Posts Tagged ‘curd’

సమ్మర్‌లో ఆయిల్ స్కిన్ నివారించడానికి సులభ చిట్కాలు…

download (18)

– పాలు, గుడ్డులోని తెల్లసొన, క్యారెట్‌ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించినట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

– మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే పెరుగు కూడా జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కార్న్ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే జిడ్డుతత్వం తొలగిపోతుంది.

కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్‌, పెరుగు మరియు బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.

కాజు మష్రుమ్ మసాలా తయారుచేసే విధానం…

images

బటన్ మష్రుమ్: 1cup

ఉల్లిపాయ పేస్ట్: 2tbsp

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp

కారం పొడి: 1tsp

పసుపు పొడి: 1tsp

పెరుగు: 1/2cup

జీడిపప్పు పేస్ట్: 2tbsp

జీలకర్ర పొడి: 1tsp

గరం మసాలా పొడి: 1tsp

ఉప్పు : రుచికి సరిపడా

జీలకర్ర: 1tsp

దాల్చిన చెక్క :1

యాలకలు: 4

నూనె: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా బటన్ మష్రుమ్ ను వేడి నీటిలో శుభ్రంగా కడగాలి.

2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర దాల్చిన చెక్క, యాలకలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

3. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2-3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

4. వెంటనే పసుపు, జీలకర్ర పొడి, కారం, జీడిపప్పు పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేయాలి.

5. తర్వాత ఒక బౌల్లో పెరుగు వేసి గిలకొట్టి తర్వాత, దాన్ని పాన్ లో పోసి, మొత్తం మిశ్రమాన్ని నిదానం కలియబెట్టాలి.

6. ఒక నిముషం తర్వాత బటన్ మష్రుమ్ ను అందులో వేసి మూత పెట్టి 10 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

7. తర్వాత మూత తీసి, సరిపడా నీళ్ళు పోసి,తక్కువ మంట మీద గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.

8. చివరగా గరం మసాలా వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే కాజు మష్రుమ్ మసాల రెడీ. ఈ కర్రీని ప్లెయిన్ రైస్ లేదా పరోటాలకు సైడ్ డిష్ గా సర్వ్ చేయండి.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బటర్ ఫేస్ ప్యాక్…

images (21)

బటర్ – పాలు : ఆయిల్ స్కిన్ కు ఉత్తమ మార్గం బటర్ ఫేస్ ప్యాక్. ఒక బౌల్ మిల్క్ లో కొద్ది బటర్ మిక్స్ చేసి , ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బటర్ – పెరుగు : బటర్ ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

బటర్ – బాదం పొడి : గుప్పెడు బాదంను పొడి చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. కొద్ది సమయంలోనే ప్రకాశవంతమైన చర్మఛాయను మీరు పొందవచ్చు.

హైదరాబాది కచ్చి గోష్ట్ బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (6)

కావాల్సిన పదార్థాలు :

మటన్: 1kg

బాస్మతి రైస్: 1kg

పెరుగు: 200grms

లెమన్ జ్యూస్: 3tsp

మసాలా దినుసులు: 20grms

చిల్లీ పౌడర్: 2tsp

ధనియాల పౌడర్: 3tsp

జింజర్ గార్లిక్ పేస్ట్: 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

గరం మసాలా: 11/2tsp

నూనె: సరిపడా

ఫ్రైడ్ ఆనియన్: 1cup

తరిగిన కొత్తిమిర: 1/2cup

తరిగిన పుదీనా: 1/2cup

బే లీవ్స్: 1

వెన్న: 150grms

నీళ్ళు: 5ltrs.

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక కేజీ మాసం తీసుకుని అందులో లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, తరిగిన కొతిమిర, పుదీనా, ధనియాల పౌడర్, నూనె కలిపి రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి.

2. తర్వాత 5 లీటర్ల నీటిని ఒక బౌల్‌లో తీసుకుని 25 నిమిషాల పాటు మరగబెట్టాలి.

