Posts Tagged ‘green tea’

మానసిక ఒత్తిడిని తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు…

images

రోజు రోజుకు ఒత్తిడి అధికమవుతూనే ఉంది. కుటుంబ సంబధిత సమస్యలు, పని వంటి వాటి వలన మెదడులో రసాయనిక మార్పులు జరిగి, ఒత్తిడికి కారణం అవుతున్నాయి. కానీ, అదృష్టం ఏమిటంటే ఈ ఒత్తిడులను తగ్గించే అద్భుత ఔషదాలు మన ఇంట్లోనే ఉన్నాయి.

విటమిన్ ‘B’

విటమిన్ ‘B’ మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క విశ్రాంతి కలిగించే దిశగా పని తీరును మెరుగుపరుస్తుంది. తృణధాన్యాలు, బీన్స్, పీస్ నట్స్, కాలేయం, గుడ్లు మరియు పాల ఉత్పత్తులు విటమిన్ ‘B’ అధికంగా కలిగి ఉంటాయి.

వేడినీటి స్నానం

వేడి నీటితో స్నానం చేయటం వలన మంచి భావనకు గురవటమేకాకుండా, విశ్రాంతికి లోనవుతారు. కేవలం 5 నిమిషాల పాటు వేడి నీటితో స్నానం చేయటం వలన కండరాలు విశ్రాంతికి గురవటమేకాకుండా, ఉద్ర్రేకత వంటి వాటి నుండి ఉపశమనం పొందుతారు.

గ్రీన్ టీ

“గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది”, ఈ వ్యాఖ్యను చాలా సార్లే వినుంటారు. ఇది పాలీఫినాల్, ఫ్లావనాయిడ్స్ మరియు క్యాటేచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి మెదడును ప్రశాంతతకు గురి చేస్తుంది. అంతేకాకుండా, ‘థయామిన్’ అనే అమైనోఆసిడ్ ను కలిగి ఉండి, ఒత్తిడిని తగ్గించి వేస్తుంది.

ఓట్స్

మీరు ఒత్తిడికి గురైనపుడు ఒక గిన్నె ఓట్‌మీల్ తినండి. ఓట్స్ అధిక కొవ్వు పదార్థాల స్థాయిలతో పోరాడటమేకాకుండా, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. వీటిని పండ్లు మరియు డిజర్ట్ లలో కలుపుకొని కూడా తినవచ్చు.

వ్యాయామాలు

వ్యాయామాలు మెదడుకు చాలా ఆరోగ్యకరం మరియు ఒత్తిడిని అధిగమించుటలో సమర్థవంతంగా పని చేస్తాయి. రోజు క్రమబద్దమైన వ్యాయామాలను చేయటం వలన ఆత్మవిశ్వాసం పెరగటమేకాకుండా, శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పళ్ళను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి…

images (7)

కొన్ని పదార్ధాలని మనమెంతో ఇష్టంగా తింటాం. వాటిల్లో కొన్ని పళ్ళకు హాని చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటి వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే కొన్ని పళ్ళకు మేలు చేసేవి కూడా ఉంటాయి.

పళ్ల ఎనామిల్‌కి హాని చేసే వాటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పదార్ధాలు ముందుంటాయి. చిప్స్, తెల్ల బ్రెడ్, పాస్తా మరియు పిజ్జా లాంటివి మరీ తియ్యగా ఉండకపోవచ్చు కానీ తిన్నవెంటనే నోట్లో ఉండగానే చక్కెరగా మారిపోతాయి. వీటిని ఎంత తక్కువగా తింటే మన పళ్ళకు అంత మంచిది.

నిమ్మజాతి పండ్లు, టొమాటోలు మరియు ద్రాక్ష ఆహారంగా తీసుకున్నపుడు పళ్ళను శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

పాలు, పెరుగు, పనీర్ మరియు చీజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు మరియు లవణాలు పళ్ళ ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియంని అందిస్తాయి.

అలాగే పీచు శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయల్ని తరుచూ తీసుకుంటే మంచిది.

గోరు వెచ్చని గ్రీన్ టీ త్రాగడం వలన పళ్ళకు మేలు జరుగుతుంది. అందులో ఉండే పాలి ఫెనాల్స్ బ్యాక్టీరియాను నశింపచేసి దంత క్షయాన్ని అరికడతాయి.

బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ జింజర్, హనీ డ్రింక్…

images (30)

కావాల్సిన పదార్థాలు: 

1 గ్రీన్ టీ బ్యాగ్

చిన్న అల్లం ముక్క 1

టీస్పూన్ తేనె ( అవసరం అనుకుంటే )

తయారు చేసే విధానం:

ఒక కప్పు నీటిని ఉడికించాలి. తురిమిన తాజా అల్లం వేయాలి. అల్లం వేశాక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దాంట్లో టీ బ్యాగ్ ముంచాలి. 5 నిమిషాల తర్వాత టీ బ్యాగ్ తీసేయాలి. అంతే బెల్లీ ఫ్యాట్ కరిగించే డ్రింక్ రెడీ. కావాలనుకుంటే తేనె మిక్స్ చేసి రెగ్యులర్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ఈ డ్రింక్ తాగడం వల్ల శరీర వ్యవస్థను డెటాక్సిఫై చేయడంతో పాటు, పొట్టను ఫ్లాట్‌గా మార్చడంలోనూ సహాయపడుతుంది.

ఇది ఫ్యాట్‌తో పోరడానికి మాత్రమే కాదు మంచి పోషకాలను అందిస్తుంది. ఇమ్యునిటీ మెరుగుపరచడానికి, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరచడానికి, రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

గమనిక: ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని ఈ డ్రింక్ తాగడం మంచిది.

యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

images (51)

ఆమ్లా: ఇండియన్ గూస్బెర్రీ ఇది ఒక ఆయుర్వేదిక్ హోం రెమెడీ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రొపర్టీస్ యూరిన్ ఇన్ఫెక్షన్ నివారించడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో విటిమిన్ C, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల యూరిన్ ట్రాక్‌లో బ్యాక్టీరియాను తొలగిస్తుంది. బ్లాడర్ హెల్తీగా ఉంచుతుంది.

వాటర్: జీవించడానికి మరో ముఖ్య మూలకం నీరు. నీరు మన జీవక్రియలకు మాత్రమే కాదు, కొన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది. వాటిలో యూటిఐ ఒకటి. రోజులో సరిపడా నీరు త్రాగాలి. రోజుకు కనీసం 8గ్లాసుల నీరు త్రాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ.

విటమిన్ C రిచ్ ఫుడ్స్: విటమిన్ C ఫుడ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ తొలగించడంలో బాగా సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్‌లో విటమిన్ C రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది. యూరిన్ ఆసిడ్ ఎక్కువగా ఉంటే నొప్పికి దారితీస్తుంది, మంట ఉంటుంది. వీటికి విటమిన్ C పుడ్ చెక్ పెడుతాయి.

గ్రీన్ టీ: గ్రీన్ టీ యూరిన్ ఇన్ఫెక్షన్‌ను బాగా నివారిస్తుంది. గ్రీన్ టీ ఆకులను గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి, గోరువెచ్చగా తాగాలి. రోజూ రెండు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో యాంటీ మైక్రోబయల్ యాక్టివిటీస్ అధికంగా ఉండటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

అలసటకు గుడ్ బై చెప్పే ఎనర్జిటిక్ ఫుడ్స్…

download (24)

– గుమ్మడి విత్తనాలు: గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి కండర నిర్మాణం, కండర శక్తికి బాగా సహాయపడుతాయి. విటమిన్స్ మరియు హెల్తీ ఫ్యాట్, మెగ్నీషియం వంటివి ఎనర్జీని పెంపొందిస్థాయి.

– వాల్ నట్స్: మన శరీరంలోని కణజాలాలకు అవసరం అయ్యే శక్తిని అంధించడానికి నట్స్‌లో అనేక ఎంజైములు ఉన్నాయి. కాబట్టి, రోజులో కాస్త అలసట అనిపించినప్పుడు ఈ నట్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవడం చాలా ఉపయోగకరం. తక్షణ శక్తిని అంధిస్తాయి. అలసటను దూరం చేస్తాయి. మనస్సును ఉత్తేజపరుస్తాయి.

– ఓట్స్: ఓట్స్ ఫర్ఫెక్ట్ ఫుడ్ ఇది అలసటను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ బాగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ మరియు మజిల్స్‌కు అవసరం అయ్యే కార్బోహైడ్రేట్స్‌ను అందిస్తుంది. దాంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు విటమిన్ B1 పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతాయి.

– పెరుగు: పెరుగు ఎనర్జీ బూస్టింగ్ స్నాక్‌గా చెబుతారు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణిక్రియకు అద్భుతంగా సహాయపడుతాయి. ఇవి నిస్సత్తువు కలిగి వ్యాధినిరోధక క్రియతో పోరాడి ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది.

– పుచ్చకాయ: పుచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి హైడ్రేషన్ మాత్రమే కలిగించడం కాదు. పుచ్చకాయలో ఉండే అధిక శాతం నీరు, తగినంత హైడ్రేషన్‌తో పాటు ఎనర్జీని అంధించే B విటమిన్స్, పొటాషియం మరియు ఫ్రక్టోస్ పుష్కలంగా ఉంటుంది.

– అరటిపండ్లు: అరటి పండ్లలో అధిక శాతంలో పొటాషియం మరియు B విటమిన్స్ కలిగి ఉండటం వల్ల అరటిపండ్లు జీర్ణవ్యవస్థను నిదానం చేస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. అలసిన శరీరానికి గ్లూకోజ్‌ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది. రక్తంలోని హేమోగ్లోబిన్ అవసరమైన ఐరన్ అందిస్తుంది. ఎంతో శక్తి కలిగి భావిస్తారు.

– బాదం: బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం మరియు విటమిన్ B12 వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్ జాబితాలో చేర్చబడింది. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి మరియు ఆందోళను దూరంగా ఉంచడానికి సహాయడపతుంది.

– గ్రీన్ టీ: ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అది మానవ మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్‌గా ప్రభావం చూపెడుతుంది.

ఫుడ్ అలర్జీని నివారించే గ్రీన్ టీ…

download (13)

ఫుడ్ అలర్జీ నివారించే ఉత్తమ హోం రెమెడీ గ్రీన్ టీ. గ్రీన్ టీకి ఫుడ్ అలర్జీ లక్షణాలకు దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ సరిగా జరిగేలా చేస్తుంది. అంతే కాదు, దాంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

కాలేయంలో పేరుకున్న ఫ్యాట్ తొలగించే బెస్ట్ హోం రెమిడీస్…

images (61)

– వెనిగర్, వాటర్: ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటిని రోజు భోజనానికి ముందు కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఈ జ్యూస్ కాలేయంలో చేరిన ఫ్యాట్స్ ని బయటకు పంపుతుంది.

– నిమ్మకాయ, నీళ్లు: ఒక నెలరోజుల పాటు నిమ్మరసం నీళ్లు తాగాలి. ఇందులో ఉండే విటమిన్ సి కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. అలాగే కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది.

– గ్రీన్ టీ: ఉదయం, సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. ఇది కాలేయం పనితీరుకి సహకరిస్తుంది.

– పసుపు, నీళ్లు: గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ పసుపు కలుపుకుని రోజుకి రెండుసార్లు 15 రోజుల పాటు తీసుకోవాలి. పసుపు కాలేయంలో పేరుకున్న ఫ్యాట్ ని తొలగించడానికి సహాయపడుతుంది.

– ఉసిరికాయ జ్యూస్: ఉసిరికాయలో ఉండే విటమిన్ సి కాలేయంలో ఉండే టాక్సిన్స్ ని తొలగించడానికి సహకరిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ ఉసిరికాయ జ్యూస్ ని 25 రోజులపాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.