Posts Tagged ‘lemon’

వెజిటేబుల్ లెమన్ పెప్పర్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావల్సిన పదార్థాలు:

క్యారెట్ – 1 cup (Chopped)

ఉల్లిపాయలు -1 cup (Chopped)

క్యాప్సికమ్-1 cup (Chopped)

స్ప్రింగ్ ఆనియన్స్ – 1 cup (Chopped)

క్యాబేజ్ -1 cup (Chopped)

వెల్లుల్లి- 1/4 Teaspoon

అల్లం – 1/4 Teaspoon (Chopped)

కార్న్ ఫ్లోర్ – 3 Teaspoon

పెప్పర్ – 1/2 Teaspoon

లెమన్ జ్యూస్- 2 Teaspoon

వెజిటేబుల్ స్టాక్- 2 Cups(వెజిటేబుల్స్ ఉడకించిన నీళ్ళు)

నూనె: తగినంత

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

2. తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ మరియు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి 10 నిముషాలు వేగించుకోవాలి.

3. వేజిటేబుల్స్ వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ పోయాలి.

4. ఇప్పుడు అందులోనే పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

5. మీడియం మంట మీద ఉడికించాలి. ఉడుకుతన్నప్పుడు అందులో కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో వేసి మిక్స్ చేసి ఉడికే మిశ్రమంలో పోయాలి.

6. తర్వాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలు, మీడియం మంట మీద ఉడికించాలి.

7. చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ పెప్పర్ లెమన్ సూప్ రెడీ.

వంటగదిలోని కత్తిని ఇలా శుభ్రపరచండి…

images (30)

1. సోప్: కత్తి వాడిన తర్వాత డిష్ వాష్ సోప్ ను కత్తిమీద రుద్ది, వేడినీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి. వేడినీళ్ళు వల్ల క్రిములు చాలా త్వరగా నశిస్తాయి. మరియు కత్తి మీద మరకలను శుభ్రపరుస్తుంది.

2. నిమ్మకాయ: బాగా మురికి పట్టిన కత్తిని నిమ్మరసంతో శుభ్రం చేయాలి. నిమ్మ ఉత్తమ క్లీనింగ్ ఏజెంట్, మరియు స్ట్రాంగ్ ఆరోమా వాసన కలిగి ఉంటుంది, కత్తి కార్నర్స్ లో మురికిని తొలగించడాని బాగా సహాయపడుతుంది. కొన్ని చుక్కల నిమ్మరసంను నీటిలో వేసి మరిగించి ఆనీటితో శుభ్రం చేయాలి.

3. వెనిగర్: వంటగది వస్తువైన కత్తిని శుభ్రం చేయడానికి ఇదొక ఉత్తమ చిట్కా. వేడి నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి, కొద్ది సేపు నానబెట్టాలి. తర్వాత పాత టూత్ బ్రెష్ తో బాగా రుద్ది, తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

4. ఉడికించాలి: ప్లాస్టిక్ హ్యాండిల్ లేకుండా ఉంటే, వేడినీళ్ళలో వేసి, ఒక నిముషం ఉడికించాలి. వేడినీళ్ళు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మరకలను వదలగొడుతుంది . వేడినీళ్ళతో రుద్ది కడగడం వల్ల కత్తికి ఉన్న ఆయిల్ , జిడ్డు మరకలు తొలగిపోతాయి.

మోచేయి నలుపు తగ్గించే సులభ చిట్కాలు…

images (50)

నిమ్మరసం: నిమ్మతొక్కను పంచదార లేదా ఉప్పు లో డిప్ చేసి, మోచేతుల మీద స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరగా మార్పు వస్తుంది.

షుగర్ స్ర్కబ్: చేతులను చల్లటి నీటితో కడిగి, తర్వాత పంచదార చిలకరించి స్క్రబ్ చేయాలి. ముఖ్యంగా మోచేతుల దగ్గర స్ర్కబ్ చేయడం వల్ల నలుపుతగ్గతుంది.

నిమ్మరసంతో తళ తళలాడే పళ్ళు…ఎలా…?

download (16)
చాలా మంది పళ్ళు పచ్చగా ఉన్నాయని, గారపట్టిపోయాయని ఇబ్బంది పడుతుంటారు. వారు స్వేచ్ఛగా నోరు తెరవాలంటే బిడియపడుతుంటారు. పళ్ళను తెల్లగా తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే పిసిరంత నిమ్మకాయతో తళతళలాడే పళ్ళను తెచ్చుకోవచ్చు. అదెలా..?
ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలబెట్టాలి. బ్రషింగ్ చేయడం పూర్తి అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని ఓ రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఊమ్మేయాలి.
ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే చాలు… గార లేదా పాచితో ఉన్న పళ్ళపై  ఉప్పు, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్‌లు రసాయన చర్యలు జరుపుతాయి. వాటిపై గార లేదా పసుపు పచ్చటి పొర తొలగిస్తాయట. ఇలా చేస్తే వారానికి పళ్లు తళతళా మెరవడం ఖాయం.

