిండిలో కలుపుకోవడానికి)

నూనె : వేగించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో బియ్యం పిండి, శెనగపిండి, బేకిండ్ సోడా, ఉప్పు, కారం, వాము, జీకలర్ర, కొద్దిగా వేడిచేసిన నెయ్యి మరియు నూనె ఒకదానికి తర్వాత ఒకటి వేసుకోవాలి.

2. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

3. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి, పిండిని మృదువుగా కలుపుకోవాలి. కలుపుకొన్న తర్వాత పిండి మీద కొద్దిగా నూనె చిలకరిస్తే త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది.

4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో జంతికల గొట్టంలో పిండిని నింపి, తర్వాత ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకొని తర్వాత కాగే నూనెలో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. అంతే నెతి మురుకులు రెడీ. కాస్త శ్రమపడితే రుచికరమైన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే జంతికలు సిద్దమవుతాయి.

రిబ్బన్ పకోడ ఎలా తయారుచేయాలో చూద్దాం…

ribbon_pakoda

కావల్సిన పదార్థాలు:

బియ్యం పిండి: 1cup

శెనగపిండి: 3/4cup

కారం: 2tbsp

నెయ్యి: 2tbsp

బేకింగ్ సోడ: చిటికెడు

ఇంగువ: చిటికెడు

నీళ్ళు: 1cup

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: డీప్ ఫ్రై చేయడానికి

తయారుచేయు విధానం:

1. ముందగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, శెనగపిండి, ఉప్పు, ఇంగువ, నెయ్యి మరియు కారం అన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత సరిపడా నీళ్ళు పోసి పిండిని మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి.

3. అంతలోపు, స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి.

4. తర్వాత కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని మురుకుల గొట్టల్లో పకోడా బ్లేడ్ ఫిట్ చేసి, తర్వాత అందులో పిండి పెట్టాలి.

5. ఇప్పుడు కాగే నూనెలో గుండ్రంగా పకోడాలను ప్రెస్ చేయాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి పకోడాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి.

7. పకోడాలు చల్లబడిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి నిల్వ చేసుకోవచ్చు.