Posts Tagged ‘dandruff’

చుండ్రు తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు…

images (8)

– హాట్ ఆయిల్ మసాజ్: తలకు నూనె అప్లై చేయడానికి ముందు నూనెను కొద్దిగా వేడి చేాయలి. దీన్ని జుట్టులోపలి వరకూ అప్లై చేయాలి. 10నిముషాలు మసాజ్ చేసి తర్వాత ఒక గంట రెండు గంటల పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి.

– కర్పూరం-కొబ్బరి నూనె: ఇది అమ్మమ్మల కాలం నాటి రిసిపి. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి మిక్స్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవసరమయినప్పుడు, రాత్రుల్లో నిద్రించడానికి ముందు అప్లై చేసుకోవాలి. కర్పూరం తలను కూల్‌గా ఉంచుతుంది. చుండ్రు నివారిస్తుంది.

– కోకనట్-లెమన్: హెయిర్ కేర్ రెమెడీస్‌లో లెమన్ ఒక గ్రేట్ రెమెడీ. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– పెరుగు-నిమ్మరసం: చుండ్రు నివారించుకోవడానానికి ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం పిండి తలకు పట్టించడం వల్ల తల శుభ్రం చేస్తుంది. క్లియర్ అవుతుంది. నిమ్మరసం చుండ్రును నివారించడంలో బాగా సహాయపడుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ టిప్. పెరుగు జుట్టుకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తలను కూల్‌గా ఉంచుతుంది.

ఇంట్లో ఉండే ఔషధంతో చుండ్రు సమస్యకు చెక్..!

images

కొబ్బరినూనెలో కర్పూరంను కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ నిద్రించే ముందు జుట్టుకు పట్టించాలి. ఒకవారం రోజుల్లో దాని ఫలితంగా చుండ్రు సమస్య వదిలి పోతుంది.

చుండ్రు సమస్యకు అల్లంతో చెక్…

images (26)
ఆరోగ్యానికి మేలు చేసే వంటింటి వస్తువులన్ని సౌందర్య సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి. అల్లంను మెత్తని పేస్ట్‌లా చేసుకుని, దానికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది.

చుండ్రు సమస్యకు గసగసాలతో సులువైన నివారణా మార్గం…

images (25)

వంటింటిలో ఉన్న గసగసాలను కొద్దిగా తీసుకుని, వాటికి పాలు చేరుస్తూ నూరుకోవాలి. తర్వాత దానిని తలకు బాగా పట్టించి, ఆరిన తర్వాత తలంటు స్నానం చేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేశారంటే మూడు వారాల్లో చుండ్రు సమస్య పూర్తిగా సమసిపోతుంది…

చుండ్రును నివారించే హెయిర్ మాస్క్‌లు…

download (62)

గుడ్డు: రెండు గుడ్లను పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి, ఈ సొనను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి గోరువెచ్చిని నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు మరియు హెయిర్ ఫాల్‌ను అరికడుతుంది. ఇది మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.

పెరుగు: మీ కేశాలకు పెరుగును బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు, గోళ్ళ సమస్యల నియంత్రణకు గోరింటాకు…

images (42)

గోరింటాకులో ఎన్నో ఔషధగుణాలున్నాయని నెలకొక్కసారి చేతికి పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరింటాకుతో పెట్టుకోవడం ద్వారా గోళ్ళలో ఏర్పడే ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు..అలెర్జీలకు దూరం చేసుకోవచ్చు..బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌) దరిచేరదు..ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకు బాగా నూరి మచ్చలపై పూస్తే సరిపోతుంది..వేడిగడ్డలను సైతం గోరింటాకు నయం చేస్తుంది..అలాగే నెలకోసారి గోరింటాకు పేస్ట్‌తో తలకు ప్యాక్ వేసుకుంటే జుట్టు బలపడుతుంది..జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు..చుండ్రును దరిచేరనివ్వదు..మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.

 

జుట్టు సంరక్షణలో షీకాకాయ చేసే అద్భుతం…

long-hair1

షీకాకాయలో దాగున్న పవర్‌ఫుల్ హెయిర్ కేర్ బెన్ఫిట్స్:

– చుండ్రు: చుండ్రు నివారించడానికి షీకాకాయ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, న్యూట్రీషనల్ గుణాలు చుండ్రుని తగ్గించడంతో పాటు, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు నివారించవచ్చు.

– తెల్లజుట్టు: వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు, స్పాట్స్, తెల్లజుట్టు సమస్య వేధిస్తుంటాయి. షీకాకాయ ఉపయోగించడం వల్ల నల్లటి ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చు. షీకాకాయ, ఉసిరి వంటి వాటితో హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని రెగ్యులర్‌గా వాడటం వల్ల తెల్లజుట్టుని నివారించవచ్చు.

– హెయిర్ లాస్: జుట్టు రాలే సమస్య కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి కారణమవుతుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల షీకాకాయ జుట్టు రాలడాన్ని అరికట్టి, వేగంగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడాన్ని నివారిస్తుంది.

– బలమైన జుట్టుకి: షీకాకాయ జుట్టుని న్యాచురల్‌గా సాఫ్ట్‌గా, స్మూత్‌గా మారుస్తుంది. ఇందులో విడుదలయ్యే ఎసెన్షియల్ ఆయిల్స్, విటమిన్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జుట్టు షైనింగ్‌గా, బలంగా మారడానికి సహకరిస్తుంది.

చుండ్రు సమస్యను నివారించే అవిసె నూనె…

 

images (5)

చుండ్రు సమస్యను నివారించడంలో అవిసే నూనె బాగా తోడ్పడుతుంది. వెంట్రుకలు కూడా పెరిగి జుత్తు వత్తుగా అవుతుంది.

చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందడమెలా…

 download (12)
శిరోజాలు వత్తుని బట్టి గుడ్డులోని తెల్ల సొనలని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్నికలిపి ఈ మిశ్రమాన్నితలకి పట్టించి అరగంటపాటు ఉంచి తలస్నానం చెయ్యాలి. చుండ్రు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

తలలో చుండ్రును నివారించడానికి ఉపయోగపడే వెనిగర్…

download (12)

కొన్ని పుదినా ఆకులను పేస్ట్‌లా చేసి రసం తీయాలి. ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, మాడుకి పట్టించి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు తొలగిపోయి, జుట్టు మంచి సువాసన వస్తుంది.