Posts Tagged ‘coconut oil’

మృదువైన షేవింగ్ క్రీం లా ఉపయోగపడే కొబ్బరినూనె…

images

షేవింగ్ చేసుకునే ముందు కొబ్బరినూనె చర్మం పైన అప్లయ్ చేస్తే, షేవింగ్ చేసుకున్న తరువాత చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. అలాగే కొందరికి షేవింగ్ చేసుకున్న తరువాత చర్మం పైన రాషెస్ వచ్చే అవకాశం ఉంది, కొబ్బరినూనె అప్లయ్ చేయడం ద్వారా రాషెస్ రాకుండా కాపాడుతుంది.

ఇంట్లో ఉండే ఔషధంతో చుండ్రు సమస్యకు చెక్..!

images

కొబ్బరినూనెలో కర్పూరంను కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ నిద్రించే ముందు జుట్టుకు పట్టించాలి. ఒకవారం రోజుల్లో దాని ఫలితంగా చుండ్రు సమస్య వదిలి పోతుంది.

చర్మం తేమగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

download (6)
చర్మం తేమగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. వాల్‌నట్స్ తీసుకోవాలి. చర్మం తేమగా ఉంచేందుకు వాల్ నట్స్ బాగా సహాయపడుతాయి. అందువల్ల డైట్‌లో వాల్ నట్స్ తీసుకోవాలి. అలాగే కొబ్బరిని, కొబ్బరి నూనె కూడా ఉపయోగించాలి. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాట్ శరీరంలోపల నుండి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
డ్రై స్కిన్ నివారించే ఒక ఉత్తమ ఆహారం సాల్మన్. ఈ బోన్ లెస్ ఫిష్‌ను వింటర్లో తప్పక తీసుకోవాలి. అలాగే చర్మం తేమగా ఉండాలంటే కీరదోస ముక్కలు, సిలికా ఉండే కొత్తిమీరను చేర్చుకోవాలి. కొత్తిమీర మంచి మాయిశ్చరైజ్‌గా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

దంతాలను తెల్లగా మార్చుకోవడానికి సింపుల్ చిట్కా…

images (6)

అన్ రిఫైన్డ్ కుక్కింగ్ ఆయిల్ : 1tbsp (కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్)

ఉప్పు: 1tsp

పైన సూచించిన పదార్థాలు తీసుకొని, రెండూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని, ఆయిల్ పుల్లింగ్‌లా చేయాలి. 5నిముషాల పాటు నోట్లోనే ఆయిల్‌ను పుక్కట పట్టి ఆయిల్ పుల్ చేయాలి.(దంతాలు మొత్తం ఆయిల్ తాకేలా పుక్కలించాలి.) 5నిముషాల తర్వాత ఊసేసి, తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాతో పాటు హెర్బల్ టూత్ పేస్ట్ వాడుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రాంగ్ అండ్ లాంగ్ హెయిర్ కోసం కర్రీలీవ్స్ కోకనట్ ఆయిల్ హెయిర్ ప్యాక్…

download

ఒక కప్పు కరివేపాకును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. మిక్స్ చేసి తిరిగి మరోసారి బ్లెండ్ చేయాలి. అంతే మీ హెయిర్ మాస్క్ రెడీ. ఈమాస్క్‌ను జుట్టుకు అప్లై చేయాలి. తల, వెంట్రుకలు మొత్తం అప్లై చేసి కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరినూనెతో స్కిన్ అలెర్జీలకు చెక్…

images (91)

చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు, నిద్రించేందుకు ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె రెండింటిని కలిపి మసాజ్   చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తరువాత ప్రభావిత ప్రాంతాన్ని వేడి గుడ్డతో చుట్టాలి, చర్మం నూనెను గ్రహించుకున్న తరువాత గుడ్డను తొలగించాలి.ఒకవేళ ఇచెస్ కలిగి ఉన్నట్లయిటే, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పూసి గట్టిగా రాయటం వలన ఉపశమనం పొందుతారు.

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య నివారించే హెర్బల్ రెమెడీస్…

download

కొబ్బరి నూనె మరియు కరివేపాకు: తెల్లజుట్టు నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ హోం రెమెడీస్ తెల్ల జుట్టును నేచురల్‌గానే డార్క్‌గా మార్చుతుంది. కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి, వేడి చేసి తలకు రెగ్యులర్‌గా పట్టిస్తుంటే హెల్తీగా, ఒత్తుగా మరియు డార్క్ హెయిర్ పెరుగుతుంది.

