Posts Tagged ‘home decor’

డైనింగ్ టేబుల్ ను అందంగా సర్దేద్దాం ఇలా…

images (34)

మీ డైనింగ్‌ టేబుల్‌ శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు…

1. మీ డైనింగ్‌ టేబుల్‌ డిజైన్‌కి తగ్గ క్లాత్‌ని సెలెక్ట్‌ చేసి దానిమీద వేస్తే డైనింగ్‌టేబుల్‌ అందంగా కన్పిస్తుంది. కాబట్టి మంచి డిజైన్‌ ఉన్న క్లాత్‌ని ఎంపిక చేసుకోవాలి.

2.వంటింట్లో వండిన పదార్థాలు టేబుల్‌పైన పెట్టే ముందు చిన్న స్టీల్‌స్టాండ్‌ను టేబుల్‌పైన ఉంచి వాటిపైన ఆ పదార్థాల పాత్రల్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల టేబుల్‌పైన ఎలాంటి గీతలు పండేందుకు అవకాశం ఉండదు.

3. ఉదయం టిఫిన్‌ ఐటెమ్స్‌ చట్నీ, హాట్‌బాక్స్‌లో ఇడ్లీలు, వేరేవి ఏవైనా ఉంటే వాటిని నీట్‌గా టేబుల్‌పైన సర్దాలి.

4. కుటుంబ సభ్యులు తినే టైంలోనే ప్లేట్లు, నీళ్లగ్లాసులు ఉంచాలి. తిన్నవెంటనే ఆ సామాన్లు తోమేందుకు వేసేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ తినేసిన కంచాలు, ప్లేట్లను టేబుల్‌పైన ఉంచకూడదు.

5. డైనింగ్‌ టేబుల్‌ పై అన్ని వస్తువులు తీసేసి సబ్బునీళ్లలో తడిపిన బట్టతో లేదా స్పాంజ్‌తో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడిబట్టతో తుడవాలి.

6. ఈ రోజుల్లో చిన్నగ్లాస్‌లో నీరు పోసి పెంచే మొక్కల్ని డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకుంటున్నారు. మీకు అలాంటి టేస్ట్‌ ఉంటే అందంగా అలంకరించుకోండి. అయితే ఒక్క సంగతి మాత్రం మరువకండి. ప్లాంట్‌లో పోసిన నీటిని రోజు విడిచి రోజు మార్చాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల మీ డైనింగ్‌ టేబుల్‌ ఎంతో అందంగా కన్పిస్తుంది. అంతేకాదు మీ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

మొక్కలతో బాల్కనీని అందంగా అలంకరించడానికి టిప్స్…

images (50)

1. ఫ్లోరింగ్ పాత్ర పోషిస్తుంది :

మీరు బాల్కనీ అలంకరించేందుకు మొదటి స్టెప్ ఫ్లోరింగ్ అని చెప్పవచ్చు. సరైన ఫ్లోరింగ్ ఉపయోగించుట వలన మీ బాల్కనీ ఒక సొగసైన అందాన్ని ఇస్తుంది. బాల్కనీ ఫ్లోరింగ్ తెలుపు లేదా లేత రంగు టైల్స్ ఉపయోగించుట వలన మోడరన్ రూపాన్ని కలిగి ఉంటుంది.

2. మొక్కలు :

రెండవ పెద్ద స్టెప్ ఏమిటంటే మీరు బాల్కనీ అలంకరించేందుకు సరైన మొక్కలు ఎంచుకోవలసిన అవసరం ఉంది. తాజా, బలమైన మొక్కలు మరియు లావెండర్ మొక్కలు వేయుట వలన మీరు నివసిస్తున్న ప్రదేశము ఆకర్షణీయముగా ఉండటం గమనించండి. మీ మానసిక స్థితి మార్చడం మరియు విశ్రాంతిని కలిగిస్తాయి. కాబట్టి మీరు మొక్కలు కొనుగోలు చేయడం కొరకు ఖర్చు పెట్ట్టిన డబ్బుకు విలువ ఉంటుంది. ఇప్పటికే బాల్కనీ లో నాటిన కొన్ని మొక్కలు ఉంటే వాటిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్కల డెడ్ ఆకులను తొలగించాలి.

3. ఒక హద్దుని గీయండి :

మీరు డాబా అంచుల మీద పెంచటం వలన ఒక అందమైన రూపాన్ని అందిస్తాయి. అంతేకాక ఇది కూడా మీ బాల్కనీని మరింత విశాలంగా కనిపించేలా చేస్తుంది. ఒక పెద్ద ఖాళీ బాల్కనీ దగ్గరకు వచ్చినప్పుడు అంచులలో మొక్కలకు కూడా ఒక కంచె వలె హద్దును ఏర్పాటు చేయవచ్చు. ఒక చిన్న బాల్కనీ అయితే కూడా ఒక గొప్ప లుక్ ఇవ్వవచ్చు. అంతేకాకుండా మీరు బాల్కనీ కోసం ఒక మంచి రంగును ఎంచుకోండి. ఇది మీ బాల్కనీ రూపాన్ని మరియు గొప్పతనాన్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుంది.

డ్రెస్సింగ్ రూం అందంగా, ఆకర్షణీయంగా కనబడాలంటే…

4-47

– పర్‌ఫెక్ట్ లైటింగ్: డ్రెస్పింగ్ రూం లో ముఖ్యంగా ఉండాల్సింది కరెక్ట్ లైటింగ్ డిజైన్. డ్రెస్సింగ్ రూంలో లైటింగ్ బ్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అలంకరించుకొన్నప్పుడు అందంగా అలంకరించుకొన్నారా లేదా అన్నవిషయం తెలుస్తుంది. వైట్ సీలింగ్ లైట్స్, మిర్రర్ లైట్స్, చిన్న లెడ్ లైట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

– ఫర్నీచర్: మాడ్రెన్ డిజైన్ రూం అందంగా కనిపించాలంటే ఆకర్షించే ఫర్నీచర్ కూడా ఉండాలి. దాంతో ఆహ్లాదకరమైన వాతవరణం ఏర్పడుతుంది. డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతారు. ఎలా అంటే ముఖ్యంగా డ్రెస్సింగ్ రూంలో అమర్చే పొడవాటి అద్దాలు వివిధ, డిజైన్లు, ఆకారాల్లో ఉంటే ఆకర్షణగా ఉంటాయి.

– డ్రెస్పింగ్ రూంలో అలంకరణకు ఉపయోగపడే చైయిర్స్: కూర్చొని అలంకరించుకొనే చెయిర్స్ కూడా మాడ్రెన్ గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా డ్రెస్సింగ్ రూంలో కలర్ ఫుల్ పిల్లోస్, కుషన్లు కూడా పెట్టి అలంకరించుకోవచ్చు.

– వార్డ్ రోబ్: డ్రెస్పింగ్ రూంలో ఉండాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అలంకరణ వస్తువు వార్డ్ రోబ్. అలంకరించుకొనే వస్తువులు, దుస్తులు దాచుకోవడానికి వార్డ్ రోబ్ అవసరం. దీనివల్ల వాటివాటి ప్లేస్ లో సర్దుకోవడం వల్ల చూడటానికి చక్కగా కనిపిస్తుంది.

– ఫ్లోరింగ్ అండ్ డ్రెస్పింగ్ కలర్: డ్రెస్పింగ్ రూం మరింత అందంగా కనిపించాలంటే ఫ్లోరింగ్ అదిరిపోవాల్సిందే. సిరామిక్స్ టైల్స్, లామినేటెడ్ ప్లోరింగ్ కాంక్రీట్ ప్లోరింగ్ తో ఆగదికి మరింత ఆకర్షణ చోటు చేసుకుంటుంది. అంతే కాదు ఇవి అమర్చుకోవడం వల్ల శుభ్రం చేయడానికి సులభమైతుంది.

– వాల్ కలర్స్: డ్రెస్పింగ్ రూం కి వాల్ కలర్స్ నేచర్ కలర్స్ బాగా నప్పుతాయి. నేచ్యురల్ కలర్ వాల్ పేపర్స్ ను అమర్చుకొంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇంట్లో హెయిర్‌ పిన్నులు, కాటన్‌ బాల్స్‌, మానిక్యూర్‌ సామాగ్రి తదితర వస్తువులను చక్కటి గాజు పాత్రల్లో వేసి ఉంచితే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. గాజు పాత్రల్లో ఉంచటం వల్ల అవి స్పష్టంగా కనిపిస్తాయి. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వీటిని డ్రెస్సింగ్‌ రూం పక్కగానో లేదా కప్‌బోర్డ్‌లోనూ సర్దుకోవచ్చు, షాంపూలు, సబ్బులు లాంటివి కూడా బాత్రూంలో ఇలాగే గాజు పాత్రలో పెట్టుకుంటే మంచిది. ఇకపోతే పరిమళాలను వెదజల్లే క్రొవ్వొత్తులు, ఎయిర్‌ స్ప్రేలు మీ మీ అభిరుచులకు తగినట్లుగా ఎంచుకుని రూంలలో వాడటం మంచిది.

ఇంటి అందాన్ని, అలంకరణను పెంచే వాల్ క్లాక్స్…

download (26)

ఇంటికొచ్చిన అతిథుల చూపులను కట్టిపడేయాలనుకుంటే వాకిలికి ఎదురుగా లేదా లివింగ్‌ రూమ్‌లో పెద్ద రస్టిక్‌ క్లాక్‌ను ఏర్పాటు చేయాలి. ఆకారంలో పెద్దదిగా ఉండి అంకెలు కూడా స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఫ్లోటింగ్‌ నంబర్స్‌, మోనోక్రొమాటిక్‌ కలర్‌ స్కీమ్‌ కలిగి ఉండే క్లాక్‌లు లివింగ్‌ రూమ్‌లో చక్కగా ఇమిడిపోతాయి. అయితే ఇలాంటి డెకరేటివ్‌ క్లాక్‌ గదిలోని ఫర్నిచర్‌ను డామినేట్‌ చేసేలా ఉండకుండా చూసుకోవాలి. గదిలోని మిగతా వస్తువులతో మ్యాచ్‌ అయ్యేలా ఉండాలి. ఇతర ఆర్ట్‌ పీస్‌లు, ఫొటోగ్రా్‌ఫలు ఏవీ లేకుండా ఖాళీగా ఉండే గోడ మీద ఓవర్‌సైజ్‌ రెట్రో క్లాక్‌ను అమరిస్తే లివింగ్‌ రూమ్‌ మరింత ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.

ఇంటికి వన్నెతెచ్చే లగ్జరీ క్యాండిల్ హోల్డర్స్ …

images (4)

– ఒకే క్యాండిల్ తో: ఎక్కువ వెలుగు లేకుండా ఒకే క్యాండిల్ అమర్చుకొనే క్యాండిల్ హోల్డర్స్ కూడా ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లలో లభిస్తున్నాయి. దీనికి చేత్తో పట్టుకోవడానికి హోల్డర్, క్రింది భాగంలో పొందికైన ఆధారం కూడా ఉంటాయి. ఈ క్యాండిల్ హోల్డర్ ను ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు. క్యాండిల్స్ లైట్ డిన్నర్ చేయాలనుకున్నప్పుడు డిమ్ లైటింగ్ కోసం వీటిని అక్కడక్కడా ఉపయోగించుకోవచ్చు.

– వెరైటీ క్యాండిల్ హోల్డర్లు: క్యాండిల్ హోల్డర్లు గురించి చెప్పుకునేటప్పుడు ‘క్యాండిలాబ్రా’ హోల్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ హోల్డర్ చెట్టు ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనిలో ఎక్కువ కొవ్వొత్తులు అమర్చుకోవచ్చు.

– హుందాతనం కోసం: ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దే క్యాండిల్ హోల్డర్స్ షాండ్లియార్లు కూడా ఒకటి. వీటిలో కూడా క్యాండిలాబ్రా హోల్డర్లు లాగానే ఎక్కువ కొవ్వుత్తులు అమర్చుకొనే విధంగా శాఖలుంటాయి. వీటిని ఇంట్లో హాల్లో అమర్చుకోవచ్చు.

– లోహపు పాత్రలో: ఇనుము, గాజు, ప్లాస్టిక్, చెక్కవంటి పదార్థాలతో చేసిన పాత్రల్లో అమర్చిన క్యాండిళ్ళను టీలైట్ క్యాండిల్ హోల్డర్లు అంటారు. ఇవి ఎత్తు తక్కువగా ఉండి, విశాలంగా ఉంటాయి. పైగా వీటిలో అమర్చిన క్యాండిల్ కరిగి అందులోనే పడడం వల్ల కొవ్వొత్తి ఎక్కువ రోజులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవి చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు వీటిని అక్కడక్కడా అమర్చడం వల్ల ఇల్లంతా సరికొత్తగా తయారవుతుంది.

– సంప్రదాయ కళ: ప్రత్యేకించి పండగ సమయాల్లో ఇంటి అందాన్ని పెంచడం కోసం కూడా ఎన్నో రకాల క్యాండిల్ హోల్డర్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో బంగారం లేదా వెండితో తయారైనవి కూడా ఉండడం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో కొవ్వొత్తులు వెలిగించడానికి వీలుగా ఉండే వీటిని గదిలో ఒక పక్కకు అమర్చిన టేబుల్ పై అలంకరించుకుంటే ఇంటికి సంప్రదాయబద్దమైన కళ వస్తుంది.

గృహశోభ కోసం ఇంటీరియర్ లైటింగ్ డిజైనర్ ఐడియాస్…

download (5)

లివింగ్ రూం/హాల్: హాల్ లో లైటింగ్ పై ప్రత్యేక శ్రద్ద కనబరచాలి. మూడు లేదా నాలుగు కార్నర్స్ నుంచి లైటింగ్ పడే విధంగా ఎరేంజ్మెంట్స్ చేసుకోవాలి. డెకరేటివ్ ఐటెం ని హైలైట్ చేసే విధంగా లైటింగ్ ఉండాలి. సాయంత్రం రిలాక్స్ అవడానికి డిమ్ గా ఉండే లైట్లను ను ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్ రూం: రిలాక్సేషన్ కు మొట్టమొదటిగా అందరూ ప్రెఫరెన్స్ ఇచ్చే గది బెడ్ రూం. అందుకు తగ్గట్టే బెడ్ రూం లో రిలాక్సేషన్ ను కలిగించే బెడ్ సైడ్ లాంప్స్ కి ప్రెఫరెన్స్ ఇవ్వండి. లైట్స్ ప్రశాంతంగా ఉన్నవి ఎంచుకోండి. బెడ్ సైడ్ లాంప్స్ దొరకకపొతే ఫ్లోర్ లాంప్స్ కి ప్రెఫరెన్స్ ఇవ్వండి. మీ బెడ్ ను ఫేస్ చేసి ఉన్న ఫ్రంట్ వాల్ పై కూడా దృష్టి పెట్టండి. ఆ వాల్ పై కూడా లైటింగ్ చక్కగా పడేలా ఏర్పాట్లు చేస్తే బెడ్ రూం కి అందమైన లుక్ వస్తుంది.

కిచెన్: కిచెన్ లో వెలుతురు చక్కగా ఉండడం ఎంతో అవసరం. ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు సరైన పదార్థాలను వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి వెలుతురు అవసరం. డిమ్మెర్ ఉన్న ఓవర్ హెడ్ లైటింగ్ కు ప్రాధాన్యతనివ్వండి. అండర్ కేబినేట్ లైట్స్ ను కూడా వాడవచ్చు. కిచెన్ కార్నర్స్ కి అలాగే సింక్ కి వెలుతురు సరిగ్గా చేరడానికి అమిత ప్రాధాన్యతనివ్వండి.

డైనింగ్ హాల్: అందరూ కలిసి చక్కాగా ముచ్చటించుకుంటూ భోజనం చేస్తారిక్కడ. గ్రాండ్ లుక్ కోసం డైనింగ్ టేబుల్ పైన షాన్డిలియర్ ని ఏర్పాటు చేసుకోండి.

రోజూ శుభ్ర పరిస్తే… తళ తళ మెరుపులే!…

5e78130b51c44d7f6139a113edc32a15

ఇంటికి ప్లాస్టిక్ కిటికీలు పెడితే ప్రయోజనమే. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఈ రకమైన వస్తువులకు ప్రత్యేకతనిస్తుంది. గ్లాస్ విండోల కంటే కూడా ప్లాస్టిక్ విండోలు బాగుంటున్నాయని సర్వేలో తేలింది. ప్లాస్టిక్ విండోల వలన ప్రయోజనాలు పరిశీలిద్దాం.

గీతలు పడకుండా వుంటాయి.

అధికమైన లైటింగ్ ఇంటిలోపలికి ప్రసరిస్తుంది.

గ్లాస్ విండోలకంటే కూడా బలంగా వుంటాయి. అయితే వీటిని తరచుగా శుభ్రం చేయాల్సి వుంటుంది. శుభ్రం చేయటానికి కొన్ని చిట్కాలను పరిశీలించండి.

1. ఒక తడిగుడ్డ, ఒక బకెట్ సోప్ నీరు, ఒక బకెట్ సాధారణ నీరు వుంచండి.

2. మెత్తటి గుడ్డ లేదా స్పాంజిలను ముందుగా సోప్ నీటిలో ముంచి మెల్లగా ప్లాస్టిక్ విండోను శుభ్రం చేయండి.

3. మరో గుడ్డ లేదా స్పాంజిని సాధారణ నీటిలో ముంచి విండోను తుడిచి, అధికంగా వున్న సోప్ నీటిని తీసేయండి. దీనితో సోప్ మరకలు కనపడకుండా వుంటాయి.

4. ఇక నీటి మరకలు కనపడకుండా, మెత్తటి పొడి గుడ్డ తో మెల్లగా విండో తుడిచేయండి. ఈ శుభ్రత చిట్కాలు రోజూ పాటిస్తే మీ ఇంటి కిటికీలు తళ తళ లాడుతూంటాయి.

ఫ్లవర్ వేజ్ పూలు వాడకుండా…

04-charcoal

ప్రతి వారికి పూలు అంటే ఇష్టమే. ఏదో ఒక కారణంగా, బూకేలు లేదా ఫ్లవర్ వేజ్ అలంకరణలుగా పూలను ఇంటిలో పెట్టి ఆనందిస్తారు. కాని కొద్ది రోజుల్లో అవి వాడిపోతాయి. వాటిని ఎక్కువ రోజులు వాడకుండా వుంచాలంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అవేమిటో పరిశీలించండి.

– నీరు: పూలు వాడకుండా వుండాలంటే నీరు వుండాలి. వాటికి తగినంత నీటిని చల్లటం లేదా నీటిలో వుంచటం చేస్తూ వుండండి.

– కాడలు తుంచండి: కాడలు తుంచేస్తే అవి తాజాగా ఎక్కువ రోజులుంటాయి. తుంచాలంటే, కత్తెరకంటే, కత్తిని ఉపయోగించండి.

– నీరు మార్చండి: ఫ్లవర్ వేజ్ లో నీటిని రోజూ మార్చండి. నిలువ నీటికి పూలు వాడిపోతాయి.

– చల్లని ప్రదేశం: పూలను ఎండ తగలని చోట లేదా చల్లని ప్రదేశంలో వుంచండి. వాడిన పూలను వేరు చేసి తీసేయండి.

– షుగర్: పూలను వుంచిన నీటిలో ఒక స్పూను షుగర్ వేయండి. పూలు తాజాగా వుంటాయి.

పూలను వుంచే నీరు అతి చల్లగాను లేదా అతి వేడిగా వుండక రూమ్ టెంపరేచర్ లో వుండాలి.

ఇంటి ఆందానికి, ఆకర్షణకి టీపాయ్ అలంకరణ ఎలా ఉండాలంటే…

download (3)

ఎవరైన ఇంటికి రాగానా ముందుగా అడుగు పెట్టేది హాల్లోనే. అతిథులకు స్వాగతం లభించేది ఇక్కడే. కొన్ని కొన్ని సమయాల్లో మనం రిలాక్స్ అవ్వాలంటే హాలే మంచి ప్లేస్. మరి అలాంటి హాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనబడాలంటే కుర్చీలు, సోఫాలు, దీవాన్లు, కార్పెట్లు, ఫోటో ఫ్రేమ్ లు ఇవే కాదు ఉండాల్పింది. వీటితో పాటు ఒక టీపాయ్ దానీ మీద ఓ ప్లవర్ వాజ్, పక్కనే న్యూస్ పేపర్ లేదా వీక్లీ మ్యాగజైన్స్. వచ్చిన అథితులకు రిలాక్స్ అవ్వడానికి, బోరుకొడితే చదువుకోవడానికి ఉపయోగపడుతాయి.

టీపాయ్ అలంకరణలోనూ ఇంటి అందం ముడిపడి ఉంది. చూడటానికి చిన్న సైజులో ఉన్నా దీని ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. టీ సర్వ్ చేయడానికి. పేపర్, మ్యాగజైన్ పెట్టుకోవడానికి, ఇంటి ఆకర్షణలో ఫవర్ వాజులు నింపుకోవాడానికి ఇలా ఎన్నో ఉపయోగాలున్న టీపాయ్ ఎలా ఉండాలంటే..

టీ టేబుల్‌ ను రౌండ్ టేబుల్‌ లా ఏర్పాటు చేసుకొంటే చాలా బాగుంటుంది. దానికి సరిపడా ఓ అద్దాన్ని కట్ చేయించి. ఆ టేబుల్ పైన చక్కటి ముదురు రంగు మఖమల్ వస్త్రాన్ని పరిచి దానిపైన మీకు నచ్చిన జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను ఒకదాని పక్కన ఒకటి పరచాలి. ఆ పైన అద్దాన్ని టేబుల్‌ కి బిగించుకోవచ్చు. అందులో పొందుపరచిన ఫోటోలు తాలూకు అందమైన జ్ఞాపకాలను తలచుకుంటూ హాయిగా టీని సేవించి చూడండి. అందులో ఎంత హాయి దాగుంటుందో తెలిసిపోతుంది.

టీపాయ్ ల్లో కూడ విభిన్న రకాలు ఉన్నాయి. వాటిలో రెండు కాళ్ళు, మూడుకాళ్ళు, నాలుగు కాళ్ళున్నవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీపాయ్ రెండు అరలుగా ఉంటే టీపాయ్ మీద తాజాపువ్వులు అలంకరించిన ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే చాలు. క్రింది అరలో న్యూస్ పేపర్ పెట్టుకొంటే చూడటానికి అందంగా ఉంటుంది. అన్ని ఒకే చోటులేకుండా సపరేట్ గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి టీ పాయ్ కొనేటప్పుడు ఇంట్లో లభించే స్థలంను బట్టి చిన్నసైజ్ పెద్ద సైజు వంటి టీపాయ్ లను ఎంపిక చేసుకొని మరీ కొనాలి.

