Posts Tagged ‘culsium’

గంగవావిలి ఆకులో ఏమున్నాయ్…ఆరోగ్య ప్రయోజనాలేంటి…

download (21)
గంగవావిలి ఆకులో, ఏ ఆకులోనూ ఉండని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కరోనరీ హార్ట్ డిసీజ్, పక్షవాతం, ఎడిహెచ్‌డి, ఆటిజమ్‌తో పాటు పిల్లల్లో ఎదుగుదల సమస్యలను నివారిస్తుంది. అలాగే ఎ, బి-కాంప్లెక్స్, సి. ఇ విటమిన్‌లు, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేడ్లు, అమైనో యాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి.
ఇందులో కెలోరీలు చాలా తక్కువ. వంద గ్రాముల ఆకులో కేవలం 16 కేలరీలే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు ఓరల్ క్యావిటీ క్యాన్సర్‌లను నివారిస్తుంది. ఈ ఆకులోని మ్యూకస్ మెంబ్రేన్‌లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
ఎల్‌డిఎల్ (లో డెన్సిటీ లైపోప్రొటీన్)ను తగ్గిస్తుంది. దీనినే బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా వ్యవహరిస్తారు. పరిమితమైన కేలరీలతో, పోషకాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా కలిగిన గంగవావిలి ఆకు తీసుకుంటే నాడీవ్యవస్థ పనితీరు క్రమబద్ధమవుతుంది.

పంటి ఆరోగ్యానికి క్యాల్షియం… ఎటువంటి ఆహారంలో ఉంటుంది?

images

ఎముకల సాంద్రత పెంచడం నుంచీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా రోజూ క్యాల్షియం అందేలా చూసుకోవాలి. ఫలితంగా ఏళ్లు గడిచేకొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే సమస్య చాలా మటుకూ తగ్గుతుంది. పైగా ఈ పోషకం కండరాలనే కాదు, నాడీవ్యవస్థను కూడా దృఢంగా ఉంచుతుంది.

టైపు2 మధుమేహం రాకుండా జాగ్రత్తపడాలంటే క్యాల్షియంతోపాటూ, విటమిన్ ‘డి’ పోషకాన్ని కూడా తీసుకుంటే సరిపోతుంది. ఈ పోషకం కేవలం పాలు, పాల ఉత్పత్తుల నుంచే కాదు చేపలూ, సోయాబీన్స్, నువ్వులూ, నట్స్, పప్పులూ, ఆకుకూర నుంచి లభిస్తుంది.

సకల రోగ నివారిణి నేరేడు… రుచికి రుచి… ఆరోగ్యానికి ఆరోగ్యం…

images (96)

నేరేడు పళ్లు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ముఖ్యంగా నేరేడు పళ్లు మధుమేహ వ్యాధి నివారణకు బాగా ఉపకరిస్తాయి. ఇందులో గ్లైకమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ వ్యాధికి చక్కగా పనిచేస్తాయి. యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్స్ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది. ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే వ్యాధి నిరోధక శక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది.

చిన్న పిల్లల్లో కనిపించే ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. నేరేడు పళ్లు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేరేడు పళ్లు క్యాన్సర్ రాకుండా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. నేరేడు పళ్లు మాత్రమే కాదు, నేరేడు చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్ని తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి. నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

వేడిని తగ్గించే, రక్తాన్ని శుద్ధి చేసే బత్తాయి…

images (84)

రక్తాన్ని శుద్ధిచేసే గుణాలు బత్తాయిలో మెండుగా ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు)తో బాధపడేవారికి, గుండెజబ్బుతో ఇబ్బందిపడేవారికి బత్తాయి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

మలబద్ధకంతో బాధపడేవారికి బత్తాయి ఔషధంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని ప్రతిరోజూ రాత్రివేళల్లో తీసుకున్నట్లయితే ఉదయాన్నే సులభంగా మలవిసర్జన జరుగుతుంది. బత్తాయి గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచి చేస్తుంది. పిండం ఎదిగేందుకు, సుఖ ప్రసవానికి బత్తాయి రసం ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ఆ సమయంలో ఉండే అలసటన, అనారోగ్యాలను దూరం చేస్తుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటమే గాకుండా. ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార  కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమేగాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది.

ఒక గ్లాసెడు బత్తాయి రసంలో కాస్తంత ఉప్ప, మిరియాలపొడి కలిపి తీసుకుంటే వేసవిలో అతి దప్పికను నివారిస్తుంది. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియమ్, పొటాషియం, బియాటిన్, ఫోలిక్ యాసిడ్. తదితర పోషక పదార్థాలు మెండుగా లభ్యమయ్యే బత్తాయిని ఏ వయసువారైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.