Posts Tagged ‘health tips’

విశ్రాంతితో ఆరోగ్యానికి మేలెంతో తెలుసుకోండి…

images (5)
విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. విశ్రాంతి టెక్నిక్స్ వల్ల హార్ట్ రేట్ తగ్గుతుంది. కాబట్టి హెల్దీ హార్ట్‌ను కోరుకుంటున్నట్లైతే శరీరానికి రెగ్యులర్‌గా విశ్రాంతి అందివ్వడం మంచిది. ప్రతి రోజూ అలసిన శరీరానికి తగినంత విశ్రాంతిని అందివ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. ఒత్తిడి తగ్గించుకొన్నట్లైతే శరీర, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు వదులవుతాయి. తద్వారా అలసట ఆవహిస్తుంది. ప్రతి రోజూ విశ్రాంతి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. రోజూ ఎనిమిది గంటల పాటు నిద్రతో పాటు ఒత్తిడిని సునాయాసంగా అధిగమించే తత్త్వం ఉంటే.. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంతేగాకుండా ఏకాగ్రత పెంచుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది.

కొబ్బరి పాలతో క్యాన్సర్‌కి చెక్…

images

కొబ్బరి పాలలో ఉండే ఖనిజాలు క్యాన్సర్ ని అరికడతాయి. ప్రేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లను నివారించడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ సెల్స్ అభివృద్దిని నిరోధించగల యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి తరచుగా కొబ్బరిపాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

మెదడు చురుగ్గా పని చేయడానికి చిట్కాలు…

download (1)

చేపలు, అక్రోట్ కాయలు, విటమిన్ సమృద్ధిగా లభించే బొప్పాయి, నిమ్మ జాతి పండ్లు తినాలి. విటమిన్ E పుష్కలంగా ఉండే గుడ్లు, బాదం, ఆకుకూరలు బాగా తీసుకోవాలి.

చక్కటి సంగీతం వినాలి, లేత ఎండలో రోజూ కాసేపు గడపాలి, బొమ్మలు వేయడం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, యోగా చేయడం వల్ల కూడా మెదడు చురుగ్గా పని చేస్తుంది.

అన్నింటికీ మించి కంటినిండా హాయిగా నిద్రపోవాలి.

డైట్ లో చేర్చుకోవాల్సిన సూపర్ హెల్తీ ఫుడ్స్…

images (12)

గుడ్లు: కోడి గుడ్డులో మినరల్స్‌, రైబోఫ్లెవిన్‌ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుడ్డును కానీ, ఆమ్లెట్‌ను గానీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

క్యారెట్స్‌: క్యారెట్స్ ఎవర్ గ్రీన్ హెల్తీ వెజిటబుల్ అని మనందరికీ తెలుసు. కానీ వీటిని తినడానికి మాత్రం కొంతమందే ఇష్టపడతాు. కళ్లకు మేలు చేయడంలో క్యారెట్‌కు మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్‌ A కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు బీటా-కెరటీన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా క్యారెట్స్ లో లభిస్తాయి. అలాగే ఖనిజలవణాలు, ఫైబర్‌ క్యారెట్స్ నుంచి పొందవచ్చు.

వెల్లుల్లి: వెల్లుల్లి రుచి దాదాపు ప్రతి కూరలు, చారుల్లోనూ దట్టిస్తారు. కానీ ఆహారం తినేటప్పుడు వీటిని పక్కనపెట్టేవాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ ఇది తినడం వల్ల రుచి మాత్రమే కాదు ఆరోగ్యమూ బాగుంటుంది. ఇందులో ఉండే విటమిన్ B, Cతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారించడానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటు, కార్డియోవాస్కులర్‌ డీసీజ్‌లను నివారించే శక్తి ఉంది.

క్యాబేజ్‌: క్యాబేజ్ అంటే చాలామంది నో చెప్పేస్తారు. కానీ ఇందులో ఉండే లో సాచురేటెడ్‌ ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌ శరీరానికి ఎంతో అవసరం. క్యాబేజ్‌ నుంచి ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ పొందవచ్చు. హార్ట్‌‌రేట్‌ను, రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో, క్యాబేజ్‌ వల్ల లభించే పాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ కీలకపాత్ర పోషిస్తాయి.

పాలు: పాల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలలో ఉండే ఐరన్‌, కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్స్‌ మరియు ప్రోటీన్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న వేరే ఆహార పదార్థం మరొకటి లేదు.

