Posts Tagged ‘face pack’

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బటర్ ఫేస్ ప్యాక్…

images (21)

బటర్ – పాలు : ఆయిల్ స్కిన్ కు ఉత్తమ మార్గం బటర్ ఫేస్ ప్యాక్. ఒక బౌల్ మిల్క్ లో కొద్ది బటర్ మిక్స్ చేసి , ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బటర్ – పెరుగు : బటర్ ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

బటర్ – బాదం పొడి : గుప్పెడు బాదంను పొడి చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. కొద్ది సమయంలోనే ప్రకాశవంతమైన చర్మఛాయను మీరు పొందవచ్చు.

రోజ్ వాటర్ తో బ్రిలియంట్ బ్యూటీ బెనిఫిట్స్ …

rosewater-for-dark-circles

– మేకప్ రిమూవ్ చేస్తుంది: కాటన్ ప్యాడ్ ను రోజ్ వాటర్ లో డిప్ చేసి చర్మానికి అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మర్దన చేయాలి. మేకప్ కొద్దిగా వదులైనప్పుడు ఈ ప్రొసెస్ ను రిపీట్ చేయండి. ప్రతి సారి ఫ్రెష్ గా ఉండే కాటన్ ప్యాడ్ ను ఉపయోగించాలి.

– స్కిన్ రిఫ్రెషనర్: ఒక బాటిల్లో రోజ్ వాటర్ నింపి, అందులో రెండు మూడు చుక్కల బాదం ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రిఫ్రిజరేటర్లో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి ఈ సొల్యూషన్ ను ముఖానికి స్ప్రే చేసి, నేచురల్ గా అబ్‌సార్బ్ అయిన తర్వాత టిష్యు పేపర్ తో తుడిచేసుకోవాలి.

– మేకప్ సెట్ చేసుకోవడానికి: మేకప్ వేసుకున్నప్పుడు కరెక్ట్ గా ఉంటేనే అందంగా కనబడుతారు, చివరిలో టచ్ అప్ ఇస్తేనే చూడటానికి అందంగా కనబడుతారు. అందుకోసం ఒక కప్పు రోజ్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేసి స్ప్రే బాటిల్లోకి మార్చుకోవాలి. మేకప్ వేసుకున్న తర్వాత ఈ స్ప్రే బాటిల్లో మిశ్రమాన్ని ముఖం మీద స్ప్రే చేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండాలి లేదంటే మేకప్ చెరిగిపోతుంది.

– టోనర్: ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, అందులో కాటన్ బాల్ డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ ను పిండేసి, ముఖం , మెడ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తరవ్ాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, చర్మంలో డీప్ గా వెళ్ళి మలినాలను తొలగిస్తుంది. చర్మంను కొత్తగా , హైడ్రేషన్ లోకి మార్చుతుంది.

ద్రాక్షరసం తాగండి ఆరోగ్యంగా ఉండండి.. గ్రేప్ జ్యూస్‌తో బ్యూటీ…

images (81)
గ్రేప్ తొక్కలను ముఖానికి మాస్క్‌లా వేసుకోవడం ద్వారా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో యాంటీయాక్సిడెంట్లు చర్మానికి క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది. చర్మానికి కొత్త కాంతిని ఇస్తుంది. సన్ టాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు.
కంటి కిందటి వలయాలకు చెక్ పెట్టాలంటే.. ద్రాక్ష పండ్లను కట్ చేసి ఆ రసాన్ని కంటి కింద నల్లటి వలయాలపై రాస్తే ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ ద్రాక్ష రసంతో పాటు ఒక స్పూన్ గుడ్డులోని తెల్లసొనను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌ వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం పొడిబారదు. చర్మానికి నిగారింపు సంతరించుకుంటుంది.

సమ్మర్ సన్ టాన్ నివారించే బట్టర్ మిల్క్ ఫేస్ ప్యాక్…

images (19)

ఓట్ మీల్ -3టేబుల్ స్పూన్లు,

బట్టర్ మిల్క్-1/4కప్పు,

నిమ్మరసం -2టీస్పూన్లు

పైన సూచించన పదార్థాలు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్ నేచురల్ స్కిన్ ఎక్సఫ్లోయేటర్, ఇది చర్మం మీద ఎఫెక్టివ్‌గా పనిచేసి డెడ్ స్కిన్ సెల్స్‌ను మరియు డార్క్ ప్యాచెస్‌ను తొలగిస్తుంది. చర్మంలో డెడ్ స్కిన్ లేయర్ తొలగిపోతే సన్ టాన్ మరియు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది.

అలాగే బట్టర్ మిల్క్‌లో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. ఇది స్కిన్ టైట్ చేస్తుంది. ఇంకా సన్ టాన్ మరియు పిగ్మెంటేషన్ నివారిస్తుంది. మరియు బటర్ మిల్క్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. యాంటీబ్యాక్టీరియల్ నేచురల్‌ను కలిగి ఉండటం వల్ల స్కిన్ కంప్లెక్షన్ క్లియర్ చేస్తుంది.

నిమ్మరసంలో అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దాంతో సన్ టాన్ తొలగించి స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది. స్కిన్ బ్రైట్ చేస్తుంది.

