Posts Tagged ‘butter’

బాదుషా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (20)

కావల్సిన పదార్థాలు:

మైదా: 3cups

బట్టర్ : 1/2cup

బేకింగ్ పౌడర్: 1tsp

బేకింగ్ సోడ: 1చిటికెడు

పాలు: 1cup

పంచదార: 2కప్పులు

డ్రై కోకనట్ (తురుముకోవాలి): గార్ణిష్ కోసం కొద్దిగా

నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3కప్పుల మైద మరియు 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులోనే బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే పాలు కూడా వేసి పిండిని సాఫ్ట్ గా కలుపుకొని 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

3. 10 నిముషాల తర్వాత పిండిలో కొద్దిగా తీసుకొని బాల్ షేప్ చేసుకోవాలి. లేదా ట్రైయాంగిల్ షేప్ లో చుట్టుకోవచ్చు.

4. ఇలా అన్ని తయారుచేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాచాలి.

5. ఇప్పుడు కాగుతున్న నూనెలో రౌండ్ గా చుట్టి పెట్టుకొన్న మైదా పిండిని (పచ్చిబాదుషాను) వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. అంతలోపు మరో పాన్ స్టౌ మీద పెట్టి 3-4 కప్పుల నీళ్ళు పోసి రెండు కప్పుల పంచదార వేసి బాయిల్ చేయాలి.బాగా మరిగిస్తుంటే, షుగర్ సిరఫ్ చిక్కగా రెడీ అవుతుంది .

7. ఇప్పుడు నూనెలో వేగించుకొన్న బాదుషాలను షుగర్ సిరఫ్ లో వేయాలి. తర్వాత వాటి మీద డ్రై కోకనట్ పౌడర్ గార్నిష్ చేయాలి . అంతే ఈ ఫెస్టివల్ సీజన్ లో వేడిగా లేదా చల్లగా బాదుషాను సర్వ్ చేయవచ్చు.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బటర్ ఫేస్ ప్యాక్…

images (21)

బటర్ – పాలు : ఆయిల్ స్కిన్ కు ఉత్తమ మార్గం బటర్ ఫేస్ ప్యాక్. ఒక బౌల్ మిల్క్ లో కొద్ది బటర్ మిక్స్ చేసి , ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బటర్ – పెరుగు : బటర్ ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

బటర్ – బాదం పొడి : గుప్పెడు బాదంను పొడి చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. కొద్ది సమయంలోనే ప్రకాశవంతమైన చర్మఛాయను మీరు పొందవచ్చు.

వంకాయ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం..

 

images (52)

కావలసిన పదార్థాలు :

వంకాయలు: 1/2Kg

ఎండుమిర్చి: 8-10

మినప్పప్పు: 2tbsp

ధనియాలు: 1tsp

ఉల్లిపాయలు: 4

వెన్న: 100grm

ఉప్పు: రుచికి తగినంత

నూనె: 3tsp

తయారు చేయు విధానం :

1. ముందుగా వంకాయలను గుత్తి వంకాయల మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి.

2. తర్వాత ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.

3. తరువాత ఉల్లిపాయముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి.

4. ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూరి ఉంచాలి.

5. తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదాని పక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే వేడి వేడి వంకాయ వెన్న మసాలా సిద్ధమైనట్లే…

స్వీట్ పొటాటో పాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం…

images (20)

కావల్సిన పదార్థాలు:

స్వీట్ పొటాటో : 2 పెద్దవి(పొట్టు తీసి, మైక్రోవోవెన్‌లో ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకోవాలి)

బట్టర్: 2tbsp(కరిగించుకోవాలి)

పుదీనా: 2tsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

ఉప్పు: రుచికి సరిపడా

పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

గుడ్డు : 1(అవసరం అనుకుంటేనే)

మైదా: 1cup

బ్రెడ్ పొడి: 1/2cup

బేకింగ్ పౌడర్ : 1tsp

వెజిటేబుల్ ఆయిల్ : ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న స్వీట్ పొటాటో, బటర్, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మైదా, బ్రెడ్ పొడి, గుడ్డు, బేకింగ్ పౌడర్‌ను వేసి మెత్తగా మృదువుగా కలుపుకోవాలి.

2. ఇప్పుడు ఒక సాస్ పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక దాని మీద వెజిటేబుల్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పొటాటో మిశ్రమాన్ని దోసెలాగా వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పాన్ కేక్ మీద కొద్దిగా నూనె చిలకరించుకోవాలి. రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే స్పైసీ అండ్ స్వీట్ పొటాటో పాన్ కేక్ రెడీ.

