Posts Tagged ‘health’

తులసి ఆకులు, పాలు కాంబినేషన్‌లో దాగున్న పవర్‌ఫుల్ బెన్ఫిట్స్…

download (1)

తయారు చేసే విధానం: 3 లేదా 4 తులసి ఆకులు తీసుకుని శుభ్రం చేయాలి. మరిగిన పాలల్లో కలపాలి. వాటిని ఒక కప్పులో తీసుకుని ప్రతి రోజు ఉదయం పరకడుపున తీసుకోవాలి. అంతే ఈ సింపుల్ పదార్థంతో ప్రయోజనాలు అమోఘం.

ప్రయోజనాలు:

ఫ్లూ: తులసిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం, పాలల్లో హీలింగ్ ప్రాపర్టీ ఉండటం వల్ల ఈ రెండింటిని మిక్స్ చేసి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫ్లూ వంటి లక్షణాల నుంచి వెంటనే బయటపడవచ్చు.

గుండె ఆరోగ్యానికి: తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి హార్ట్‌ని హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండటానికి సహాయపడుతాయి. పాలు గుండెకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. ఈ రెండింటి మిశ్రమం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఒత్తిడి తగ్గడానికి: వేడి పాలు, తులసి కలిపి తీసుకోవడం వల్ల నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతుంది.

కిడ్నీ స్టోన్స్: తులసి ఆకులు, పాలు కాంబినేషన్ కిడ్నీల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించి, డెటాక్సిఫై చేస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో స్టోన్స్ కరిగిపోతాయి.

క్యాన్సర్: పాలు, తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యున్ సిస్టమ్ బలంగా మారుతుంది. ఎలాంటి క్యాన్సర్ అయినా దరిచేరకుండా నివారించే శక్తి ఉంటుంది.

శ్వాస సంబంధ సమస్యలు: వేడి పాలు, తులసి ఆకుల కాంబినేషన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, వాపు, కామన్ కోల్డ్, పొడి దగ్గు నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది ఈ డ్రింక్.

తలనొప్పి నివారణకు: చాలా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ తులసి, పాలు కలిపి ఒక గ్లాసు తాగండి. వెంటనే తలనొప్పి తగ్గడాన్ని మీరు గమనిస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల నొప్పి దూరమవుతుంది.

డైట్ లో చేర్చుకోవాల్సిన సూపర్ హెల్తీ ఫుడ్స్…

images (12)

గుడ్లు: కోడి గుడ్డులో మినరల్స్‌, రైబోఫ్లెవిన్‌ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుడ్డును కానీ, ఆమ్లెట్‌ను గానీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

క్యారెట్స్‌: క్యారెట్స్ ఎవర్ గ్రీన్ హెల్తీ వెజిటబుల్ అని మనందరికీ తెలుసు. కానీ వీటిని తినడానికి మాత్రం కొంతమందే ఇష్టపడతాు. కళ్లకు మేలు చేయడంలో క్యారెట్‌కు మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్‌ A కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు బీటా-కెరటీన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా క్యారెట్స్ లో లభిస్తాయి. అలాగే ఖనిజలవణాలు, ఫైబర్‌ క్యారెట్స్ నుంచి పొందవచ్చు.

వెల్లుల్లి: వెల్లుల్లి రుచి దాదాపు ప్రతి కూరలు, చారుల్లోనూ దట్టిస్తారు. కానీ ఆహారం తినేటప్పుడు వీటిని పక్కనపెట్టేవాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ ఇది తినడం వల్ల రుచి మాత్రమే కాదు ఆరోగ్యమూ బాగుంటుంది. ఇందులో ఉండే విటమిన్ B, Cతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారించడానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటు, కార్డియోవాస్కులర్‌ డీసీజ్‌లను నివారించే శక్తి ఉంది.

క్యాబేజ్‌: క్యాబేజ్ అంటే చాలామంది నో చెప్పేస్తారు. కానీ ఇందులో ఉండే లో సాచురేటెడ్‌ ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌ శరీరానికి ఎంతో అవసరం. క్యాబేజ్‌ నుంచి ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ పొందవచ్చు. హార్ట్‌‌రేట్‌ను, రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో, క్యాబేజ్‌ వల్ల లభించే పాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ కీలకపాత్ర పోషిస్తాయి.

పాలు: పాల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలలో ఉండే ఐరన్‌, కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్స్‌ మరియు ప్రోటీన్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న వేరే ఆహార పదార్థం మరొకటి లేదు.

ఆయిల్ పుల్లింగ్ వల్ల పొందే అమోఘమైన ప్రయోజనాలు…

download (8)

ఆయిల్ పుల్లింగ్ నోటిని శుభ్రం చేయడానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. ఆరోగ్యపరంగా దీని ఉపయోగాలు అమోఘం. కాబట్టే మన పూర్వీకులు కూడా ఈ పద్ధతిని పాటించేవాళ్లు. ఈ ప్రక్రియ నోటి వరకే పరిమితం అయినప్పటికీ శరీరంలోపలి భాగాలను ఆరోగ్యంగా మారుస్తాయి. ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించే నూనెల వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

ఆయిల్ పుల్లింగ్ కి రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి కూడా మంచిది. కొబ్బరినూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించవచ్చు. 15 నుంచి 20 నిమిషాల ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. కాకపోతే వీటిని ఎట్టిపరిస్థితుల్లో మింగకూడదు.

చర్మానికి: ఆయిల్ పుల్లింగ్ వల్ల చర్మానికి మంచిదని చాలా మందికి తెలియదు. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చర్మం హెల్తీగా మారడంతోపాటు, గ్లోయింగ్ గా మారుతుంది. నోటి ద్వారా శరీరం లోపలికి వెళ్లే బ్యాక్టీరియాను నోట్లోనే నాశనం చేసే సత్తా ఆయిల్ పుల్లింగ్ కి ఉంది. దీనివల్ల రక్తం శుద్ధి అయి, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

హార్మోన్ పనితీరుకి: మనం ఆరోగ్యంగా ఉండటానికి హార్మోన్ల పనితీరు సజావుగా ఉండాలి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ అలవాటు చేసుకోవడం వల్ల హార్మోనల ఇంబ్యాలెన్స్ సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు.

రోగనిరోధక శక్తి: ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్లలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రకరకాల అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి పొందడానికి ఆయిల్ పుల్లింగ్ చాలా చక్కటి ఉపాయం. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా 20 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలా మంచి ఫలితం పొందవచ్చు.

తెల్లటి పళ్లకి: ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పళ్లు మిళమిళ మెరిసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకి కనీసం 20 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పళ్లకు గారపట్టడానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేయవచ్చట. అలాగే యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల ఇవి పళ్లు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడతాయట.

ప్లేట్‌లెట్ కౌంట్‌ని పెంచుకునే న్యాచురల్ అండ్ సింపుల్ రెమిడీస్…

images (18)

సరిపడా నిద్ర: సరిపడా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. తాజాగా మీకు లో ప్లేట్‌లెట్ కౌంట్‌ అని తెలిస్తే మీరు ఖచ్చితంగా సరైన పద్ధతిలో నిద్రపోవాలి. రోజుకి ఖచ్ఛితంగా 8 గంటలు నిద్రపోవాలి.

వ్యాయామం: రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. కాబట్టి మీకు లో ప్లేట్‌లెట్ కౌంట్ అని డాక్టర్లు చెప్పి ఉంటే వెంటనే వ్యాయామం చేయడం మొదలుపెట్టండి.

నీళ్లు ఎక్కువగా తాగడం: నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి పెరుగుతుంది. లో ప్లేట్‌లెట్స్ కౌంట్ సమస్య నుంచి బయటపడటానికి ఇది సింపుల్ టిప్.

విటమిన్ సి ఫుడ్స్: విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లో ప్లేట్‌లెట్ కౌంట్‌ని పెంచుకోవచ్చని తాజా అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి టమోటాలు, నిమ్మ, ఆరంజ్ వంటివి డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.

ఉసిరికాయలు: ప్లేట్‌లెట్స్ పెంచడంలో ఉసిరికాయలు సహాయపడతాయి. రెగ్యులర్‌గా ఉసిరికాయ జ్యూస్ తాగితే ఈ సమస్య నుంచి తేలికగా, త్వరగా బయటపడవచ్చు. అలాగే ఇమ్యునిటీ మెరుగుపడుతుంది.

పాలకూర: లో ప్లేట్‌లెట్ డిజార్డర్ నివారించడంలో పాలకూర ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీన్ని సలాడ్ రూపంలో లేదా జ్యూస్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇందులో ఉండే ప్రొటీన్స్, విటమిన్స్ ప్లేట్‌లెట్స్ ప్రొడక్షన్‌ని పెంచుతాయి.

దానిమ్మ: దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది లో ప్లేట్‌లెట్ కౌంట్‌ని ట్రీట్ చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.

మనం ఊహించని లివర్ డ్యామేజ్ లక్షణాలు…

images

ఉదరం కుడివైపున నొప్పి కొన్ని సార్లు, కాలేయం ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఎన్ లార్డ్ కావడం వల్ల పొట్ట ఉదర భాగం ఉబ్బి ఉంటుంది. ఈ పరిస్థితిని వెంటనే గమనించకపోయినట్లైతే మీ బొడ్డు చుట్టూ పొట్ట మరింత విస్తరించే అవకాశం ఉంది. పొత్తికడుపు, ప్రత్యేకంగా పొత్తికడుపు పైన కుడివైపు మూలన లేదా పక్కటేముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణాన్ని సూచిస్తుంది.

