Posts Tagged ‘coconut’

బాదుషా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (20)

కావల్సిన పదార్థాలు:

మైదా: 3cups

బట్టర్ : 1/2cup

బేకింగ్ పౌడర్: 1tsp

బేకింగ్ సోడ: 1చిటికెడు

పాలు: 1cup

పంచదార: 2కప్పులు

డ్రై కోకనట్ (తురుముకోవాలి): గార్ణిష్ కోసం కొద్దిగా

నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3కప్పుల మైద మరియు 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులోనే బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే పాలు కూడా వేసి పిండిని సాఫ్ట్ గా కలుపుకొని 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

3. 10 నిముషాల తర్వాత పిండిలో కొద్దిగా తీసుకొని బాల్ షేప్ చేసుకోవాలి. లేదా ట్రైయాంగిల్ షేప్ లో చుట్టుకోవచ్చు.

4. ఇలా అన్ని తయారుచేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాచాలి.

5. ఇప్పుడు కాగుతున్న నూనెలో రౌండ్ గా చుట్టి పెట్టుకొన్న మైదా పిండిని (పచ్చిబాదుషాను) వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. అంతలోపు మరో పాన్ స్టౌ మీద పెట్టి 3-4 కప్పుల నీళ్ళు పోసి రెండు కప్పుల పంచదార వేసి బాయిల్ చేయాలి.బాగా మరిగిస్తుంటే, షుగర్ సిరఫ్ చిక్కగా రెడీ అవుతుంది .

7. ఇప్పుడు నూనెలో వేగించుకొన్న బాదుషాలను షుగర్ సిరఫ్ లో వేయాలి. తర్వాత వాటి మీద డ్రై కోకనట్ పౌడర్ గార్నిష్ చేయాలి . అంతే ఈ ఫెస్టివల్ సీజన్ లో వేడిగా లేదా చల్లగా బాదుషాను సర్వ్ చేయవచ్చు.

పెసరపప్పు పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం…శ్రావణ మాసం స్పెషల్…

images

కావల్సిన పదార్థాలు:

పెసరపప్పు: 2 cup

కొబ్బరి – 1 cup

బెల్లం – 1 cup

యాలకలు – 4 to 5

పాలు –  2 cup

ఎండు ద్రాక్ష – 10

జీడిపప్పు – 10

నెయ్యి:- 5 tbsp

1. ప్రెజర్ కుక్కర్లో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో పెసరపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

2. . తర్వాత అందులో ఒక కప్పు పెసరపప్పుకు మూడు కప్పుల నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

3. మరో పాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకూ కలియబెడుతుండాలి. ఈ బెల్లంను నీళ్ళను స్టౌ మీద పెట్టి కొద్ది సమయం ఉడికించి తర్వాత క్రింద దింపుకొని చల్లార్చుకోవాలి.

4. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి తురుము మరియు యాలకలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

5. తర్వాత కుక్కర్ లో ఆవిరి తగ్గి చల్లబడిన తర్వాత మూత తీసి అందులో బెల్లం మిశ్రమం మరియు కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి.

6. అలాగే ఇందులో రెండు కప్పుల పాలు పోసి మిక్స్ చేయాలి.

7. మరో చిన్న పాన్ లో నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, వేగించుకొని తర్వాత పెసరపప్పు కుక్కర్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే హాట్ అండ్ టేస్టీ మూగ్ దాల్ స్వీట్ రిసిపి రెడీ.

కోవా కోకనట్ బర్ఫీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

images (72)

కావల్సిన పదార్థాలు:

కొబ్బరి (తురుము) – 1 cup

కోవ – 1 cup

పాలు – 1 cup

మిల్క్ పౌడర్ – 1tbsp

షుగర్ -1cup

యాలకలు – 1/4 tbsp

నెయ్యి – 4 to 5tbsp

తయారుచేయు విధానం:

1. పాన్ లో నెయ్యి, కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత మరో పాన్ లో కోవ మరియు ఒక కప్పు షుగర్ వేసి మిక్స్ చేస్తూ కరిగించాలి.

3. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కొబ్బరి తురుము మరియు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.

4. ఇప్పుడు ప్లేట్ తీసుకొని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి.

5. ఇప్పడు పాన్లో ఉడుకుతున్న మిశ్రమాన్ని వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి.

6. కొద్దిగా చల్లారిన తర్వాత చేతిలోనికి నిమ్మకాయంత తీసుకొని ఉండలు చుట్టుకోవచ్చు. లేదా చాకుతో చతురస్రాకారంలో మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు. అంతే కోవ కోకనట్ బర్ఫీ రెడీ.

చర్మం తేమగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

download (6)
చర్మం తేమగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. వాల్‌నట్స్ తీసుకోవాలి. చర్మం తేమగా ఉంచేందుకు వాల్ నట్స్ బాగా సహాయపడుతాయి. అందువల్ల డైట్‌లో వాల్ నట్స్ తీసుకోవాలి. అలాగే కొబ్బరిని, కొబ్బరి నూనె కూడా ఉపయోగించాలి. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాట్ శరీరంలోపల నుండి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
డ్రై స్కిన్ నివారించే ఒక ఉత్తమ ఆహారం సాల్మన్. ఈ బోన్ లెస్ ఫిష్‌ను వింటర్లో తప్పక తీసుకోవాలి. అలాగే చర్మం తేమగా ఉండాలంటే కీరదోస ముక్కలు, సిలికా ఉండే కొత్తిమీరను చేర్చుకోవాలి. కొత్తిమీర మంచి మాయిశ్చరైజ్‌గా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రాన్ మలై కర్రీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (3)

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్: 1kg

ఉల్లిపాయలు: 1+1(కట్ చేసి పేస్ట్ చేయాలి)

వెల్లుల్లి: 8(పేస్ట్ చేయాలి)

కలౌంజి(ఉల్లిపాయ విత్తనాలు): 1/2tsp

పచ్చిమిర్చి: 2+6(మద్యకు కట్ చేసి పస్ట్ చేయాలి)

కొబ్బరి పాలు: 1cup

మస్టర్డ్ పేస్ట్: 2tbsp

పసుపు: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

మస్టర్డ్ ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ప్రాన్స్‌ను శుభ్రం చేసి పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. తర్వాత మస్టర్డ్ ఆయిల్‌లో వేసి 3-4నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ విత్తనాలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి.

3. అంతలోపు ఒక ఉల్లిపాయను, వెల్లుల్లి మరియు మిగిలిన పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

4. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో మస్టర్డ్ పేస్ట్, ఉప్పు, పసుపు చిలకరించి ఒక 5నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. చివరగా కొబ్బరి పాలు కూడా వేసి మిక్స్ చేసి 2నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

7. తర్వత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి 10నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ప్రాన్ మలై కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

నోరూరించే పుల్లని టేస్టీ మామిడికాయ పచ్చడి ఎలా తయారుచేయాలో చూద్దాం… సమ్మర్ స్పెషల్…

images (11)

పచ్చిమామిడియ- 1 cup (chopped)

బెల్లం: 1/2 cup

ఎండు మిర్చి: 5 to 6

ఆవాలు:1tps

కరివేపాకు : 8 to 10

కొబ్బరి తురుము: 1/2 cup

కొత్తిమీర : 4 to 5

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో పచ్చిమామిడికాయ ముక్కలు వేయాలి.

2. ఈ బౌల్ స్టౌ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.

3. అంతలోపు, మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి, బెల్లం తురము వేసి చిక్కటి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు మెత్తగా ఉడికిన మామిడి ముక్కల నుండి అదనపు నీరు పక్కకు వంపేసుకోవాలి. తర్వాత ముక్కలను మిక్సీ జార్లో వేయాలి.

5. ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి, కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

6. ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి అందులో బెల్లం నీటిని వేసి కొద్ది సేపు ఉడికించుకోవాలి.

7. కొద్దిసేపటి తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకొన్న మామిడికాయ పచ్చడి వేయాలి మొత్తం మిశ్రమాన్ని కలగలుపూత ఉడికించాలి.

