Posts Tagged ‘honey’

ఓట్స్ మీల్ ను బ్యూటికి ఏవిధంగా ఉపయోగించుకోవాలి?

 

download (26)

ముఖానికి ఓట్ మీల్: చర్మానికి తగినంత తేమను అందించి మాయిశ్చరైజ్ గా సహాయపడుతుంది. మరియు చర్మ రంద్రాల్లోని మురికిని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించి, డీప్ గా శుభ్రపరుస్తుంది.

ఫేస్ వాష్: ఓట్ మీల్లో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మంలో మురికిని మరియు ఆయిల్ ను తొలగిస్తుంది. మీరు చాలా త్వరగా ఓట్ మీల్ తో క్లెన్సర్ ను తయారు చేసుకోవచ్చు. అందుకు రెండు చెంచాలా ఓట్ మీల్, ఒక చెంచ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి గుండ్రంగా ముందుకు వెనకు మర్దన చేయాలి . 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేనె బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

స్పాట్ ట్రీట్మెంట్: మొటిమలు మరియు మచ్చలతో బాధపడుతున్నట్లైతే ఓట్స్ మీల్ మీ సమస్యను నివారిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మంలోని అదనపు ఆయిల్ గ్రహిస్తుంది మరియు చర్మానికి చల్లదనాన్ని తీసుకొస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ ను నీటిలో వేసి ఉడికించి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరియు సన్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది.

ఇంట్లో ఉండే ఔషధాలతో పెదాలపై నల్లని వలయాలకు చెక్…

images

నిమ్మకాయ రసంలో తేనె మరియు గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేస్తే పెదాలపై ఉండే నల్లటి వలయాలు తొలిగిపోయి అందంగా తయారు అవుతాయి.

వృద్ధాప్య లక్షణాలను నివారించి చర్మ సౌందర్యం పెంచే చందనం…

images (68)

చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా చేయాలంటే, గుడ్డు సొనలో తేనె, చందనం మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా మంచి ఫలితం ఉంటుంది.

మెరిసే చేతులు కోసం…

images (6)

కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చేతులను మెరిసే విధంగా మృదువుగా చేసుకోవచ్చు.

– ఒక చెంచా ఆలివ్ నూనె మరియు చక్కెర కలిపి చేతులకు రాసి మృదువుగా మర్దన చేసి పది నిమిషాలు తరువాత చన్నీళ్ళతో కడిగెయ్యాలి.

– రెండు చెంచాలు నిమ్మ రసం, తేనె మరియు వంటసోడా కలపాలి. చేతులను వేడి నీళ్ళతో కడుక్కుని, ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి, పది నిమిషాలు మర్దన చేసి గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.

– ఒక చెంచా దాల్చిన చెక్క పొడి మరియు తేనె కలిపి చేతులకు రుద్ది పది నిమిషాల తరువాత కడిగెయ్యలి.

– రెండు చెంచాలు కీరదోస గుజ్జు మరియు నిమ్మ రసం కలిపి చేతులకు రాసి పావు గంట తరువాత శుభ్రంగా కడగాలి.

ఇంటి వైద్యం తో కడుపులో మంట (అల్సర్) మాయం…

images (87)
కడుపులో నొప్పి, తీవ్రమైన మంట ఉంటే అది అల్సర్ అని గుర్తించవచ్చు. అల్సర్‌లు పలు రకాలు ఉన్నాయి. అయితే  కడుపులో వచ్చే అన్ని రకాల అల్సర్లకు ఆహారమే మందు అని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా సమయానికి భోజనం తినకపోవడం వలనే అల్సర్ వస్తుంది. కొన్ని సందర్భాలలో అత్యధికంగా కారపు పదార్థాలు తినడం వలన కూడా అల్సర్ ఏర్పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు.
అయితే ఒక కప్పు మెంతికూర ఆకులను నీళ్లలో ఉడికించి, వాటిలో కొద్దిగా ఉప్పు చేర్చి, ఈ నీటిని గోరు వెచ్చగా చేసి ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి. ఇలా చేస్తే ఎటువంటి అల్సర్ అయినా మటుమాయమవుతుంది.
క్యాబేజీ రసం తాగడం వలన కూడా కడుపులోని అల్సర్లు త్వరగా తగ్గిపోతాయి. అయితే ఈ రసాన్ని పడుకోబోయే ముందు తాగాలి. అల్సర్‌తో బాధపడుతున్న వారికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ పొద్దున్నే అల్పాహారంతో పాటు ఒక చెంచా తేనె తాగాలి.

కంటి అద్దాల వలన ఏర్పడే మచ్చలను తొలగించే ఔషదాలు…

images

కంటి అద్దాలను వాడటం వలన ముక్కుపై మరియు కంటి కింద మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కంటి అద్దాలు బరువుగా ఉండటం వలన ముక్కుపై మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మచ్చలను తొలగించే సమర్థవంతమైన ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

కలబంద

కలబంద చర్మానికి శీతలీకరణ ఏజెంట్ గా పని చేస్తుంది. ఈ మచ్చలను సహజంగా తగ్గించుకోటానికి, తాజా కలబంద గుజ్జును తీసుకొని, మచ్చలు ఉన్న ప్రాంతంలో నేరుగా అప్లై చేయండి. ఈ గుజ్జు ఎండే వరకు వేచి ఉండి, తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి.

బంగాళదుంప

తురిమిన బంగాళదుంపను పేస్ట్ లా చేసి ముక్కుపై ఉండే నల్లటి మచ్చలపై నేరుగా అప్లై చేయండి. కంటి అద్దాల వలన ముక్కుపై ఏర్పడిన మచ్చలు తొలగిపోయే వరకు రోజు ఈ పద్దతిని అనుసరించండి.

దోసకాయ

తాజా దోసకాయ నుండి సన్నగా రెండు ముక్కలను కత్తిరించి, నల్లటి మచ్చలపై ఉంచండి. ఈ దోసకాయ ముక్కలు శీతలీకరణ ఏజంట్ గా పని చేసి, నల్లటి మచ్చలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. లేదా కత్తిరించిన దోసకాయ ముక్కలను కంటి చుట్టూ రాయటం ద్వారా వీటి నుండి ఉపశమనం పొందుతారు.

నిమ్మ

తాజా నిమ్మపండు నుండి రసాన్ని తీసుకొని, తగినంత నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగి వేయండి.

తేనె

తేనెను పాలు మరియు ఓట్స్ లో కలపండి. ఈ మిశ్రమాన్ని, నల్ల మచ్చలపై అప్లై చేసి, 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి. ఈ మిశ్రమం ముఖం నుండి తొలగించిన తరువాత కలిగే మార్పులను గమనించండి.

ఆయాసంను అదుపులో పెట్టవచ్చు… ఈ చిట్కాలు పాటిస్తే సరి…

images (98)
ఆయాసం ఉన్నవారు ఒక చిటికెడు మెత్తటి ఉప్పు, రెండు చిటికెల పసుపు రోజూ తీసుకోవడం మంచిది. అలాగే వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది.
ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది.

దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీ…

download (4)

రెండు టేబుల్ స్పూన్ల తేనె, పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేడి పాలల్లో కలపాలి. ఈ డ్రింక్‌ని ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే దగ్గు, దగ్గు లక్షణాలు పూర్తీగా తగ్గిపోతాయి.

ఎసిడిటీకి నివారణా మార్గం…

acidity2
వేడి నీళ్లలో 1 టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, ఆందులో టీ స్పూన్ తేనెను కలిపి మూడుపూటలా తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే హనీ, కర్డ్ కాంబినేషన్…

images (5)

– క్లియర్ స్కిన్: పెరుగు మరియు తేనె రెండు మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉండే జింక్, ఇన్ఫ్లమేషన్ మరియు స్కిన్ రెడ్ నెస్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దాంతో స్కిన్ కంప్లెక్షన్ పెరగుతుంది.

– స్కిన్ మాయిశ్చరైజర్: పెరుగు మరియు తేనె ఒక నేచురల్ స్కిన్ హైడ్రేట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మంలో ఇది నేచురల్ మాయిశ్చరైజర్ లెవల్స్‌ను రీస్టోర్ చేస్తుంది. దాంతో చర్మం సాఫ్ట్‌గా మారుతుంది.

– స్కిన్ ఫెయిర్‌గా మారుతుంది: పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్‌లో వివిధ రకాల ఎంజైమ్స్ ట్రైగ్లిజరైడ్స్ వంటివి చర్మంలో మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతాయి. దాంతో స్కిన్ సెల్స్ కొత్తగా పుడుతాయి, చర్మం ఎప్పుడూ కొత్తగా ప్రకాశవంతంగా యవ్వనంగా కనబడుతుంది.

– మొటిమలను నివారిస్తుంది: తేనె మరియు పెరుగు రెండింటి కాంబినేషన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియ వల్ల ఏర్పడే మొటిమలను నివారిస్తుంది.

– యాంటీఏజింగ్‌గా పనిచేస్తుంది: పెరుగు మరియు తేనె కాంబినేషన్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది. దాంతో చర్మంలో ఏజింగ్ లక్షణాలు నివారించబడుతాయి.

– సన్ బర్న్ నివారిస్తుంది: ఈ రెండింటి మిశ్రమంలో సన్ బర్న్ నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. దాంతో చర్మం ఎర్రబడకుండా మరియు పిగ్మెంటేషన్ నివారించి యూత్ ఫుల్‌గా కనబడేలా చేస్తుంది.