Posts Tagged ‘furniture’

డైనింగ్ టేబుల్ ను అందంగా సర్దేద్దాం ఇలా…

images (34)

మీ డైనింగ్‌ టేబుల్‌ శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు…

1. మీ డైనింగ్‌ టేబుల్‌ డిజైన్‌కి తగ్గ క్లాత్‌ని సెలెక్ట్‌ చేసి దానిమీద వేస్తే డైనింగ్‌టేబుల్‌ అందంగా కన్పిస్తుంది. కాబట్టి మంచి డిజైన్‌ ఉన్న క్లాత్‌ని ఎంపిక చేసుకోవాలి.

2.వంటింట్లో వండిన పదార్థాలు టేబుల్‌పైన పెట్టే ముందు చిన్న స్టీల్‌స్టాండ్‌ను టేబుల్‌పైన ఉంచి వాటిపైన ఆ పదార్థాల పాత్రల్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల టేబుల్‌పైన ఎలాంటి గీతలు పండేందుకు అవకాశం ఉండదు.

3. ఉదయం టిఫిన్‌ ఐటెమ్స్‌ చట్నీ, హాట్‌బాక్స్‌లో ఇడ్లీలు, వేరేవి ఏవైనా ఉంటే వాటిని నీట్‌గా టేబుల్‌పైన సర్దాలి.

4. కుటుంబ సభ్యులు తినే టైంలోనే ప్లేట్లు, నీళ్లగ్లాసులు ఉంచాలి. తిన్నవెంటనే ఆ సామాన్లు తోమేందుకు వేసేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ తినేసిన కంచాలు, ప్లేట్లను టేబుల్‌పైన ఉంచకూడదు.

5. డైనింగ్‌ టేబుల్‌ పై అన్ని వస్తువులు తీసేసి సబ్బునీళ్లలో తడిపిన బట్టతో లేదా స్పాంజ్‌తో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడిబట్టతో తుడవాలి.

6. ఈ రోజుల్లో చిన్నగ్లాస్‌లో నీరు పోసి పెంచే మొక్కల్ని డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకుంటున్నారు. మీకు అలాంటి టేస్ట్‌ ఉంటే అందంగా అలంకరించుకోండి. అయితే ఒక్క సంగతి మాత్రం మరువకండి. ప్లాంట్‌లో పోసిన నీటిని రోజు విడిచి రోజు మార్చాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల మీ డైనింగ్‌ టేబుల్‌ ఎంతో అందంగా కన్పిస్తుంది. అంతేకాదు మీ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

ఫర్నీచర్‌కు చెదులు పట్టకుండా ఉండాలంటే…

download (26)

ఫర్నీచర్‌కు చెదులు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్‌ను సమపాళ్లలో తీసుకుని రెండింటినీ కలపాలి. ఈ మిశ్రమంతో ఫర్నిచర్‌ను తుడిస్తే సమస్య తగ్గుతుంది.

పాత ఫర్నిచర్ లో ఉన్న చెదపురుగులని నియంత్రించడం ఎలా…

images (2)

మీ పాత ఫర్నిచర్ లో చెదపురుగుల ముట్టడిని ఆపడానికి మరియు చెదపురుగులని నియంత్రించడం  గురించి తెలుసుకుందాం.

1. మీరు మీ పాత ఫర్నిచర్ లో చెదపురుగుల ముట్టడి ఉన్నప్పుడు, మీరు వాటికీ సూర్యరశ్మి తగిలేలా ఉంచాల్సిన అవసరం ఉంది. పాత ఫర్నిచర్ ను 4 గంటల పాటు సూర్యకాంతిలో ఉంచితే, చెదపురుగుల సమస్యను వదిలించుకోవటానికి సహాయం చేస్తుంది.

2. వేప, చెదపురుగులను నియంత్రించడానికి మంచి ఔషధాలలో ఒకటి.

3. ఉప్పు అనేది మీ పాత ఫర్నిచర్ లో ఉండే చెదపురుగులని చంపడానికి ఉపయోగించే మరొక పరిష్కారం.

4. చెదపురుగుల గూళ్ళలో కొద్దిగా కారం చల్లడం ద్వారా మీ పాత ఫర్నిచర్ ను చెదపురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. ఇది చెదపురుగులను వేగంగా చంపుతుంది.

5. చెదపురుగులకు చేదు వాసన అంటే ద్వేషం. అందువలన, మీరు చెదపురుగుల గూడు దగ్గర కొద్దిగా కాకరకాయ రసం చల్లాలి. ఇది కూడా చాలా ప్రభావవంతముగా పనిచేస్తుంది.

