Posts Tagged ‘home improvement tips’

ఈగలకు చెక్ పెట్టాలంటే…

01.jpg072893c9-ab03-4841-bf3d-076fbe86cb1dLarger
వర్షాకాలంలో ఈగలకు చెక్ పెట్టాలంటే.. తులసి కొమ్మల్ని వంటగది, డైనింగ్ టేబుల్ వద్ద ఉంచాలి. ఒకవేళ తాజా కొమ్మలు దొరక్కపోతే ఎండిపోయిన ఆకుల్ని మస్లిన్‌ వస్త్రంలో ఉంచి వేలాడదీస్తే సరిపోతుంది. అలానే లావెండర్‌, తమలపాకులూ, పుదీన వంటివి కూడా ఈగల్ని పారదోలతాయి.

షవర్‌హెడ్‌ను శుభ్రం చేయడానికి సులువైన మార్గం…

download (15)

షవర్‌హెడ్‌లో ఏదో అడ్డుపడినట్లయి, నీళ్ళు సరిగ్గా  రానట్లైతే అలాంటప్పుడు దాన్ని ఊడదీసి, రాత్రి తెల్లవార్లూ వెనిగర్‌లో ముంచి ఉండాలి. తెల్లవారాక బలమైన బ్రష్‌తో దాన్ని రుద్దాలి.

ఐస్ క్యూబ్ ట్రే వల్ల ఉపయోగాలు…

images (75)

పిల్లలవి చెవిపోగులూ, ఉంగరాలూ, హారాలూ..ఒకేచోట పెడుతుంటే ఒకదానితో ఒకటి కలసి చిక్కుపడిపోతున్నాయ? పాత ఐస్ క్యూబ్ ట్రే ని పారేయకుండా ఈ ఆభరణాలని విడివిడిగా ఉంచుకోవడానికి ఉపయోగించుకోండి..వెతుక్కోవాల్సిన శ్రమ ఉండదు, సమయం కూడా ఆదా అవుతుంది.

అలాగే మనం ఇంట్లో వివిధ హస్తకళాకృతులు చేయడానికి ఉపయోగించే రంగురంగుల కుందన్స్, బటన్స్, స్టోన్స్, బీడ్స్..మొదలైనవన్నీ విడిగా జాగ్రత్తగా ట్రేల్లో భద్రపరచుకోవచ్చు.

టైల్స్ మద్య మురికిని తొలగించడానికి క్లీనింగ్ టిప్స్…

images (2)

వెనిగర్: వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి బాగా మిక్స్ చేసి స్ప్రేబాటిల్‌లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదు నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి వదలిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాకు అరకప్పు లిక్విడ్ బ్లీచ్ మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి దీన్ని టైల్స్ మధ్య రాసి 10 నిముషాల తర్వాత టూత్ బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోతుంది. తర్వాత తడిబట్టతో తుడిస్తే సరిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్: దెబ్బలు తగినప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ సైతం టైల్స్ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. దీన్నే నేరుగా ఫ్లోర్‌ని శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. లేదంటే దీనిలో బేకింగ్ సోడాను కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసి టైల్స్ మద్య రాసి ఆ తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్లీచింగ్ పౌడర్: కొన్ని సార్లు టైల్స్ మధ్య చేరిన మురికి పసుపు రంగులో కనబడుతుంది. దీన్ని పోగొట్టడానికి బ్లీచ్‌తో తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లీచింగ్ పౌడర్‌ను రెండు కప్పుల వేడినీటిలో వేసి మిశ్రమంగా చేసుకుని దీనిలో పాత టూత్ బ్రష్‌ని ముంచి మురికి ఉన్న చోట బాగా రుద్దితే వెంటనే అది వదిలిపోతుంది.

నిమ్మరసం: నిమ్మరసాన్ని నీటిలో కలిపి మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత స్ర్కబ్బర్‌తో రుద్ది శుభ్రం చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మరసం వల్ల టైల్స్‌ నునుపుదనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, కాస్త ఎక్కువ నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.