స్పైసీ చికెన్‌ పకోడి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావలసిన పదార్థాలు:

బోన్‌లెస్‌ చికెన్‌: 1/2kg

పుదీనా: 1 కట్ట

కొత్తిమీర: 1 కట్ట

పచ్చిమిర్చి: 4

అల్లం: చిన్న ముక్క

వెల్లుల్లి: 6 రెబ్బలు

నిమ్మకాయ: 1

ధనియాల పొడి: 1tsp

గరం మసాలా: 1tsp

పెరుగు: 2tsp

శనగపిండి: 1/2cup

ఉప్పు: తగినంత

నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేసే విధానం:

1. ముందుగా పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి.

2. తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం, ముందుగా నూరిపెట్టుకున్న పుదీన, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి.

3. ఒక గంట తర్వాత అందులో ఒక స్పూను వేడి నూనె, శనగపిండి కలపాలి.

4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ నుండి కొద్దికొద్దిగా తీసి శెనగపిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేయాలి.

5. కాగిన నూనెలో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీలా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీస్తే చాలు. రుచికరమైన వేడి వేడి చికెన్‌ పకోడీ రెడీ.

ఉప్పు, మిరియాలు, నిమ్మ కలిపి తీసుకుంటే పొందే బెన్ఫిట్స్…

images (14)

ముక్కుదిబ్బడ: ఉప్పు, మిరియాల పొడి, నిమ్మలతో పాటు గోరువెచ్చని నీళ్లు కలిపి తీసుకుంటే శరీరంలో కావాల్సినంత హీట్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్ల్ఫమేషన్ తగ్గించి, ముక్కు దిబ్బడను నివారిస్తుంది.

గొంతు నొప్పి: ఈ న్యాచురల్ డ్రింక్ యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

గాల్ బ్లాడర్ స్టోన్స్: ఉప్పు, మిరియాలు, నిమ్మలతో పాటు ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకుంటే గాల్ బ్లాడర్‌లో ఇబ్బందిపెట్టే స్టోన్స్ నివారించవచ్చు. రెగ్యులర్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

బరువు తగ్గడానికి: ఈ మిశ్రమాన్ని వేడినీటితో కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే మీ శరీరం మెటబాలిజం పెరిగి, ఫ్యాట్ బర్నింక్ కెపాసిటీ పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

పంటినొప్పి: గోరు వెచ్చని నీటితో కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల పంటినొప్పి నివారిస్తుంది. పుక్కిలించినా పంటినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఫ్లూ: ఈ మిశ్రమాన్ని తేనెతో పాటు తీసుకుంటే వైరస్‌లతో పోరాడుతుంది. ఫ్లూ లక్షణాలను కూడా నివారిస్తుంది.

వికారం: ఉప్పు, మిరియాలలో పొట్టలోని యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేస్తుంది. నిమ్మరసం వికారాన్ని తగ్గిస్తుంది. అలాగే పొట్ట సమస్యలు, లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

కంటి అద్దాల వలన ఏర్పడే మచ్చలను తొలగించే ఔషదాలు…

images

కంటి అద్దాలను వాడటం వలన ముక్కుపై మరియు కంటి కింద మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కంటి అద్దాలు బరువుగా ఉండటం వలన ముక్కుపై మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మచ్చలను తొలగించే సమర్థవంతమైన ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

కలబంద

కలబంద చర్మానికి శీతలీకరణ ఏజెంట్ గా పని చేస్తుంది. ఈ మచ్చలను సహజంగా తగ్గించుకోటానికి, తాజా కలబంద గుజ్జును తీసుకొని, మచ్చలు ఉన్న ప్రాంతంలో నేరుగా అప్లై చేయండి. ఈ గుజ్జు ఎండే వరకు వేచి ఉండి, తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి.

బంగాళదుంప

తురిమిన బంగాళదుంపను పేస్ట్ లా చేసి ముక్కుపై ఉండే నల్లటి మచ్చలపై నేరుగా అప్లై చేయండి. కంటి అద్దాల వలన ముక్కుపై ఏర్పడిన మచ్చలు తొలగిపోయే వరకు రోజు ఈ పద్దతిని అనుసరించండి.

