Posts Tagged ‘house tips’

కిచెన్ టవల్స్ శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…

images

కిచెన్ టవల్స్ ను మరింత శుభ్రంగా ఉతకాలంటే, వేడి నీళ్ళలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేయడం ఉత్తమ పద్దతి. వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత డిటర్జెంట్ తో ఉతికి, ఎండలో ఆరబెట్టుట వల్ల మురికి మరియు దుర్వాసన పోయి తాజాగా ఉంటాయి. వీటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా లేదా వెనిగర్ ను ఉపయోగించవచ్చు.

కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ చిట్కా. మరకలను వదిలించే మంచి క్లీనర్ ను ఉపయోగించాలి. వాటిని శుభ్రం చేయడానికి ముందు కొంత సమయం క్లీనర్ లో నానబెట్టి, తర్వాత బ్రష్ వేసి శుభ్రం చేయాలి.

బ్లీచింగ్ మరియు సోడియం బైకార్బోనేట్ లో రాత్రంత నానబెట్టి, తర్వాత శుభ్రం చేసి, ఎండలో ఆరబెట్టాలి. దాంతో కిచెన్ టవల్స్ క్లీన్ గా మంచి సువాసనతో ఉంటాయి.

బెడ్ ఎంపిక చేసుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలు…

images (82)

మీరు పరుపులు ఎన్నుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఇవ్వబడ్డాయి…

1. ఇప్పటికే ఉన్న మీ పరుపు వయస్సు(గడువు): మీరు నిద్రపోయేటపుడు సమస్యగా ఉంటే, ఆ సమస్య మీ పరుపులో లేదు, దాని వయసులో ఉండవచ్చు. ప్రతి పరుపుకి గడువు తేదీ ఉంటుంది. కొంత సమయం అయిన తరువాత, పరుపులు వాటి సహజ సౌకర్య నాణ్యతను ఎక్కువకాలం కలిగి ఉండవు.

2. మీరు నిర్ధారించుకునే ముందు పరీక్షించండి: ఒకసారి మీ మనసు నిర్దిష్ట పరుపుపై ఉన్నట్లయితే, కనీసం 10 నుండి 15 నిముషాలు దానిపై కూర్చుని ప్రయత్నించండి. దీనివల్ల దాని సౌకర్యాన్ని, మన్నికను తెలుసుకోవచ్చు. కొనుగోలులో పెద్ద హడావిడి పడొద్దు, అమ్మకందారుని ప్రభావం వల్ల మీరు నిర్ణయం తీసుకోవద్దు.

3. అన్ని ఎంపికలని, వ్యత్యాసాలని తనిఖీ చేయండి: పరుపు సంస్ధ, దాని అందమైన శైలి, పైన ది౦డుతో కలిసి ఉందో లేదో, దాని బ్రాండ్ హామీ అన్నీ చూడండి. మధ్యవర్తి ద్వారా నిర్ణయం తీసుకోవద్దు. నిజమైన పరుపుల దుకాణంలో కొనుగోలు చేయండి.

4. డిపార్టుమెంటు స్టోర్ లో కొనుగోలు మానండి: పరుపుల దుకాణంలోని అమ్మకందారులు సాధారణంగా బాగా శిక్షణ పొంది ఉంటారు, మీరు సరైన ఎంపిక చేసుకోవడానికి వారి నైపుణ్యం ఎంతో సహాయ పడుతుంది.

5. వారెంటీ తనిఖీ చేయడం మరిచిపోవద్దు: మంచి పరుపులకు కనీసం 10 సంవత్సరాల ‘పూర్తి’ వారెంటీ లేదా ‘నాన్-ప్రోరేటేడ్ వారెంటీ’ ఉంటుంది.

ఐస్ క్యూబ్ ట్రే వల్ల ఉపయోగాలు…

images (75)

పిల్లలవి చెవిపోగులూ, ఉంగరాలూ, హారాలూ..ఒకేచోట పెడుతుంటే ఒకదానితో ఒకటి కలసి చిక్కుపడిపోతున్నాయ? పాత ఐస్ క్యూబ్ ట్రే ని పారేయకుండా ఈ ఆభరణాలని విడివిడిగా ఉంచుకోవడానికి ఉపయోగించుకోండి..వెతుక్కోవాల్సిన శ్రమ ఉండదు, సమయం కూడా ఆదా అవుతుంది.

