Posts Tagged ‘halwa’

గసగసాలతో స్వీట్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (4)

కావల్సిన పదార్థాలు:

గసగసాల : 100grms

చక్కెర: 1/2cup

పాలు: 2cups

నెయ్యి : 1/2cup

ఏలకులు : 4-5(పొడి చేసుకోవాలి)

బాదం: 5-6(గార్నిష్ చేయడానికి)

తయారుచేయు విధానం:

1. ముందుగా గసగసాలను శుభ్రంగా కడిగి, సన్నగా ఉన్న మట్టి, దుమ్మును తొలగించాలి. (చాలా చిన్నగా ఉండటం వల్ల కాఫీ ఫిల్టర్ లేదా కాఫీ స్ట్రెయినర్‌లో వేసి శుభ్రం చేయాలి)

2. తర్వాత నీరు పూర్తిగా కారిపోయే వరకూ అలాగే ఉంచాలి.

3. తర్వత స్టౌ మీద మంద పాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో గసగసాలు వేసి, తక్కువ మంట మీద అవి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ అలాగే ఉండనివ్వాలి.

4. ఇప్పుడు అందులో పాలు పోసి మరిగించాలి. అలాగే యాలకలపొడి వేసి మీడియం మంట మీద మొత్తం పాలు గట్టిగా ఇమిరిపోయే వరకూ మీడియం మంట మీద ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

5. పాలు బాగా మరుగుతున్నప్పుడే, అందులో షుగర్ కూడా జోడించి బాగా మిక్స్ చేయాలి. పాలు చిక్కబడి, గసగసాలతో కలిసిపోయి మొత్తగా ఉడికి హల్వ లా తయారైనప్పుడు బాదంతో గార్నిష్ చేయాలి.

బనానా హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

1 (1)

కావలసిన పదార్ధాలు:

అరటిపండ్లు: 5

పంచదార: 1 cup

నెయ్యి: 3tbsp

జీడిపప్పు: 15

యాలకులు: 6

తయారు చేయు విధానము:

1. అరటిపండు తోలు తీసి బాగా గుజ్జుగా చేత్తో చిదిమి పెట్టుకోవాలి.

2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పుని దోరగా వేయించాలి.

3. అదే పాన్ లో మళ్ళి కొద్దిగా నెయ్యి వేసి ఈ అరటి పండు గుజ్జుని అందులో వేసి బాగా రోష్ట్ చేయాలి.

4. పది నిమిషాలా తర్వాత అందులో పంచదార వేసి మళ్ళి పది నిమిషాలు రోష్ట్ చేయాలి. తర్వాత యాలకల పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిగా నెయ్యివేసి అందులోనే జీడిపప్పు కూడా వేసి, నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే బనానా హల్వా రెడీ.

టమోటో హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

0c52d743823ad42a761d15892cee0dce-eaf83c0d6bdbd79f0f04220220bea9bd-600x188-100-crop

కావలసిని పదార్ధాలు:

టమోటో – 4

పంచదార – 250 grm

పచ్చికొబ్బరి – 1 cup

ద్రాక్ష – 50 grm

జీడిపప్పు – 50 grm

బాదాం పప్పు – 50 grm

నెయ్యి – 50 grm

తయారు చేయు విధానం:

మొదట టమోటాలని కట్ చేసి స్టౌ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో వేసి కొద్దిగా డ్రైగా వేపాలి.

తర్వాత పాన్ లో నుండి తీసి చల్లార్చి గ్రైడ్ చేస్తే టమోటో పూరి సిద్దం దీన్ని ఒక బౌల్ లో తీసి పెట్టుకోవాలి.

మరోక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ద్రాక్ష, జీడిపప్పు, బాదాం పప్పు, వేసి విడి విడి గా దోరగా వేయించి ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్ లో రెడీ చేసి పెట్టుకొన్న టమోటో పూరీని వేసి సన్నని మంట మీద ఆవిరి పట్టకుండా(మూత పెట్టకూడదు) చిక్కబడే వరకూ ఉడకనివ్వాలి.

తర్వాత పంచదార, కొబ్బరి ముద్ద, ప్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి బాదం పౌడర్ చల్లి మిశ్రమానంతటిని కలిసే విధంగా కలిపి కొద్దిగా మగ్గనివ్వాలి. అంతే టమోటో హల్వా రెడీ.

హల్వా స్పెషల్: బ్రెడ్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

bread-halwa-625_625x350_61454580934

కావల్సిన పదార్థాలు:

మిల్క్ బ్రెడ్: 1 ప్యాకెట్

బాదాం: 12

జీడిపప్పు: 12

యాలకులు: 6

నెయ్యి: 1cup

పాలు: 1/2 litre

పంచదార: 1 cup

తయారు చేయు విధానం:

1. ముందుగా బ్రెడ్ ను సైడ్ లో బ్రౌన్ కలర్ లో ఉన్న అంచులను తొలగించి, ఆ తర్వాత బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలుగా(ఒక అంగుళం) చేసుకోవాలి.

2. తర్వాత ఒక పాన్ లో ఒక కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడిఅయ్యాక, అందులో బాదాం, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే నెయ్యిలో ముక్కలు చేసి పెట్టుకొన్న బ్రెడ్ ను వేసి ఐదు నిముషాల పాటు వేయించాలి. ఎప్పుడైతే బ్రెడ్ బ్రౌన్ కలర్ లోకి మారుతుందో అప్పుడు బ్రెడ్ ను మరో గిన్నెలోనికి తీసుకోవాలి.

4. అంతలోపు మరో గిన్నెలో పాలు పోసి కాగనివ్వాలి. పాలు మరిగేటప్పుడు అందులో స్పూన్ నిండుగా పంచదారను వేసి పంచదార కరిగే వరకూ వేయించాలి.

5. వేయించి బాదాం, జీడిపప్పు మినహా మిగినవి యాలకులు, కొన్ని జీడిపప్పు, బాదాంను మిక్సీలో వేసి కొద్దిగా నీరు చేర్చి పేస్ట్ లా చేసుకోవాలి.

6. ఈ పేస్ట్ ను కాగే పాలలో వేసి బాగా కలగలిపి మరో ఐదు నిముషాల పాటు ఉడికించాలి.

7. పాలు చిక్కబడే సమయంలో వేయించి పెట్టుకొన్న బ్రెడ్ ముక్కలను వేసి తక్కువ మంటలో ఉడికించాలి. అంతే బ్రెడ్ హల్వా రెడీ. వేయించి పెట్టుకొన్న బాదాం, జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. ఈ రిసిపిని వేడిగా లేదా చల్లబడినతర్వాత కూడా సర్వ్ చేయవచ్చు.