డ్రెస్సింగ్ రూం అందంగా..ఆకర్షణీయంగా కనబడాలంటే?

wooden-dressing-table-500x500

1. పర్‌ఫెక్ట్ లైటింగ్: డ్రెస్పింగ్ రూం లో ముఖ్యంగా ఉండాల్సింది కరెక్ట్ లైటింగ్ డిజైన్. డ్రెస్సింగ్ రూంలో లైటింగ్ బ్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అలంకరించుకొన్నప్పుడు అందంగా అలంకరించుకొన్నారా లేదా అన్నవిషయం తెలుస్తుంది. వైట్ సీలింగ్ లైట్స్, మిర్రర్ లైట్స్, చిన్న లెడ్ లైట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

2. ఫర్నీచర్: మోడ్రన్ డిజైన్ రూం అందంగా కనిపించాలంటే ఆకర్షించే ఫర్నీచర్ కూడా ఉండాలి. దాంతో ఆహ్లాదకరమైన వాతవరణం ఏర్పడుతుంది. డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతారు. ఎలా అంటే ముఖ్యంగా డ్రెస్సింగ్ రూంలో అమర్చే పొడవాటి అద్దాలు వివిధ, డిజైన్లు, ఆకారాల్లో ఉంటే ఆకర్షణగా ఉంటాయి. డ్రెస్పింగ్ రూంలో అలంకరణకు ఉపయోగపడే చైయిర్స్ కూర్చొని అలంకరించుకొనే చెయిర్స్ కూడా మోడ్రన్ గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా డ్రెస్సింగ్ రూంలో కలర్ ఫుల్ పిల్లోస్, కుషన్లు కూడా పెట్టి అలంకరించుకోవచ్చు.
3. వార్డ్ రోబ్: డ్రెస్పింగ్ రూంలో ఉండాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అలంకరణ వస్తువు వార్డ్ రోబ్. అలంకరించుకొనే వస్తువులు, దుస్తులు దాచుకోవడానికి వార్డ్ రోబ్ అవసరం. దీనివల్ల వాటివాటి ప్లేస్ లో సర్దుకోవడం వల్ల చూడటానికి చక్కగా కనిపిస్తుంది.

4. ఫ్లోరింగ్ అండ్ డ్రెస్సింగ్ కలర్: డ్రెస్సింగ్ రూం మరింత అందంగా కనిపించాలంటే ఫ్లోరింగ్ అదిరిపోవాల్సిందే. సిరామిక్స్ టైల్స్, లామినేటెడ్ ప్లోరింగ్ కాంక్రీట్ ప్లోరింగ్ తో ఆగదికి మరింత ఆకర్షణ చోటు చేసుకుంటుంది. అంతే కాదు ఇవి అమర్చుకోవడం వల్ల శుభ్రం చేయడానికి సులభమైతుంది.

5. వాల్ కలర్స్: డ్రెస్సింగ్ రూం కి వాల్ కలర్స్ నేచర్ కలర్స్ బాగా నప్పుతాయి. నేచ్యురల్ కలర్ వాల్ పేపర్స్ ను అమర్చుకొంటే చాలా అందంగా..ఆకర్షణీయంగా ఉంటుంది.

6. ఇంట్లో హెయిర్‌ పిన్నులు, కాటన్‌ బాల్స్‌, మానిక్యూర్‌ సామాగ్రి… తదితర వస్తువులను చక్కటి గాజు పాత్రల్లో వేసి ఉంచితే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. గాజు పాత్రల్లో ఉంచటం వల్ల అవి స్పష్టంగా కనిపిస్తాయి. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వీటిని డ్రెస్సింగ్‌ రూం పక్కగానో, లేదా కప్‌బోర్డ్‌లోనూ సర్దుకోవచ్చు, షాంపూలు, సబ్బులు లాంటివి కూడా బాత్రూంలో ఇలాగే గాజు పాత్రలో పెట్టుకుంటే మంచిది. ఇకపోతే పరిమళాలను వెదజల్లే క్రొవ్వొత్తులు, ఎయిర్‌ స్ప్రేలు మీ అభిరుచులకు తగినట్లుగా ఎంచుకుని రూంలలో వాడటం మంచిది.