Posts Tagged ‘healthy teeth’

పంటి ఆరోగ్యానికి క్యాల్షియం… ఎటువంటి ఆహారంలో ఉంటుంది?

images

ఎముకల సాంద్రత పెంచడం నుంచీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా రోజూ క్యాల్షియం అందేలా చూసుకోవాలి. ఫలితంగా ఏళ్లు గడిచేకొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే సమస్య చాలా మటుకూ తగ్గుతుంది. పైగా ఈ పోషకం కండరాలనే కాదు, నాడీవ్యవస్థను కూడా దృఢంగా ఉంచుతుంది.

టైపు2 మధుమేహం రాకుండా జాగ్రత్తపడాలంటే క్యాల్షియంతోపాటూ, విటమిన్ ‘డి’ పోషకాన్ని కూడా తీసుకుంటే సరిపోతుంది. ఈ పోషకం కేవలం పాలు, పాల ఉత్పత్తుల నుంచే కాదు చేపలూ, సోయాబీన్స్, నువ్వులూ, నట్స్, పప్పులూ, ఆకుకూర నుంచి లభిస్తుంది.

పళ్ళను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి…

images (7)

కొన్ని పదార్ధాలని మనమెంతో ఇష్టంగా తింటాం. వాటిల్లో కొన్ని పళ్ళకు హాని చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటి వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే కొన్ని పళ్ళకు మేలు చేసేవి కూడా ఉంటాయి.

పళ్ల ఎనామిల్‌కి హాని చేసే వాటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పదార్ధాలు ముందుంటాయి. చిప్స్, తెల్ల బ్రెడ్, పాస్తా మరియు పిజ్జా లాంటివి మరీ తియ్యగా ఉండకపోవచ్చు కానీ తిన్నవెంటనే నోట్లో ఉండగానే చక్కెరగా మారిపోతాయి. వీటిని ఎంత తక్కువగా తింటే మన పళ్ళకు అంత మంచిది.

నిమ్మజాతి పండ్లు, టొమాటోలు మరియు ద్రాక్ష ఆహారంగా తీసుకున్నపుడు పళ్ళను శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

పాలు, పెరుగు, పనీర్ మరియు చీజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు మరియు లవణాలు పళ్ళ ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియంని అందిస్తాయి.

అలాగే పీచు శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయల్ని తరుచూ తీసుకుంటే మంచిది.

గోరు వెచ్చని గ్రీన్ టీ త్రాగడం వలన పళ్ళకు మేలు జరుగుతుంది. అందులో ఉండే పాలి ఫెనాల్స్ బ్యాక్టీరియాను నశింపచేసి దంత క్షయాన్ని అరికడతాయి.

దంత ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల నూనె…

dental-health-and-hygiene
నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి. ఈ నూనెతో అలర్జీలు వస్తాయన్న భయం కూడా లేదు. దంతాలు తెల్లబడాలనుకునేవారు ఇలా కొబ్బరినూనెతోనూ ప్రయత్నించవచ్చు.

చిగుళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడే మిరియాలు…

pepper

ఒక కప్పు నీటిలో మిరియాల పొడి, ఉప్పు రెండింటినీ సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చిగుళ్ల ఆరోగ్యం మెరుగవడమే కాదు, పలు దంత సమస్యల నుంచి బయటపడవచ్చు.

గోధుమ గడ్డి రసంతో దంత సమస్యలు ముటుమాయం…

wheatgrassగోధుమ గడ్డి రసం దంత సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. ఈ గడ్డిని తీసుకుంటే దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పులు కూడా దూరమవుతాయి.

దంత క్షయం నివారించే కొబ్బరి నూనె…

coconutoil

దంతక్షయం లేదా ఓరల్ సమస్యలను నివారించుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ వంటివి చేస్తుంటారు. ఇతర హోం రెమెడీస్ ను ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఓరల్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

ఆరోగ్యకరమైన మెరిసే దంతాల కోసం నూనె మరియు ఉప్పు…

download (4)

కొబ్బరి నూనెను నేచురల్ టూత్ పేస్ట్‌ల్లో కూడా ఉపయోగిస్తారు. కొద్దిగా ఉప్పులో కోకనట్ ఆయిల్ వేసి దంతాల మీద రుద్దడం వల్ల దంతాలు ఆరోగ్యంగా, దంతక్షయం లేకుండా మెరుస్తుంటాయి.

దంతాలకు మేలు చేసే ఆకుకూరలు…

dark-green-leafy
ఆకుకూరలు దంతాలకు ఎంతో మేలు చేస్తాయట. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు దంతాలను కూడా దృఢంగా వుంచుతాయి. అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఇవి వుంటాయి. ఈ పోషకాలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాగే క్యారెట్‌, యాపిల్‌ వంటివి బాగా తినాలి. వీటిని నమలడం వల్ల లాలాజలం వృద్ధి అవుతుంది. ఫలితంగా మేలు చేసే ఎంజైములు విడుదలవుతాయి. పళ్ల మధ్యలో ఉన్న బ్యాక్టీరియా దూరమవుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది.
ఇంకా దంతాలు బలంగా ఉండాలంటే.. క్యాల్షియం ఎక్కువగా ఉండే కోడిగుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. గుడ్డులోని సొన దంతాలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. చిన్నారులకు ఇవ్వడం ద్వారా దంతాలతో పాటు ఎముకలు బలంగా మారుతాయి. వీటితో పాటు ఫాస్పరస్‌ అందాలంటే మాంసాహారం తినాలి. ఈ ఫాస్పరస్.. పళ్లకు ఎంతో మేలు చేస్తుంది. మాంసం, చేపలు తినడం పళ్లకు మంచిది. ఇవి తీసుకోవడం వల్ల అత్యవసరమైన ఖనిజాలు అంది.. పళ్లపై ఉండే ఎనామిల్‌ కూడా గట్టిపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తెల్లగా మెరిసే దంతాల కోసం కొబ్బరినూనె.

coconut oil

కొబ్బరినూనెలో ఉండే లారిక్‌యాసిడ్ దంతాలపైన బాక్టీరియాలు చేరడానికి దారితీసే పాచి వంటి వలయాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడ్తుంది. అదేవిధంగా దంతాలు చెడు వాసన రాకుండా శుభ్రంగా ఉంచుతుంది.
రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకునే ముందు కొంచెం కొబ్బరినూనెను వేలితో దంతాలను రుద్దాలి. కొబ్బరినూనెను మింగకుండా జాగ్రత్త పడాలి. తరువాత దంతాలను నీళ్ళతో శుభ్రంచేసుకుని బ్రష్ చేసుకోవాలి.

పళ్ల ఆరోగ్యానికి సంజీవని జాజికాయ…

images (76)

జాజికాయ పళ్ల ఆరోగ్యానికి సంజీవని అని చెప్పాలి. ఇది యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. కాబట్టి నోటిలో బ్యాక్టీరియాని నాశనం చేసి.. క్యావిటీల నుంచి రక్షించడానికి జాజికాయ ఉపయోగపడుతుంది.