Posts Tagged ‘green chilli’

మీల్ మేకర్ బిర్యాని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

download (5)

బియ్యం : 1cup

నెయ్యి : 2tsp

లవంగాలు,చెక్క,యాలుకలు,బిర్యనిఆకు :రెండు రెండు చొప్పున తీసుకోవాలి.

మీల్ మేకర్ : 1/2cup

ఉప్పు : తగినంత

పుదినా : ఒక కట్ట

కొత్తిమీర : ఒక కట్ట

బిర్యానీ మసాలా : 1tsp

ఉల్లి ,పచ్చిమిర్చి ముక్కలు : 1/2cup

తయారుచేయు విధానం :

1. ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. మీల్ మేకర్ వేడినీళ్ళల్లోవేసి ఒక నిముషం ఉంచి నీళ్ళు పిండి పక్కనపెట్టాలి.

3. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

4. నెయ్యి వేడి అయ్యిన తరువాత చెక్క, లవంగాలు, యలుకులు, బిర్యానీఆకు వేసి వేయించుకోవాలి.

5. అవి వేగాక పుదినా, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.

6. తరువాత పక్కన పెట్టిన మిల్ మేకర్ వేసి కాసేపు వేయించి కడిగి నానబెట్టిన బియ్యం వేసి ఒక సారి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి దానిలో ఉప్పు, బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి.

7. కాసేపటికి బిర్యానీ రెడి అవ్వుతుంది. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి దీనిలో కొత్తిమీర వేసి మూత పెట్టాలి. అంతే సర్వ్ చెయ్యటానికి మిల్ మేకర్ బిర్యానీ రెడి.

పాలక్ చపాతీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (1)

పాలకూర: 200grm

గోధుమపిండి: 2 cups

వెల్లుల్లి రెబ్బలు: 3-4

పచ్చిమిర్చి: 5-10

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా కొన్ని పాలకూరను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు చిలకరించి బాయిల్ చేయాలి. ఆకుకూర మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.

2. 10 నిముషాల ఉడికించుకొన్న తర్వాత, మూత తీసి ఎక్సెస్ వాటర్‌ను తొలగించాలి. ఆకు కూర చల్లగా మారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. పాలకూరతో పాటు అల్లం మరియు పచ్చిమిర్చి కూడా వేసి నీళ్లు పోయకుండా పేస్ట్ చేయాలి.

4. ఇప్పుడు బౌల్ తీసుకొని, గోధుమపిండి, ఉప్పు వేసి మిక్స్ చేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి.

5. తర్వాత పిండిలోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఆకుకూరను కూడా వేసి మొత్తం పిండిని చపాతిల పిండిలా కలుపోవాలి. సరిపడేంత నీరు మాత్రమే వేసి కలుపుకోవాలి. 10నిముషాలు పక్కన పెట్టాలి.

6. 10 నిముషాల తర్వాత పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతీల్లా రోల్ చేసుకోవాలి.

7. ఇలా అన్ని చపాతీలను చేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి చపాతీలను ఒక్కొక్కటి వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే పాలక్ చపాతీ రెడీ.

8. ఈ చపాతీలను సర్వింగ్ ప్లేట్‌లోకి మార్చుకొని మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేయాలి.

పాలక్ పన్నీర్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం…

maxresdefault

కావల్సిన పదార్థాలు:

తరిగిన పాలకూర: 1cup

పన్నీర్ తురుము: 1/2cup

తరిగిన ఉల్లిపాయలు: 1/2cup

వెల్లుల్లి పేస్ట్: 1/2tsp

అల్లం పేస్ట్: 2tsp

తరిగిన పచ్చిమిర్చి ముక్కలు: 2tsp

ఆలివ్ ఆయిల్: 2tsp

ధనియాలు: 1tsp

పంచదార: 1tsp

నిమ్మరసం: 2tsp

వేరుశెనగ: 2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ స్టౌమీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి కొన్ని నిముషాల పాటు వేగించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో పాలకూర తరుగును, పన్నీర్ తరుగును కూడా వేసి బాగా వేగించుకోవాలి.

2. అంతకంటే ముందు వేరుశనగలు వేయించి సిద్దంగా ఉంచుకోండి.

3. తర్వాత ఒక కప్పు పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ పంచదార, 1కప్పు పాలు, అర స్పూన్ ఈస్ట్, 1/2 ఉప్పు, మూడు స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకుని పిండి ముద్దను మూడు నాలుగు గంటల పాటు వదిలేయండి.

4. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న రోటీలా తయారుచేయండి.

5. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కర్రీని రోటీలో పెట్టి నాలుగు వైపులా మూసేసి మరిగే నూనెలో వేసి వేయించండి. అంతే తినడానికి పాలక్ పఫ్ రెడీ.

