Posts Tagged ‘body care’

ఓట్స్ మీల్ ను బ్యూటికి ఏవిధంగా ఉపయోగించుకోవాలి?

 

download (26)

ముఖానికి ఓట్ మీల్: చర్మానికి తగినంత తేమను అందించి మాయిశ్చరైజ్ గా సహాయపడుతుంది. మరియు చర్మ రంద్రాల్లోని మురికిని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించి, డీప్ గా శుభ్రపరుస్తుంది.

ఫేస్ వాష్: ఓట్ మీల్లో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మంలో మురికిని మరియు ఆయిల్ ను తొలగిస్తుంది. మీరు చాలా త్వరగా ఓట్ మీల్ తో క్లెన్సర్ ను తయారు చేసుకోవచ్చు. అందుకు రెండు చెంచాలా ఓట్ మీల్, ఒక చెంచ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి గుండ్రంగా ముందుకు వెనకు మర్దన చేయాలి . 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేనె బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

స్పాట్ ట్రీట్మెంట్: మొటిమలు మరియు మచ్చలతో బాధపడుతున్నట్లైతే ఓట్స్ మీల్ మీ సమస్యను నివారిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మంలోని అదనపు ఆయిల్ గ్రహిస్తుంది మరియు చర్మానికి చల్లదనాన్ని తీసుకొస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ ను నీటిలో వేసి ఉడికించి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరియు సన్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది.

మగవారి సౌందర్యం పెంపొందిచుకోవడానికి మేకప్ ట్రిక్స్…

images (73)

కన్సీలర్: 

పురుషులకు కన్సీలర్ ఒక అద్భుతమైనటువంటి సాధారణ మేకప్. చాలా మంది టీవీ స్టార్స్, పిల్మిం స్టార్స్ అందరూ ముఖం మీద ఉన్న చర్మం లోపాలను దాచడానికి దీన్ని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. సాధారణంగా కళ్ల క్రింద నల్లటి వలయాలు కనిపించకుండా కన్సీలర్లను వాడుతారు. లేత బంగారు రంగు కన్సీలరయితే నల్లటివలయాల్ని బాగా కప్పేస్తుంది. లేతరంగు కన్సీలర్ వాడితే బాగుంటుంది. ఫౌండేషన్ వేసుకున్నా లేకపోయినా కన్సీలర్ వాడొచ్చు. చర్మం అంతా ఒకటే రకంగా కనిపించాలంటే, కన్సీలర్‌ రాయాలి.

ఫౌండేషన్:

పురుషులు ఫౌండేషన్ కాస్మోటిక్ వాడటం అనేది కన్సీలర్ వంటిదే, అయితే శరీరపు ఛాయను బట్టి ఫౌండేషన్ రంగును ఎంచుకోవాలి. అందంగా కనబడాలంటే మేకప్ లో మొదట ఫౌండేషన్ తప్పనిసరి. పౌండేషన్ మృదువుగా వుండేలా చూసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసేటప్పుడు అంతటా సమనంగా వుండేలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖంపై మొటిమలు, మచ్చలు, కళ్లకింది నల్లటి వలయాలను కప్పిపుచ్చుకునేందుకు చాలామంది ఫౌండేషన్‌ను మందంగా రాసుకుంటుంటారు. అయితే దీనివల్ల అనుకున్న ఫలితం రాదు. కాబట్టి అలాంటి వారు ఇకమీదట కన్సీలర్‌ను వాడిచూస్తే తేడా ఇట్టే అర్థమవుతుంది. చిన్న మొటిమను కనిపించకుండా చేయాలంటే, ఫౌండేషన్‌కు బదులుగా ముందు కన్సీలర్‌ వాడాలి. ముడతలు కనిపించకుండా ఉండేందుకు మాయిశ్చరెైజర్‌, ఫౌండేషన్‌లను కలిపి రాసుకుంటే సరిపోతుంది.

