Posts Tagged ‘Fruits’

డైట్ లో చేర్చుకోవాల్సిన సూపర్ హెల్తీ ఫుడ్స్…

images (12)

గుడ్లు: కోడి గుడ్డులో మినరల్స్‌, రైబోఫ్లెవిన్‌ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుడ్డును కానీ, ఆమ్లెట్‌ను గానీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

క్యారెట్స్‌: క్యారెట్స్ ఎవర్ గ్రీన్ హెల్తీ వెజిటబుల్ అని మనందరికీ తెలుసు. కానీ వీటిని తినడానికి మాత్రం కొంతమందే ఇష్టపడతాు. కళ్లకు మేలు చేయడంలో క్యారెట్‌కు మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్‌ A కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు బీటా-కెరటీన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా క్యారెట్స్ లో లభిస్తాయి. అలాగే ఖనిజలవణాలు, ఫైబర్‌ క్యారెట్స్ నుంచి పొందవచ్చు.

వెల్లుల్లి: వెల్లుల్లి రుచి దాదాపు ప్రతి కూరలు, చారుల్లోనూ దట్టిస్తారు. కానీ ఆహారం తినేటప్పుడు వీటిని పక్కనపెట్టేవాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ ఇది తినడం వల్ల రుచి మాత్రమే కాదు ఆరోగ్యమూ బాగుంటుంది. ఇందులో ఉండే విటమిన్ B, Cతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారించడానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటు, కార్డియోవాస్కులర్‌ డీసీజ్‌లను నివారించే శక్తి ఉంది.

క్యాబేజ్‌: క్యాబేజ్ అంటే చాలామంది నో చెప్పేస్తారు. కానీ ఇందులో ఉండే లో సాచురేటెడ్‌ ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌ శరీరానికి ఎంతో అవసరం. క్యాబేజ్‌ నుంచి ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ పొందవచ్చు. హార్ట్‌‌రేట్‌ను, రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో, క్యాబేజ్‌ వల్ల లభించే పాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ కీలకపాత్ర పోషిస్తాయి.

పాలు: పాల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలలో ఉండే ఐరన్‌, కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్స్‌ మరియు ప్రోటీన్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న వేరే ఆహార పదార్థం మరొకటి లేదు.

ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ శుభ్రంగా వాష్ చేయడానికి సులభ చిట్కాలు…

 

images (17)

హానికర బ్యాక్టీరియాను తొలగించడానికి ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ను శుభ్రపరచడానికి కొన్ని సులభ చిట్కాలు

1. మొదట చేతులను శుభ్రపరచుకోవాలి. భయట నుండి తెచ్చిన ఎటువంటి ప్రోడక్ట్స్ నైనా ముట్టుకోవడానికి ముందుగా, వాటిని ముట్టుకొన్న తర్వాత చేతులు శుభ్రపరచుకోవడం మర్చిపోకూడదు .

2. అన్ని రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ ను వాటిని విగియోంచడానికి , తినడానికి లేదా వండటానికి ముందు జోరుగా నీళ్ళు వచ్చే ట్యాప్ క్రింద పెట్టి శుభ్రం చేయడం మంచిది. నీళ్ళు చిలకరించి కడగడం కంటే దారాళంగా వచ్చే నీటి క్రింద శుభ్రం చేయడం ముఖ్యం. వాటిని శుభ్రం చేయడానికి ఎటువంటి సోపులు, డిటర్జెంట్లు ఉపయోగించాల్సి అవసరం లేదు. నీటితో మాత్రమే శుభ్రం చేయాలి.

3. నీటిలో బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని తడి ఆరిపోయే వరకూ పొడిగా ఉన్న న్యూస్ పేపర్ లేదా పేపర్ టవల్ లేదా క్లీన్ గా ఉన్న పొడి వస్త్రంతో తుడవాలి ఇలా చేయడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా అయినా తొలగిపోతుంది.

