Posts Tagged ‘home remedies’

ప్రతిరోజు క్రమంతప్పకుండా వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే…

honey-and-garlic1
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతిరోజు పరకడుపున తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో ఏర్పడే కొవ్వుని తొలగించి, గుండెకు రక్తప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్‌ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్‌లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్‌లు దరిచేరవు. ఈ మిశ్రమంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది.

బ‌రువు త‌గ్గించే మిరియాల ‘టీ’…

maxresdefault-3
మిరియాల‌ను మ‌నం వంట‌ల్లో విరివిగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. మిరియాల‌లో మ‌నకు ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో మిరియాలతో త‌యారు చేసే టీని తాగ‌డం వ‌ల్ల అధికంగా ఉన్న శ‌రీర బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆక‌లిని త‌గ్గించడంలో మిరియాల టీ బాగా ప‌నిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్వీట్లు, అధిక క్యాల‌రీలు ఉన్న ఆహారం, టీ, కాఫీ, జ్యూస్‌ల‌కు బ‌దులుగా మిరియాల టీని తాగితే బ‌రువు త‌గ్గుతారని వైద్యులు అంటున్నారు. మిరియాల టీతో మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. శ‌రీర రోగనిరోధక వ్య‌వ‌స్థ పటిష్ట‌మ‌వుతుంది.
నిజానికి మిరియాల టీ తాగటం వలన శరీర బరువు తగ్గదు, ఈ మిరియాల టీతో పాటుగా, సరైన ఆహార పదార్థాలు, వ్యాయామాలు కూడా చేయాలి. మిరియాల టీ తాగడం వల్ల ఆకలి అనిపించకుండా చూస్తుంది. ఈ టీ తీసుకోవడం వలన కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, మల ప్రవాహాన్ని పెంచుతుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలతో చేసిన టీలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి.

రాగులు నానబెట్టి మొలకలొచ్చాక ఎండించి పిండి చేసి తింటే…

finger-millet
మన శరీరం ఎలాంటి అనారోగ్యాన్నయినా ఎదుర్కోవటానికి దృఢంగా ఉండాలి. దృఢమైన శరీరం గల వారు రోగాలను ఎదుర్కొనగలరు. శరీరం దృఢంగా ఉండాలంటే రాగులని మన ఆహారంతో తీసుకోవాలి. వివిధ రోగాలకి రాగులు బాగా పనిచేస్తాయి. మొక్కగట్టిన ధ్యానం పిండిని రాగిమాల్ట్ అంటారు. రాగుల్ని బాగు చేసి నీళ్ళలో నానబెట్టి నాలుగు గంటల తరువాత గుడ్డలో వేసి మూటగట్టి పైన బరువు ఉంచండి. రెండు మూడు రోజుల్లో చిన్న మొక్కలొస్తాయి. మొలకలొచ్చిన తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత దోరగా వేయించాలి. నూనె వెయ్యకుండా మామూలు మూకుడిలో వేయించి అలా వేగిన రాగుల్ని మర పట్టించాలి. ఆ పిండినే రాగిమాల్ట్ అంటారు. రాగి మాల్ట్ ని రోజుకు రెండుసార్లు పాలలో గాని, మజ్జిగలో గాని కలుపుకుని తాగాలి.
కడుపులో మంటకి, వాంతులు, వికారానికి, మలబద్థకం నివారణకి రాగిమాల్ట్ మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల ఆ వ్యాధులు త్వరగా తగ్గుతాయి. ఘుగర్‌, బిపి తగ్గటానికి రాగిమాల్ట్ వాడవచ్చు. రాగిమాల్ట్ తరుచూ తాగటం వల్ల చలువ చేస్తుంది. రక్తదోషాలన్నింటికి చాలా మంచిది. బొల్లి, సోరియాసిస్‌ మరియు ఇతర చర్మవ్యాధులలో బాధపడేవారు, సుగంధ పాలతో రాగిమాల్ట్ కలుపుకుని తాగితే ఆయా వ్యాధులు త్వరగా తగ్గుతాయి.

బ‌రువు త‌గ్గించే జీరా డ్రింక్…

images (12)

ఒక గ్లాస్ నీళ్ల‌లో 2 టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర క‌లిపి రాత్రంతా నాన‌నివ్వాలి. ఉద‌యాన్నే ఆ నీటిని ఉడ‌క‌బెట్టి వ‌డ‌క‌ట్టాలి. అందులో స‌గం నిమ్మ‌కాయ ర‌సం క‌ల‌పాలి. ఖాళీ క‌డుపుతో ఈ నీటిని ప్ర‌తి రోజూ ఉద‌యం రెండువారాల పాటు తాగితే సులువుగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

చిట్లిన జుట్టుకు పరిష్కార మార్గాలు…

images (5)

మసాజ్: తలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు మెరుస్తూ, బలంగా ఉండటమే కాదు, జుట్టు చివర్ల చిట్లిపోవడాన్ని అరికడుతుంది. కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్‌ని సమానంగా తీసుకోవాలి. మూడింటిని కలిపి తలకు పట్టించుకోవడానికి ముందు గోరువెచ్చగా చేయాలి. తర్వాత తల మాడుకి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.

హెన్నా: హెన్నా బెస్ట్ నేచురల్ కండీషనర్. హెన్నా పౌడర్‌ను, గ్రీన్ టీతో మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి, అందులో అరకప్పు వేడిగా ఉండే ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. దీన్ని రెండు గంటల పాటు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే జుట్టు డ్యామేజ్ కాకుండా నివారించుకోవచ్చు.

అలోవెరా జెల్: అరకప్పు అలోవెర జెల్‌లో 3 చెంచాల కోకోనట్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రామాన్ని తలకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం ద్వారా చిట్లిన జుట్టును నివారించుకోవచ్చు. మరియు జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

తులసి ఆకులు, పాలు కాంబినేషన్‌లో దాగున్న పవర్‌ఫుల్ బెన్ఫిట్స్…

download (1)

తయారు చేసే విధానం: 3 లేదా 4 తులసి ఆకులు తీసుకుని శుభ్రం చేయాలి. మరిగిన పాలల్లో కలపాలి. వాటిని ఒక కప్పులో తీసుకుని ప్రతి రోజు ఉదయం పరకడుపున తీసుకోవాలి. అంతే ఈ సింపుల్ పదార్థంతో ప్రయోజనాలు అమోఘం.

ప్రయోజనాలు:

ఫ్లూ: తులసిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం, పాలల్లో హీలింగ్ ప్రాపర్టీ ఉండటం వల్ల ఈ రెండింటిని మిక్స్ చేసి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫ్లూ వంటి లక్షణాల నుంచి వెంటనే బయటపడవచ్చు.

గుండె ఆరోగ్యానికి: తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి హార్ట్‌ని హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండటానికి సహాయపడుతాయి. పాలు గుండెకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. ఈ రెండింటి మిశ్రమం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఒత్తిడి తగ్గడానికి: వేడి పాలు, తులసి కలిపి తీసుకోవడం వల్ల నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతుంది.

కిడ్నీ స్టోన్స్: తులసి ఆకులు, పాలు కాంబినేషన్ కిడ్నీల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించి, డెటాక్సిఫై చేస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో స్టోన్స్ కరిగిపోతాయి.

క్యాన్సర్: పాలు, తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యున్ సిస్టమ్ బలంగా మారుతుంది. ఎలాంటి క్యాన్సర్ అయినా దరిచేరకుండా నివారించే శక్తి ఉంటుంది.

శ్వాస సంబంధ సమస్యలు: వేడి పాలు, తులసి ఆకుల కాంబినేషన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, వాపు, కామన్ కోల్డ్, పొడి దగ్గు నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది ఈ డ్రింక్.

తలనొప్పి నివారణకు: చాలా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ తులసి, పాలు కలిపి ఒక గ్లాసు తాగండి. వెంటనే తలనొప్పి తగ్గడాన్ని మీరు గమనిస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల నొప్పి దూరమవుతుంది.

మునగాకు రసంతో మొటిమల నివారణ…

download (59)

మొటిమలతో బాధపడేవారు మునగాకు రసంలో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మొటిమల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

పసుపు, వేప పొడి కలిపి తీసుకుంటే…

download (49)
పసుపు, వేప పొడిని సమ భాగాల్లో కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు మాయమవుతాయి.

ఆయిలీ హెయిర్ నివారించే సింపుల్ టిప్…

download (6)

కావలసిన పదార్థాలు:

గుడ్డు 1

ఉప్పు: 2 టేబుల్స్ స్పూన్లు

నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు

ఎలా ఉపయోగించాలి:

ముందుగా గుడ్డు సొన ఒక బౌల్లో తీసుకొని, అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని తలకు మొత్తం అప్లై చేసి 10 నుంచి 15 నిముషాల వరకూ మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్‌తో తలను కవర్ చేయాలి. ఇలా షవర్ క్యాప్ పెట్టుకొని అరగంట అలాగే ఉండి కొద్దిగా తడి ఆరిన తర్వాత మీకు నచ్చిన షాంపుతో తలస్నానం చేయాలి. తర్వాత కండీషనర్‌ను అప్లై చేయాలి.

ఈ సింపుల్ అండ్ పవర్‌ఫుల్ హెయిర్ మాస్క్‌ను వారంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల క్రమంగా తలలో ఎక్సెస్ ఆయిల్‌ను నివారిస్తుంది. మీ జుట్టు మరింత అందంగా కనబడేలా చేస్తుంది.

అరటితొక్కతో పసుపు దంతాలు మాయం…

images (89)

ఇకపై అరటిపండు తిన్నాక తొక్కను పడేయకండి. తొక్కలో దంతాలకు మెరుపు తీసుకొచ్చే గుణం ఉంది. తొక్క లోపలి భాగాన్ని పళ్లపై రోజుకి ఒకసారి రుద్దుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ అరటితొక్కలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల అవి.. పళ్లు తెల్లగా మారడానికి సహకరిస్తాయి.