కాలేయం దాని పై కొవ్వు పేరుకుపోయినా లేదా కాలేయం విస్తరించినా, నీరు కూడా జీర్ణం కాలేవు. అయితే చాలా కాలం నుండి చిన్న జీర్ణ సమస్యలు ఉన్నా, తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ లక్షణంగా గుర్తించాలి.

యూరిన్‌లో మార్పులు శరీరంలోని రక్తప్రవాహంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల యూరిన్ పచ్చగా మారుతుంది, దెబ్బతిన్న కాలేయం వల్ల కిడ్నీల ద్వారా మలవిసర్జనను తొలగించడానికి సాధ్యపడదు.

బలహీనత మరియు అలసట కాలేయం వల్ల మన శరీరంలో అనేక విటమిన్స్ మరియు మినిరల్స్ మన శరీర భాగాలకు అందజేస్తాయి. అలాకాకుండా జీవక్రియలు సరిగా పనిచేయకుండా పోవడం వంటి లక్షణాలు మీరు గుర్తించినట్లైతే అలసట మరియు బలహీనంగా కనబడుతారు. అటువంటప్పుడు లివర్ డ్యామేజ్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి.

  తెల్లగా ఉండే కళ్ళు పసుపు పచ్చగా మరియు గోళ్ళు పసుపుగా మారినప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి. అంటే కాలేయం దెబ్బతినింది దానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

అనారోగ్యానికి మ్యూజిక్ చేసే మ్యాజిక్…

download (6)

సంతోషం: మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డొపామైన్ అనే రసాయనం రిలీజ్ చేయడం వల్ల.. సంతోషంగా ఫీలవుతారు. సంగీతం వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా.. ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఓ 15 నిమిషాల పాటు.. మ్యూజిక్ వినండి.

రన్నింగ్ కెపాసిటీ పెంచుతుంది: మ్యూజిక్ వింటూ పరుగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే.. మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్ గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరుగెత్తవచ్చు.

ఒత్తిడి, ఆరోగ్యం: అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవరుచుకోండి. సంగీతం మనసుకు ఉల్లాసాన్నే కాదు.. ఒత్తిడిని తగ్గించగలదు. మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. అలసటగా అనిపిస్తే.. వెంటనే రేడియో ఆన్ చేయండి.. ఎక్కడలేని ఉత్సాహం పొందవచ్చు.

నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే: 45 నిమిషాలు శాస్త్రీయ సంగీతం వింటే, రిలాక్సేషన్ తో పాటు మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే. పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి.. హాయిగా నిద్రలోకి జారుకుంటారు.

మెమరీ పవర్: సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది. కానీ.. మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది.

మీ డైట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన ప్రొటీన్ రిచ్ ఫుడ్స్…

download (2)

– మాంసాహారం: మేక, గొర్రె వంటి మాంసాహారాల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిమిట్‌గా తీసుకోవాలి. అలాగే స్కిన్ లెస్ చికెన్ తినడం వల్ల కూడా ప్రొటీన్స్ పొందవచ్చు. అలాగే కోడిగుడ్లు కూడా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ పొందవచ్చు.

– చేపలు: చేపల్లో గుండెకు మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ట్యూనా, సార్డీన్, ట్రాట్ వంటి చేపలు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రొటీన్స్ పొందవచ్చు. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది.

– నట్స్: బాదాం, పిస్తా, ఆక్రోట్ వంటి నట్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోవాలి. అయితే లిమిట్‌గా తీసుకోవడం మంచిది. వీటిని సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకుంటే టేస్ట్‌తో పాటు, కావాల్సిన ప్రొటీన్స్ అందుతాయి.

– డైరీ ప్రొడక్ట్స్: కండరాల నిర్మాణానికి సహాయపడే ప్రొటీన్స్ డైరీ ప్రొడక్ట్స్ ద్వారా పుష్కలంగా లభిస్తాయి. మధుమేహం, గుండె జబ్బు, రక్తపోటు తగ్గడానికి ఇవి గ్రేట్‌గా సహాయపడతాయి. అయితే కొవ్వు తీసేసిన పాలు తీసుకోవడం చాలా మంచిది.

– వెజిటబుల్స్: పచ్చి బఠాణీలు, రాజ్మా గింజలు, చిక్కుళ్లు వంటి వాటిల్లో ప్రొటీన్స్ లభిస్తాయి. వీటిని వారంలో కనీసం ఒకసారైనా డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందిస్తాయి.