స్పైసీ అండ్ టేస్టీ ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (16)

కావల్సిన పదార్థాలు:

చికెన్ – 500 g

ఉల్లిపాయలు – 2 cups (finely chopped)

టమోటో – 1 cup (finely chopped)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 teaspoon

పచ్చిమిర్చి – 5 to 6

పెరుగు – 1 cup

కారం – 1/2 teaspoon

నూనె: తగినంత

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

2. నూనె వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

3. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.

4. టమోటో మెత్తబడే వరకూ 10 నిముషాలు వేగించుకోవాలి.

5. మరో పాన్‌లో ఆయిల్ వేసి, చికెన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.

6. పది నిముషాల తర్వాత ముందుగా వేపుకుంటున్న పోపులో చికెన్ ముక్కలను ట్రాన్స్ ఫర్ చేయాలి. మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు అందులోనే పెరుగు, కారం వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం చిక్కగా మారే వరకూ ఉడికించుకోవాలి. అంతే ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి రెడీ.

బ్రెడ్ సమోసా ఎలా తయారుచేయాలో చూద్దాం… మాన్‌సూన్ స్పెషల్…

450245-samosa

కావలసిన పదార్థాలు:

వైట్ బ్రెడ్: 8 (పెద్ద స్లైసులు, చివర్లు తీసేయాలి)

నూనె: 2btsp

ఉల్లితరుగు: 1/2cup

వెల్లుల్లి తరుగు: 1tsp

ఎండుమిర్చి: 3

పచ్చిమిర్చి తరుగు: 2tsp

బంగాళదుంప: 1 (పెద్దది, ఉడికించి, తొక్క తీసి, చిన్నచిన్నముక్కలుగా చేయాలి)

ఉడికించిన బఠాణీ: 50grms

ధనియాల పొడి: 2tsp

కొత్తిమీర తురుము: 2tbsp

డీప్ ఫ్రైకోసం నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లితరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.

2. తర్వాత బంగాళదుంప ముక్కలు, బఠాణీ, ధనియాలపొడి వేసి బాగా మెత్తగా అయ్యేలా కలిపి, రెండు నిముషాలు ఉడికించాలి.

3. ఇప్పుడు కిందకు దించి ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తురుము వేసి కలపాలి.

4. తర్వాత బ్రెడ్ స్లైసులు ఫ్లాట్‌గా అయ్యేలా అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి.

5. ఉడికించుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, బ్రెడ్ పీస్ మీద ఉంచి పైన మరో పీస్ ఉంచి, అంచులను నీటితో తడుపుతూ అంతా మూసుకునేలా సమోసా ఆకారంలో జాగ్రత్తగా మూయాలి.

6. ఇలా అన్నింటినీ తయారు చేసుకొన్నతర్వాత స్టౌ మీద పాన్ ఉంచి నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి వేయించాలి.

7. బంగారురంగులోకి వచ్చాక తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి. తర్వాత నూనె అంత ఇమిరిపోయాక వేడి వేడిగా సర్వ్ చేయాలి.

కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ (గోబీ ఫ్రైడ్ రైస్) ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (4)

కావల్సిన పదార్థాలు:

బాస్మతి రైస్: 2cups(వండిపెట్టుకోవాలి)

కాలీఫ్లవర్: 1/2పువ్వు(విడిపించి లేదా కట్ చేసి పెట్టుకోవాలి)

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

జీలకర్ర: 1/2tbsp

కారం: 1/2tbsp

పసుపు: 1/4tsp

దాల్చిన చెక్క: కొద్దిగా

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. వేడి అయ్యేక అందులో జీలకర్ర, దాల్చిన చెక్క మరియు లవంగాలు వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

2. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి.

3. పోపు వేగిన తర్వాత అందులో కారం, పసుపు, మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.

4. తర్వాత అందులోనే కాలీఫ్లవర్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేస్తూ మీడియం మంట మీద 10నిముషాలు వేగించుకోవాలి.

5. గోబీ గోల్డ్ బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

6. గోబీ మెత్తగా మారిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే 5-6నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.అంతే గోబీ రైస్ రిసిపి రెడీ.

బంగాళదుంప-పెసరపప్పు పకోడా ఎలా తయారుచేయాలో చూద్దాం…

7230796057659388f7bbbdf981274fa3

కావల్సిన పదార్థాలు:

మూంగ్ దాల్(పెసరపప్పు): 1cup

బంగాళ దుంపలు : 2(ఉడికించిన)

ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా కత్తిరించాలి)

పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

అల్లం: 1tbsp(తురుముకోవాలి)

కొత్తిమీర: 1tsp(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

జీలకర్ర(zeera): 1tsp

ఇంగువ (హింగ్):  చిటికెడు

బేకింగ్ సోడా: చిటికెడు

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా పెసరపప్పును నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం నీరు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2. తర్వాత బంగాళదుంపలను ఉడికించుకొని, చిదిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి మెత్తగా చేసుకొన్న బంగాళదుంప, గ్రైండ్ చేసుకొన్న పెసరపప్పు, మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

3. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని పకోడాలా గుండ్రంగా చేసుకోవాలి.

4. ఇప్పడు స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో గుండ్రంగా చుట్టుకొన్న పకోడాలను వేసి, అతి తక్కువ మంట మీద పకోడాలను వేగించుకోవాలి.

5. పకోడా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకొని, పక్కకు తీసి, పేపర్ టవల్ మీద వేసి అదనపు నూనెను తీసివేయాలి.

6. ఈ వేడి వేడి మూంగ్ దాల్ ఆలూ పకోడాను వేడి వేడిగా పుదీనా చట్నీ లేదా కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే మూంగ్ దాల్ ఆలూ పకోడా రెడీ. వర్షాకాలంలో ఒక కప్పు వేడి వేడి కాఫీ లేదా టీ తో పకోడాను సర్వ్ చేయండి.

హెల్తీ అండ్ టేస్టీ పనీర్ చీజ్ బాల్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (13)

కావల్సిన పదార్థాలు:

పనీర్ – 500 g (grated)

చీజ్ – 1 cup (grated)

ఉల్లిపాయలు – 1 cup

పచ్చిమిర్చి – 4 to 5

బ్రెడ్ పొడి – 1/2 cup

బంగాళదుంపలు – 1/2 cup

కార్న్ ఫ్లోర్ – 1/2 cup

కారం – 1/2 teaspoon

ఉప్పు: రుచికి సరిపడా

నూనె తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పనీర్ తురుము మరియు చీజ్ తురుము వేయాలి.

2. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, బంగాళదుంప, కారం వేసి బాగా మిక్స్ చేయాలి.

3. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి .

4. తర్వాత ఈ మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి.

5. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత, స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చయాలి.

6. నూనె వేడి అయ్యాక పనీర్ చీజ్ బాల్స్ బ్రెడ్ పొడిలో పొర్లించి తర్వాత కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.

7. డీప్ ఫ్రై చేసుకొన్న తర్వాత వీటిని ప్లేట్‌లోనికి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. అంతే హాట్ హాట్ పనీర్ బాల్స్ రెడీ, వీటిని టమోటో సాస్ తో సర్వ్ చేయండి..

మిర్చీ బజ్జీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download-3

కావల్సిన పదార్థాలు:

పెద్ద పచ్చిమిర్చి(బజ్జీ మిర్చి): 10

శెనగపిండి: 1cup

కారం: 1tsp

ఛాట్ మసాలా: 3tsp

అజ్వైన్: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

పసుపు: కొద్దిగా

నూనె : డీఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, పసుపు, కారం, ఉప్పు, అజ్వైన్ మరియు ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా చిక్కగా జారుడుగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు బజ్జీ మిర్చినీ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో తుడిచి పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక్కోదాన్ని తీసుకొని మిర్చి పొడవునా చీలిక చేసి లోపలి విత్తనాలను తొలగించాలి.

5. ఇలా మొత్తం రెడీ చేసుకొన్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిలో మిర్చిలను డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి.

6. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. కాగిన తర్వాత అందులో శెనగపిండిలో వేసిన మిర్చి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

7. అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. అంతే మిర్చి పకోర రెడీ. వీటిని మీకు నచ్చిన కెచప్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి.

సౌత్ ఇండియన్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (7)

కావల్సిన పదార్థాలు:

చికెన్:- 500 gms

ఉల్లిపాయలు- 5 (సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటోలు- 3 (సన్నగా కట్ చేసుకోవాలి)

పచ్చిమిర్చి – 1 (సన్నగా కట్ చేసుకోవాలి)

బంగాళదుంపలు- 2 (తొక్కతీసి సన్నగా కట్ చేసుకోవాలి)

దాల్చిన చెక్క – 2

లవంగాలు – 2

అల్లం, వెల్లుల్లి పేస్ట్- 1 ½ tbsp

కారం – 1 tbsp

పసుపు – 1 tsp

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్ళు – 1 cup

నూనె- 3 tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా రెండు చెంచాలా నూనెను ప్రెజర్ కుక్కర్లో వేసి వేడి అయ్యాక అందులో లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఒక నిముషం తక్కువ మంట మీద వేగించుకోవాలి.

2. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిసేపటి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

3. తర్వాత అందులో టమోటోలు మరియు పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో పసుపు, కారం మరియు ఉప్పు వేసి 5-10నిముషాలు వేగించుకోవాలి.

5. ఇప్పుడు కుక్కర్లో చికెన్ ముక్కలు మరియు ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి.

6. తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి 15నిముషాలు (4-5)విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

7. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ చేసి, విజిల్ పెట్టకుండా మూత పెట్టి తక్కువ మంట మీద మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

8.ఈ టేస్టీ చికెన్ కర్రీ రెసిపి చపాతీలు లేదా తందూరి రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది.