Posts Tagged ‘cutlet’

రుచికరమైన పనీర్ కట్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

aaloo-and-paneer-cutlets

కావలసిన పదార్ధాలు:

కాటేజ్ చీజ్ (పనీర్) – 2 కప్పులు (తరిగినది)

ఉడికించిన అన్నం – ½ కప్పు (చల్లారినది)

రుచికి సరిపడా ఉప్పు

పచ్చిమిర్చి – 1 ½ టేబుల్ స్పూను (సన్నగా తరిగినవి)

మైదా – ¼ కప్పు

కొత్తిమీర – ¼ టీస్పూను (తరిగినది)

క్యాప్సికం – ½ కప్పు వివిధ రంగులవి (సన్నగా తరిగినవి)

పైన కోటింగ్ కి బ్రెడ్ పొడి

నూనె – 2 టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానం:

1.సన్నగా తరిగిన చీజ్ తీసుకుని అందులో ఉడికించిన అన్నాన్ని కలపండి.

2.ఇప్పుడు, మైదా, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి.

3.ఇప్పుడు, కొత్తిమీర, తరిగిన క్యాప్సికం వేయండి. మీరు వివిధ రకాల క్యాప్సికం తీసుకున్నట్లయితే, మీ కట్లెట్ లు చాలా అందంగా కనిపిస్తాయి.

4.ఈ పదార్ధాలు అన్నిటినీ బాగా కలిపి, చేతితో చిన్నచిన్న ఉండలుగా చేయండి.

5.ఇప్పుడు, తవా వేడిచేసి, నూనె రాయండి.

6.దానిపై కట్లెట్ లను ఉంచి, బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.

7.రెండువైపులా బాగా ఉడికిన తరువాత, పుదీనా పచ్చడి లేదా టొమాటో సాస్ తో వేడిగా వడ్డించండి.

ఫిష్ కట్‌లెట్‌ ఎలా తయారు చేయాలో చూద్దాం..

images (100)

కావల్సిన పదార్థాలు:

తున ఫిష్- 2 small tins

ఉల్లిపాయలు- 2పెద్దవి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి- 5 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

కరివేపాకు- 3 రెమ్మలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

అల్లం – 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

వెల్లుల్లి: – 1tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

కారం- ½ tsp

పసుపు- ¼ tsp

మిరియాలపొడి- ½ tsp

గరం మసాలా- ½ tsp

నూనె- 2tbsp (వేడిచేయాలి)

గుడ్లు- 1-2 (బాగా గిలకొట్టాలి)

బంగాళదుంప- 1 (చిన్నసైజు, ఉడికించి మ్యాస్ చేసుకోవాలి)

బ్రెడ్ పొడి: కోటింగ్ కోసం

డీప్ ఫ్రై చేయడానికి : నూనె

గరం మసాలా పొడి కోసం:

లవంగాలు- 2tbsp

యాలకలు- 2tbsp

యానీసీడ్- 2tbsp

దాల్చిన చెక్క- 3 small sticks

తయారుచేయు విధానం:

1. ముందుగా గరం మసాలా కోసం సిద్దం చేసుకొన్న వాటినన్నింటిని డ్రై రోస్ట్ చేసుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

2. తర్వాత చేపలను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వంపేసి, తడి ఆరేవరకూ పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నని ముక్కలుగా చేయాలి. లేదా ముల్లు తొలగించి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు రెండు చెంచాల నూనెను పాన్ లో పోసి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

5. అందులోనే పసుపు, కారం, పెప్పర్ పౌడర్, మరియు గరం మసాలా వేసి మరో 3 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు అందులోనే మెత్తగా చేసి పెట్టుకొన్న చేపపదార్థాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ తేమ లేకుండా ఫ్రై చేయాలి.

8. ఇలా చేసిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దుంపుకొని, చల్లారనివ్వాలి.

9. ఇవి చల్లారిన తర్వాత వీటిని రౌండ్ షేప్ లో అరచేతిలో పెట్టుకొని వడలా తట్టుకోవాలి.

10. ఇలా ప్రిపేర్ చేసిన కట్‌లెట్‌ను బాగా గిలకొట్టి పెట్టుకొన్న ఎగ్ లో డిప్ చేసి ప్లేట్‌లో ఉన్న బ్రెడ్ పొడిలో వేసి ప్లొరించాలి. అన్నివైపుల బ్రెడ్ పొడి అంటుకొనేలా చేయలి.

11. ఇప్పుడు డీఫ్ ఫ్రైకి సరిపడా నూనె పాన్ లో వేసి వేడి చేయాలి. వేడి అయ్యాక ఆ నూనెలో రెడీగా పెట్టుకొన్న ఫిష్ కట్‌లెట్‌ వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

12. అంతే ఫిష్ కట్‌లెట్‌ రెడీ. దీన్ని వేడి వేడి చట్నీతో సర్వ్ చేయాలి.

స్పినాచ్(ఆకుకూర) కట్‌లెట్ రిసిపి ఎలా తయారు చేయాలో చుద్దాం… బ్రేక్ ఫాస్ట్ స్పెషల్ …

images (76)

ఆకుకూర: 2cups(సన్నగా తరిగినది)

బంగాళాదుంప:1 (ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చిదుమిపెట్టుకోవాలి)

ఆయిల్: 2tbsp

ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)

అల్లం పేస్ట్: 1tbsp

గరం మసాలా: ½ tsp

శెనగపిండి: 1cup

బ్రెడ్ పొడి: 2cup

నీరు: ½cup

నూనె: డీప్ ఫ్రై చేయడానికి

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక, అందులో ఉల్లిపాయ, పచ్చిమర్చి ముక్కలు మరియు అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

2. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోఆకుకూర తరుగు వేసి, మీడియం మంట మీద బాగా వేగించుకోవాలి. ఆకు కూర మెత్తగా ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాలదుంప, గరం మసాలా, ఫ్రై చేసుకొన్నఆకుకూర మిశ్రమం మరియు ఉప్పు కూడా వేసి అన్నింటిని చేత్తో కలుపుతూ మిక్స్ చేయాలి.

4. ఇప్పుడు ఈ కలుపుకొన్న మిశ్రమంలో నుండి కొంత చేతిలో తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

5. మరొక బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి.

6. ఇప్పుడు చిన్నచిన్న ఉండలుగా తయారుచేసిన వాటని అరచేతిలో తీసుకొని కట్ లెట్ లా ఒత్తుకొని, శెనగపిండి మిశ్రమంలో డిప్ చేయాలి.

7. కట్ లెట్ రెండు వైపులా శెనగపిండి మిశ్రమం బాగా పట్టేలా డిప్ చేయాలి. ఇప్పుడు వీటిని బ్రెడ్ పొడిలో వేసి రెండు వైపులా అద్దాలి.

8. స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో నూనె పోసి, మీడియం మంట మీద కాగనివ్వాలి, నూనె కాగిన తర్వాత బ్రెడ్ పొడిలో అద్ది పెట్టుకొన్నకట్ లెట్ ను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

9. అంతే స్పినాచ్ కట్‌లెట్ రెడీ. మీకు ఇష్టమైతే టమోటో సాస్ కూడా టాపింగ్ చేసుకోవచ్చు.