బ్లడ్ డొనేషన్ వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్…

download (8)

– క్యాన్సర్: రక్త దానం చేసినప్పుడు శరీరంలో ఐరన్ లెవెల్స్ మెయింటెన్ చేయబడతాయి. శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గినప్పుడు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.

– లివర్ డ్యామేజ్: శరీరంలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ రిస్క్ ఉంటుంది. బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండటం వల్ల అధికంగా ఉన్న ఐరన్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల లివర్ డ్యామేజ్ రిస్క్ తగ్గించుకోవచ్చు.

– ఐరన్ లెవెల్స్: శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు అనీమియాకి దారితీస్తుంది. అలాగే ఎప్పుడైతే శరీరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు అవయవాలకు హాని కలుగుతుంది. రెగ్యులర్‌గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అధికంగా ఉన్న ఐరన్‌ని తగ్గించి, అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

– హార్ట్ ప్రాబ్లమ్స్: రక్తదానం చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ మెయింటెయిన్ చేసి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గించుకోవచ్చు. అలాగే హార్ట్ బీట్ కూడా సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది.

– బరువు తగ్గడానికి: బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బరువు తగ్గడానికి, ఎక్స్ ట్రా క్యాలరీలు కరిగించడానికి సహాయపడుతుంది.

– బ్లడ్ ఫ్లో పెరగడానికి: తరచుగా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా సాగుతుంది. శరీరమంతటికీ రక్త సరఫరా సరిగ్గా అందుతుంది. దీనివల్ల బ్లాకేజ్, బ్లడ్ వెజెల్స్ డ్యామేజ్ నివారించవచ్చు.

– న్యూ బ్లడ్ సెల్స్: రెగ్యులర్‌గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు.

– సైకలాజికల్ బెన్ఫిట్స్: రక్తదానం చేయడం వల్ల మానసికంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అవసరమైన వాళ్లకు బ్లడ్ డొనేట్ చేశామన్న ఫీలింగ్ సంతోషాన్నిస్తుంది. దీనివల్ల ఒకరి జీవితాన్ని కాపాడిన వాళ్లు అవుతారు.

ఆరోగ్యానికి మొదటి మెట్టు ఉదయం తీసుకునే అల్పాహారం…

images (32)

వివిధ కారణాల వలన ఈ రోజుల్లో ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా తక్కువైపోయింది. కాని మన శరీర ఆరోగ్యానికి ప్రధానంగా దోహద పడే ఆహారం ఉదయం తీసుకునే అల్పాహారం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం మరువ కూడదు.

అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డు మొదలైన ప్రొటీన్‌లు కలిగి ఉండే ఆహారంగా తీసుకుంటే ఉత్తమం.

మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ఉపయోగపడుతుంది. వారికి అల్పాహారం ఇచ్చేటపుడు బలవంతంగా కాకుండా, నిదానంగా ఇవ్వాలి.

ఉప్పు, మిరియాలు, నిమ్మ కలిపి తీసుకుంటే పొందే బెన్ఫిట్స్…

images (14)

ముక్కుదిబ్బడ: ఉప్పు, మిరియాల పొడి, నిమ్మలతో పాటు గోరువెచ్చని నీళ్లు కలిపి తీసుకుంటే శరీరంలో కావాల్సినంత హీట్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్ల్ఫమేషన్ తగ్గించి, ముక్కు దిబ్బడను నివారిస్తుంది.

గొంతు నొప్పి: ఈ న్యాచురల్ డ్రింక్ యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

గాల్ బ్లాడర్ స్టోన్స్: ఉప్పు, మిరియాలు, నిమ్మలతో పాటు ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకుంటే గాల్ బ్లాడర్‌లో ఇబ్బందిపెట్టే స్టోన్స్ నివారించవచ్చు. రెగ్యులర్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

బరువు తగ్గడానికి: ఈ మిశ్రమాన్ని వేడినీటితో కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే మీ శరీరం మెటబాలిజం పెరిగి, ఫ్యాట్ బర్నింక్ కెపాసిటీ పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

పంటినొప్పి: గోరు వెచ్చని నీటితో కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల పంటినొప్పి నివారిస్తుంది. పుక్కిలించినా పంటినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఫ్లూ: ఈ మిశ్రమాన్ని తేనెతో పాటు తీసుకుంటే వైరస్‌లతో పోరాడుతుంది. ఫ్లూ లక్షణాలను కూడా నివారిస్తుంది.

వికారం: ఉప్పు, మిరియాలలో పొట్టలోని యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేస్తుంది. నిమ్మరసం వికారాన్ని తగ్గిస్తుంది. అలాగే పొట్ట సమస్యలు, లక్షణాలను కూడా తగ్గిస్తుంది.