Posts Tagged ‘house keeping’

వేపనూనె, కర్పూరంతో దోమలు పరార్…

mosquito-illustration_360x286
దోమలతో డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చేసిందంటే.. ఇక దోమల బాధ తాళలేక గుడ్ నైట్లు, ఆలౌట్లకు నెల పొడవునా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారా? అయితే ఇక అలాంటి దోమల లిక్విడేటర్లకు గుడ్ బై చెప్పేయండి. ఎలాగంటే.. ముందుగా పచ్చకర్పూరాన్ని లిక్విడేటర్ బాటిల్‌లో వేసి ఆపై అందులో వేపనూనెను పోయండి. తర్వాత బాటిల్‌కు మూతపెట్టి.. ప్లగ్గులో పెట్టండి. అంతే దోమల బెడద ఉండదు.
అలాకాకుంటే.. కప్పు వేప నూనెలో మెత్తగా పొడి చేసిన కర్పూరం వేయాలి. ఈ మిశ్రమాన్ని దోమల రిపెల్లెంట్‌లో ఉంచి.. ప్లగ్‌లో పెట్టుకోవాలి. గదిలో దోమలూ, ఇతర పురుగులు ఉంటే వెంటనే చనిపోతాయి.

స్పాంజ్ తో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు…

images

ప్లాంట్ కంటైనర్ లో ఉపయోగించాలి: మొక్కలు పెట్టిన కుంపటి క్రింద స్పాంజ్ ఉంచడం వల్ల మొక్కలకు పోసే నీరు కుంపటి నుండి లీక్ అయినప్పుడు, స్పాంజ్ ఆనీటిని పీల్చుకొంటుంది. దాంతో ఫ్లోర్ మీద మట్టి మరకలు పడకుండా సహాయపడుతుంది. అంతే కాదు, స్పాంజ్ లోని నీరు మొక్కను ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది.

గ్లాస్ వేర్ ను ప్రొటెక్ట్ చేస్తుంది: ఇంట్లో ఏవైనా గాజు వస్తువులు పగిలినప్పుడు, వాటిని తొలగించడానికి స్పాంజ్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. అలాగే గాజు వస్తులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మీరు మార్చాలనుకున్నప్పుడు, స్పాంజ్ ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. పగిలిపోకుండా ఉంటాయి.

మీ కార్పెట్ ను శుభ్రం చేస్తుంది: మీ ఇంట్లో పెట్స్ ఉన్నట్లైతే, కార్పెట్ మీద పెంపుడు కుక్కల యొక్క బొచ్చు పడినప్పుడు , స్పాంజ్ తో తుడిస్తే చాలా సులభంగా తొలగిస్తుంది.

గీతలు పడకుండా నివారిస్తుంది: మన ఇంట్లో కనుక, ఒక మంచి మోడ్రన్ గ్లాస్ టీ పాయ్ ఉన్నప్పుడు, దాని మీద ఫ్లవర్ వాజ్ గీతలు పడకుండా ఉండాలంటే పల్చగా ఉండే స్పాంజ్ ను పెట్టి, దాని మీద ఫ్లవర్ వాజ్ ను అమర్చుకోవచ్చు. దాంతో గీతలు పడకుండా కొత్తవాటిలా ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.

టేబుల్ ను శుభ్రం చేస్తుంది: డైనింగ్ టేబుల్, మరియు ఇతర టేబుల్స్ కూడా శుభ్రంచేస్తుంది. క్లాత్ ను శుభ్రం చేయడం కంటే, స్పాంజ్ తో మరింత శుభ్రంగా క్లీన్ చేయవచ్చు. టేబుల్ మీద చాలా శుభ్రంగా క్లీన్ అవుతుంది. అయితే క్లాత్ తో శుభ్రం చేస్తే వాటిని శుభ్రం చేయడానికి కొంత ఒత్తిడి, కష్టంతో కూడిన పని.

కూరల్లో ఉప్పు ఎక్కువైందా?గాభరాపడకండి.. ఈ చిట్కాలు ఫాలోఅయిపోండి.

images

వంటచేసేటప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాము. అయితే అలా ఎక్కువైన ఉప్పుని వెనక్కి తీయలేకపోయినా దాని వల్ల కూర రుచి చెడిపోకుండా మాత్రం జాగ్రత్త పడవచ్చు. అదెలాగంటే…

1. కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేడయం వల్ల కూరల్లో ఉప్పదనం తగ్గి రుచికరంగా ఉంటుంది.

2. మరో చిట్కా ఒక బంగాళదుంప తీసుకొని ఓవెన్ లో 5నిముషాలు బేక్ చేసుకొని, తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 5నిముషాల పాటు అందులోనే బంగాళదుంప ముక్కలను ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి.

3.మరో అద్భుత చిట్కా, రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు రుచి కూడా పెరుగుతుంది. పెరుగు వేయడం ఇష్టం లేని వారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు.

4.ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నూనెలో వేయించి కూరలో కలపడం వల్ల రుచికి రుచి మరియు ఉప్పదనం కూడా తగ్గుతుంది.

5.మీరు చేసే వంటకాన్ని బట్టి టమోటో ముక్కలు లేదా టమోటో పేస్ట్ ని కూడా జత చేయవచ్చు.

6.గోధుమ పిండికి కొద్దిగా నీటిని జతచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీటిని కూరలో వేసి 3 నుండి 4నిముషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయవచ్చు.

ఇవి కొన్ని చిట్కాలు మాత్రమే..ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు గుర్తుంచుకుని, సందర్భం ఎదురైనప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ‘కుకింగ్ క్వీన్’ అనిపించుకోండి.

పాత్రలు మరింత సులభంగా శుభ్రం చేసుకోవడానికి చిట్కాలు…

images (90)

డిష్ వాష్ ను మరింత సులభతరం చేసుకోవడానికి ఒక సాధారణ చిట్కా , మీరు ఉపయోగించిన వెంటనే దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే షింక్ నిండుగా వేయకుండా ఏదైనా పాత్రలు కనబడిన వెంటనే వాటిని శుభ్రం చేసుకోవాలి.

టైమ్ సెట్ చేసుకోవాలి:  షింక్ నిండుగా వేసేసి గంటలు తరబడి వాటి శుభ్రం చేయకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు శుభ్రం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. దాంతో త్వరగా శుభ్రం చేయాలనే ఆలోచన కలుగుతుంది.

తిరిగి ఉపయోగించే పాత్రలు: వంటలు వండుటకు ఎక్కువ పాత్రలు ఉపయోగించడం నివారించాలి . ఎక్కువ వెజల్స్ ను బయటకు తీయ్యడం వల్ల అవి వంటగదిని చిందరవందర చేసేస్తాయి. తిరిగి ఉపయోగించే పాత్రలను వెంట వెంటనే శుభ్రం చేసేసుకుంటుండాలి. అలా చేస్తుంటే క్రమంగా పాత్రలు తక్కువగా పడుతాయి. మీకు శ్రమ తగ్గుతుంది.

షింక్ కు కాస్త దూరంలో పాత్రలుంచాలి: వాడిన వాటాని , వాడని పాత్రలన్నింటిని షింక్ దగ్గర్లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మొత్తం, కలిసిపోయి చిందరవందరగా కనబడుతాయి. మురికిపడ్డ పాత్రలన్నీ ఒక టబ్ లో వేసి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల షింక్ అశుభ్రంగా కనబడకుండా ఉంటుంది.

మ్యూజిక్: పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ పని మొదలు పెడితే మీ పనిని మరింత సులభతరం చేస్తుంది. మీరు ఏకాగ్రత, పాత్రల శుభ్రం చేయడం కంటే మ్యూజిక్ మీద ఉండటం వల్ల పని భారంగా అగుపించదు మరియు త్వరగా పని పూర్తి చేయగలుగుతారు.

మీ పనిని షేర్ చేసుకోవాలి: పని ఎక్కువగా ఉన్నప్పుడు మీ పాట్నర్ యొక్క సహాయం తీసుకోవడంతో పని భారం మరింత తగ్గించుకోవచ్చు. శరీరానికి ఎక్కువ ఒత్తిడి కలగకుండా ఉంటుంది.

ఇంట్లో అద్దాలని మిలమిల మెరిపించే ట్రిక్స్ అండ్ టిప్స్…

images (25)

1. అద్దాలను శుభ్రం చేసేందుకు మార్కెట్‌లో ప్రత్యేక షాంపూలు లభిస్తున్నాయి. వాటిని పేపర్‌ టవల్‌ మీద స్ప్రే చేసి దానితో అద్దాన్ని తుడిస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది. అద్దం వెనుక దుమ్ముపడితే గుడ్డతో తుడిచేయాలే కాని షాంపూ మాత్రం వాడకూడదు. అద్దాలు దుమ్ముపట్టి నల్లగా, అసహ్యంగా మారకూడదంటే పేపర్‌ టవల్‌పై షాంపూ వేసి అద్దాల అంచులను తరచుగా శుభ్రం చేయాలి.

2. అద్దాన్ని తుడిచేటప్పుడు, మధ్యలోనుంచి ప్రారంభించి చివరలతో ముగించాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు. అంచులపై షాంపూ ఎక్కువగా పడితే సిల్వర్‌ మెరుపు అంతా పోయి నల్లగా మారిపోవచ్చు.

3. సున్నితమైన వస్త్రం: ప్రతి రోజూ అద్దాలు శుభ్రం చేయడానికి ఒక సున్నితమైన వస్త్రాన్ని ఉపయోగించాలి. మెత్తని వస్త్రం అద్దం మీద ఉన్న దుమ్మును పూర్తిగా శుభ్ర పరుస్తుంది.

4. న్యూస్ పేపర్: అద్దం మీద ఎటువంటి మరకలు లేకుండా మంచి షైనింగ్ తో మెరుస్తుండాలంటే, కొన్ని నీళ్ళు చిలకరించాలి లేదా క్లీనింగ్ సొల్యూషన్ ను చిలకరించి తర్వాత న్యూస్ పేపర్ తో శుభ్రం చేసుకోవాలి. న్యూస్ పేపర్ ను రెండు మూడు మడతలుగా ఫోల్డ్ చేసి తర్వాత శుభ్రపరచడానికి ఉపయోగించాలి.

5. నిమ్మరసం: మురికి పట్టిన అద్దాలను శుభ్రం చేయడంలో నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని నీటిలో కలిపి బాటిల్లో నిల్వ చేసుకోవాలి. నిమ్మరసంతో అద్దాలు శుభ్రపర్చడంతో పాటు ఆ ప్రదేశంలో మంచి సువాసన వస్తుంటుంది.

6. వైట్ వెనిగర్: గోరువెచ్చని నీటికి కొద్దిగా వైట్ వెనిగర్ ను మిక్స్ చేసి క్లీనింగ్ సొల్యూషన్ గా తయారు చేసుకోవాలి. ఈ లిక్విడ్ తోనే మీ అద్దాన్ని శుభ్రం చేసి, మెరిపించుకోవచ్చు. వైట్ వెనిగర్ ను నీటితో మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో నింపుకొని ప్రతి రోజూ లేదా సమయం దొరికినప్పుడల్లా అద్దాలను శుభ్రపరుస్తుండాలి.

నల్లుల బెడదను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గాలు…

images (70)

నల్లులు (ఆంగ్లంలో వీటిని Bed bugs అంటారు) దోమలాగా రక్తాహార కీటకాలు…బెడ్ బగ్స్ ను ఎదుర్కొవడానికి మరికొన్ని నేచురల్ క్రిమి సంహారక హోం రెమెడీస్ మీకోసం…

 

1. ఉప్పు: మరో క్రిమి సంహారిని, ఉప్పు. ఇది బెడ్ బగ్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. నలుల్లున్న ప్రదేశంలో కొద్దిగా సీసాల్ట్ చిలకరించి వదిలేయాలి. ఇది తక్షణ ప్రభావం చూపుతుంది.

2. ఉల్లిపాయ రసం: ఈ నేచురల్ హోం రెమెడీ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు, బెడ్ బగ్స్ ను నివారించడానికి ఉల్లిపాయ రసం అద్భుతంగా సహాయపడుతుంది, తక్షణం నల్లులు చనిపోయే విధంగా చేసే ఘాటైన వాసన ఉల్లిపాయలో ఉంది.

3. వెనిగర్: బెడ్ బగ్స్(నల్లులు)ను నివారించడానికి వెనిగర్ ఎఫిక్టివ్ గా సహాయపడుతుంది. వెనిగర్ మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో ఈ క్రిములున్నచోట వెనిగర్ ను చిలకరించి వదిలితే సులభంగా నివారించబడుతాయి.

 

కార్పెట్ మీద గాజు వస్తువులు పగిలినప్పుడు ఎలా శుభ్రం చేయాలో చూద్దాం…

images (48)

కార్పెట్ మీద పగిలిన గాజు ముక్కలను శుభ్రం చేయడానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

1.గాజు ముక్కలను శుభ్రం చేసే ప్రదేశం నుండి మీ పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి, మీ కాళ్ళకు షూలను ధరించాలి, చేతులకు గ్లౌజులను దరించాలి. ఒక వేళ గ్లౌజులు లేనట్లైతే , పక్కన ఐస్ క్యూబ్స్ దగ్గర పెట్టుకోవాలి. చేతికి రక్షణగా ఏవీ లేనప్పుడు, చిన్న చిన్న గాజు ముక్కల వల్ల ప్రమాధకరం అవుతుంది.

2.న్యూస్ పేపర్:

న్యూస్ పేపర్ మీద గాజు ముక్కలను వేసి, భద్రంగా చుట్టి, పడేయాలి. ఇలాపెద్ద పెద్ద గాజు ముక్కలనుతొలగించాలి.

3.వాక్యూమ్ క్లీనర్:

వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించి, ఆ ప్రదేశాన్ని శుభ్రపరచాలి. డస్టిబిన్ తీసుకొచ్చి , మీ వాక్యూమ్ క్లీనర్ ను శుభ్రం చేసుకోవాలి. వాక్యూమ్ ను ఖాళీ చేయాలి.

4.చీపురు:

గాజు పగలిన ప్రదేశంలో గాజు ముక్కలున్నట్లైతే, ఫర్నీచర్ క్రిందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాక్యూమ్ చేసిన వెంటనే చీపురుతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి . ఈ విధంగా జాగ్రత్తగా కార్పెట్ మీద గాజు ముక్కలను తొలగించుకోవాలి. 

నకిలీ కోడిగుడ్లను కనిపెట్టడమెలా?

 egg-benefits-for-kids
అస‌లు కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా త‌క్కువ‌గా ఉంటుంది. కల్తీ కోడి గుడ్డు మెరుస్తుంది.
న‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌న ఉండ‌దు. అస‌లు కోడిగుడ్ల‌కు ఎంత లేద‌న్నా కొద్దిగా నీచు వాసన వ‌స్తుంది.
అస‌లైన గుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డును పైన తాకితే గట్టిగా అనిపిస్తుంది.
నకిలీ కోడిగుడ్డును ప‌గ‌ల గొట్ట‌గానే అందులోని ద్ర‌వాలు మ‌న ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి.
కోడిగుడ్డును కొనేటప్పుడు ఊపి చూడాలి. లోపల నుంచి ఏవైనా సౌండ్స్ వ‌స్తే దాన్ని న‌కిలీగా గుర్తించాలి. ఎందుకంటే న‌కిలీ గుడ్డు అయితే దాంట్లోని కెమిక‌ల్ ద్ర‌వాలు సుల‌భంగా క‌రిగిపోతాయి కాబ‌ట్టి.
గుడ్డును చిన్న‌గా ట‌క్‌ ట‌క్‌మ‌ని కొట్టి చూడాలి. అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్‌మ‌ని బాగా వినిపిస్తుంది.
న‌కిలీ గుడ్ల‌లో ప‌చ్చ‌ని సొన కొన్ని సార్లు మ‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది.

గోడలపై క్రేయాన్ మరకలను తొలగించడానికి సులభ మార్గం…

download (30)

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారికి గోడలపై గీతాలు గీయడానికి పిల్లలు ఎంత ఇష్టపడతారో తెలిసే ఉంటుంది. ఆ గీతాలను చెరపడానికి కేవలం ఒక చిన్నసాధారణ రబ్బరును ఉపయోగించండి. దీనికి బదులుగా బ్లో డ్రయ్యర్‌ని కూడా ఐదు నుండి పదినిమిషాలు ఈ గీతాలపై ఉపయోగించవచ్చు. ఆ ప్రాంతాన్ని శుభ్రమైన పొడి తువాలుతో తుడవండి.

వాచ్ బ్యాండ్స్‌ను శుభ్రం చేయడానికి సులభ మార్గం…

download

వాచ్ బ్యాండ్స్ లేదా బ్యాండ్స్ ప్రతి రోజూ వినియోగించడం వల్ల బాగా మరకపట్టి ఉంటాయి. కాబట్టి వాచ్ బ్యాండ్స్ మీద పేస్ట్‌ని అప్లై చేసి సాఫ్ట్‌గా ఉండే బ్రష్‌తో క్లీన్ చేసి తర్వాత నీళ్ళతో శుభ్రం చేయాలి.