8. అవసరం అయితే కొద్దిగా నీరు, ఉప్పు వేసి బాగా ఉడికించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

తీపి కుడుముులు ఎలా తయారు చేయాలో చూద్దాం…

download (5)

కావలసిన పదార్థాలు:

గోధుమ రవ్వ: 1/2kg

బియ్యం పిండి: 1cup

పొట్టు పెసరపప్పు: 1/2kg

బెల్లం తురుము: 1/2kg

పచ్చిపాలు : 1/2ltr

కొబ్బరికాయ : ఒకటి

నెయ్యి: 100grm

యాలకుల పొడి: 1tbsp

మంచినీళ్లు: సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పెసరపప్పుని పొడి చేసి ఉంచాలి, తర్వాత కొబ్బరి తురమాలి.

2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమరవ్వ, పెసరపప్పు పొడి, బియ్యం పిండి, బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకులపొడి వేసి బాగా కలపాలి.

3. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని గట్టి ముద్దలాగా చేయాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను అరచేతిలో పెట్టి నాలుగువేళ్లతో కోలగా ఒత్తాలి.

4. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో 20 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించి తీయాలి. అంతే అందరూ ఇష్టంగా తినే తీపి కుడుములు రెఢీ…

డేట్స్ , బాదం & హనీ బాల్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

img_6358_2

కావలసిన పదార్థాలు:

ఖర్జూరాలు: 1cup

బాదం: 1/2cup

నువ్వులు: 1/2cup(వేయించినవి)

ఎండుకొబ్బరి తురుము : 1/2cup

కొబ్బరి పొడి : 1/2cup

తేనె : మిశ్రమాన్ని బాల్స్ చేయడానికి తగినంత

తయారు చేయు విధానం:

1. ముందుగా బాదం పప్పును, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి(పొడి కాకూడదు, పలుకుగా ఉండాలి).

2. తర్వాత అందులో ఎండు ఖర్జూరంలోని గింజలు తీసివేపి ఖర్జూరం తొనలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి.

3. ఇప్పుడు ఈ మిశ్రమాన్నిగిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి.

4. తర్వాత ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. అంతే డేట్స్, బాదం, హనీ లడ్డు రెడీ.

పాలతాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం…

palathalikalu

కావలసినవి:

పాలు: 1glass

బియ్యప్పిండి: 1cup

బెల్లంతురుము: 2cups

ఎండుకొబ్బరి ముక్కలు: 2tbsp

జీడిపప్పు, బాదం పలుకులు: 1/2cup

యాలకుల పొడి: 1tps

తయారు చేయు విధానం:

1. ముందుగా గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల పాలు పోసి స్టౌమీద పెట్టాలి. పాలు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి.

2. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చల్లార్చాలి.

3. తర్వాత మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి.

4. ఉడికించిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి.

5. యాలకుల పొడి వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి, ఇందులో కలపాలి.

కొబ్బరి చట్నీరిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (11)

కావల్సిన పదార్థాలు:

ఫ్రెష్ గా తురుమిన కొబ్బరి : 1cup

పెరుగుం 2tbsp(బాగా గిలకొట్టాలి)

ఆవాలు: 1/2tsp

పచ్చిమిర్చి: 8

ఎండుమిర్చి: 2

ఉప్పు: రుచికి సరిపడా

ఉద్దిపప్పు:1tsp

నూనె: కొద్దిగా

నీళ్ళు: కొద్దిగా

కరివేపాకు : 2రెమ్మలు

తయారుచేయు విధానం:

1. ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి మరియు పెరుగు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించాలి.

3. పోపు వేగిన తర్వాత అందులో మిక్సీలో తయారుచేసుకొన్న కర్డ్ కోకనట్ చట్నీ వేసి, మీడియం మంట మీద 5నిముషాలు మిక్స్ చేస్తూ ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి.

4. ఈ చట్నీని సర్వింగ్ బౌల్లో వేసి ఇడ్లీ, వడ లేదా దోసకు కాంబినేషన్‌గా వడ్డించవచ్చు.