అమ్మోనియా: బకెట్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ , అమ్మోనియా లిక్విడ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి టైల్స్ మధ్య మురికిగా ఉన్న చోట స్ప్రే చేసుకోవాలి. 5నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్ది తర్వాత తడి వస్త్రంతో లేదా మాప్‌తో నేలను తుడిస్తే సరిపోతుంది.

డైనింగ్ టేబుల్ ను అందంగా సర్దేద్దాం ఇలా…

images (34)

మీ డైనింగ్‌ టేబుల్‌ శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు…

1. మీ డైనింగ్‌ టేబుల్‌ డిజైన్‌కి తగ్గ క్లాత్‌ని సెలెక్ట్‌ చేసి దానిమీద వేస్తే డైనింగ్‌టేబుల్‌ అందంగా కన్పిస్తుంది. కాబట్టి మంచి డిజైన్‌ ఉన్న క్లాత్‌ని ఎంపిక చేసుకోవాలి.

2.వంటింట్లో వండిన పదార్థాలు టేబుల్‌పైన పెట్టే ముందు చిన్న స్టీల్‌స్టాండ్‌ను టేబుల్‌పైన ఉంచి వాటిపైన ఆ పదార్థాల పాత్రల్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల టేబుల్‌పైన ఎలాంటి గీతలు పండేందుకు అవకాశం ఉండదు.

3. ఉదయం టిఫిన్‌ ఐటెమ్స్‌ చట్నీ, హాట్‌బాక్స్‌లో ఇడ్లీలు, వేరేవి ఏవైనా ఉంటే వాటిని నీట్‌గా టేబుల్‌పైన సర్దాలి.

4. కుటుంబ సభ్యులు తినే టైంలోనే ప్లేట్లు, నీళ్లగ్లాసులు ఉంచాలి. తిన్నవెంటనే ఆ సామాన్లు తోమేందుకు వేసేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ తినేసిన కంచాలు, ప్లేట్లను టేబుల్‌పైన ఉంచకూడదు.

5. డైనింగ్‌ టేబుల్‌ పై అన్ని వస్తువులు తీసేసి సబ్బునీళ్లలో తడిపిన బట్టతో లేదా స్పాంజ్‌తో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడిబట్టతో తుడవాలి.

6. ఈ రోజుల్లో చిన్నగ్లాస్‌లో నీరు పోసి పెంచే మొక్కల్ని డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకుంటున్నారు. మీకు అలాంటి టేస్ట్‌ ఉంటే అందంగా అలంకరించుకోండి. అయితే ఒక్క సంగతి మాత్రం మరువకండి. ప్లాంట్‌లో పోసిన నీటిని రోజు విడిచి రోజు మార్చాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల మీ డైనింగ్‌ టేబుల్‌ ఎంతో అందంగా కన్పిస్తుంది. అంతేకాదు మీ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

కంట్లో నీళ్ళు రాకుండా ఉల్లిపాయలు తరగడం ఎలా…

download (11)

నీళ్ళలో వేయాలి: ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత నీటిలో వేయడం అందరికీ తెలిసిందే. అయితే వీటిని సగానికి ముక్కలుగా కోసిన తర్వాత నీటిలో వేయడం మంచిది. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గాలి ప్రసరించే చోట: గాలి బాగా ప్రసరించే చోట మాత్రమే ఉల్లిపాయలను కోయాలి. అలాగని ఫ్యాక్ కింద కూర్చుని కోయడం కూడా మంచిది కాదు. కిచెన్ లో ఉల్లిపపాయలు కోస్తున్నప్పుడు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కి దగ్గరలో నిల్చుంటే కళ్లు ఎక్కువగా మండకుండా ఉంటాయి.

ఫ్రిజ్ లో : కోసే ముందు ఉల్లిపాయలను కాసేపు ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా కూడా కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ద్రవరూపంలో ఉన్న రసాయనాలు గడ్డకట్టడం వల్ల వాటిని కోసినప్పుడు అవి తక్కువగా విడుదలవుతాయి.

