Posts Tagged ‘cough’

దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీ…

download (4)

రెండు టేబుల్ స్పూన్ల తేనె, పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేడి పాలల్లో కలపాలి. ఈ డ్రింక్‌ని ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే దగ్గు, దగ్గు లక్షణాలు పూర్తీగా తగ్గిపోతాయి.

గొంతులో కిచ్ కిచ్.. అయితే యాలకులను నమలండి..

download (2)
గొంతులో కిచ్ కిచ్.. అయితే యాలకులను నమలండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలంలో గొంతులో గరగర ఏర్పడటం తప్పదు. గొంతులో మంట, బొంగురుపోయినట్లుంటే ఉదయం లేవగానే యాలకలను నమిలి తినండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగండి. ఉపశమనం కలుగుతుంది.
గొంతులో వాపు సంభవిస్తే ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకలను రుబ్బి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వున్నప్పుడు యాలకలు, అల్లం ముక్క, లవంగం, ఐదు తులసి ఆకులు కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
నోట్లో పొక్కులుంటే యాలకలతోపాటు కలకండను కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నాలుకపై ఉంచుకోండి. దీంతో వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఉసిరితో ఇన్‌ఫెక్షన్లు దూరం….

download-5

విటమిన్ సి అధికంగా లభించే వాటిల్లో ఉసిరి ముందుంటుంది. ఇది శరీరానికి అందడం వల్ల రకరకాల ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యేవారు ఉసిరికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. సీజన్ కానప్పుడు ఉసిరితో చేసిన మురబ్బలూ, క్యాండీలను ఎంచుకోవచ్చు.
ఈ కాలంలో గొంతు నొప్పి, మంట వంటివి ఎదురవుతుంటాయి. అవి దూరం చేసుకోవాలంటే ఉసిరి రసంలో కాస్త అల్లం రసం చేర్చి తీసుకోవాలి. ఇలా రోజులో రెండు ముడుసార్లు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్లు వంటివి త్వరగా తగ్గుతాయి.

తులసి ఆకుల రసంలో తేనెని కలిపి తీసుకుంటే…

tulsi-and-honey
ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి సింపుల్ టిప్…

cold-l-re

కరివేపాకు పొడిని, తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

బార్లీతో మొండి దగ్గుకు చెక్… ఇలా చేయండి…

download (35)
బార్లీ బియ్యాన్నినీటిలో కడిగి పక్కనబెట్టుకోవాలి. దీనిలో తగినన్ని నీరు పోసి పెట్టాలి. కాసేపయ్యాక నీటిని మాత్రం తీసుకుని రెండు స్పూన్ల తేనెను కలిపి తీసుకుంటే మొండి దగ్గుకు చెక్ పెట్టొచ్చు. మూడు రోజుల పాటు ఈ బార్లీ నీటిని తీసుకుంటే జలుబు, గొంతునొప్పి కూడా తగ్గిపోతుంది.

ఇమ్యునిటీ పవర్ క్షణాల్లో పెంచే అద్భుత ఔషధం…

images (48)

తరచుగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్ మరియు జ్వరం వంటి సమస్యలన్నీ రోగనిరోధక శక్తి సరిగా లేకపోవడం వల్ల వస్తుంటాయి. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం డైట్‌లో చేర్చుకోవడం చాలా అవసరం. అయితే ఫుడ్‌తో పాటు ఒక చిన్న ఔషధం రోజు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ర్టాంగ్‌గా మారిపోతుంది.

ఒక అల్లం ముక్క, 3 నిమ్మకాయలు, 500 గ్రాముల తేనె తీసుకోవాలి. ముందుగా నిమ్మకాయలను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేయాలి. అల్లం చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలను తేనెలో కలిపి ఒక జార్‌లో భద్రపరుచుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కొంత కాలం వరకు నిలువ ఉంచుకోవచ్చు. కేవలం ఈ మిశ్రమాన్ని రోజుకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని డైరెక్ట్‌గా తీసుకోవడం ఇష్టపడని వాళ్లు టీతోపాటు తీసుకోవచ్చు. ఏదోలా ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే ఇమ్యునిటీ పవర్ పెరగడమే కాదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మీ దరిచేరవు.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్…

download (7)

ఒక టీ స్పూన్ సొంఠి, టీ స్పూన్ మిరియాల పొడి, అయిదారు తులసి ఆకులు తీసుకుని నీటిలో కలిపి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడబోసి ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు తాగితే.. జలుబు, దగ్గు తగ్గుతాయి.

జలుబు పూర్తీగా తగ్గేవరకు రోజుకు మూడుసార్లు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లిని బాగా నూరాలి. గంటక ఒకసారి దాని వాసన పీలిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. అప్పుడప్పుడు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగడం వల్ల కూడా జలుబు తగ్గిపోతుంది.

ఒక టేబుల్ స్పూన్ తేనెలో సగం టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పడుకునేటప్పుడు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

జలుబు, తుమ్ములు వేధిస్తుంటే నీటిని బాగా ఉడకబెట్టి అందులో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల త్వరగా తగ్గుతుంది.

దగ్గు, జలుబు నివారించడం కోసం చిట్కా…

dry cough_094

గ్లాసుడు పాలు వేడి చేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

సాధారణ జలుబు, దగ్గును నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

common-cold

– తులసి: తులసి హెర్బ్, ఈ మూలిక జలుబు దగ్గును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని తులిసి ఆకులను నోట్లో వేసుకుని తిడనం వల్ల కామన్ కోల్డ్, కఫ్ , ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుంది. బాడీ ఉష్ణోగ్రతను నార్మల్ గా ఉంచుతుంది. కాబట్టి రెగ్యులర్ గా తులసిని తినడం మంచిది.

– దాల్చిన చెక్క: కొద్దిగా దాల్చిన చెక్క నూనెను తేనెలో మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.దాల్చిన చెక్క శరీరంను వెచ్చగా ఉంచుతుంది. మరియు మ్యూకస్ ఏర్పడకుండా చేస్తుంది.

– అల్లం: ఈ అల్లంలో ఔషద విలువలు అపరిమితంగా ఉంటాయి. అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి,. అల్లం గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. చాలా మంది సాధరణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వాటి నివారణకు ఈ అల్లం రూట్ ను ఔషదంగా తయారు చేసుకొని లేదా టీలో అల్లం చేర్చి బాగా మరింగించి సేవిస్తుంటారు.

– తేనె: తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. సీజనల్ గా వచ్చే వ్యాదుల నివారణకు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఒక కప్పు వేడి నీళ్ళలో తేనె మిక్స్ చేసి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. లేదా రాత్రి నిద్రించడానికి ముందు ఒక టీస్పూన్ తేనె తినాలి.

– చికెన్ సూప్: చాలా మంది దీన్ని నేచర్ పెన్సిలిన్ అంటుంటారు. వ్యాధి నివారణ శక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. వేడిగా ఉండే చికెన్ సూప్ శ్వాసనాళాల్లో గాలిపోవడానికి అడ్డుపడుకుండా సహాయపడుతుంది. అదనపు శక్తిని పొందడానికి మరియు మంచి టేస్ట్ కోసం ఈ సూప్ లో కొద్దిగా వెజిటేబుల్ ముక్కలను మరియు వెల్లుల్లి ముక్కలను చేర్చాలి.

– వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, ప్లూ, కోల్డ్ వంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ డైలీ డైయట్ లిస్ట్ లో ఈ వెల్లుల్లిని చేర్చుకోవచ్చు.