ఇంటి అందాన్ని, అలంకరణను పెంచే వాల్ క్లాక్స్…

download (26)

ఇంటికొచ్చిన అతిథుల చూపులను కట్టిపడేయాలనుకుంటే వాకిలికి ఎదురుగా లేదా లివింగ్‌ రూమ్‌లో పెద్ద రస్టిక్‌ క్లాక్‌ను ఏర్పాటు చేయాలి. ఆకారంలో పెద్దదిగా ఉండి అంకెలు కూడా స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఫ్లోటింగ్‌ నంబర్స్‌, మోనోక్రొమాటిక్‌ కలర్‌ స్కీమ్‌ కలిగి ఉండే క్లాక్‌లు లివింగ్‌ రూమ్‌లో చక్కగా ఇమిడిపోతాయి. అయితే ఇలాంటి డెకరేటివ్‌ క్లాక్‌ గదిలోని ఫర్నిచర్‌ను డామినేట్‌ చేసేలా ఉండకుండా చూసుకోవాలి. గదిలోని మిగతా వస్తువులతో మ్యాచ్‌ అయ్యేలా ఉండాలి. ఇతర ఆర్ట్‌ పీస్‌లు, ఫొటోగ్రా్‌ఫలు ఏవీ లేకుండా ఖాళీగా ఉండే గోడ మీద ఓవర్‌సైజ్‌ రెట్రో క్లాక్‌ను అమరిస్తే లివింగ్‌ రూమ్‌ మరింత ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.

ఇంటి ఆందానికి, ఆకర్షణకి టీపాయ్ అలంకరణ ఎలా ఉండాలంటే…

download (3)

ఎవరైన ఇంటికి రాగానా ముందుగా అడుగు పెట్టేది హాల్లోనే. అతిథులకు స్వాగతం లభించేది ఇక్కడే. కొన్ని కొన్ని సమయాల్లో మనం రిలాక్స్ అవ్వాలంటే హాలే మంచి ప్లేస్. మరి అలాంటి హాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనబడాలంటే కుర్చీలు, సోఫాలు, దీవాన్లు, కార్పెట్లు, ఫోటో ఫ్రేమ్ లు ఇవే కాదు ఉండాల్పింది. వీటితో పాటు ఒక టీపాయ్ దానీ మీద ఓ ప్లవర్ వాజ్, పక్కనే న్యూస్ పేపర్ లేదా వీక్లీ మ్యాగజైన్స్. వచ్చిన అథితులకు రిలాక్స్ అవ్వడానికి, బోరుకొడితే చదువుకోవడానికి ఉపయోగపడుతాయి.

టీపాయ్ అలంకరణలోనూ ఇంటి అందం ముడిపడి ఉంది. చూడటానికి చిన్న సైజులో ఉన్నా దీని ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. టీ సర్వ్ చేయడానికి. పేపర్, మ్యాగజైన్ పెట్టుకోవడానికి, ఇంటి ఆకర్షణలో ఫవర్ వాజులు నింపుకోవాడానికి ఇలా ఎన్నో ఉపయోగాలున్న టీపాయ్ ఎలా ఉండాలంటే..

టీ టేబుల్‌ ను రౌండ్ టేబుల్‌ లా ఏర్పాటు చేసుకొంటే చాలా బాగుంటుంది. దానికి సరిపడా ఓ అద్దాన్ని కట్ చేయించి. ఆ టేబుల్ పైన చక్కటి ముదురు రంగు మఖమల్ వస్త్రాన్ని పరిచి దానిపైన మీకు నచ్చిన జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను ఒకదాని పక్కన ఒకటి పరచాలి. ఆ పైన అద్దాన్ని టేబుల్‌ కి బిగించుకోవచ్చు. అందులో పొందుపరచిన ఫోటోలు తాలూకు అందమైన జ్ఞాపకాలను తలచుకుంటూ హాయిగా టీని సేవించి చూడండి. అందులో ఎంత హాయి దాగుంటుందో తెలిసిపోతుంది.

టీపాయ్ ల్లో కూడ విభిన్న రకాలు ఉన్నాయి. వాటిలో రెండు కాళ్ళు, మూడుకాళ్ళు, నాలుగు కాళ్ళున్నవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీపాయ్ రెండు అరలుగా ఉంటే టీపాయ్ మీద తాజాపువ్వులు అలంకరించిన ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే చాలు. క్రింది అరలో న్యూస్ పేపర్ పెట్టుకొంటే చూడటానికి అందంగా ఉంటుంది. అన్ని ఒకే చోటులేకుండా సపరేట్ గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి టీ పాయ్ కొనేటప్పుడు ఇంట్లో లభించే స్థలంను బట్టి చిన్నసైజ్ పెద్ద సైజు వంటి టీపాయ్ లను ఎంపిక చేసుకొని మరీ కొనాలి.