అలాగే మనం ఇంట్లో వివిధ హస్తకళాకృతులు చేయడానికి ఉపయోగించే రంగురంగుల కుందన్స్, బటన్స్, స్టోన్స్, బీడ్స్..మొదలైనవన్నీ విడిగా జాగ్రత్తగా ట్రేల్లో భద్రపరచుకోవచ్చు.

కంప్యూటర్లు – ల్యాప్ టాప్ లు ఎక్కువ కాలం మన్నాలంటే…

pc-laptop-tablet-repairs

1. కంప్యూటర్ మీద ఇంట్లో పనిచేసేటప్పుడు వేరే పని మీద లేచి వెళ్ళిపోవడం, మళ్లీ ఇప్పుడే వచ్చి పని చేసుకుంటాం కదాని కంప్యూటర్‌ని అలానే వదిలి వెళ్ళడం జరుగుతుంది, అలా చెయ్యడం సరి కాదు. కంప్యూటర్ వాడకం అయ్యాక తప్పనిసరిగా షట్ డౌన్ చేయాలి. తరచూ అలా చేస్తే పాడవుతుందన్నది అపోహ మాత్రమే. నిజానికి మన్నిక కాలం పెరుగుతుంది.

2. అందమైన స్క్రీన్ సేవర్ పెట్టుకుంటే కంప్యూటర్ చూడటానికి బాగానే ఉంటుంది. కాని, దాని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కొన్ని గంటలు అలా వదిలేస్తే ఖర్చయ్యే శక్తి…రోజంతా ఓ రిఫ్రిజిరేటర్ నడపడానికి కావాల్సిన విద్యుత్తుతో సమానం.

3. మరీ చిన్నపాటి విరామానికే షట్ డౌన్ చేయడం ఎందుకూ అనుకుంటే కనీసం మానిటర్ ని కట్టేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఎందుకంటారా? కంప్యూటర్ వినియోగించుకొనే శక్తిలో సగం మానిటరే ఉపయోగించుకుంటుంది కనుక. కంప్యూటర్, మానిటర్, కాపీయర్… వీటికి స్లీప్ మోడ్ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. దీనివల్ల నలభై శాతం విద్యుత్ ఆదా అవుతుంది.

4. ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్ ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్ ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. ఒక్క ల్యాప్ టాప్ విషయంలోనే కాదు… సెల్ ఫోన్, డిజిటల్ కెమెరాలకి ఉపయోగించే ఛార్జర్ల విషయంలోనూ ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి.

5. ల్యాప్‌టాప్, మొబైల్, డిజిటల్ కెమెరా చార్జింగ్ అవడం పూర్తి అయిన వెంటనే చార్జర్‌ను తీసెయ్యాలి. ఇలా చెయ్యడం వలన బ్యాటరీ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. లేకపోతే బ్యాటరీ త్వరగా చెడిపోయే వీలు ఉంది.

గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికోసం ముఖ్యమైన జాగ్రత్తలు…

images (2)

గ్యాస్ సిలిండర్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడం: గ్యాస్ సిలిండర్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఒక సమయం అంటూ ఉంటుంది. కొన్ని రకాల సిలిండర్లను వినియోగించేటప్పుడు సురక్షితంగా ఏవిధంగా ఉపయోగించాలి, అందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకోవాలి. గ్యాస్ సిలిండర్ ను తరలించేటప్పుడు నిలువుగా ఉంచాలి . సిలిండర్ ను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించడానికి ముందు క్యాప్స్ మరియు కవర్స్ కరెక్ట్ గా ఫిట్ చేసి ఉండాలి . ఇలా చేయడం వల్ల ఏదైన దుమ్ము, ధూళి వాల్వ్ లోనికి ప్రవేశించకుండా ఉంటుంది.

