Posts Tagged ‘brinjal’

వంకాయ మరియు టమోటో రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (1)

కావల్సిన పదార్థాలు:

వంకాయ: 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

ఆయిల్ : ¼tsp

వెల్లుల్లి రెబ్బలు: 4- 5

టొమాటోస్ : 4 (సన్నగా తరిగినవి)

నీళ్ళు :1cup

కారం : 1 tbsp

దాల్చిన : చిన్నముక్క

బే ఆకు: 1

ఉప్పు : రుచికి సరిపడా

పసుపు పొడి :1tsp

జీలకర్ర పొడి : 1 tsp

గరం మసాలా పొడి : ½tsp

కొత్తిమిర : సన్నగా తరిగి పెట్టుకోవాలి

పచ్చిబఠానీలు : ½cup(ఉడికించినవి)

తయారుచేయు విధానం:

1. ముందుగా వంకాయలను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి కొద్దిసేపు ఉండనిచ్చి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి.

2. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడిఅయ్యాక అందులో సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయముక్కలు మరియు వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. 10నిముషాల తర్వాత అందులో సన్నగా తరిగిన టమోటో, వంకాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫై చేయాలి. తర్వాత కొద్దిగా నీరు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా మరియు కొత్తిమీర తరుగు వేసి ,మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టి, తర్వాత మూత పెట్టి 10నిముషాలు ఉడకనివ్వాలి.

4. పదినిముషాల తర్వాత మూత తీసి, అందులో ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠానీలను వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి అంతే గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

వంకాయ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం..

 

images (52)

కావలసిన పదార్థాలు :

వంకాయలు: 1/2Kg

ఎండుమిర్చి: 8-10

మినప్పప్పు: 2tbsp

ధనియాలు: 1tsp

ఉల్లిపాయలు: 4

వెన్న: 100grm

ఉప్పు: రుచికి తగినంత

నూనె: 3tsp

తయారు చేయు విధానం :

1. ముందుగా వంకాయలను గుత్తి వంకాయల మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి.

2. తర్వాత ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.

3. తరువాత ఉల్లిపాయముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి.

4. ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూరి ఉంచాలి.

5. తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదాని పక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే వేడి వేడి వంకాయ వెన్న మసాలా సిద్ధమైనట్లే…

స్టఫ్డ్ టమోటో మలై గ్రేవీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (2)

కావలసిన పదార్థాలు:

ఎర్రగా ఉన్న టొమాటోలు: 2

ఆలివ్ ఆయిల్ : 1tsp

వెల్లుల్లి రేకలు: 2

ఉల్లి తరుగు: 1/2cup

జీలకర్ర: 1/2tsp

వంకాయ ముక్కలు: 1/2cup

వెనిగర్: 2tbps

టొమాటో ముక్కలు: 1/2cup

పుదీనా ఆకులు: 5

నువ్వుపప్పు : 3tbsp

పైన్‌నట్స్: 2tbsp

కారం: 1/2tsp

ఉప్పు: రుచికి తగినంత

మిరియాలపొడి: 1/2tsp

కొత్తిమీర తరుగు: 1cup

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓవెన్‌ను 375 డిగ్రీల దగ్గర వేడి చేయాలి.

2. తర్వాత టొమాటోలపై భాగాన్ని కట్ చేసి, లోపల ఉండే గుజ్జును స్పూను సహాయంతో జాగ్రత్తగా తీయాలి.

3. ఇప్పుడు ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లిరేకలు, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మూడు నిమిషాలు వేయించాలి.

4. వంకాయ ముక్కలను జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.

5. తర్వాత ఒక చిన్న బాణలిలో వెనిగర్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి.

6. అలాగే అందులోనే పుదీనా ఆకులు, కారం జత చేసి రెండు నిమిషాలు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.

7. మరో బాణలిలో కూరగాయ ముక్కలకు, నువ్వుపప్పు, పైన్ నట్స్ జత చేసి కలపాలి. వేడిగా ఉండగానే మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి దించేయాలి.

8. పైన తయారుచేసుకున్న పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.

9. పెద్ద స్పూన్‌తో ఈ మిశ్రమాన్ని టొమాటోలలో స్టఫ్ చేయాలి.

10. తర్వాత బేకింగ్ షీట్ మీద ఉంచి ఓవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి. 20 నిముషాల తర్వాత బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్టఫ్డ్ టమోటో రెడీ.

బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (49)

కావల్సిన పదార్థాలు:

బంగాళ దుంపలు : 2 (పొట్టు తొతలగించి మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి)

ఆకుకూర: కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

క్యారెట్: 1 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

వంకాయ: 1 (మీడియం సైజ్, కట్ చేసుకోవాలి )

మునక్కాడలు: 2 (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)

పచ్చి బటానీలు: ½cup

అల్లం: 1 మీడియం సైజ్ (తురుముకోవాలి)

కళా జీర (ఉల్లిపాయ విత్తనాలు) : 2tbsp(పొడి చేసుకోవాలి)

ఉల్లిపాయ విత్తనాలు: 1tsp

కారం: 1tsp

పసుపు: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

ఆయిల్: 2tbsp

నీళ్ళు: ½cup

తయారుచేయు విధానం:

1. ముందుగా కట్ చేసి పెట్టుకొన్న కూరగాయ ముక్కలన్నింటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలను ఉప్పునీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి.

2. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఒక చెంచా ఉల్లిపాయ విత్తనాలు వేయాలి.

3. ఈ విత్తనాలు వేగడం మొదలుపెట్టాక అందులో అల్లం తురుము వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

4. తర్వాత కూరగాయ ముక్కలను ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ 4-5నిముషాలు మీడియం మంట మీద వేగించుకవోాలి.

5. ఇప్పుడు అందులో కట్ చేసిన ఆకుకూర తరుగు, పసుపు పౌడర్, కారం మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.

6. మీడియం మంట పెట్టి 5-10నిముషాలు ఉడికించుకోవాలి.

7. తర్వాత అవసరం అయినంత మేర నీళ్ళు పోసి, మూతపెట్టి 10నిముషాలు ఉడికించుకోవాలి.

8. వెజిటేబుల్ ముక్కలు మెత్తగా ఉడికినవో లేదో నిర్ధారించుకొని, పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ . ఈ అద్భుతమైన వంటను రోటీ లేదా పరాటాలో సర్వ్ చేయండి.

బ్రింజాల్ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (44)

బ్రింజాల్ గ్రేవీకి కావల్సిన పదార్థాలు:

వంకాయలు – 6 (blue coloured)

వేరుశెనగలు – 1 cup

పచ్చిశెనగపప్పు – 1/2 cup

కొబ్బరితురుము – 1/2 cup

బెల్లం – 2 teaspoons

చింతపండుపేస్ట్ – 1 teaspoon

జీలకర్ర – 1/2 teaspoon

ఆవాలు – 1/2 teaspoon

ఎండుమిర్చి – 5 to 6

ఉల్లిపాయలు – 1 cup

టమోటోలు – 1 cup

కొత్తిమీర – 1/2 cup

పసుపు – 1/4th teaspoon

నూనె: తగినంత

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా మిక్సీలో, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, టమోటో, వేరుశెనగలు, పచ్చిశెనగపప్పు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండుపేస్ట్, బెల్లం, మరియు ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

2. తర్వాత వంకాయలను శుభ్రం చేసి, ఒక్కో వంకాయను నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి.(గుత్తివంకాయకు కట్ చేసినట్లు కట్ చేసుకోవాలి)

3. తర్వాత ఒక్కో వంకాయను తీసుకొని ముందుగా తయారుచేసుకొన్న మసాలాను వంకాయల్లో స్టఫ్ చేయాలి. ఇలా అన్ని వంకాయలను స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు మరో పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, టమోటో ముక్కలు, కారం వేసి మొత్తగా ఫ్రై చేసుకోవాలి.

5. ఉల్లి, టమోటో ముక్కలు మెత్తబడ్డాక అందులో మసాల స్టఫ్ చేసిన వంకాయలను నిధానంగా పోపులో వేసి మొక్స్ చేసి కలియబెడుతూ 10 నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత అవసరం అయితే నీళ్ళు కొద్దిగా మిక్స్ చేసి, వంకాయలను మెత్తగా ఉడికించుకోవాలి. అంతే బ్రింజాల్ కర్రీ రెడీ. ఈ రుచికరమైన నోరూరించే బ్రింజాల్ కర్రీని జొన్నరొట్టెతో సర్వ్ చేస్తే సూపర్‌గా ఉంటుంది.