దోసకాయ

తాజా దోసకాయ నుండి సన్నగా రెండు ముక్కలను కత్తిరించి, నల్లటి మచ్చలపై ఉంచండి. ఈ దోసకాయ ముక్కలు శీతలీకరణ ఏజంట్ గా పని చేసి, నల్లటి మచ్చలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. లేదా కత్తిరించిన దోసకాయ ముక్కలను కంటి చుట్టూ రాయటం ద్వారా వీటి నుండి ఉపశమనం పొందుతారు.

నిమ్మ

తాజా నిమ్మపండు నుండి రసాన్ని తీసుకొని, తగినంత నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగి వేయండి.

తేనె

తేనెను పాలు మరియు ఓట్స్ లో కలపండి. ఈ మిశ్రమాన్ని, నల్ల మచ్చలపై అప్లై చేసి, 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి. ఈ మిశ్రమం ముఖం నుండి తొలగించిన తరువాత కలిగే మార్పులను గమనించండి.

కల్మీ కబాబ్ రిసిపి ఎలా తయారుచేస్తారో చూద్దాం…

images (23)

కావల్సిన పదార్థాలు:

చికెన్: 1kg (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp

ఉప్పు: రుచికి సరిపడా

పెరుగు: 1cup

కుంకుమపువ్వు: చిటికెడు

నిమ్మకాయ రసం: 1tbsp

మైదా: ¼cup

మసాలా కోసం కావల్సిన పదార్థాలు:

లవంగాలు: 3

ఉల్లిపాయ విత్తనాలు(కాలా జీర): ½tsp

చెక్క: 1

బే ఆకు: 1

మిరియాలు: 5

తయారుచేయు విధానం:

1. ముందుగా మసాలాకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని పాన్‌లో వేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారనిచ్చి, మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, తడిఆరేవరకూ పక్కన పెట్టుకోవాలి.

3. తర్వత చికెన్ ముక్కలను చిన్న చిన్నగాట్లు పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కుంకుమ పువ్వు, నిమ్మరసం, మైదా మరియు పొడిచేసుకొన్న మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

5. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి రెండు మూడు గంటల సమయం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.

6. తర్వత మైక్రోవేవ్‌లోని గ్రిల్స్‌కు గ్రిల్ చేసి 15-20నిముషాలు మైక్రోవోవెన్‌లో పెట్టాలి.

7. చికెన్ గ్రిల్ క్రింది బాగంలో డ్రిప్ ట్రే పెట్టాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోనికి మార్చుకోవాలి. అంతే చికెన్ కల్మీ కబాబ్ రిసిపి రెడీ.

చోపింగ్ బోర్డ్ క్లీన్ చేయడానికి టిప్స్…

images (70)

సాల్ట్ స్ర్కబ్:

చోపింగ్ బోర్డ్ మీద వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు సందుల్లో మిగిలిపోయి బ్లాక్ మరకలు ఏర్పడుతాయి. ఇలాంటి బ్లాక్ మరకలు తొలగించడం కొంచెం కష్టమే. అందుకు ఒక నిమ్మతొక్క తీసుకొని దాని మీద కొద్దిగా ఉప్పు చిలకరించి చోపింగ్ బోర్డ్ మీద రుద్ది శుభ్రం చేయాలి.

చింతపండు గుజ్జు:

చింతపండు గుజ్జుకు కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి శుభ్రం చేయడం వల్ల ఇది ఇక గ్రేట్ క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ రెండింటి మిశ్రమంతో చోపింగ్ బోర్డ్ ను రుద్ది శుభ్రం చేయాలి. ఎలాంటి మొండి మరకలైనా తొలగించాలంటే చింతపండు నీటిలో మొదట నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.

నిమ్మరసం:

మీరు రెగ్యులర్ గా పచ్చిఅరటికాయ, బీట్ రూట్ వంటివి కత్తిపీట మీద తరిగినప్పుడు, మరకలు తప్పనిసరిగా ఏర్పడుతాయి. ఇవి తొలగించాలంటే నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని కొద్దిగా అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. తర్వాత నిమ్మకాయ తొక్కను తీసుకొని మరకల మీద బాగా రుద్దాలి. అంతే మొండి మరకలు చాలా సులువుగా తొలగిపోతాయి.

చుండ్రు సమస్యకు అల్లంతో చెక్…

images (26)
ఆరోగ్యానికి మేలు చేసే వంటింటి వస్తువులన్ని సౌందర్య సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి. అల్లంను మెత్తని పేస్ట్‌లా చేసుకుని, దానికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది.