Posts Tagged ‘hair pack’

ఆయిలీ హెయిర్ నివారించే సింపుల్ టిప్…

download (6)

కావలసిన పదార్థాలు:

గుడ్డు 1

ఉప్పు: 2 టేబుల్స్ స్పూన్లు

నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు

ఎలా ఉపయోగించాలి:

ముందుగా గుడ్డు సొన ఒక బౌల్లో తీసుకొని, అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని తలకు మొత్తం అప్లై చేసి 10 నుంచి 15 నిముషాల వరకూ మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్‌తో తలను కవర్ చేయాలి. ఇలా షవర్ క్యాప్ పెట్టుకొని అరగంట అలాగే ఉండి కొద్దిగా తడి ఆరిన తర్వాత మీకు నచ్చిన షాంపుతో తలస్నానం చేయాలి. తర్వాత కండీషనర్‌ను అప్లై చేయాలి.

ఈ సింపుల్ అండ్ పవర్‌ఫుల్ హెయిర్ మాస్క్‌ను వారంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల క్రమంగా తలలో ఎక్సెస్ ఆయిల్‌ను నివారిస్తుంది. మీ జుట్టు మరింత అందంగా కనబడేలా చేస్తుంది.

జుట్టుకు మంచి కండీషనర్ కోసం…

download (56)
పావుకప్పు యాపిల్ గుజ్జులో కోడిగుడ్డులోని తెల్లసొనా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల జట్టు కండీషనర్ అయ్యి చిట్లడం వంటి సమస్యలు దరిచేరవు.

స్ట్రాంగ్ జుట్టు సొంతం చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్, ఎగ్ మాస్క్…

download (27)

ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డు మిశ్రమాన్ని వేయాలి. హనీ, ఆలివ్ ఆయిల్ మరియు తేనె మూడింటిని సమంగా తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ అయ్యే వరకూ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 20 నిముషాలు అలాగే ఉండనివ్వాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. షాంపుతో తలస్నానం చేస్తే ఎగ్ స్మెల్ పోతుంది. జుట్టు వేగంగా పెంచుకోవడానికి ఈ పద్దతిని వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నించవచ్చు. దీంతో పాటు హెల్తీ డైట్‌ను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌తో జుట్టుకు మసాజ్ చేయాలి. డ్రై అండ్ స్ట్రెయిట్ హెయిర్ స్టైలింగ్‌కు దూరంగా ఉండాలి.

తెల్లజుట్టుకి న్యాచురల్ కలర్ అందించే హోంమేడ్ హెయిర్ డై…

download (35)

గోరింటాకుతో తయారు చేసిన హెన్నా ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. అయితే దీనికి ఆయిల్, కరివేపాకు మిక్స్ చేసుకుంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కొద్దిగా ఆముదం లేదా నువ్వుల నూనె తీసుకుని వేడి చేయాలి. ఉడికేటప్పుడు కొన్ని కరివేపాకు వేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక టైట్ కంటెయినర్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే జుట్టుకి కలర్ వేసుకోవాలని భావిస్తారో అప్పుడు దీనిలోకి హెన్నా వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత జుట్టుకి అప్లై చేసి మూడు నాలుగు గంటల తర్వాత షీకాయ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉంటుంది.

కూలింగ్ హెయిర్ ప్యాక్…

hair-conditioning

షీకాకాయలో జుట్టుని స్మూత్‌గా మార్చే సత్తా ఉంది. షీకాకాయ, ఉసిరికాయ, పెరుగు మరియు సోప్ నట్ అన్నింటిని కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకుంటే చాలా చల్లటి అనుభూతి కలుగుతుంది. సమ్మర్‌లో ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. తలనొప్పి తగ్గించి, రిలాక్సేషన్ ఇస్తుంది.

జుట్టు రాలడాన్నినివారించే సింపుల్ హెయిర్ ప్యాక్…

images (58)

మెంతులు జుట్టుని నల్లగా, నిగనిగలాడేలా చేసి చుండ్రుని నివారిస్తాయి. 4 టేబుల్ స్పూన్ల మెంతులను గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో అర నిమ్మకాయ రసం, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. బాగా మిక్స్ చేసి, జుట్టుకి, స్కాల్ఫ్‌కి పట్టించి 20 నిమిషాల తర్వాత మైల్డ్ కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడాన్ని పూర్తీగా అరికట్టవచ్చు.

జుట్టు పెరుగుదలకు బనానా చేసే మ్యాజిక్…

download (61)

– విటమిన్స్ కు ఒక గొప్ప నిలయం అరటి: అరటి పండ్లలో విటమిన్స్ అధికం. విటమిన్ బి3, బి6, సి మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టుకు అందినప్పుడు మీ జుట్టు మరింత తేజో వంతంగా మరియు ఒత్తుగా చిగురిస్తూ కనిపిస్తుంది.

– మాయిశ్చరైజింగ్: బనానా జ్యూస్ ను తలకు మరియు కేశాలకు పట్టించడం వల్ల జుట్టుకు కావల్సినంత మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. జుట్టును సాఫ్ట్ గా, ప్రకాశవంతంగా మరియు హెల్తీగా మార్చుతుంది.

– శెనగపిండి: జుట్టు బాగా పెరగాలంటే, తగినంత పోషకాలు అందివ్వడం అవసరం మరియు విటమిన్లు కూడా అవసరం అవుతాయి. శెనగపిండిలో అరటి జ్యూస్ మిక్స్ చేసి తలకు పట్టించి, 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. అరటి జ్యూస్ విటమిన్స్ ను అందిస్తే, శెనగపిండి ప్రోటీన్స్ ను అందిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్గా మార్చుతాయి.

– పెరుగు మరియు అరటి: పెరుగుకు బనాను జోడించి తలకు పట్టించడం వల్ల మరింత ఎఫెక్టివ్ రిజల్ట్ ను మీరు పొందవచ్చు. ఇది జుట్టు రాలడం తగ్గించడం మాత్రమే కాదు, జుట్టుకు అవసరం అయ్యే పోషణను అందిస్తుంది.

– తేనె మరియు అరటి: తేనె మరియు అరటి జ్యూస్ ను సమంగా తీసుకొని హెయిర్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది జుట్టుకు తగినంత పోషణను మరియు రక్షణ కల్పిస్తుంది.