ఆయిల్ పుల్లింగ్ వల్ల పొందే అమోఘమైన ప్రయోజనాలు…

download (8)

ఆయిల్ పుల్లింగ్ నోటిని శుభ్రం చేయడానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. ఆరోగ్యపరంగా దీని ఉపయోగాలు అమోఘం. కాబట్టే మన పూర్వీకులు కూడా ఈ పద్ధతిని పాటించేవాళ్లు. ఈ ప్రక్రియ నోటి వరకే పరిమితం అయినప్పటికీ శరీరంలోపలి భాగాలను ఆరోగ్యంగా మారుస్తాయి. ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించే నూనెల వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

ఆయిల్ పుల్లింగ్ కి రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి కూడా మంచిది. కొబ్బరినూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించవచ్చు. 15 నుంచి 20 నిమిషాల ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. కాకపోతే వీటిని ఎట్టిపరిస్థితుల్లో మింగకూడదు.

చర్మానికి: ఆయిల్ పుల్లింగ్ వల్ల చర్మానికి మంచిదని చాలా మందికి తెలియదు. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చర్మం హెల్తీగా మారడంతోపాటు, గ్లోయింగ్ గా మారుతుంది. నోటి ద్వారా శరీరం లోపలికి వెళ్లే బ్యాక్టీరియాను నోట్లోనే నాశనం చేసే సత్తా ఆయిల్ పుల్లింగ్ కి ఉంది. దీనివల్ల రక్తం శుద్ధి అయి, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

హార్మోన్ పనితీరుకి: మనం ఆరోగ్యంగా ఉండటానికి హార్మోన్ల పనితీరు సజావుగా ఉండాలి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ అలవాటు చేసుకోవడం వల్ల హార్మోనల ఇంబ్యాలెన్స్ సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు.

రోగనిరోధక శక్తి: ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్లలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రకరకాల అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి పొందడానికి ఆయిల్ పుల్లింగ్ చాలా చక్కటి ఉపాయం. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా 20 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలా మంచి ఫలితం పొందవచ్చు.

తెల్లటి పళ్లకి: ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పళ్లు మిళమిళ మెరిసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకి కనీసం 20 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పళ్లకు గారపట్టడానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేయవచ్చట. అలాగే యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల ఇవి పళ్లు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడతాయట.

పొటాషియం ఉండే ఆహార ప‌దార్థాలు తీసుకుంటే బీపీకి చెక్…

images

పొటాషియం శ‌రీరానికి కావాల్సిన స్థాయిలో అందితే గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం త‌క్కువ‌గా ఉంటుంది. కేవలం నాలుగువారాలు ఉప్పు వాడకం తగ్గించినా కూడా రక్తపోటు తగ్గుతుంది.

స‌రైన ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువ‌గా తీసుకోవాలి. అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరుసెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీరల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉన్నవారిలో రక్తపోటు సమస్య త‌క్కువ‌గా ఉంటుంది. క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి మామూలు వాడకం కన్నా కాస్త ఎక్కువ‌గా తీసుకున్నా మంచిదే.

వేరుసెనగ, ఆలివ్, రైస్ బ్రాన్ నువ్వుల నూనెల‌ వాడకం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మైదాతో చేసిన పఫ్‌లు, కార్పొహైడ్రేట్లు అధికంగా ఉండే పదార్థాలు పూర్తిగా మానేయడం మంచిది.

ప్రేగు క్యాన్సర్‌ని నివారించే వంకాయ…

download (16)

వంకాయలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. ఇంకా రోజూ ఆహారంలో వంకాయను తీసుకోవడం వలన ప్రేగు క్యాన్సర్‌ని నివారించుకోవచ్చును.

బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే క్రాన్ బెర్రీ జ్యూస్…

images (75)

క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఉండే రసాయనిక అంశాలు, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి 20 ఏళ్ళ దాటిన మహిళలు ఈ క్రాన్ బెర్రీ  జ్యూస్ ను త్రాగడం ఒక అలవాటుగా మార్చుకొని, బ్రెస్ట్ క్యాన్సర్ దరిచేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మతిమరపును నివారించే పాలకూర…

images

మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర.. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి.

కంటిచూపు మెరుగవ్వాలంటే… టమోటాల్ని ఆహారంలో చేర్చుకోండి…

download (13)
టమోటాలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు…
–  టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది.
– విటమిన్ ఎ, సిలు వుండే టమోటాలను యాంటీయాక్సిడెంట్ల ద్వారా డీఎన్‌ను డామేజ్ చేయకుండా కాపాడుతుంది.
టమోటాలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌, గుండెపోటు, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చును.
టమోటాలు తీసుకుంటే నిత్యయవ్వనులుగా ఉంటారు. చర్మాన్ని, కేశానికి సంరక్షించే యాంటీయాక్సిడెంట్లు టమోటాల్లో పుష్కలంగా వున్నాయి.
విటమిన్ కె, క్యాల్షియంలు కలిగిన టమోటాలను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యమవుతాయి.
టమోటా అనేక క్యాన్సర్ వ్యాధులు అనగా ప్రోస్టేట్, ఉదర, నోటి వంటి ఇతరత్రా క్యాన్సర్లను నియంత్రిస్తుంది.
టమోటా శరీరంలోని చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.