Posts Tagged ‘Egg’

ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

french-omelette-004

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 4 (whites only)

పాలు: 1tbsp

పెప్పర్: 1tsp

పాలక్: 1 sprig (chopped)

మెంతి: 1/2tsp

ఆయిల్: తగినంత

కొత్తిమీర: 1 sprig (chopped)

పుదీనా: 5 (chopped)

ఉప్పు: రుచికి సరిపడా

ఆలివ్ ఆయిల్: 1tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. పచ్చసొనను మీరు వేరే వంటకానికి ఉపయోగించుకోవచ్చు లేదా పడేసేయండి.

3. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న పాలాకు, మెంతి, కొత్తిమీర, పుదీనా అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

4. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి అయ్యాక అందులో బీటెన్ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి రెండు నుండి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

5. మూడు నాలుగు నిముషాల తర్వాత ఆమ్లెట్ ను ఫోల్డ్ లేదా రోల్డ్ చేసి మరి రెండు నిముషాలు ఫ్రై చేయాలి. అంతే ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ రెడీ. ఈ ఆమ్లెట్ ను ఫ్రెగా కట్ చేసిన టమోటో, లేదా కీరకాయ ముక్కలతో బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది.

మసాలా ఎగ్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

కావల్సిన పదార్థాలు:

బాయిల్డ్ ఎగ్స్: 4 ( సగానికి కట్ చేసుకోవాలి )

టమోటోలు : 2

ఉల్లిపాయలు: 2

కారం: 1 tsp

కొబ్బరి తురుము : 1 cup

దాల్చిన చెక్క: 1 stick

లవంగాలు: 2

యాలకలు : 2 to 3

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 tbsp

ధనియాలపొడి : 1 tbsp

ఉప్పు:రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక జార్ లో టమోటో, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, మరియు కొన్ని నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి .

2. ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో మిక్సీలో మెత్తగా చేసుకొన్న మసాలా పేస్ట్ ను వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. మసాలాతో పాటు, కారం, కొద్దిగా ధనియాలపొడి, ఉప్పు వేసి ఫ్రై చేయాలి.

5. మసాలా పచ్చివాసన పోయి, బాగా వేగిన తర్వాత ఉడికించిపెట్టుకొన్న గుడ్లను రెండుబాగాలుగా కట్ చేసి వేగుతున్న మసాలాలో వేసి మిక్స్ చేస్తూ , తక్కువ మంట మీద 5నుండి 10 నిముషాలు ఉడికించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఎగ్ మసాల రెడీ.

ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (62)

కావల్సిన పదార్థాలు :

మష్రుమ్(పుట్టగొడుగులు) : 1cup(మష్రుమ్ ను తరుముకోవాలి. లేదా సన్నగా తరిగి పెట్టుకోవాలి)

ఎగ్ వైట్ : 4

పెప్పర్ : 1/2tsp

పాలు : 1tbps

ఆలివ్ ఆయిల్ : 1tsp

ఓరిగానో : 1/2tsp

చీజ్ : 1/2cube(గార్నిష్ కొరకు)

కొత్తిమీర : కొద్దిగా

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం :

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న మష్రుమ్, కొత్తిమీర, అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

3. అలాగే అందులో పెప్పర్ అప్పుడే వేయవచ్చు లేదా తర్వాత కూడా పెప్పర్ ను చిలకరించుకోవచ్చు.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.

5. ఇప్పుడు మష్రుమ్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.

6. ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, ఓరిగానో చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్ తురుమును కూడా చిలకరించాలి.

8. చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ రెడీ. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి.

గుడ్డు వాసను మాయం చేసే సింపుల్ చిట్కాలు…

images (52)

గుడ్డు పగిలి క్రిందపడినప్పుడు, లేదా పాత్రలకు అట్టుకొన్నప్పుడు వెంటనే శుభ్రం చేయకపోతే, కెమిక్ గ్యాస్ హైడ్రోజన్ ఉత్పత్తై బ్యాక్టీరియా చేరి దుర్వాసన మరింత ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, గుడ్డు వల్ల వచ్చే దుర్వాసను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి…

1. నిమ్మరసం: నిమ్మరసంతో గుడ్డు వాసను దూరం చేయవచ్చు. గుడ్డ పడ్డ మరకల మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించండి. రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత పొడి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే తక్షణం వాసన పోతుంది.