చర్మం తరచూ పొడబారిపోతుంటే సోయాపిండి, తేనె, పాలు కలిపి ముఖానికి ప్యాక్‌…

images (35)
చర్మం తరచూ పొడబారిపోతుంటే సోయాపిండిలో కొంచెం తేనె, కొద్దిగా పాలు కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారినికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గ్లోయింగ్ స్కిన్ కోసం క్యారట్, పాలతో ఫేస్‌పాక్…

images (7)

క్యారట్, పాలు కలిపిన మిశ్రమంలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలోని కణాలకు పోషణ అందిస్తుంది. అలాగే చర్మాన్ని హెల్తీగా, గ్లోయింగ్‌గా మారుస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తూ ఉండండి.

క్యారట్, పాలు మిశ్రమం మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అలాగే మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది.

పాలు, క్యారట్ రెండు చర్మానికి నూతనోత్తేజాన్నిస్తాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. స్కిన్ ఎలాస్టిసిటీ పెంచి యంగ్ లుక్‌ని అందిస్తుంది.

క్యారట్లలో ఉండే విటమిన్ C, పాలల్లో ఉండే హైడ్రేటింగ్ నేచర్ చర్మానికి మాయిశ్చరైజర్‌ని, కాంప్లెక్షన్‌ని అందిస్తాయి. అలాగే ఎల్లప్పుడూ సాఫ్ట్‌గా ఉంచడం వల్ల పొడిబారిన చర్మం నుంచి బయటపడవచ్చు.

క్యారట్స్, మిల్క్ కాంబినేషన్ న్యాచురల్ సన్ స్క్రీన్‌లా పనిచేస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే హానికారక యువీఏ, యువీబీ కిరణాల నుంచి రక్షణ కల్పించి చర్మ సమస్యలను, ట్యాన్, పిగ్మెంటేషన్‌ను నివారిస్తుంది.

వేసవిలో డ్రై స్కిన్ వారికోసం అమేజింగ్ ఫేస్ ప్యాక్స్…

images (7)

పెరుగు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. డల్ స్కిన్ నివారిస్తుంది. ఇది నేచురల్ బ్లీచ్‌గా పనిచేస్తుంది. తేనె మాయిశ్చరైజర్ మరియు చర్మాన్ని నేచురల్‌గా సాఫ్ట్‌గా మార్చుతుంది. రెండు చెంచాలా పెరుగులో 1 చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి పూర్తిగా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. అదే విధంగా 1 చెంచా పెరుగుకు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తగినంత హైడ్రేషన్ అందుతుంది.

తెల్లటి మెరిసే ముఖం కోసం ఆరెంజ్ ఫేస్ ప్యాక్…

download (21)

ఆరెంజ్ ఫేస్ ప్యాక్:

సిట్రస్ పండ్లు చర్మం తెల్లగా మార్చడంలో అద్బుతంగా పనిచెస్తాయి..ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి,ఆ పొడికి కొద్దిగా పాలు మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేసుకోవాలి..ఎండిన తరువాత చల్లని నీటి తో శుభ్రం చేసుకోవాలి..

ముఖానికి మంచి రంగు కోసం టమోటాలతో ఫేస్ ప్యాక్…

images (62)

కొన్ని టమోటోలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు, శెనగపిండి మిక్స్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ అప్లై చేసుకుంటే వారంలోనే ఫెయిర్ నెస్ లభిస్తుంది…

సమ్మర్‌లో చర్మాన్ని కూల్‌గా ఉంచే ఫ్రూటీ ఫేస్ ప్యాక్స్…

images (2)

– కుకుంబర్ ఫేస్ ప్యాక్: ఇది వండర్ ఫుల్ వాటర్ బేస్డ్ వెజిటేబుల్ చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో తక్కువగా చెమట పట్టాలంటే, కుకుంబర్ ఫేస్ ప్యాక్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి కూల్‌గా అనుభూతి కలిగిస్తుంది.

– వాటర్‌మెలోన్ ఫేస్ ప్యాక్: ఈ రెడ్ ఫ్రూట్ ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. సమ్మర్‌లో హీట్‌ను బీట్ చేయాలంటే వాటర్‌మెలోన్‌తో ఫేస్ ప్యాక్ వేసుకోండి. వాటర్‌మెలోన్ గుజ్జును ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మానికి చల్లగా ఉంటుంది. తర్వాత రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.

– ఆరెంజ్ ఫేస్ ప్యాక్: సిట్రస్ ఫేస్ ప్యాక్‌ను ఏదీ బీట్ చేయలేవు. ఎందుకంటే వీటిలో విటమిన్ C అధికంగా ఉంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చర్మంను ఫ్రెష్‌గా, చల్లని అనుభూతికి గురిచేస్తుంది. ఆరెంజ్ గుజ్జును ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆరెంజ్ జ్యూస్‌కు కొద్దిగా నిమ్మరసం జోడించి మసాజ్ చేయడం వల్ల సమ్మర్ టాన్ నివారించబడుతుంది.

– మస్క్‌మెలోన్ ఫేస్ ప్యాక్: మస్క్‌మెలోన్ ఫేస్ ప్యాక్ చర్మానికి మంచి గ్లో అందిస్తుంది మరియు స్కిన్ కంప్లెక్షన్ అందిస్తుంది. మస్క్ మెలోన్ మెత్తగా చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ పెరుగుతుంది మరియు చర్మం కూల్‌గా మార్చుతుంది.