3. అంతే ఈ వేడి వేడి పొటాటో పాన్ కేక్‌కు సాస్ మరియు బట్టర్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

బరువు తగ్గించే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (11)

కావల్సినపదార్థాలు:

క్యాబేజ్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

క్యారెట్ : 2(పొట్టు తీసి సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

కార్న్ ఫ్లోర్: 1/2tsp

బ్లాక్ పెప్పర్: 1tsp(పొడి)

ఉప్పు: రుచికి సరిపడా

బట్టర్: 1tsp

తయారుచేయు విధానం:

1. ముందుగా వెజిటేబుల్స్ ముక్కలన్నీ నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ప్రెజర్ కుక్కర్ స్టౌ మీద పెట్టి నీళ్ళు పోసి మరిగించాలి.

3. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న వెజిటుబుల్ క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

4. అన్ని బాగా మిక్స్ చేసి, మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి పెట్టుకోవాలి. ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీయాలి.

5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్‌లో బటర్ వేసి అందులో కూరగాయ ముక్కలతో సహా సూప్(కూరలు ఉడికిన నీరు)కూడా అందులో పోయాలి.

6. ఇప్పుడు అందులో బ్లాక్ పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చాలి.

7. సూప్ చిక్కగా రావాలంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపి ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. అంతే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇది దగ్గు జలుబును నివారిస్తుంది శరీరంలో వేడి పుట్టించి కొవ్వును కరిగిస్తుంది.

పనీర్ పోస్తో ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (29)

పన్నీర్: 250gms

పొస్తో పేస్ట్: 5-6tbps

పచ్చిమిర్చి: 3-4

ఉప్పు: రుచికి సరిపడా

పంచదార: 1/4tsp

జీడిపప్పు: 8-10

కస్తూరి మెంతి: 1/2tbsp

క్రీమ్ : 1cup

పాలు : 1/2cup

బట్టర్: 50gms

తయారుచేయు విధానం:

1. ముందుగా జీడిపప్పును నీటిలో ఒకటి లేదా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. పచ్చిమిర్చి, పాస్టో(గసగసాలు) మరియు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. అలాగే జీడిపప్పు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

4. పనీర్ ముక్కగా కట్ చేసుకొని, మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.

5. తర్వాత స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో బటర్ వేసి వేడి చేయాలి.

6. ఇప్పుడు అందులో పాస్తో పేస్టే వేసి బాగా మిక్స్ చేస్తూ, వేయించుకోవాలి.

7. ఇప్పుడు అందులో ఉప్పు వేసి మిక్స్ చేయాలి.

8. ఇప్పుడు అందులో కొద్దిగా పాలు వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. లేదంటే, పూర్తిగా డ్రై అవుతుంది.

9. తర్వాత అందులో జీడిపప్పు పేస్ట్ , క్రీమ్ మరియు షుగర్ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. కొన్ని నిముషాలు వేయించుకోవాలి.

10. మూత పెట్టి, అతి తక్కువ మంట మీద మరో 5నిముషాలు వేగించుకోవాలి.

11. తర్వాత మూత తీసి మరికొంత బటర్ మరియు మెంతి ఆకులు వేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. ఈ స్పెషల్ డిష్ రైస్ మరియు చపాతీలకు మంచి కాంబినేషన్.

ఎగ్ లెస్ క్యారెట్ కేక్ రిసిపి ఎలా తయారు చేయాలో చుద్దాం… క్రిస్మస్ స్పెషల్…

images (86)

కావలసిన పదార్థాలు:

వెన్న: 1/2cup

కొబ్బరి తురుము: 1cup

అక్రోట్ ముక్కలు: 1cup

ఎండుద్రాక్ష: 1cup

క్యారెట్‌ తురుము: 3cups

దాల్చినచెక్కపొడి: 1tsp

జాజికాయ పొడి: 1tsp

అల్లంపొడి: 1tsp

బ్రౌన్‌ షుగర్‌ (ముడి పంచదార): 1cup

మైదాపిండి: 2cups

బేకింగ్‌సోడా: 1tsp

ఆరెంజ్‌ జ్యూస్‌: 2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో మైదా, మసాలా పొడులు, బేకింగ్‌ సోడా, బ్రౌన్‌ షుగర్‌, వాల్‌నట్‌ ముక్కలు వేసి బాగా కలపాలి.

2. తర్వాత విడిగా ఓ పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత బంగారువర్ణంలోని ఎండుద్రాక్ష, క్యారెట్లు, ఆరెంజ్‌ జ్యూస్‌ వేసి కలిపి వెంటనే దించి మైదా మిశ్రమంలో వేసి కలపాలి.

3. ఇప్పుడు మొత్తం మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.

4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్‌ టిన్‌లో వేసి సుమారు గంటసేపు 150 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర బేక్‌ చేయాలి.

5. చిన్న టూత్‌పిక్‌తో ఉడికిందో లేదో చూసి బయటకు తీయాలి. బయటకు తీసిన తరవాత ఐసింగ్‌ చేసి అందిస్తే బాగుంటుంది.