3.తరువాత ఇందులో పైన సూచించిన మోతాదులో ఉప్పు, 10గ్రా. గరం మసాలా, బేలీవ్స్ కలపాలి.

4. ఇప్పుడు గంటపాటు నాన బెట్టిన బాస్మతి రైస్‌ని మరగించిన నీటికి కలపాలి. ఇప్పుడు సగం బిర్యానీ తయారు అయినట్లే.

5. ఈ రైస్‌ని తీసుకుని పైన సూచించిన విధంగా బాగా నాన బెట్టిన మటన్‌పై వేయాలి. రైస్ పైన వెన్న, గార్లిక్ కలపాలి. ఇలా తయారైన బిర్యానీపై మూత ఉంచి గోధుమపిండితో మూతను సీల్ చేయాలి(ఆవిరిబయట పోకుండా)20-25 నిమిషాల పాటు గ్యాస్‌ని సిమ్‌లో ఉంచి ఉడకబెట్టాలి.

6. తరువాత మూతపై 20 నిమిషాల పాటు వేడి వేడి నిప్పులు పోయాలి. తరువాత మూత తీస్తే ఘుమ ఘుమలాడే బిర్యానీ మనకు నోరూరిస్తుంది. దీనికి తరిగిన కొతిమిర, పుదీనా, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్, మిర్చీ ముక్కలు కలపాలి.

7. అంతే మనకు కావల్సిన కచ్చి గోషి బిర్యానీ తయారైంది. ఇలా వేడి వేడిగా ఉన్న బిర్యానీని టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరు.

కల్మీ కబాబ్ రిసిపి ఎలా తయారుచేస్తారో చూద్దాం…

images (23)

కావల్సిన పదార్థాలు:

చికెన్: 1kg (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp

ఉప్పు: రుచికి సరిపడా

పెరుగు: 1cup

కుంకుమపువ్వు: చిటికెడు

నిమ్మకాయ రసం: 1tbsp

మైదా: ¼cup

మసాలా కోసం కావల్సిన పదార్థాలు:

లవంగాలు: 3

ఉల్లిపాయ విత్తనాలు(కాలా జీర): ½tsp

చెక్క: 1

బే ఆకు: 1

మిరియాలు: 5

తయారుచేయు విధానం:

1. ముందుగా మసాలాకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని పాన్‌లో వేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారనిచ్చి, మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, తడిఆరేవరకూ పక్కన పెట్టుకోవాలి.

3. తర్వత చికెన్ ముక్కలను చిన్న చిన్నగాట్లు పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కుంకుమ పువ్వు, నిమ్మరసం, మైదా మరియు పొడిచేసుకొన్న మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

5. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి రెండు మూడు గంటల సమయం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.

6. తర్వత మైక్రోవేవ్‌లోని గ్రిల్స్‌కు గ్రిల్ చేసి 15-20నిముషాలు మైక్రోవోవెన్‌లో పెట్టాలి.

7. చికెన్ గ్రిల్ క్రింది బాగంలో డ్రిప్ ట్రే పెట్టాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోనికి మార్చుకోవాలి. అంతే చికెన్ కల్మీ కబాబ్ రిసిపి రెడీ.

పళ్ళను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి…

images (7)

కొన్ని పదార్ధాలని మనమెంతో ఇష్టంగా తింటాం. వాటిల్లో కొన్ని పళ్ళకు హాని చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటి వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే కొన్ని పళ్ళకు మేలు చేసేవి కూడా ఉంటాయి.

పళ్ల ఎనామిల్‌కి హాని చేసే వాటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పదార్ధాలు ముందుంటాయి. చిప్స్, తెల్ల బ్రెడ్, పాస్తా మరియు పిజ్జా లాంటివి మరీ తియ్యగా ఉండకపోవచ్చు కానీ తిన్నవెంటనే నోట్లో ఉండగానే చక్కెరగా మారిపోతాయి. వీటిని ఎంత తక్కువగా తింటే మన పళ్ళకు అంత మంచిది.

