Posts Tagged ‘house keeping tips’

టైల్స్ మద్య మురికిని తొలగించడానికి క్లీనింగ్ టిప్స్…

images (2)

వెనిగర్: వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి బాగా మిక్స్ చేసి స్ప్రేబాటిల్‌లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదు నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి వదలిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాకు అరకప్పు లిక్విడ్ బ్లీచ్ మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి దీన్ని టైల్స్ మధ్య రాసి 10 నిముషాల తర్వాత టూత్ బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోతుంది. తర్వాత తడిబట్టతో తుడిస్తే సరిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్: దెబ్బలు తగినప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ సైతం టైల్స్ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. దీన్నే నేరుగా ఫ్లోర్‌ని శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. లేదంటే దీనిలో బేకింగ్ సోడాను కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసి టైల్స్ మద్య రాసి ఆ తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్లీచింగ్ పౌడర్: కొన్ని సార్లు టైల్స్ మధ్య చేరిన మురికి పసుపు రంగులో కనబడుతుంది. దీన్ని పోగొట్టడానికి బ్లీచ్‌తో తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లీచింగ్ పౌడర్‌ను రెండు కప్పుల వేడినీటిలో వేసి మిశ్రమంగా చేసుకుని దీనిలో పాత టూత్ బ్రష్‌ని ముంచి మురికి ఉన్న చోట బాగా రుద్దితే వెంటనే అది వదిలిపోతుంది.

నిమ్మరసం: నిమ్మరసాన్ని నీటిలో కలిపి మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత స్ర్కబ్బర్‌తో రుద్ది శుభ్రం చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మరసం వల్ల టైల్స్‌ నునుపుదనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, కాస్త ఎక్కువ నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.

అమ్మోనియా: బకెట్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ , అమ్మోనియా లిక్విడ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి టైల్స్ మధ్య మురికిగా ఉన్న చోట స్ప్రే చేసుకోవాలి. 5నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్ది తర్వాత తడి వస్త్రంతో లేదా మాప్‌తో నేలను తుడిస్తే సరిపోతుంది.

స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే…

images (1)

స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే వంటసోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి తయారు చేసిన పేస్ట్‌తో రుద్దాలి. పాత టూత్‌బ్రష్‌తో టైల్స్ మీద రుద్దవచ్చు.

ఫ్రిడ్జ్‌లో టమోటాలను పెడుతున్నారా…?

How-to-Get-the-Most-Nutrients-Out-of-Food2
ఫ్రిడ్జ్‌ల్లో ఏది మిగిలితే దాన్ని భద్రపరిచేయడం ప్రస్తుతం ఫ్యాషనైంది. ఆహార పదార్థాలు పాడుకావనే ఉద్దేశంతో వాటిలో ఏది పడితే దాన్ని పెట్టేయకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదంటున్నారు. టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా విటమిన్ సి కోల్పోయే అవకాశం ఉందని.. అలాగే అది రుచి కూడా తగ్గిపోతుంది. టమోటా పండ్లను బయటే పేపర్ బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిది.
అలాగే ఉల్లిపాయలను, అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. తేనెను ఎప్పుడూ రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. కానీ సూర్యరశ్మి తగలకుండా ఉంటే మంచిది. తేనెను ఫ్రిజ్‌లో ఉంచటం ద్వారా చిక్కగా మారటమే కాకుండా స్పటికంగానూ మారుతుంది. దీంతో వాడుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇక పుచ్చకాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
వెల్లుల్లి పాయలను పొట్టు తీసి, గాలి చొరబడని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. కేవలం తక్కువు సమయం నిల్వచేసుకోవడానికి మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలి. ఇక బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇలా పెడితే అవి ఎండిపోవడంతో వాటిని తినడం ద్వారా వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు. ఇక కెచప్, సాస్, జామ్‌లాంటి వాటిని నెలకుపైగా ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మగువలు మెచ్చే లెగ్గింగ్స్ ఎక్కువ రోజులు మన్నాలంటే…

download (16)

లెగ్గింగ్స్ వాడాకం బాగా ప్రాచుర్యం చెందింది అయితే వాటి వాడకంలో, శుభ్రతలో, తీసుకోవాల్సిన జాగ్రత్తల కొరకు కొన్ని ట్రిక్స్ పాటిస్తే లెగ్గింగ్స్ వేసుకోవడానికి ఫిట్‌గా, క్లీన్‌గా ఉంటాయి.

1. ముందుగా లెగ్గింగ్స్ కొనే ముందు వాటి వెనుక లేబుల్‌లో ఏం రాసుందో, ఎలా వినియోగించాలో తెలుసుకోవాలి. కఠినమైన ఫ్రాబ్రిక్స్‌తో వాష్ చేయడం వల్ల రెండు మూడు ఉతుకులకే కలర్ మారిపోతుంటాయి. కాబట్టి లేబుల్ సూచనలు తప్పని సరి.

2. లెగ్గింగ్స్ వాష్ చేయాలనుకొన్నప్పుడు వాటిని మొదట మంచి డిటర్జెంట్ పౌండర్ లో 15-20నిమిషాల పాటు నానబెట్టి తర్వాత చేత్తోనే ఉతకాలి. ఉతికిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి.

3. లెగ్గింగ్స్ ఉతికేటప్పుడు చేతులతోనే వాష్ చేయాలి. బ్రష్ వాడకపోవడమే మంచిది. బ్రష్ ఉపయోగించినట్లైతే కలర్ పోవడంతోపాటు ఎలాస్టిక్ వదులు అవ్వడం వంటివి జరుగుతాయి.

4. లెగ్గింగ్స్‌కి కెమికల్స్, బ్లీచింగ్ వంటివి వేసి వాష్ చేయకూడదు. అలా చేయడం వల్ల కలర్, క్వాలిటీ విలువలు తగ్గిపోతాయి. లిక్విడ్ డిటర్జెట్ మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుంది.

5. లెగ్గింగ్స్ పై చెమట మరకలు, బురద మరకలు, దుమ్ము ఎక్కువగా ఉన్నట్లైతే నిమ్మరసం కలిపిన నీళ్ళలో పదినిమిషాల పాటు నానబెట్టి తర్వాత వాష్ చేయాలి.

6. లెగ్గింగ్స్‌ను వేడి నీళ్ళతో నానబెట్టి ఉతకకూడదు. చల్లని నీళ్ళలోనే ఉతకాలి.

7. కలర్, క్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే లెగ్గింగ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రాబ్రిక్ కండీషనర్ వినియోగించాలి.

8. లెగ్గింగ్స్ ఎక్కువ సార్లు ఉతకడం వల్ల ఎలాస్టిక్ పాడై లూజ్ అవుతుంది. కాబట్టి ఈ లెగ్గింగ్స్ ఉతకడంలో ఈ చిట్కాలను పాటించినట్లైతే ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి.

దుస్తులపై కాఫీ మరకలను పోగొట్టే సులభ చిట్కాలు…

images (14)

– స్టెయిన్ రిమూవర్: కాఫీ మరకలను సులభంగా తొలగించేవి స్టెయిన్ రిమూవర్స్. స్టెయిన్ రిమూవర్‌ను అప్లై చేసి 5నిముషాలు వదిలేసి మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

– గుడ్డులోని పచ్చసొన: టెర్రీ క్లాత్‌తో గుడ్డులోని పచ్చసొనను బాగా గిలకొట్టాలి, తర్వాత అదే బట్టతో మరకల మీద మర్ధన చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేస్తే మరక మాయమవుతుంది.

– బేకింగ్ సోడా: కాఫీ మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా బాగా సహాయపడుతుంది. అందుకు కొద్దిగా వేడి నీళ్ళను మరకల మీద పోసి, దాని మీద కొద్దిగా బేకింగ్ సోడా చిలకరించి, కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

– వెనిగర్: వాటర్ సోలబుల్ మరకలను తొలగించడంలో వెనిగర్ బాగా పనిచేస్తుంది. కాఫీ మరక మీద నేరుగా కొద్దిగా వెనిగర్ చిలకరించి చేత్తో రుద్ది, రెగ్యులర్ వాష్ చేస్తే మెండిగా మారిన కాఫీ మరక తొలగిపోతుంది.

సమ్మర్‌లో మీ పెట్స్ కోసం తీసుకోవల్సిన కేరింగ్ టిప్స్…

download (6)

– అవి ఏం తింటున్నాయో గమనించండి: పెంపుడు కుక్కలను పెంచుకోనే యజమానులు, వాటి బాగోగులు కూడా గమనిస్తుండాలి. వేసవిలో మనతో పాటు, వాటికి కూడా వేడిని ఎదుర్కోవడానికి సహాయపడే ఆహారాలను అందివ్వాలి. పుచ్చకాయ, మజ్జిగ, మరియు కొబ్బరి నీళ్ళు వంటివి వాటికి కూడా అప్పుడప్పుడు అందివ్వాలి. పెరుగు మంచి ప్రోబయోటిక్ ఆహారం. కాబ్టటి అన్నంతో పాటు, పెరుగు, మాంసాన్ని కలిపి పెట్టొచ్చు.

– బయటకు తీసుకెళ్ళండి: ఉదయం మరియు సాయంత్రాల్లో వాటిని బయటకు తీసుకెళ్ళడం చాలా ఫర్ఫెక్ట్. ఎండ తగలకుండా, చల్లని వాతావరణంలో వాటిని బయట తిప్పాలి. ఇలా చేయడం వల్ల మీతో పాటు అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా పార్కుల వెంట తిప్పండి. వాటి కాళ్ళను స్ట్రెచ్ అయ్యేలా చూడండి.

– స్విమ్ చేయించాలి: వేసవి వేడిని తట్టుకోవడానికి వాటిని స్విమ్మింగ్ కు తీసుకెళ్ళండి. లేదా నగరాల్లోని పెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్‌కు తీసుకెళ్ళండి. ఈ రెండు పద్దతులు మీకు మరియు మీ పెంపుడు కుక్కలకు వేసవి వేడి నుండి ఉపశమనం కలుగుతుంది.

– కుక్కలకు తగినన్ని నీరు అందివ్వాలి:  మనుషులకు వలె వాటికి కూడా ఎక్కువ నీరు అవసరం అవుతాయి. అవి ఎక్కువ నీరు తాగేట్లు చూడాలి. వాటికి ఒక గిన్నెలో నీరు నింపి పెట్టడం వల్ల అవి రోజులో వాటికి దాహం అనిపించనప్పుడు అవి తాగుతుంటాయి.

– వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు: వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో అవి బయట తిరగకుండా నీడ ఉండే ప్రదేశంలో ఉంచాలి. కుక్కలు కూడా వడదెబ్బకు గురైయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, వాటిని చల్లని వాతావరణంలో ఉండనివ్వాలి.

– పిల్లులకు కూడా: పెంపుడు కుక్కల వలే పిల్లులు కూడా ఎండ వేడికి తట్టుకోలేవు. అయితే అవి కొన్ని సమయాల్లో ఎండను ఇష్టపడుతాయి. కాబట్టి వాటికి కూడా తగిన చల్లని ప్రదేశాన్ని కల్పించాలి. ఎక్కువ నీరు అందివ్వాలి. పెంపుడు జంతువులు హైడ్రేట్‌గా మరియు కూల్‌గా ఉంచాలి.

దోశలు మెత్తగా, రుచికరంగా ఉండటానికి సింపుల్ టిప్స్…

download (2)

ఇడ్లీ కాని దోశలు కాని పప్పు నానబెట్టినప్పుడు త్వరగా నానాలంటే అందులో ఒక ఇనప వస్తువు వేసుకోవాలి.

దోసెలు మెత్తగా కావాలనుకున్న వారు పిండి రుబ్బేటప్పుడు మినపప్పు, బియ్యంతో పాటుగా కొద్దిగా ఉడికించి చల్లబడిన అన్నాన్ని చేర్చి రుబ్బుకోవాలి.

దోశలు మెత్తగా రావాంటే పప్పు నానబెట్టేటప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పు, నాలుగు మెంతి గింజలు వేస్తే దోశలు మెత్తగా, ఎంతో రుచికరంగా ఉంటాయి.

ఫ్లవర్ వాజ్‌ను శుభ్రం చేయడానికి సులువైన మార్గం…

images (31)

ఫ్లవర్ వాజ్‌లు నీళ్లతో నిల్వ ఉండటం వల్ల లోపల ఫంగస్ పేరుకుపోతుంది. దాని వల్ల పువ్వులు త్వరగా వాడిపోయే అవకాశం ఉంది అందుకే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ వాజులో కొద్దిగా నీళ్లు పోసి అర చెంచా బియ్యం వేసి అటు ఇటూ బాగా తిప్పి కడిగితే శుభ్రపడుతుంది.

అలాగే ఫ్లవర్ వాజ్‌లో సాల్ట్ కలిపిన నీరు పోస్తే ఫ్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.

రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను శుభ్రం చేయడానికి సింపుల్ టిప్…

how-to-clean-silver-vessels
ఉప్పులో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కలిపి రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరిసిపోతాయి.

కిచెన్ సింక్‌ను క్లీన్ చేయడానికి సింపుల్ టిప్…

kitchen-sink-6
గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కిచెన్ సింక్‌ను క్లీన్ చేస్తే జిడ్డు తొలగి అందులో ఇరుక్కున్న ప‌దార్థాల‌న్నీ పోతాయి.