చాపింగ్ బోర్డ్: సగానికి తరిగిన ఉల్లిపాయను చాపింగ్ బోర్డుపై బోర్లించడం ద్వారా కూడా రసాయనాల విడుదల తగ్గి కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది.

కొద్దిగా వేడిగా ఉండేలా: ఉల్లిపాయలు కోసే ప్రదేశంలో ఒక కొవ్వొత్తిని వెలిగించినా కూడా కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. మండుతున్న గ్యాస్ స్టౌవ్ కి దగ్గరగా ఉల్లిపాయల్ని కోసినా కళ్లు మండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఉల్లిపాయ కట్ చేసేప్పుడు ఈ చిట్కాలు పాటించండి..కన్నీళ్ళకు చెక్ పెట్టండి.

స్పాంజ్ తో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు…

images

ప్లాంట్ కంటైనర్ లో ఉపయోగించాలి: మొక్కలు పెట్టిన కుంపటి క్రింద స్పాంజ్ ఉంచడం వల్ల మొక్కలకు పోసే నీరు కుంపటి నుండి లీక్ అయినప్పుడు, స్పాంజ్ ఆనీటిని పీల్చుకొంటుంది. దాంతో ఫ్లోర్ మీద మట్టి మరకలు పడకుండా సహాయపడుతుంది. అంతే కాదు, స్పాంజ్ లోని నీరు మొక్కను ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది.

గ్లాస్ వేర్ ను ప్రొటెక్ట్ చేస్తుంది: ఇంట్లో ఏవైనా గాజు వస్తువులు పగిలినప్పుడు, వాటిని తొలగించడానికి స్పాంజ్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. అలాగే గాజు వస్తులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మీరు మార్చాలనుకున్నప్పుడు, స్పాంజ్ ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. పగిలిపోకుండా ఉంటాయి.

మీ కార్పెట్ ను శుభ్రం చేస్తుంది: మీ ఇంట్లో పెట్స్ ఉన్నట్లైతే, కార్పెట్ మీద పెంపుడు కుక్కల యొక్క బొచ్చు పడినప్పుడు , స్పాంజ్ తో తుడిస్తే చాలా సులభంగా తొలగిస్తుంది.

గీతలు పడకుండా నివారిస్తుంది: మన ఇంట్లో కనుక, ఒక మంచి మోడ్రన్ గ్లాస్ టీ పాయ్ ఉన్నప్పుడు, దాని మీద ఫ్లవర్ వాజ్ గీతలు పడకుండా ఉండాలంటే పల్చగా ఉండే స్పాంజ్ ను పెట్టి, దాని మీద ఫ్లవర్ వాజ్ ను అమర్చుకోవచ్చు. దాంతో గీతలు పడకుండా కొత్తవాటిలా ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.

టేబుల్ ను శుభ్రం చేస్తుంది: డైనింగ్ టేబుల్, మరియు ఇతర టేబుల్స్ కూడా శుభ్రంచేస్తుంది. క్లాత్ ను శుభ్రం చేయడం కంటే, స్పాంజ్ తో మరింత శుభ్రంగా క్లీన్ చేయవచ్చు. టేబుల్ మీద చాలా శుభ్రంగా క్లీన్ అవుతుంది. అయితే క్లాత్ తో శుభ్రం చేస్తే వాటిని శుభ్రం చేయడానికి కొంత ఒత్తిడి, కష్టంతో కూడిన పని.

కూరల్లో ఉప్పు ఎక్కువైందా?గాభరాపడకండి.. ఈ చిట్కాలు ఫాలోఅయిపోండి.

images

వంటచేసేటప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాము. అయితే అలా ఎక్కువైన ఉప్పుని వెనక్కి తీయలేకపోయినా దాని వల్ల కూర రుచి చెడిపోకుండా మాత్రం జాగ్రత్త పడవచ్చు. అదెలాగంటే…

1. కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేడయం వల్ల కూరల్లో ఉప్పదనం తగ్గి రుచికరంగా ఉంటుంది.