మిక్స్డ్ పల్స్ సాంబార్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (43)

కావల్సిన పదార్థాలు:

ఉలవలు – 1/2 కప్పు

ముడి పెసలు – 1/2 కప్పు

శెనగలు – 1/2 కప్పు

వంకాయలు – 3 to 4 (సన్నగా తరిగినవి)

ఉల్లిపాయలు- 2 (సన్నగా తరిగినవి)

ఆవాలు – 1/4 టీస్పూన్

కొబ్బరి తురుము – 1/2 కప్పు

ధనియాలు – 1/2 టీస్పూన్

కారం – 3 టీస్పూన్

బెల్లం – 1/4 టీస్పూన్

చింతపండు – 1/4 టీస్పూన్

కరివేపాకు – 8 to 10

నూనె: సరిపడా

ఉప్పు: రుచికి తగినంత

తయారీ విధానం:

1. పెసలు, శెనగలు, ఉలవలను నీటిలో వేసి రాత్రంత నానబెట్టుకోవాలి లేదా వేడి నీటిలో 2 గంటలు నానబెడితే సరిపోతుంది.

2. గింజలను 2 గంటలసేపు నానబెట్టిన తర్వాత నీరు వంపేసి ప్రెజర్ కుక్కర్ లో వేసి వేరే నీరు పోసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

3. గింజలు ఉడికే లోపు మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, చింతపండు, కారం, బెల్లం, ధనియాలు మరియు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

4. ఇప్పుడు ఒక కుక్కింగ్ బౌల్ స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

5. నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు మరియు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

7. ఉల్లిపాయ, వంకాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి మిక్స్ చేస్తూ ఐదునిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సరిపడా నీరు పోయాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ఉడికించుకోవాలి.

8. రుచికి సరిపడా ఉప్పు వేసి కలబెట్టి, పది నుండి పదిహేను నిముషాలు ఉడికించుకోవాలి.

9. సాంబార్ బాగా ఉడికి, చిక్కబడే సమయంలో, స్టౌ ఆఫ్ చేయాలి. అంతే మిక్స్డ్ పల్స్ వెజిటేబుల్ సాంబార్ రిసిపి రెడీ ఇది రైస్ కు మంచి కాంబినేషన్.

స్పైసీ స్టప్డ్ బ్రింజాల్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం…

images (4)

కావల్సిన పదార్థాలు:

వంకాయలు: 1/2kg

ఉల్లిపాయలు: 2పెద్దవి

వెల్లుల్లి: 4

ఉప్పు : రుచికి తగినంత

కారం: 1tsp

నూనె : వేయించడానికి తగినంత

పోపు కోసం:

ఆవాలు: 1tsp

జీలకర్ర: 1tsp

మినపప్పు: 1tsp

వెల్లుల్లి పాయలు: రెండు లేదా మూడు

కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:

1. ముందుగా వంకాయలను తొడిమ చివర కొద్దిగా కట్ చేసి (మొదలు విడవకుండా)అడుగున ప్లస్ ఆకారంలో గాట్లు పెట్టి, కాయలోపలి వైపు ఉప్పు రాయాలి.

2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత వంకాయలోని నీరు పోయేటట్లు నొక్కి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత అదే పాన్ లో మరో రెండు చెంచాల నూనె వేసి కాగిన తర్వాత అందులో పోపు దినుసులు వేసి లైట్ గా వేగనివ్వాలి.

4. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కులు, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు వేసి వేగించుకోవాలి.

5. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి దింపేసుకోవాలి.

6. వేడి తగ్గిన తర్వాత ముందుగా వేగించి పెట్టుకొన్న వంకాయాల్లో వేగించుకొన్న మిశ్రమాన్ని కూర్చి సర్వ్ చేయాలి. అంతే ఇది అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది.

తమిళనాడు స్పెషల్ వంకాయ(కత్రికాయ్) కర్రీ ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం…

brinjal-fry-vankaya-vepudu

కావల్సిన పదార్థాలు:

వంకాయ: 500grms

ఉల్లిపాయలు: 2(స్లైస్ గా కట్ చేసుకోవాలి)

శనగపప్పు: 1tbsp

ధనియాలు: 1tbsp

ఎండుమిర్చి: 3

పసుపు: 1tsp

ఆవాలు: 1tsp

కరివేపాకు: రెండు రెమ్మలు

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా వంకాయలను బాగా శుభ్రం చేసి, కాడను కట్ చేసి వాటిని మీకు కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి.