దంతాలను తెల్లగా మార్చుకోవడానికి సింపుల్ చిట్కా…

images (6)

అన్ రిఫైన్డ్ కుక్కింగ్ ఆయిల్ : 1tbsp (కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్)

ఉప్పు: 1tsp

పైన సూచించిన పదార్థాలు తీసుకొని, రెండూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని, ఆయిల్ పుల్లింగ్‌లా చేయాలి. 5నిముషాల పాటు నోట్లోనే ఆయిల్‌ను పుక్కట పట్టి ఆయిల్ పుల్ చేయాలి.(దంతాలు మొత్తం ఆయిల్ తాకేలా పుక్కలించాలి.) 5నిముషాల తర్వాత ఊసేసి, తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాతో పాటు హెర్బల్ టూత్ పేస్ట్ వాడుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

అప్పర్ లిప్ హెయిర్‌ను తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

download (15)

– షుగర్, నిమ్మరసం: ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్‌గా మారిన తర్వాత అప్పర్ లిప్ మీద అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. స్ర్కబ్ చేసిన 15నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– పసుపు, పాలు: పసుపు, పాలను ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేయాలి. పేస్ట్‌లా చేసుకున్నాక, ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయాలి. 10నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

– ఎగ్ వైట్: అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి ఎగ్ వైట్ బాగా సహాయపడుతుంది. ఎగ్ వైట్‌లో కొద్దిగా షుగర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పై పెదవుల మీద అప్లై చేసి డ్రై అయిన అరగంట తర్వాత పీలింగ్‌లా తొలగించాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– శెనగపిండి: కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. శెనగపిండిలో కొద్దిగా పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

ఆకర్షణీయమైన పెదాలకు పర్‌ఫెక్ట్ లిప్ స్టిక్ మరియు లిప్ లైనర్…

download (6)

1. ఆకర్షనీయమైన పెదాల కోసం మన్నికైన లిప్ స్టిక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అందుకు మంచి కలర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంచుకొనే లిప్ స్టిక్ నేచురల్ కలర్ అయ్యుంటే, సహజ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ రాత్రి సమయంలో మాత్రమే ఉపయోగపడుతాయి. మ్యాట్ ఫినిష్ నిచ్చే లిప్ స్టిక్స్ పగలు అందంగా కనబడేలా చేస్తే, స్టెయిన్ మరియు గ్లాస్ ఫినిష్ సాయంత్రం, రాత్రి వేళల్లో మంచి లుక్ నిస్తుంది.

2. లిప్ స్టిక్, లిప్ లైనర్ ఉపయోగించడానకి ముందుగా మీ మేకప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చివరగా లిప్ స్టిక్, తర్వాత లిప్ షేప్ కోసం లిప్ లైనర్‌ను ఉపయోగించాలి.

3. అలాగే పెదాలకు కొద్దిగా లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం వల్ల పెదాలు తడిగా ఉంటాయి.

4. పెదాలకు లిప్ స్టిక్ రాసుకొన్న తర్వాత పెదాలా ఆకృతి కోసం లిప్ లైనర్‌ను లిప్ స్టిక్ కంటే కొంచెం డార్క్‌గా ఉన్నవాటితో ఔట్ షేప్‌ను గీయాల్సి ఉంటుంది. పెదాలపైన కొంచెం మందంగా లిప్ లైన్ పెన్సిల్‌తో గీసుకొని చివర్లు వచ్చేసరికి సన్నగా ఔట్ లైన్ ఇవ్వాల్సి ఉంటుంది.

5. నోటిని తెరచి సన్నని పెదాలపై లిప్ లైనర్‌తో ఔట్ లైన్ గీసుకోవాలి. పెదాలపై పూర్తిగా ఔట్ లైన్ గీసుకొన్న తర్వాత పెద్దాలు నిండుగా కనిపిస్తాయి.

6. లిప్ స్టిక్‌ను ట్యూబ్‌తో లేదా లిప్ స్టిక్ బ్రెష్‌తో అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత పైనల్ కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పెదాలు మరింత అందంగా కనబడుతాయి.

7. పై పెదవి, క్రింది పెదవి పైన ఎక్స్‌ట్రా లిప్ స్టిక్ ఏమైనా కనబడితే కాటన్ బాల్స్ తీసుకొని తుడిచేసుకోవాలి.

8. తక్కువ విలువ, మన్నిక లేని, లిప్ స్టిక్ ఉపయోగించడం వల్ల భోజనం తర్వాత లిప్ స్టిక్ వాటర్ బాటిల్స్, టీ కప్పుకు, అంటుకోవడం గమనించాలి.

ముల్తానీ మట్టి యొక్క గొప్ప సౌందర్య ప్రయోజనాలు…

images (67)

చర్మం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది దీనికి సహజంగా పిల్చే గుణం కలిగి ఉంటుంది. ముల్టానా మట్టిని జిడ్డు చర్మం నుంచి అధిక నూనెను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మ రంద్రాలను క్లాగ్ లేకుండా చేస్తుంది. అలాగే చర్మం యొక్క సహజ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనిని సాదారణంగా ఇంటిలో ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు.