2. మరో చిట్కా ఒక బంగాళదుంప తీసుకొని ఓవెన్ లో 5నిముషాలు బేక్ చేసుకొని, తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 5నిముషాల పాటు అందులోనే బంగాళదుంప ముక్కలను ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి.

3.మరో అద్భుత చిట్కా, రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు రుచి కూడా పెరుగుతుంది. పెరుగు వేయడం ఇష్టం లేని వారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు.

4.ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నూనెలో వేయించి కూరలో కలపడం వల్ల రుచికి రుచి మరియు ఉప్పదనం కూడా తగ్గుతుంది.

5.మీరు చేసే వంటకాన్ని బట్టి టమోటో ముక్కలు లేదా టమోటో పేస్ట్ ని కూడా జత చేయవచ్చు.

6.గోధుమ పిండికి కొద్దిగా నీటిని జతచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీటిని కూరలో వేసి 3 నుండి 4నిముషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయవచ్చు.

ఇవి కొన్ని చిట్కాలు మాత్రమే..ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు గుర్తుంచుకుని, సందర్భం ఎదురైనప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ‘కుకింగ్ క్వీన్’ అనిపించుకోండి.

స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే…

images (1)

స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే వంటసోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి తయారు చేసిన పేస్ట్‌తో రుద్దాలి. పాత టూత్‌బ్రష్‌తో టైల్స్ మీద రుద్దవచ్చు.

పాత్రలు మరింత సులభంగా శుభ్రం చేసుకోవడానికి చిట్కాలు…

images (90)

డిష్ వాష్ ను మరింత సులభతరం చేసుకోవడానికి ఒక సాధారణ చిట్కా , మీరు ఉపయోగించిన వెంటనే దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే షింక్ నిండుగా వేయకుండా ఏదైనా పాత్రలు కనబడిన వెంటనే వాటిని శుభ్రం చేసుకోవాలి.

టైమ్ సెట్ చేసుకోవాలి:  షింక్ నిండుగా వేసేసి గంటలు తరబడి వాటి శుభ్రం చేయకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు శుభ్రం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. దాంతో త్వరగా శుభ్రం చేయాలనే ఆలోచన కలుగుతుంది.

తిరిగి ఉపయోగించే పాత్రలు: వంటలు వండుటకు ఎక్కువ పాత్రలు ఉపయోగించడం నివారించాలి . ఎక్కువ వెజల్స్ ను బయటకు తీయ్యడం వల్ల అవి వంటగదిని చిందరవందర చేసేస్తాయి. తిరిగి ఉపయోగించే పాత్రలను వెంట వెంటనే శుభ్రం చేసేసుకుంటుండాలి. అలా చేస్తుంటే క్రమంగా పాత్రలు తక్కువగా పడుతాయి. మీకు శ్రమ తగ్గుతుంది.

షింక్ కు కాస్త దూరంలో పాత్రలుంచాలి: వాడిన వాటాని , వాడని పాత్రలన్నింటిని షింక్ దగ్గర్లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మొత్తం, కలిసిపోయి చిందరవందరగా కనబడుతాయి. మురికిపడ్డ పాత్రలన్నీ ఒక టబ్ లో వేసి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల షింక్ అశుభ్రంగా కనబడకుండా ఉంటుంది.

మ్యూజిక్: పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ పని మొదలు పెడితే మీ పనిని మరింత సులభతరం చేస్తుంది. మీరు ఏకాగ్రత, పాత్రల శుభ్రం చేయడం కంటే మ్యూజిక్ మీద ఉండటం వల్ల పని భారంగా అగుపించదు మరియు త్వరగా పని పూర్తి చేయగలుగుతారు.

మీ పనిని షేర్ చేసుకోవాలి: పని ఎక్కువగా ఉన్నప్పుడు మీ పాట్నర్ యొక్క సహాయం తీసుకోవడంతో పని భారం మరింత తగ్గించుకోవచ్చు. శరీరానికి ఎక్కువ ఒత్తిడి కలగకుండా ఉంటుంది.