వెజ్ కొల్హాపురి గ్రేవీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం… మహారాష్ట్రియన్ స్పెషల్…

download (2)

శెనగపిండి – 1 cup

క్యారెట్ – 1 cup

క్యాప్సికమ్ – 1 cup

పనీర్ – 1 cup

క్యాలీఫ్లవర్ – 1 cup

పచ్చిబఠానీలు – 1 cup

టమోటోలు – 2

జీడిపప్పు – 10 ( soaked for one hour)

పచ్చిమర్చి – 4 to 5

గరం మసాల – 1 tsp

పసుపు – 1 tsp

కారం – 1 tsp

బిర్యానీ ఆకు – 1 to 2

జీలకర్ర – 1/2 tsp

అల్లం – 1/2 tsp

బట్టర్ – 1 tbsp Oil

నూనె: సరిపడా

తయారుచేయు విధానం:

1. పాన్ లో నూనె వేసి అందులో కాలీప్లవర్, పనీర్ వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత అందులోనే బీన్స్, క్యారెట్ మరియు క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు టమోటోలను ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యక జీలకర్ర, కరివేపాకు, పసుపు, అల్లం, కారం వేసి వేగించాలి.

5. తర్వాత అందులోనే గరం మసాలా, కారం, నీళ్లు పోసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.

6. 5నిముషాల తర్వాత, టమోటో జీడిపప్పు పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్స్ చేస్తూ, బట్టర్ మిక్స్ చేసి ఉడికిస్తే గ్రీవీ చిక్కబడుతుంది .

7. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే సరి కోల్హాపురి గ్రేవీ మహారాష్ట్ర స్పెషల్ డిష్ రెడీ.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎగ్ పరోటా రిసిపి

download (14)

కావల్సిన పదార్థాలు:

గోధుమ పిండి: 2cups

గుడ్లు: 4

నూనె: 1tbsp

బటర్ లేదా నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా గోధుపిండిని కొన్ని నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి.

2. పిండి కలుపుకొన్న తర్వాత, దానికి పల్చని తడిగా ఉండే క్లాత్ ను కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి.

3. అంతలోపు, ఆ పిండి నుండి కొద్దిగా (బాల్ సైజ్) పిండిని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి.

4. ఇలా వత్తుకొన్న చపాతీ మీద కొద్దిగా నూనె చిలకరించి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి సెమీ సర్కిల్ షేప్ లో రోల్ ఫోల్డ్ చేసుకోవాలి.

5. తిరిగి మరికొద్దిగా నూనె ఉపయోగించి తవాను వేడి చేసి, చపాతీని పాన్ మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

6. కాలేటప్పుడు , చపాతీ పై పొరలాగా తీసి నిధానంగా దాని మీద గుడ్డు పగులగొట్టి పోయాలి.

7. ఇప్పుడు మరికొద్దిగా నూనెను చిలకరించి గోల్డ్ కలర్ వచ్చే వరకూ రెండు వైపులా కాల్చుకోవాలి.

8. అదేవిధంగా పిండి మొత్తాన్ని మీకు కావల్సినన్ని ఎగ్ పరోటాలను తయారుచేసుకోవాలి. అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఎగ్ పరోటా రిసిపి రెడీ.

పనీర్ బట్టర్ మసాలా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (5)

కావల్సిన పదార్థాలు:

పనీర్(కాటేజ్ చీజ్): 500grm

బట్టర్: 100grms

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp

ఉల్లిపాయలు : 2(పేస్ట్)

టమోటో గుజ్జు: 3/4cup

కారం: 1tbsp

గరం మసాలా: 2tbsp

పంచదార: 1tsp

క్రీమ్: 1cup

కొత్తిమీర తరుగు: 1cup

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. పనీర్ తీసుకొని మీకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి.

2. ఇప్పడు పాన్ స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా బట్టర్ వేసి కరిగిన తర్వాత అందులో కట్ చేసుకొన్న పనీర్ ముక్కలు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

3. ఫ్రై అయినా తర్వాత పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా బట్టర్ వేసి కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

5. ఉల్లి, అల్లం వెల్లుల్లిపేస్ట్ వాసన పోయే వరకూ ఉండి, తర్వాత టమోటో గుజ్జు వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులోనే కారం, గరం మసాలా, పంచదార మరియు కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.

7. తర్వాత అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.

8. మొత్తం ఉడికిన తర్వాత అందులో క్రీమ్ వేసి బట్టర్ పనీర్ ను రెండు మూడు నిముషాలు బాగా మిక్స్ చేయాలి. అంతే బటర్ పనీర్ మసాలా సర్వ్ చేయడానికి రెడీ…చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.