కొబ్బరి నూనె మరియు మెంతులు: కొబ్బరి నూనెలో మెంతులు వేసి వేడి చేసి, చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు యొక్క ఓరిజినల్ కలర్ నేచురల్‌గా అందుతుంది. తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను పొందవచ్చు.

అందమైన కళ్ల కోసం కొబ్బరి నూనె…

eye-care-tips-for-beautiful-eyes
అందమైన కళ్ల కోసం నువ్వుల నూనె భేషుగ్గా పనిచేస్తుంది. కళ్లు అందంగా మెరిసిపోవాలంటే.. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు నువ్వుల నూనెను కళ్ల కింది ముడతలపై మర్ధన చేసి నిద్రించాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కళ్ల కింది ముడతలు పోయి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది.
అలాగే ఆముదం, కొబ్బరి నూనెలు కూడా కంటి కింద ముడతలకు చెక్ పెడతాయి. కొబ్బరినూనెను నిద్రించే ముందు కళ్ల కింద రాయాలి. ఉదయాన్నే లేచి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. దీని వల్ల కళ్ల కింద ముడతలు త్వరగా తగ్గిపోతాయి. చర్మంపై కొబ్బరి నూనెతో మర్ధన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవటంతో పాటు మచ్చలు తొలగిపోతాయి.
ఇక ఆముదం నూనె కూడా ముడతలు, మచ్చలపై మెరుగ్గా పనిచేస్తుంది. కళ్ల కింద ఉండే ముడతలు, మచ్చలు పోవాలంటే వాటిపై రాత్రి నిద్రపోయే ముందు ఆముదంతో మర్ధన చేయాలి.

దంత ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల నూనె…

dental-health-and-hygiene
నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి. ఈ నూనెతో అలర్జీలు వస్తాయన్న భయం కూడా లేదు. దంతాలు తెల్లబడాలనుకునేవారు ఇలా కొబ్బరినూనెతోనూ ప్రయత్నించవచ్చు.

మెడ నాజూగ్గా ఉండాలంటే…

images (3)
మహిళలు అందం విషయంలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత మెడకు ఇవ్వరు. అందుకే చాలామంది స్త్రీల మెడ బాగంలో నల్లగా ఉంటుంది. మెడ దగ్గర చర్మం నల్లగా ఉండడమే కాకుండా మెడచర్మం వదులవ్వడం వల్ల మెడ అందాన్ని కోల్పోతుంది. మెడమీద చర్మం వదులుగా అవ్వడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి వయస్సు పైబడటం. పోషకాహారలోపం వల్ల, చర్మసంరక్షణ తీసుకోకపోవడం.
స్కిన్‌ను టైట్ చేసుకోవాలంటే ఎఫన్షియల్ ఆయిల్స్‌ను ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలంటున్నారు వైద్యులు. కొబ్బరినూనెతో గానీ, ఆలివ్ ఆయిల్‌తో గానీ మెడపై మసాజ్ చేసుకోవాలట. ఏదో ఒక నూనెను తీసుకొని గోరువెచ్చగా చేసి అప్లై చేసుకోవాలట. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ జరుగుతుంది. వదులైన చర్మం టైట్ అవుతుంది.
మరొక పద్ధతి ద్వారా కూడా మెడను నలుపుదనం నుంచి కాపాడుకోవచ్చట. గుడ్డులో పవర్‌ఫుల్ యాంటీ యాక్సిడైట్స్ ఉంటాయి. ఇవి మెడ, గొంతు భాగంలో వదులైన చర్మాన్ని టైట్‌గా మారుస్తుంది. గుడ్డు నుంచి వైట్‌ను వేరుచేసి మెడచుట్టూ పూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్లాత్‌తో తుడిచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
సాగిన చర్మాన్ని యాపిల్ స్లెడర్ వెనిగర్‌తో కూడా టైట్‌గా చేసుకోవచ్చు. కొద్దిగా నీటిలో యాపిల్ స్లెడర్ వెనిగర్‌ను వేసి మెడకు పూయాలి. కొద్దిసేపటి తర్వాత కడిగెయ్యాలి. ఇలా వారానికి ఒకటి, రెండు సార్లు చేస్తే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మెడకు సంబంధించిన వ్యాయామం, యోగా కూడా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మెడ నాజూగ్గా ఉంటుందట.