Posts Tagged ‘egg white’

సమ్మర్‌లో ఆయిల్ స్కిన్ నివారించడానికి సులభ చిట్కాలు…

download (18)

– పాలు, గుడ్డులోని తెల్లసొన, క్యారెట్‌ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించినట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

– మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే పెరుగు కూడా జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కార్న్ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే జిడ్డుతత్వం తొలగిపోతుంది.

కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్‌, పెరుగు మరియు బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.

జుట్టుకు మంచి కండీషనర్ కోసం…

download (56)
పావుకప్పు యాపిల్ గుజ్జులో కోడిగుడ్డులోని తెల్లసొనా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల జట్టు కండీషనర్ అయ్యి చిట్లడం వంటి సమస్యలు దరిచేరవు.

వృద్ధాప్య లక్షణాలను నివారించి చర్మ సౌందర్యం పెంచే చందనం…

images (68)

చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా చేయాలంటే, గుడ్డు సొనలో తేనె, చందనం మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా మంచి ఫలితం ఉంటుంది.

పురుషుల ముఖంలో ముడుతలను నివారించే ఉత్తమ మార్గాలు…

images (88)

మంచి నిద్ర :

మీ చర్మాన్ని ముడతలు పడకుండా చూడటంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఎండలో తిరగటం మానండి :

మీ చర్మం ముడతలు పడటానికి ప్రధాన కారణాలలో ఎండ కూడా ఒకటి. మీరు చేయవలసిందల్లా, సాధ్యమైనంతవరకు ఎండలో సమయం కేటాయించకుండా జాగ్రత్త పడండి.

తెల్ల సొన :

ఇది మీకు వింతగాను మరియు ఇబ్బందిగాను అనిపించవచ్చు, అయితే దీని వలన మేలు కలుగుతుంది. కోడిగుడ్లలోని తెల్లసొనను తీసుకోండి. అయితే పసుపు భాగం ఇందులో కలవకుండా చూడాలి. సేకరించిన తెల్లసొనను మీ చర్మానికి మర్దన చేసుకోవాలి. దీనిని మీ చర్మంపై కనీసం పదిహేను నిమిషాల పాటు ఉండేటట్లు చూడాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో చర్మాన్ని కడగాలి. దీనిలో పుష్కలంగా ఉన్నటువంటి సహజ విటమిన్ ‘B’,  ప్రభావాన్ని చూపి, చర్మ ముడతలను తొలగిస్తాయి.

అప్పర్ లిప్ హెయిర్‌ను తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

download (15)

– షుగర్, నిమ్మరసం: ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్‌గా మారిన తర్వాత అప్పర్ లిప్ మీద అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. స్ర్కబ్ చేసిన 15నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– పసుపు, పాలు: పసుపు, పాలను ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేయాలి. పేస్ట్‌లా చేసుకున్నాక, ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయాలి. 10నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

– ఎగ్ వైట్: అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి ఎగ్ వైట్ బాగా సహాయపడుతుంది. ఎగ్ వైట్‌లో కొద్దిగా షుగర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పై పెదవుల మీద అప్లై చేసి డ్రై అయిన అరగంట తర్వాత పీలింగ్‌లా తొలగించాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– శెనగపిండి: కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. శెనగపిండిలో కొద్దిగా పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

ద్రాక్షరసం తాగండి ఆరోగ్యంగా ఉండండి.. గ్రేప్ జ్యూస్‌తో బ్యూటీ…

images (81)
గ్రేప్ తొక్కలను ముఖానికి మాస్క్‌లా వేసుకోవడం ద్వారా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో యాంటీయాక్సిడెంట్లు చర్మానికి క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది. చర్మానికి కొత్త కాంతిని ఇస్తుంది. సన్ టాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు.
కంటి కిందటి వలయాలకు చెక్ పెట్టాలంటే.. ద్రాక్ష పండ్లను కట్ చేసి ఆ రసాన్ని కంటి కింద నల్లటి వలయాలపై రాస్తే ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ ద్రాక్ష రసంతో పాటు ఒక స్పూన్ గుడ్డులోని తెల్లసొనను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌ వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం పొడిబారదు. చర్మానికి నిగారింపు సంతరించుకుంటుంది.

గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించే విటిమిన్ ఫుడ్స్…

images (64)

ఎగ్ వైట్ :

గొంతునొప్పి నివారించడంలో ఎగ్ వైట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే, ఎగ్ వైట్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . వ్యాధినిరోధకత తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్స్ సహాయపడుతాయి.

నిమ్మరసం :

నిమ్మరసం అసిడిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. ఇది గొంతునొప్పి తగ్గించడానికి చాలా సింపుల్ అండ్ బెస్ట్ హోం రెమెడీ. నిమ్మరసంకు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

అరటిపండ్లు :

అరటిపండ్లలో విటమిన్ సి, పొటాషియం, బి12 మరియు సోడియం కలిగి ఉండటం వల్ల గొంతునొప్పిని తగ్గిస్తుంది. అరటిపండ్లు మింగడానికి కూడా చాలా స్మూత్ గా ఉండటం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

ఎగ్ ఫేస్ ప్యాక్ లతో యంగ్ లుక్…

images-1

ఎగ్ వైట్: కేవలం ఎగ్ వైట్ ని మాత్రమే ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేస్తే ముడతలు రాకుండా ఉంటాయి.

ఎగ్ వైట్ మరియు ముల్తానీ మట్టి: ఒక ఎగ్ లోని తెల్లసొన, 1 టీస్పూన్ ముల్తానీ మట్టి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు నివారించి చర్మాన్ని స్మూత్ గా మారుస్తాయి.

క్యారట్ జ్యూస్ మరియు ఎగ్ వైట్: ఒక టేబుల్ స్పూన్ క్యారట్ జ్యూస్, ఒక ఎగ్ వైట్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇందులో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే వెంటనే చర్మంలో గ్లోయింగ్ పెరుగుతుంది.

చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందడమెలా…

 download (12)
శిరోజాలు వత్తుని బట్టి గుడ్డులోని తెల్ల సొనలని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్నికలిపి ఈ మిశ్రమాన్నితలకి పట్టించి అరగంటపాటు ఉంచి తలస్నానం చెయ్యాలి. చుండ్రు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

ఎగ్‌వైట్ మాస్క్‌తో తెల్లగా మారడం తేలికే…

images (20)

రెండు కోడిగుడ్ల తెల్లసొన తీసుకుని, పావు కప్పు ఫ్రెష్ టమోటా జ్యూస్ కలపాలి. ఒక స్పూన్ ముల్తానీ మట్టి కూడా యాడ్ చేయాలి. బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత మరోసారి ఇంకో లేయర్ అప్లై చేయాలి. పూర్తీగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఫెయిర్ నెస్ లుక్ తీసుకొస్తుంది.