* ముల్టానా మట్టి,రోజ్ వాటర్,గంధం పొడి ఈ మూడింటిని సమాన మొత్తాలలో తీసుకోని కలపాలి.

* ఈ మిశ్రమంతో మీ ముఖానికి ఫేస్ ప్యాక్ వేయాలి.

* ఇది సహజంగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

* జిడ్డు చర్మం కలవారు ఈ ప్యాక్ ను ప్రతి రోజు వేయాలి. ఒక మోస్తరు జిడ్డు చర్మం కలవారు వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ ను వేయాలి.

పగిలిన పెదాలను స్మూత్ అండ్ సాఫ్ట్ గా మార్చే రెమెడీస్…

Pink-Lips-lips-10439612-440-296

– కొబ్బరినూనె: ఒక గిన్నెలో తేనె, కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పెదాలను సున్నితంగా  స్క్రబ్ చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి, పెదాలకు కావాల్సిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది.

– బ్రౌన్ షుగర్: అర టీస్పూన్ బ్రౌన్ షుగర్ ను పెదవులపై రాసి నెమ్మదిగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి స్మూత్ గా తయారవుతాయి.

– పంచదార: డెడ్ స్కిన్ సెల్స్, మురికి మీ పెదాలను పొడిగా, డార్క్ గా మారుస్తాయి. లిప్స్ ను క్లీన్ చేసి, వాటిని స్మూత్ గా, పింక్ కలర్ లోకి మార్చుకోవడానిని ఈ సింపుల్ టిప్ ఫాలో అవవచ్చు. నీటిలో కొద్దిగా పంచదార వేసి పెదాలపై స్క్రబ్ చేసుకోవాలి. ఇది పెదాల రంగును మార్చడమే కాకుండా స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుస్తాయి.

మెడ చుట్టూ, వీపు భాగంలో డార్క్ స్కిన్ పోగొట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీ…

img_como_quitar_la_flacidez_de_la_cara_y_el_cuello_44798_300_square

అరస్పూన్ మిల్క్ క్రీమ్ తీసుకుని, అందులో అరటీస్పూన్ శెనగపిండి మిక్స్ చేయాలి. చిక్కగా పేస్ట్ చేసి, నల్లగా ఉన్నభాగంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మెడ నలుపును తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్‌ హోం రెమెడీస్…

images (38)

పసుపు మరియు నిమ్మరసం: పసుపు, నిమ్మరసం సమపాళ్లల్లో తీసుకొని మెడకు పట్టించి పావు గంట పాటు ఆరనిచ్చి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేసినట్లయితే మెడ రంగులో తేడాను గమనించవచ్చు. ఈ చిట్కాను రెగ్యులర్‌గా పాటిస్తుంటే ముందు ముందు తిరిగి డార్క్‌గా మారకుండా ఉంటుంది.

నిమ్మరసం మరియు టమోటో: టమోటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం పిండి మెడ చుట్టూ అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చక్కటి మార్పు కనిపిస్తుంది.

నిమ్మ, ఆలివ్ ఆయిల్ మరియు తేనె: ఈ మూడింటి కాంబినేషన్‌లో నెక్ ప్యాక్ వేసుకోవడం వల్ల మెడ మీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అందుకోసం ఒక బౌల్లో ఒక చెంచా తేనె, 2చెంచాల ఆలివ్ ఆయిల్, ఒక చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి అరగంట మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

డార్క్ నెక్‌కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

download (11)

– నిమ్మరసం మరియు రోజ్ వాటర్: ఫ్రెష్‌గా ఉండే నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి కాటన్ బాల్ డిప్ చేసి మెడ చుటూ అప్లై చేసి మర్దన చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇదిఅన్ని రకాల చర్మతత్వాతలకు నప్పుతుంది.

– లెమన్ అండ్ హనీ: ఇది వివిధ రకాల చర్మ తత్వాలున్న వారికి ఫర్ఫెక్ట్ కాంబినేషన్. ఫ్రెష్ లెమన్ జ్యూస్‌లో కొద్దిగా ఆర్గానిక్ తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈచిట్కాతో స్కిన్ టోన్ ఎఫెక్టివ్‌గా మార్చుకోవచ్చు.