2. రోజ్ వాటర్: గుడ్డు పడ్డ చోట బాగా ఎండిపోయి, మొండి మరకలుగా తయారైతే రోజ్ వాటర్ తో శుభ్రం చేయడం ఒక సులభమైన పద్దతి. అంతే కాదు, రోజ్ వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుంటుంది.

3. వెనిగర్: ఎగ్ స్మెల్ నిర్మూలించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక ఎఫెక్టివ్ మార్గం. అందుకు మీరు చేయాల్సిందల్లా, వెనిగర్ లో కాటన్ క్లాత్ ను డిప్ చేసి, మరకపడ్డ ప్రదేశంలో రుద్దాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే దుర్వాసన మాయం అవుతుంది.

4. ఆరెంజ్ తొక్క: ఎగ్ స్మెల్ తొలగించడానికి ఆరెంజ్ ఒక ఉత్తమమైన మార్గం. ఇది ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ సువాసన అందించే బెస్ట్ హోంరెమడీ. ఆరెంజ్ తొక్కతో ఎగ్ మరకలున్న చోట రుద్ది శుభ్రం చేయాలి.

కరకరలాడే హాట్ అండ్ స్పైసీ చికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

 

images (17)

కావల్సిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్ ముక్కలు:5 to 6

కార్న్ ఫ్లోర్: 5 tbsp

మైద: 5 tbsp

గుడ్లు: 2

సోయా సాస్: 2 tbsp

చిల్లీ సాస్: 2 tbsp

వెనిగర్: 2 tbsp

ఆవపొడి: 1 tsp

బ్లాక్ పెప్పర్: 1 tsp

వెల్లుల్లి రెబ్బలు: 6 to 7సన్నగా తరిగి పెట్టుకోవాలి

ఉప్పు : రుచికి సరిపడా

చైనీస్ సాల్ట్: రుచికి సరిపడా

నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా శుభ్రం చేసుకొన్న చికెన్ ముక్కలను కుక్కర్లో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పెట్టాలి.

2. అలాగే చికెన్ తో పాటు, కొద్దిగా నూనె, చైనీస్ సాల్ట్, వెల్లుల్లి, వెనిగర్, ఉప్పు మరియు పెప్పర్ వేయాలి.

3. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.

4. ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని అందులో గుడ్లు, సోయాసాస్, చిల్లీ సాస్, బ్లాక్ పెప్పర్, ఆవాల పేస్ట్, కార్న్ ఫ్లోర్ మరియు మైదా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.

5.ఈ పేస్ట్ ను మరీ చిక్కగా లేకుండా కొద్దిగా పాలు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఉడికించుకొన్న చికెన్ ముక్కలకు ఈ పేస్ట్ ను పట్టించి డీప్ ఫ్రై చేసుకోవాలి.

6. అంతే క్రిస్పీ చికెన్ ముక్కలను టమోటో సాస్ మరియు కోల్డ్ డ్రింక్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

షహీ కోప్తా షొర్భా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

కావల్సిన పదార్థాలు:

కోఫ్తాకు కావల్సిన పదార్థాలు:

బీఫ్: 500grms

గుడ్డు: 1(పగులగొట్టిలోపలి సొన తీసుకోవాలి)

ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)

అల్లం వెల్లల్లి: 2tsp

పచ్చిమిర్చి: 2(సన్నగా కట్ చేసుకోవాలి)

కొత్తిమీర: 1కట్ట(సన్నగా తరగాలి)

పుదీనా: 1/2 కట్ట(సన్నగా తరగాలి)

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: డీప్ ప్రైయింగ్కి సరిపడా

కర్రీ కోసం కావల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు: 3(సన్నగా తరగిపెట్టుకోవాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp

టమోటో: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పసుపు: 1tsp

కారం: 1tsp

గరం మసాలా: 1tsp

ధనియాల పొడి: 1tsp

యాలకులపొడి: 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

ఆయిల్: 2tbsp

నీళ్ళు: 1cup

కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఫ్రెష్ క్రీమ్ : 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా మటన్‌ను శుభ్రంగా కడగాలి. తర్వాత కోఫ్తాలకు సిద్దం తీసుకొన్న పదార్థాలన్నింటిని ఒక మిక్స్ బౌల్లో వేసి (నూనె మినహాయించాలి)అన్నింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి.

2. డీప్ ఫ్రౌయింగ్ పాన్‌లో నూనె వేసి కాగిన తర్వాత కోఫ్తా ఉండలను, కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.

3. నూనెలో కోఫ్తాలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

5. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2, 3 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత టమోటో, పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాలా, ఉప్పు వేసి 5నుండి6 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. కొద్దిగా నీళ్ళు పోసి చిక్కటి గ్రేవీ అయ్యే వరకూ 2-3నిముషాలు ఉడికించుకోవాలి.

8. గ్రేవీ చిక్కబడిన తర్వాత అందులో ఫ్రైడ్ కోఫ్తాలను వేసి, మూత పెట్టి 10-15నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

9. తర్వాత మూత తీసి, యాలకుల పొడి చిలకరించి, కోఫ్తాలు పూర్తిగా ఉడికిన తర్వాత, స్టౌ ఆఫ్ చేయాలి.

10. చివరగా కొత్తిమీర తరుగు మరియు ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేయాలి. అంతే షహీ కోఫ్తా షొరబ రెడీ. ఈ రుచికరమైన బీఫ్ రిసిపిని రోటి లేదా పరోటాలతో సర్వ్ చేయండి.

టమోటో ఎగ్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (2)

కావలసిన పదార్థాలు:

టొమాటోలు: 6

కోడిగుడ్లు: 3

ఉల్లిపాయ: 1

కరివేపాకు: 1 రెమ్మ

అల్లం వెల్లుల్లి ముద్ద: 1tsp

పసుపు: 1/4tsp

కారంపొడి: 1tsp

గరంమసాలా పొడి: 1/4tsp

ఉప్పు: రుచికి తగినంత

నూనె: 3tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్‌లో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.

2. తర్వాత అందులోనే పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, కారం పొడి వేయాలి. రెండు నిమిషాలు వేయించి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు కలిపి మూతపెట్టాలి.

3. టొమాటో ముక్కలు బాగా మగ్గి, మెత్తబడిన తర్వాత, బాగా కలిపి, కోడిగుడ్లు కొట్టి వేయాలి. గుడ్డు సగం ఉడికిన తర్వాత గరిటెతో మెల్లగా కలపాలి. దీనివల్ల గుడ్డు పెద్దపెద్ద ముక్కలుగా అవుతుంది. నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరంమసాలా చల్లి దింపేయాలి. అంతే టమోటో ఎగ్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది.

రుచికరమైన ఎగ్ & పొటాటో కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (21)

కావల్సిన పదార్థాలు:

గుడ్లు : 5

బంగాళదుంపలు : 3 (పొట్టు తీసి ముక్కలుగా కట్ చేయాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp

ఉప్పు : రుచికి సరిపడా

ఉల్లిపాయ పేస్ట్ : 2tbsp

టొమాటో పేస్ట్ : 1cup

ఎర్ర కారం : 1 tsp

పసుపు : ½ tsp

జీలకర్ర పొడి : ½tsp

ధనియాల పొడి : ½tsp

మసాలా పొడి : ¼ tsp

మెంతులు: ¼tsp

పచ్చిమిర్చి: 2చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి

కరివేపాకు : రెండు రెమ్మలు

కొత్తిమిర : కొద్దిగా సన్నగా తరిగిపెట్టుకోవాలి

ఆయిల్ : 4tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా గుడ్లును ఉడికించి, పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత బంగాళదుంపల యొక్క పొట్టు తొలగించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఒక మీడియం పాన్ తీసుకొని అందులో నూనె వేసి, వేడి అయ్యాక అందులో మెంతులు మరియు కరివేపాకు వేసి తక్కువ మంట మీద ఒక నిముషం వేగించుకోవాలి.