కరెంట్ కట్ తర్వాత ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం తీసుకోవచ్చా…?

images (38)
కరెంట్ పోయిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసి వుంచిన ఆహారం తీసుకోవచ్చా.. అనే ప్రశ్నకు న్యూట్రీషన్లు ఏమంటున్నారంటే.. కూరగాయలు, పండ్లు, ఉడికించిన ఆహారాన్ని ఒక్క రోజు మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. అనేక రోజులు అలాగే ఉంచి వేడి చేసి తినడం అనారోగ్యానికి దారితీస్తుంది.
అలాగే పవర్ కట్‌తో చల్లదనం కోల్పోయే ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా సులువుగా వ్యాపిస్తుంది. మళ్లీ పవర్ వచ్చినా ఆ ఆహారంలో నాణ్యత కోల్పోతుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడాన్ని తగ్గించండి. నాన్ వెజ్‌లో వచ్చే బ్యాక్టీరియాలు ఉదర సంబంధిత రోగాలకు దారి తీస్తుంది.
అలాగే కూరగాయల్ని కట్ చేసి అలానే ఉంచకుండా ఒక కవర్లో భద్రపరచి ఉంచడం మేలు. ఏ వస్తువునైనా ఒకరోజుకు పైగా ఫ్రిజ్‌లో ఉంచకండి. ఇడ్లీ పిండి వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచకండి. 48 గంటల్లోపే ఉపయోగించండి.
ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడిచేసి మళ్లీ దానిని ఫ్రిజ్‌లో పెట్టకుండా చూసుకోండి. వీటికన్నింటికీ పరిష్కారం కావాలంటే మితంగా వండుకుని తినడం ఫ్రిజ్‌ను తక్కువగా వాడటం ఎంతో మేలని న్యూట్రీషన్లు అంటున్నారు.

మీ డైట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన ప్రొటీన్ రిచ్ ఫుడ్స్…

download (2)

– మాంసాహారం: మేక, గొర్రె వంటి మాంసాహారాల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిమిట్‌గా తీసుకోవాలి. అలాగే స్కిన్ లెస్ చికెన్ తినడం వల్ల కూడా ప్రొటీన్స్ పొందవచ్చు. అలాగే కోడిగుడ్లు కూడా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ పొందవచ్చు.

– చేపలు: చేపల్లో గుండెకు మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ట్యూనా, సార్డీన్, ట్రాట్ వంటి చేపలు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రొటీన్స్ పొందవచ్చు. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది.

– నట్స్: బాదాం, పిస్తా, ఆక్రోట్ వంటి నట్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోవాలి. అయితే లిమిట్‌గా తీసుకోవడం మంచిది. వీటిని సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకుంటే టేస్ట్‌తో పాటు, కావాల్సిన ప్రొటీన్స్ అందుతాయి.

– డైరీ ప్రొడక్ట్స్: కండరాల నిర్మాణానికి సహాయపడే ప్రొటీన్స్ డైరీ ప్రొడక్ట్స్ ద్వారా పుష్కలంగా లభిస్తాయి. మధుమేహం, గుండె జబ్బు, రక్తపోటు తగ్గడానికి ఇవి గ్రేట్‌గా సహాయపడతాయి. అయితే కొవ్వు తీసేసిన పాలు తీసుకోవడం చాలా మంచిది.

– వెజిటబుల్స్: పచ్చి బఠాణీలు, రాజ్మా గింజలు, చిక్కుళ్లు వంటి వాటిల్లో ప్రొటీన్స్ లభిస్తాయి. వీటిని వారంలో కనీసం ఒకసారైనా డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందిస్తాయి.

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకోండి…

images (60)
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకోండి! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో మొదటిది దానిమ్మపండు. దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడాంట్స్ సమృద్ధిగా ఉండటం వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారాలుగా ఉన్నాయి.
అలాగే యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు E, B మరియు C ఉంటాయి. ఈ మూలకాలు అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి.
ఇకపోతే.. ద్రాక్షపండులో ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఇవి ఊపిరితిత్తుల్లో కణితుల పెరుగుదలను నిరోధిస్తాయి.
అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. పొగతాగేవారికే ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇవి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి.
క్యారెట్లు శ్వాస సమస్యలు నిరోధించడానికి సహాయం చేసే అద్భుతమైన ఆహారాలలో ఒకటి. దీనిలో A, C విటమిన్స్ సమృద్దిగా ఉంటాయి. ఈ రెండు విటమిన్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఆరోగ్యానికి మొదటి మెట్టు ఉదయం తీసుకునే అల్పాహారం…

images (32)

వివిధ కారణాల వలన ఈ రోజుల్లో ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా తక్కువైపోయింది. కాని మన శరీర ఆరోగ్యానికి ప్రధానంగా దోహద పడే ఆహారం ఉదయం తీసుకునే అల్పాహారం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం మరువ కూడదు.

అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డు మొదలైన ప్రొటీన్‌లు కలిగి ఉండే ఆహారంగా తీసుకుంటే ఉత్తమం.

మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ఉపయోగపడుతుంది. వారికి అల్పాహారం ఇచ్చేటపుడు బలవంతంగా కాకుండా, నిదానంగా ఇవ్వాలి.

ఇంట్లో ఉండే ఔషధాలతో బెల్లీఫాట్‌కు చెక్ పెట్టండి.

images (2)

చిన్న చిన్న చిట్కాలను పాటించి ఇంట్లో ఉండే ఔషధాలతో బెల్లీఫాట్‌ను తగ్గించుకోవచ్చు.

1. రోజును నిమ్మరసంతో ప్రారంభం: ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగాలి. బెల్లీఫాట్‌ను కరిగించడంలో ఇది చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.

2. తెల్ల అన్నంకి దూరం: తినే ఆహారంలో సాధ్యమైనంత వరకు తెల్ల అన్నాన్ని దూరంగా ఉంచాలి. తెల్ల అన్నంకి బదులుగా గోధుమ రంగు అన్నం (బ్రౌన్‌రైస్), బ్రౌన్ బ్రెడ్, ఓట్స్ లాంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.     

3. చక్కెర పదార్దాలకు దూరం: వీలైనంతవరకు చక్కెర పదార్దాలకు, పానీయాలకు మరియు తీపి వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.

4. ఎక్కువ నీటిని త్రాగడం: రోజులో కొంత కొంత విరామంతో నీటిని ఎక్కువగా త్రాగడం వలన బెల్లీఫాట్‌ను నివారించవచ్చు.

5. వెల్లుల్లి రెబ్బలను నమలడం: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తీసుకునే ముందు 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను నమలడం వలన శరీర రక్తప్రసరణను సాఫీగా జరిగేలా చేసి అనవసర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

6.  పండ్లు మరియు కూరగాయలతో: రోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక గిన్నె నిండా పండ్లు లేదా కూరగాయలు తినాలి.

ఎదిగే పిల్లలకు అందివ్వాల్సిన హెల్తీ ఫ్రూట్స్…

images (16)

బొప్పాయి: బొప్పాయి బేబీస్‌కు చాలా గ్రేట్ ఫుడ్. ఎందుకంటే ఇందులో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలకు చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా వారి ఎదుగుదలకు డైలీ డైట్‌లో అందివ్వాల్సి ఉంటుంది. ఇందులో ఉండే సోలబుల్ ఫైబర్ బేబీలో మలబద్దకం నివారించి సులభంగా మోషన్ అయ్యేందుకు సహాయపడుతుంది.

ఆపిల్: ఆపిల్స్ బెస్ట్ ఫుడ్. బేబీ ఆరోగ్యంగా పెరగడానికి ఆపిల్స్‌లో ఉండే పెక్టిన్ మరియు ఇతర విటమిన్స్ మరియు మినిరల్స్ ఎంతగానో సహాయపడుతాయి.

అవొకాడో: అవొకాడోను బేబీ డైట్‌లో చేర్చడం వల్ల , అన్ శాచ్యురేటెడ్ ఫయాట్స్‌ను నేచురల్‌గా కలిగి ఉండటం వల్ల ఇది బేబీ ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతాయి. అవొకాడో తినిపించడం వల్ల పిల్లలో ఙ్ఞాపకశక్తి మరియు మెమరీ ఫంక్షన్ మెరుగ్గా ఉంటుంది.

అరటి: అరటి పండ్లలో కార్బోహైడ్రేట్స్ మరియు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బౌల్ మూమెంట్ సరిగా అయ్యేందుకు సహాయపడుతుంది. అంతే కాదు ఇది చాలా సాఫ్ట్‌గా ఉండటం వల్ల పిల్లలకు ఇది ఒక ఫర్ఫెక్ట్ ఫుడ్‌గా చెప్పవచ్చు.