2. తర్వాత పాన్ లో ఒక చెంచా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులోనే శెనగపప్పు, ధనియాలు, మరియు ఎండు మిర్చి, వేసి మరో రెండు నిమిషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.

3. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఒకసారి ఇది చల్లబడిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తని పౌడర్ లా తయారు చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ ఆయిల్ ను పాన్ లో వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, వేసి మరో నిముషం పాటు వేగించుకోవాలి.

5. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, ఉల్లిపాయ మెత్తబడే వరకూ వేగించుకోవాలి.

6. తర్వాత అందులో వంకాయ ముక్కలు, ఉప్పు వేసి మరో 2నిముషాలు వేగించుకోవాలి.

7. అలాగే పసుపు, శెనగపప్పు మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

8. ఈ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత మూత పెట్టి 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతండాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి.

9. ఇక సారి అంతా ఉడికిన తర్వాత వంకాయ పూర్తిగా ఉడికిందో లేదో సరిచూసుకొని, స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. తమిళ స్టైల్ వంకాయ కర్రీ రెడీ. చపాతీ లేదా రైస్ తో సర్వ్ చేయాలి.

వంకాయ మసాల వేపుడు ఎలా తయారుచేయాలో తెలుసుకోండి…

download (23)

కావల్సిన పదార్థాలు:

వంకాయులు : 250grms

పళ్ళీలు : 20grms

నూనె : 2tbsp

ఉప్పు : రుచికి సరిపడా

ఉల్లిపాయ – ఒకటి

పుట్నాలపప్పు: 15grm

వెల్లుళ్ళి రెబ్బలు: 4

ఎండుమిరపకాయలు : 5

జీలకర్ర : 1tsp

కారం : 1tsp

పసుపు: చిటికెడు

ధనియపౌడర్ : 1tbsp

మెంతి పొడి : చిటికెడు

తయారుచేయు విధానము:

1. ముందుగా పళ్ళీలు, పుట్నాలపప్పు, ఎండుమిరపకాయలను నూనె లేకుండా వేయించాలి.

2. ఇప్పుడు అందులో జీలకర్ర, వెల్లుళ్ళి రెబ్బలు వేసి బరకగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి.

3. వంకాయలను కావలసిన సైజులో కట్ చేసుకుని, ఉప్పు నీటిలో వేసుకోవాలి.

4. తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసుకోని అందులో ఆవాలు, పచ్చిశెనగ పప్పు, కరివేపాకు వేసి, అవి చిట పటలాడిన తరవాత వంకాయ ముక్కలను వేసి మూత పెట్టుకోవాలి.

5. ఐదు నిమషాలు తరవాత పసుపు, ఉప్పు, మెంతి పొడి, కారం, ధనియా పౌడర్, గ్రైండ్ చేసిపెట్టుకున్న పల్లీల పొడి వేసి మరి కొంచెం నూనె వేసి మూత పెట్టుకోవాలి.

6. వంకాయలు బాగా వేగిన తరవాత దించే ముందు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రెండు నిమషాలు మూత పెట్టి దించుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే వంకాయ మసాల వేపుడు రెడీ!

డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? వంకాయ తినండి…

download
వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. వయస్సు ఛాయలు కనిపించనీయవు. శరీరంలో వాపు, నరాల బలహీనత తగ్గించే శక్తి వంకాయలకు ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.
ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు దీన్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిదట. దీనిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా దీన్ని ఎంత ఎక్కువ తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా వంకాయలో వుండే ఫొటో న్యూట్రియంట్స్… ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నష్టం నుంచి కణత్వచాన్ని రక్షిస్తాయి. బి-కాంప్లెక్స్ విటమిన్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతతను కలిగిస్తాయి. నాడీ చర్య సులభతరంగా మార్చి, షార్ప్ మెమొరీ నిధులను జరిగేలా చేస్తాయి. వంకాయలో ఎక్కువ మోతాదులో విటమిన్ – సీ సమృద్ధిగా లభిస్తుంది.
ఇది ఎంతో ప్రతిభావంతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి వుంటుంది. శరీరంలో హాని కలిగించే బాక్టీరియాలను అంతం చేయడంలో వంకాయ ఎంతోగానో మెరుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు