Posts Tagged ‘fish fry’

బట్టర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ ఎలా తయారు చేయాలో చూద్దాం…టేస్టీ సైడ్ డిష్…

images (21)

కావల్సిన పదార్థాలు:

చేప ముక్కలు: 1kg

మైదా : 2tbsp

కార్న్ ఫ్లోర్: 2tbsp

వెన్న: 4tbsp

బేకింగ్ పౌడర్: 1tsp

వెలుల్లి, కొత్తిమీర తురుము : 4tbsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ ను కలపాలి.

2. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని జారుడుగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు, వాటిని పక్కన పెట్టుకోవాలి.

4. అరగంట తర్వాత నాన్ స్టిక్ పాన్ లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో చేపముక్కలు ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

5. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ రెడీ…

సౌంత్ ఇండియన్ స్టైల్ ఫిష్ ఫ్రై రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (34)

కావల్సిన పదార్థాలు:

చేపలు: 1/2kg

ఉల్లిపాయలు: 2

పచ్చిమిర్చి: 5

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp

లవంగాలు: 8

దాల్చిన చెక్క: 4

ధనియాలపొడి: 2tbsp

కారం: 2tbsp

పసుపు: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చేపలను పల్చగా కట్ చేసుకోవాలి.

2. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. తర్వాత ఈ పేస్ట్‌లో కారం, ఉప్పు, పసుపు, ధనియాలపొడి కలిపి పలుచగా కట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను రెండు వైపులా ఈ మసాలాను పట్టించాలి.

4. మసాలా పట్టించిన ఈ చేప ముక్కలను 2,3గంటలు మారినేట్ చేసుకోవాలి.

5. పాన్‌లో నూనె పోసి బాగా కాగిన తర్వాత మారినేట్ చేసిన చేపముక్కలను నూనెలో వేసి రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వేయించుకోవాలి.

6. ఇలా అన్ని ముక్కలు వేయించి, సర్వింగ్ ప్లేట్‌లోకి మార్చుకొన్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది.

కరకరలాడే రుచికరమైన షిఫ్ చిప్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (24)

కావల్సిన పదార్థాలు:

చేపలు – 5 to 6

కారం – 1 teaspoon

బేకింగ్ పౌడర్ – 3/4th teaspoon

సోడా లేదా వైన్- 1 cup

మైదా- 1 tablespoon

కార్న్ ఫ్లోర్ – 1 tablespoon

నూనె: సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పిండిని తయారుచేసుకోవాలి. అందుకోసం మైదా, కారం, బేకింగ్ పౌడర్‌ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులో సోడా లేదా వైన్ వేసి మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి.

3. మొత్తం మిశ్రమం ఒక 20నిమిషాలు చల్లగా అవ్వనివ్వాలి.

4. తర్వాత అందులో ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

5. తర్వాత కార్న్ ఫ్లోర్ మరియు మైదాను ఒక ప్లేట్ లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకొన్న చేప ముక్కల మీద మైదా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని చిలకరించాలి.

7. ఇప్పుడు ఈ చేప ముక్కలను సోడా లేదా వైన్ మిశ్రమంలో డిప్ చేయాలి.

8. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగిన తర్వాత డిప్ చేసిన చేపముక్కలను కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

9. అంతే క్రిస్పీ ఫిష్ ఫ్రై రిసిపి రెడీ. వీటిని వేడి వేడిగా స్పైసీ సాస్ మరియు చిప్స్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.