4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ మరియు అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులోనే టమోటో పేస్ట్ , కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, అన్ని రకాల మసాలా పొడులు మరియు కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మసాల పొడులన్నీ వేసిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి ఫ్రై చేసుకోవాలి.

6. పోపు 5నిముషాలు వేగిన తర్వాత అందులో బంగాళదుంపల ముక్కలు మరియు 2 కప్పుల నీరు పోసి మిక్స్ చేసి, పాన్ మూత పెట్టాలి.

7. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లను వేసి మిక్స్ చేయాలి.

8. చివరగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు కొత్తిమీర తరుగు వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన ఎగ్ మరియు పొటాటో కర్రీ రిసిపి రెడీ.

ఎగ్ బోండా ఎలా తయారుచేయాలో చూద్దాం…

images-5

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 5

శెనగపిండి: 1/2cup

కారం: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 1cup

తయారుచేయు విధానం:

1. ముందుగా గుడ్లను ఉడికించి తర్వాత ఔటర్ షెల్ తొలగించి పక్కన పెట్టుకోవాలి. అవసరం అయితే మీరు ఒక గుడ్డును రెండుగా కట్ చేసుకోవచ్చు. లేదా పూర్తిగా ఒక గుడ్డు కావాలనుకుంటే అలాగే ఉపయోగించుకోవచ్చు.

2. ఒక మిక్సింగ్ బౌల్లో శెనగపిండి, నీళ్ళు, కారం, మరియు ఉప్పు వేసి, చిక్కగా, కొత్తిగా జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, మీడియం మంట మీద కాగనివ్వాలి, తర్వాత ఉడికించి పక్కన పెట్టుకొన్న గుడ్డును శెనపిండిలో డిప్ చేసి గుడ్డుకు బాగా అంటుకొనేలా చేయాలి.

4. ఇప్పుడు కాగుతున్న నూనెలో వేయాలి. మంటను తగ్గించి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మద్యమ్యదలో వాటిని తిరగేస్తుండాలి.

5. ఎగ్ బోండా ఫ్రై అయినట్లు అనిపిస్తానే వాటీని నూనె నుండి వేరుచేసి తీసి సర్వింగ్ బౌల్ లేదా సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. ఇలా మొత్తం గుడ్లును తయారుచేసుకొన్న తర్వాత అదనంగా ఆయిల్ ఉన్నట్లు మీరు గమనించినట్లైతే పేపర్ టవల్ మీద వేసి అదనపు నూనె పీల్చుకొనేలా చేయాలి. అంతే ఎగ్ బోండా రెడీ. అంతే ఈ ఎగ్ బోండాను టమోటో కెచప్ లేదా కోరియాండర్ చట్నీతో సర్వ్ చేయాలి.

స్ట్రాంగ్ జుట్టు సొంతం చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్, ఎగ్ మాస్క్…

download (27)

ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డు మిశ్రమాన్ని వేయాలి. హనీ, ఆలివ్ ఆయిల్ మరియు తేనె మూడింటిని సమంగా తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ అయ్యే వరకూ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 20 నిముషాలు అలాగే ఉండనివ్వాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. షాంపుతో తలస్నానం చేస్తే ఎగ్ స్మెల్ పోతుంది. జుట్టు వేగంగా పెంచుకోవడానికి ఈ పద్దతిని వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నించవచ్చు. దీంతో పాటు హెల్తీ డైట్‌ను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌తో జుట్టుకు మసాజ్ చేయాలి. డ్రై అండ్ స్ట్రెయిట్ హెయిర్ స్టైలింగ్‌కు దూరంగా ఉండాలి.