Posts Tagged ‘Evening Snack’

ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చెయ్యాలో చూద్దామా… వింటర్ స్పెషల్ స్నాక్…

20130416-152841

కావాల్సిన పదార్ధాలు:

ఉల్లిపాయలు-5(విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి)

నూనె-వేయించడానికి సరిపడినంత

కారం-1 టీ స్పూను

మైదా-1 1/2 కప్పు

ఎండబెట్టిన మిక్స్డ్ హెర్బ్స్-1 టీ స్పూను

త్రాగే సోడా-2 కప్పులు

ఉప్పు-రుచికి సరిపడా

ఉల్లిపాయ పొడి-1 టీ స్పూను

మిరియాలు-1/2 టీ స్పూను(మెత్తగా దంచుకోవాలి)

బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పూ

ఆవ పొడి-1/2 టీ స్పూను

కారంఫ్లేక్స్-1/2 కప్పు(మెత్తగా పొడి చేసుకోవాలి)

కొత్తిమీర-1 టేబుల్ స్పూను(సన్నగా తరగాలి)

తయారీ విధానం:

1. ఉల్లిపాయలని విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి. ఇలా తరిగిన ఉల్లిపాయలని 15 నిమిషాలపాటు చల్లని నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిలోనుండీ తీసి కిచెన్ టవల్ మీద ఆరబెట్టాలి. ఆరిన తరువాత ఒక ప్లేటులోకి మార్చి వీటి మీద పిండిని చల్లాలి. అందువల్ల ఎక్కువగా ఉన్న తేమని పిండి పీల్చుకుంటుంది.

2. ఒక పెద్ద గిన్నెలో మైదా, కారం, మిక్స్డ్ హెర్బ్స్, ఉల్లి పొడి, ఆవ పొడి, మిరియాలు, ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపాలి.

3. ఈ పిండికి సోడా పోసి ఈ మిశ్రమం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా లేదా చిక్కగా ఉండకూడదు. ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలపాలి.

4. ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ పొడి, బ్రెడ్ పొడి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి.

6. పొరలు పొరలుగా తరిగిన ఉల్లిపాయలని ఒకొక్కటిగా ఈ పిండిలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ , కార్న్ ఫ్లేక్స్ పొడిలో దొర్లించి ఉల్లిపాయలకి బ్రెడ్ పొడి బాగా పట్టేటట్లు చూడాలి.

7. ఇలా బ్రెడ్ పొడిలో దొర్లించిన ఉల్లిపాయలని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.

8. వేగాకా నూనెలో నుండి తీసి కిచన్ టవల్ మీద వేస్తే ఆనియన్ రింగ్స్‌లో ఉన్న అధిక నూనెని పీల్చుకుంటుంది.

చీజ్ మష్రుమ్ పకోడా ఎలా తయారుచేయాలో చూద్దాం…

mushroompak-1

చీజ్(జున్ను): 1/3 cup(తురుము కోవాలి)

పుట్టగొడుగులను : 15 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిరపకాయలు : 4 (చిన్న ముక్కలుగా తరగాలి)

వెల్లుల్లి : 4 (పేస్ట్ చేయాలి)

శెనగపిండి : 1/3

కార్న్ ఫ్లోర్ : 2tbsp

బేకింగ్ సోడా : ½tsp

బ్రెడ్ ముక్కలు : 1cup

నల్ల మిరియాలు : ½tbsp

ఉప్పు: రుచికి సరిపడా

వేయించడానికి నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా ఇక బౌల్ తీసుకొని అందులో చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్ మరియు పచ్చిమిర్చి వేసి, బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత మరో గిన్నె తీసుకొని అందులో శెనపిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడా, నూనె వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

3. తర్వాత మష్రుమ్ కాడలు తీసేసి, ముందుగా మిక్స్ చేసి పెట్టుకొన్న చీజ్ మిశ్రమాన్ని అందులో ఫిల్ చేయాలి.

4. ఇప్పుడు శెనగపిండి, కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో డిప్ చేసి, బ్రెడ్ పొడి దొర్లించి, కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే చీజ్ మష్రుమ్ పకోడా రెడీ. వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.

ఎగ్ బేశన్ దోసె రిసిపిని ఎలా తయారుచేద్దామో చూద్దాం…

images (46)

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 2

శెనగపిండి: 1cup

ఉల్లిపాయలు: 1(సన్నగా తరిగినవి)

టమోటో: 1(సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి: 1 లేదా 2(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

మిరియాలపొడి: 1/2tsp

పసుపు: 1/2tsp

కారం: 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు: కొద్దిగా

నూనె: సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్ పౌడర్, పసుపు, కారం, కొత్తిమీర తరుగు మరియు ఉప్పును వేసి మొత్తం మిశ్రమాన్ని స్పూన్‌తో బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి తిరిగి అదే స్పూన్‌తో మరో సారి మిక్స్ చేయాలి.

3. ఇప్పుడు అందులో రెండు గుడ్లను పగులగొట్టి పోసి ఎగ్ బీటర్‌తో బీట్ చేయాలి.

4. ఈ మొత్తం మిశ్రమం కలగలిసినప్పుడు, మరోసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి.

5. తర్వాత, ఫ్లాట్ ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి, వేడయ్యాక దాని మీద కొద్దిగా నూనె చిలకరించి తర్వాత ఈ గుడ్డు శెనగపిండి మిశ్రమాన్ని తీసుకొని పాన్ మీద పోయాలి. పోసిన తర్వాత సర్క్యులర్ మోషన్‌లో పాన్ మొత్తం సర్ధాలి(దోసెలాగే పాన్ మొత్తం సర్ధాలి).

6. ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా త్రిప్పుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి.

7.ఇలా కాలుతున్నప్పుడు అందులో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఎగ్ బేశన్ దోసె రెడీ.