నిమ్మజాతి పండ్లు, టొమాటోలు మరియు ద్రాక్ష ఆహారంగా తీసుకున్నపుడు పళ్ళను శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

పాలు, పెరుగు, పనీర్ మరియు చీజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు మరియు లవణాలు పళ్ళ ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియంని అందిస్తాయి.

అలాగే పీచు శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయల్ని తరుచూ తీసుకుంటే మంచిది.

గోరు వెచ్చని గ్రీన్ టీ త్రాగడం వలన పళ్ళకు మేలు జరుగుతుంది. అందులో ఉండే పాలి ఫెనాల్స్ బ్యాక్టీరియాను నశింపచేసి దంత క్షయాన్ని అరికడతాయి.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే హనీ, కర్డ్ కాంబినేషన్…

images (5)

– క్లియర్ స్కిన్: పెరుగు మరియు తేనె రెండు మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉండే జింక్, ఇన్ఫ్లమేషన్ మరియు స్కిన్ రెడ్ నెస్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దాంతో స్కిన్ కంప్లెక్షన్ పెరగుతుంది.

– స్కిన్ మాయిశ్చరైజర్: పెరుగు మరియు తేనె ఒక నేచురల్ స్కిన్ హైడ్రేట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మంలో ఇది నేచురల్ మాయిశ్చరైజర్ లెవల్స్‌ను రీస్టోర్ చేస్తుంది. దాంతో చర్మం సాఫ్ట్‌గా మారుతుంది.

– స్కిన్ ఫెయిర్‌గా మారుతుంది: పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్‌లో వివిధ రకాల ఎంజైమ్స్ ట్రైగ్లిజరైడ్స్ వంటివి చర్మంలో మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతాయి. దాంతో స్కిన్ సెల్స్ కొత్తగా పుడుతాయి, చర్మం ఎప్పుడూ కొత్తగా ప్రకాశవంతంగా యవ్వనంగా కనబడుతుంది.

– మొటిమలను నివారిస్తుంది: తేనె మరియు పెరుగు రెండింటి కాంబినేషన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియ వల్ల ఏర్పడే మొటిమలను నివారిస్తుంది.

– యాంటీఏజింగ్‌గా పనిచేస్తుంది: పెరుగు మరియు తేనె కాంబినేషన్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది. దాంతో చర్మంలో ఏజింగ్ లక్షణాలు నివారించబడుతాయి.

– సన్ బర్న్ నివారిస్తుంది: ఈ రెండింటి మిశ్రమంలో సన్ బర్న్ నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. దాంతో చర్మం ఎర్రబడకుండా మరియు పిగ్మెంటేషన్ నివారించి యూత్ ఫుల్‌గా కనబడేలా చేస్తుంది.

జుట్టు చిక్కుబడకుండా…బాదం ఆయిల్, పెరగు & హానీ మాస్క్…

download

జుట్టు చిక్కుపడకుండా అందంగా, తేమగా, ఆరోగ్యకరమైన జుట్టును అందివ్వడానికి ఇంట్లో ఉండే మూడు ముఖ్యమైన పదార్థాలు గొప్పగా సహాయపడుతాయి. వాటిలో పెరుగు, తేనె మరియు బాదం నూనె. ఈ మూడు నేచురల్ పదార్థాల్లో ఉండే గుణాల వల్ల జుట్టు చిక్కుపడకుండా మరియు డ్రైగా మారకుండా నివారిస్తుంది. జుట్టుకు నేచురల్‌గా తేమను అందిస్తుంది మరియు జుట్టును మ్రుదువుగా మార్చడానికి సహాయపడే క్యూటికల్స్‌ను అందిస్తుంది. అలాంటి హెయిర్ మాస్క్‌ను ఇంట్లో తయారుచేసుకోవడానికి కావల్సినవి, ప్రయోగించే పద్దతి తెలుసుకుందాం…

కావల్సినవి:

టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్

1/2 కప్పు పెరుగు

1/4 కప్పు తేనె

ఉపయోగించే విధానం:

పైన పదార్థాలన్ని ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. చిక్కటి పేస్ట్‌లా ఏర్పడే వరకూ మిక్స్ చేసి, తలకు మాస్క్‌లా వేసుకొని, 15నిముషాలు మసాజ్ చేయాలి. తలకు మాస్క్ వేసుకొన్న అరగంట తర్వాత, తలస్నానం చేయాలి. మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం వల్ల చిక్కు వదిలిపోతుంది. ఈ పద్దతి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ చిట్కా వల్ల జుట్టు చిక్కుపడదు. మరియు ఒక నెల వరకూ ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి, ఈ చిట్కాను మీరు తిరిగి అనుసరించాల్సిన పనిలేదు. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు అందంగా కనడుతుంది. చిక్కు ఉండదు. ఈ హెయిర్ మాస్క్‌ను నెలకొకసారి అప్లై చేస్తే చాలు, జుట్టు సాఫ్ట్‌గా, చిక్కుపడకుండా, అందంగా కనబడుతుంది.

ఇంట్లోనే తయారుచేసుకునే ట్యాన్ రిమూవల్ బ్లీచ్…

images (4)

బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి పెరుగు చాలా సహజసిద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి పెరుగులో కాస్త పసుపు, పాలమీగడ కలిపి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత శగనపిండితో స్క్రబ్ చేసుకుంటే సహజ మెరుపు సొంతం చేసుకోవచ్చు.

చికెన్ ముర్గ్ బదామి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావల్సిన పదార్థాలు:

చికెన్: 1kg (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)

నిమ్మరసం: 2tbsp

కారం పొడి: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

చిక్కటి పెరుగు: 3tbsp

గరం మసాలా పొడి: 1tsp

ఉల్లిపాయలు: 3(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp

గ్రీన్ యాలకలు: 4

దాల్చినచెక్క: 1

లవంగాలు: 5

బే పాలు: 1

పంచాదర: 1tsp

బాదాం : 1/2(రాత్రిపూట నానబెట్టి, ఒలిచినవి)

పసుపు: చిటికెడు

జాజికాయ: చిటికెడు

నెయ్యి / నూనె: 3tbsp

కొత్తిమీర: 2tbsp

బాదాం: గార్నిషింగ్ కోసం (సన్నగా కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత బాదంకు కొద్దిగా పాలు మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌గా తయారుచేసుకోవాలి.

3. తర్వాత చికెన్ ముక్కలను ఒక పెద్దగిన్నెలో వేసుకొని అందులో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి చికెన్ ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేయాలి. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి 5-6గంటలు అలాగే ఉండనివ్వాలి.

4. ఐదు, ఆరుగంటల తర్వాత నూనె లేదా నెయ్యిని పాన్‌లో వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు పంచదార వేసి ఒక నిముషం మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి, తర్వాత అందులో అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 2, 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను మాత్రమే వేయాలి. మిగిలిన మారినేషన్ మిశ్రంను అదే గిన్నెలో అలాగే పక్కన పెట్టుకోవాలి.

8. తర్వాత చికెన్ ముక్కలను 7-8నిముషాలు ఫ్రై చేయాలి.

9. దాని తర్వాత మారినేడ్ మిశ్రమాన్ని, బాదం పేస్ట్, ఉప్పు, జాజికాయ పొడి, గరం మసాలా పౌడర్ వేసి మరో 5నిముషాలు ఉడికించాలి.

10. ఇప్పుడు పాన్‌లో నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.

11. పాన్ మూత పెట్టి, చికెన్‌ను 15-20నిముషాలు ఉడికించుకోవాలి.

12. ఒకసారిగా చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌను ఆఫ్ చేసేయాలి.

13. చివరగా కట్ చేసిన బాదం మరియు కొత్తిమీర తరుగుతో చికెన్‌ను గార్నిష్ చేయాలి. అంతే అద్భుతమైనటువంటి చికెన్ ముర్గ్ బాదామీ రిసిపి రెడీ ఈ స్పెషల్ చికెన్ రిసిపిని రోటీ పులావ్‌తో ఎంజాయ్ చేయవచ్చు.