ఫ్రూనే: ఫ్రూనేలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మరియు ఇది బౌల్ సమస్యలను నివారించడంలో మరియు మలబద్దకం నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. ప్రూనేను ఆపిల్స్‌తో జోడించి మ్యాష్ చేసి అందివ్వొచ్చు.

సమ్మర్‌లో చర్మాన్ని కూల్‌గా ఉంచే ఫ్రూటీ ఫేస్ ప్యాక్స్…

images (2)

– కుకుంబర్ ఫేస్ ప్యాక్: ఇది వండర్ ఫుల్ వాటర్ బేస్డ్ వెజిటేబుల్ చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో తక్కువగా చెమట పట్టాలంటే, కుకుంబర్ ఫేస్ ప్యాక్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి కూల్‌గా అనుభూతి కలిగిస్తుంది.

– వాటర్‌మెలోన్ ఫేస్ ప్యాక్: ఈ రెడ్ ఫ్రూట్ ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. సమ్మర్‌లో హీట్‌ను బీట్ చేయాలంటే వాటర్‌మెలోన్‌తో ఫేస్ ప్యాక్ వేసుకోండి. వాటర్‌మెలోన్ గుజ్జును ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మానికి చల్లగా ఉంటుంది. తర్వాత రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.

– ఆరెంజ్ ఫేస్ ప్యాక్: సిట్రస్ ఫేస్ ప్యాక్‌ను ఏదీ బీట్ చేయలేవు. ఎందుకంటే వీటిలో విటమిన్ C అధికంగా ఉంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చర్మంను ఫ్రెష్‌గా, చల్లని అనుభూతికి గురిచేస్తుంది. ఆరెంజ్ గుజ్జును ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆరెంజ్ జ్యూస్‌కు కొద్దిగా నిమ్మరసం జోడించి మసాజ్ చేయడం వల్ల సమ్మర్ టాన్ నివారించబడుతుంది.

– మస్క్‌మెలోన్ ఫేస్ ప్యాక్: మస్క్‌మెలోన్ ఫేస్ ప్యాక్ చర్మానికి మంచి గ్లో అందిస్తుంది మరియు స్కిన్ కంప్లెక్షన్ అందిస్తుంది. మస్క్ మెలోన్ మెత్తగా చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ పెరుగుతుంది మరియు చర్మం కూల్‌గా మార్చుతుంది.

దూద్ డులరీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (40)

కావల్సిన పదార్థాలు:

పాలు – 2 ltr

కండెన్స్డ్ మిల్క్ (వెన్న తీసిన పాలు): ½ cup

మొక్కజొన్న పిండి – 1tsp

సేమియా: ½cup

స్ట్రాబెర్రీ జెల్లీ – 50grm

గ్రీన్ జెల్లీ – 50grms

రబ్రి – 250grms

తాజా క్రీమ్ – 200grms

మిక్స్ ఫ్రూట్ కాక్ టైల్: 200ml

చం చం – 250gm

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్‌లో పాలు పాసి బాగా వెన్న మీగడ పట్టేలా మరిగించాలి.

2. పాలు బాగా మరిగిన తర్వాత అందులో సేమియా, కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేయాలి(కార్న్ ఫ్లోర్‌ను ముందుగా చల్లటి పాలలో వేసి మిక్స్ చేయాలి)

3. ఇప్పుడు అందులోనే కండెన్స్డ్ మిల్క్, ఫ్రూట్ కాక్ టైల్ మరియు పంచదార వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. తర్వాత చల్లరనివ్వాలి .

4. తర్వాత అందులోనే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, చమ్ చమ్ మరియు రబ్రిని మిల్క్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.

5. ఒక ప్లేట్‌లో కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసి, అందులో జెల్లి వేసి కరిగించుకోవాలి. పక్కన పెట్టడం వల్ల ఇది చిన్న చిన్న క్యూబ్‌గా సెటిల్ అవుతుంది.

6. ఇలా అయిన జెల్లీని మిల్క్ మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

7. దూద్ డులరి రిసిపి రెడీ. చల్లగా చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.