నిల్వచేసే ప్రదేశం : గ్యాస్ సిలిండర్ ను అవసరం ఉన్నప్పుడు మాత్రం నిల్వచేసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణం పొడిగా మరియు సురక్షితంగా ఉండే ప్రదేశంలో సిలిండర్ ఉంచడం క్షేమకరం. ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ప్రదేశించే స్థలంలో ఉండటం మంచిది. గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రదేశంలో ఎటువంటి వేడి వాతావరణం కలిగించకూడదు. అలాగే సిలిండర్ ఉన్న ప్రదేశంలో బయటి నుండి కూడా వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ ఇంట్లో సురక్షితంగా నిల్వచేయడానికి సహాయపడే కొన్ని జాగ్రత్తలు. సూచనలు.

ట్యూబ్స్ మరియు రెగ్యులేటర్స్: అన్ని రకాల ట్యూబ్స్ మరియు రెగ్యులేటర్స్ సరిగా ఉన్నాయో లేదో అప్పుడప్పుడు గమనిస్తుండాలి . ఒక్కో సందర్భంలో లీక్ అవుతుంటాయి . సిలిండర్స్ వినియోగించేటప్పుడు పీరియాడిక్ మెయింటెనెన్స్ చాలా అవసరం మరియు మంచిది కూడా. మరో ముఖ్యమైన విషయం ట్యూబ్స్ ను తరచూ మార్చుతుండాలి. పాతబడిన లేక విరిగిపోయిన గ్యాస్ పైప్ లను(రబ్బర్ ట్యూబ్ లను) వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు సంవత్సరాలకు మించి రబ్బర్ ట్యూబ్ ను వాడకూడదు.

మీ బుక్ షెల్ఫ్‌ను అమర్చుకోండి ఇలా…

images (22)

మీరు ఒక పుస్తకాల పురుగు అయి ఉండి, ఆ పుస్తకాలను ఎలా నిర్వహించాలో తెలియకపోతే, మీ ఇల్లంతా ఖచ్చితంగా టన్నుల కొద్ది పుస్తకాలతో నిండి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న పుస్తకాలను చిన్ని చిన్ని చిట్కాలను పాటించి చక్కగా అమర్చుకుందాము.

అక్షర క్రమంలో అమరిక: రచయత యొక్క మొదటి అక్షర క్రమంలో పుస్తకాలను అమర్చుకోవడం ఉత్తమమైన, సులభమైన పద్దతి.

కళల ప్రకారం అమరిక: కళల ప్రకారం పుస్తకాలను అమర్చుకోవడం మరియొక ఉత్తమమైన పద్దతి. హాస్యాలను, థ్రిల్లర్‌లను, కావ్యాలను, భక్తి ప్రవచనాలను, సస్పెన్స్‌లను ఇలా విభాగాలుగా పుస్తకాలను అమర్చుకోవాలి. మీ మూడ్‌ను బట్టి పుస్తకాన్ని ఎంచుకోవడానికి ఈ పద్దతి ఉపయోగ పడుతుంది.

రంగుల ప్రకారం అమరిక: పుస్తకాల రంగుల ప్రకారం వాతిని వివిధ విభాగాలగా అమర్చితే ఇంట్లో ఇంద్రధనస్సులాగా అందంగా కనపడుతుంటాయి.

సాఫ్ట్ టాయిస్ ను శుభ్రం చేయడానికి సులభ మార్గాలు…

images (1)

1. ముందుగా వదులుగా ఉండే పార్ట్స్: హ్యాండ్ వాష్ చిట్కాలో ఇది ఒక ముఖ్యమైనది, మీ పిల్లలకు ఇష్టమైన బొమ్మలు ఏమైనా మరమ్మత్తులు చేయాల్సి ఉందేమో గమనించాలి . ఏదైనా పార్ట్స్ వదులుగా ఉంటే, వాటిని టైట్ చేసి తర్వాత వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

2. వాటిని కొత్తవాటిలా మెరిపించాలి: మీ సాఫ్ట్ టాయ్ క్లీన్ గా మరియు కొత్తవాటిలా మెరిపించాలంటే, 3చెంచాలా బేకింగ్ పౌడర్, రెండు చుక్కల పుదీనా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ద్రవాన్ని బొమ్మమీద చిలకరించి, తర్వాత బ్రెష్ తో రుద్ది కడగాలి. ఇలాంటి సాఫ్ట్ బొమ్మలను శుభ్రంగా ఉంచడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3. దుమ్మ దులపడం: సాఫ్ట్ బొమ్మలను శుభ్రం చేయడానికి ముందుగా డస్ట్ దులపాల్సి ఉంటుంది. అందుకు వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించాలి. హ్యాండిల్ బ్లో డ్రయ్యర్ ను ఉపయోగించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

4. హోం మేడ్ క్లీనర్: డస్ట్ తొలగించిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చిట్కాను అనుసరించాలి. బొమ్మల మీద ఏర్పడ్డ మరకలను తొలగించడానికి హోం మేడ్ క్లీనర్ బాగా ఉపయోగపడుతుంది. అందుకు 3చెంచాల డిష్ సర్ఫ్ లిక్విడ్ ను , 1/4చెంచా అమ్మోనియం మరియు 3/4నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ లిక్విడ్ ను అప్లై చేసి టూత్ బ్రష్ తో కడిగి శుభ్రం చేయాలి. తర్వాత నీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి.

5. డిటర్జెంట్ సోప్: తర్వాత డిటర్జెంట్ సోప్ తో శుభ్రం చేసి కడిగేయాల్సి ఉంటుంది. సాఫ్ట్ టాయ్స్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

6. వెనిగర్: రెగ్యులర్ క్లీనింగ్ లో మరో పద్దతి. వెనిగర్ క్లీనర్. ఒక బౌల్ల్ వాటర్ లో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి తర్వాత బొమ్మలకు అప్లై చేసి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.

సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి చిట్కాలు…

images (39)

ప్రతి రోజూ సిల్వర్ ప్లేట్స్ పాలిష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రెగ్యులర్ గా శుభ్రం చేయడం వల్ల సిల్వర్ నాశనం అవుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక మృదువైన వస్త్రం లేదా మృదువైన పళ్ళు ఉన్న బ్రెష్ తో తుడిచి శుభ్రం చేయాలి. ఇంకా మీరు కొన్ని సోప్ నీళ్ళు ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చు. మరకలు తొలగిపోతాయి. నీటితో శుభ్రం చేసిన తర్వాత ఒక మృదువైన వస్త్రం ఉపయోగించి నీటిని పూర్తిగా తుడవడానికి నిర్ధారించుకోవాలి.

బేకింగ్ సోడా : బేకింగ్ సోడా సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి మరో క్లినింగ్ ట్రిక్. గోరువెచ్చని నీటిలో ఒక గుప్పెడు బేకింగ్ సోడా వేసి, నీటిలో బేకింగ్ సోడా పూర్తిగా కరిగిపోయేవరకూ రెండు మూడు నిముషాలుండి, తర్వాత అందులో సిల్వర్ ప్లేట్స్ వేసి, నీటిలో కిద్దిసేపు నానబెట్టాలి. పదినిముషాల తర్వాత ఆ నీటిలో నుండి తీసి ఒక ఒక మృదువైన పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి.

గుడ్డు వాసను మాయం చేసే సింపుల్ చిట్కాలు…

images (52)

గుడ్డు పగిలి క్రిందపడినప్పుడు, లేదా పాత్రలకు అట్టుకొన్నప్పుడు వెంటనే శుభ్రం చేయకపోతే, కెమిక్ గ్యాస్ హైడ్రోజన్ ఉత్పత్తై బ్యాక్టీరియా చేరి దుర్వాసన మరింత ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, గుడ్డు వల్ల వచ్చే దుర్వాసను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి…

1. నిమ్మరసం: నిమ్మరసంతో గుడ్డు వాసను దూరం చేయవచ్చు. గుడ్డ పడ్డ మరకల మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించండి. రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత పొడి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే తక్షణం వాసన పోతుంది.

2. రోజ్ వాటర్: గుడ్డు పడ్డ చోట బాగా ఎండిపోయి, మొండి మరకలుగా తయారైతే రోజ్ వాటర్ తో శుభ్రం చేయడం ఒక సులభమైన పద్దతి. అంతే కాదు, రోజ్ వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుంటుంది.

3. వెనిగర్: ఎగ్ స్మెల్ నిర్మూలించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక ఎఫెక్టివ్ మార్గం. అందుకు మీరు చేయాల్సిందల్లా, వెనిగర్ లో కాటన్ క్లాత్ ను డిప్ చేసి, మరకపడ్డ ప్రదేశంలో రుద్దాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే దుర్వాసన మాయం అవుతుంది.

4. ఆరెంజ్ తొక్క: ఎగ్ స్మెల్ తొలగించడానికి ఆరెంజ్ ఒక ఉత్తమమైన మార్గం. ఇది ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ సువాసన అందించే బెస్ట్ హోంరెమడీ. ఆరెంజ్ తొక్కతో ఎగ్ మరకలున్న చోట రుద్ది శుభ్రం చేయాలి.

ఫిష్ బౌల్/ఫిష్ ట్యాంక్/అక్వెరియం శుభ్రపరుచుటకు చిట్కాలు…

download (4)

వెనిగర్ : ఫిష్ బౌల్ శుభ్రపరుచుటకు వెనిగర్ ను ఉపయోగించండి. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ వేసి, ఆనీటిలో వెనిగర్ కొద్దిసేపు అలాగే ఉంచండి. తర్వాత ఆ నీటిని ఉపయోగించి ఫిష్ బౌల్ ను శుభ్రం చేయండి.

బేకింగ్ పౌడర్ : ఫిష్ బౌల్ ను శుభ్రం చేయడానికి బేకింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలి. బేకింగ్ పౌడర్ ఫిష్ ట్యాంక్ మీద మరకలను తొలగించడంతో పాటు, వాసనను కూడా తొలగిస్తుంది. అయితే బేకింగ్ పౌడర్ ను చాలా తక్కువగా ఉపయోగించాలి.

నిమ్మరసం : ఫిష్ బౌల్ శుభ్రపరచడానికి నిమ్మరసం ఒక ఉత్త వంటగది వస్తువు. కొద్దిగా నిమ్మరసంను ఫిష్ బౌల్లో చిలకరించి, నిమ్మతొక్కతో బాగా రుద్ది పది నుండి పదిహేను నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచినీటితో శుభ్రం చేయాలి. అంతే ఫిష్ ట్యాంక్ లో చెడు వాసన పోయి, తాజాగా ఫ్రెష్ గా లైమ్ వాసన వస్తుంటుంది.

ఉప్పు : ఫిష్ బౌల్ శుభ్రపరుచటకు ఉప్పు అద్భుతంగా సహాయపడుతుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక గుప్పెడు రాళ్ళఉప్పు తీసుకోని కొద్దిగా నీళ్ళు పోసి, ఉప్పును వేసి చేత్తో బాగా రుద్ది కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మరకలు సులభంగా తొలగిపోతాయి.

సోపును ఉపయోగించడం : చేపలు పెట్స్ లాంటివే, కాబట్టి వాటి శుభ్రతకు సోపును ఉపయోగించవచ్చు. మరియు మీ ఫిష్ బౌల్ చూడటానికి అందంగా ఉంటుంది. మెరిస్తూ ఉంటుంది. మరియు ఫిష్ ట్యాంక్ లో ఫౌల్ స్మెల్ ను నివారిస్తుంది.

బ్లీచింగ్ : బ్లీచ్ ఒక ఉత్తమ వంటింటి వస్తువు, ఒక టేబుల్ స్పూన్ బ్లీచ్ ను నీటితో మిక్స్ చేసి ఫిష్ బౌల్ ను శుభ్రపరుచుకోవాలి.