Posts Tagged ‘lemon juice’

సమ్మర్‌లో ఆయిల్ స్కిన్ నివారించడానికి సులభ చిట్కాలు…

download (18)

– పాలు, గుడ్డులోని తెల్లసొన, క్యారెట్‌ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించినట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

– మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే పెరుగు కూడా జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కార్న్ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే జిడ్డుతత్వం తొలగిపోతుంది.

కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్‌, పెరుగు మరియు బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.

మునగాకు రసంతో మొటిమల నివారణ…

download (59)

మొటిమలతో బాధపడేవారు మునగాకు రసంలో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మొటిమల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

ఇంట్లో ఉండే ఔషధాలతో పెదాలపై నల్లని వలయాలకు చెక్…

images

నిమ్మకాయ రసంలో తేనె మరియు గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేస్తే పెదాలపై ఉండే నల్లటి వలయాలు తొలిగిపోయి అందంగా తయారు అవుతాయి.

జుట్టుకు మంచి కండీషనర్ కోసం…

download (56)
పావుకప్పు యాపిల్ గుజ్జులో కోడిగుడ్డులోని తెల్లసొనా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల జట్టు కండీషనర్ అయ్యి చిట్లడం వంటి సమస్యలు దరిచేరవు.

మొటిమలకు హోం మేడ్ టిప్స్…

images
మొటిమలకు ఖరీదైన మందులు వాడాల్సిన పని లేదు. ఇంట్లో లభించే తులసి, వేపాకు, ఐస్ మాత్రమే చాలునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పచ్చటి తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి గట్టిగా నలిపి పిండితే రసం వస్తుంది. ఆ రసానికి రెండు మూడు చుక్కల నిమ్మరసం కలపాలి. అలా తయారుచేసిన మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
అలాగే ముదురు వేపాకు ఆకులు, తులసి ఆకులను మరిగే నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. నీళ్లు తక్కువ ఉండేలా చూసుకుంటే మంచిది. బాగా ఉడికిన తరువాత ఆ నీటిని చల్లబరిచి.. దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు పెరగవు. ముఖం మీద కూడా ఎటువంటి అలర్జీలు రావు.
శుభ్రంగా ఉతికిన పొడిగుడ్డను తీసుకుని అందులో ఐస్‌ ముక్కల్ని వేసి మడత పెట్టి దాన్ని మొటిమల మీద కాసేపు ఉంచాలి. కొంచెం విరామం తరువాత మళ్లీ అలానే చేయాలి. అదే రోజు పడుకునేప్పుడు దూది ఉండలను నిమ్మరసంలో తడిపి ముఖాన్ని డీప్‌ క్లీన్‌ చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో చేస్తే మొటిమలు లేని మృదువైన చర్మం సొంతం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఇంట్లో ఉండే ఔషధాలతో బెల్లీఫాట్‌కు చెక్ పెట్టండి.

images (2)

చిన్న చిన్న చిట్కాలను పాటించి ఇంట్లో ఉండే ఔషధాలతో బెల్లీఫాట్‌ను తగ్గించుకోవచ్చు.

1. రోజును నిమ్మరసంతో ప్రారంభం: ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగాలి. బెల్లీఫాట్‌ను కరిగించడంలో ఇది చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.

2. తెల్ల అన్నంకి దూరం: తినే ఆహారంలో సాధ్యమైనంత వరకు తెల్ల అన్నాన్ని దూరంగా ఉంచాలి. తెల్ల అన్నంకి బదులుగా గోధుమ రంగు అన్నం (బ్రౌన్‌రైస్), బ్రౌన్ బ్రెడ్, ఓట్స్ లాంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.     

3. చక్కెర పదార్దాలకు దూరం: వీలైనంతవరకు చక్కెర పదార్దాలకు, పానీయాలకు మరియు తీపి వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.

4. ఎక్కువ నీటిని త్రాగడం: రోజులో కొంత కొంత విరామంతో నీటిని ఎక్కువగా త్రాగడం వలన బెల్లీఫాట్‌ను నివారించవచ్చు.

5. వెల్లుల్లి రెబ్బలను నమలడం: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తీసుకునే ముందు 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను నమలడం వలన శరీర రక్తప్రసరణను సాఫీగా జరిగేలా చేసి అనవసర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

6.  పండ్లు మరియు కూరగాయలతో: రోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక గిన్నె నిండా పండ్లు లేదా కూరగాయలు తినాలి.

ఆయాసంను అదుపులో పెట్టవచ్చు… ఈ చిట్కాలు పాటిస్తే సరి…

images (98)
ఆయాసం ఉన్నవారు ఒక చిటికెడు మెత్తటి ఉప్పు, రెండు చిటికెల పసుపు రోజూ తీసుకోవడం మంచిది. అలాగే వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది.
ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది.

క్రిస్పీ అండ్ స్పైసీ మసాలా చిప్ ఛాట్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (48)

కావల్సిన పదార్థాలు:

పొటాటో చిప్స్ – 500 g

సేవ్ – 1 cup

పచ్చిమిర్చి పేస్ట్ – 1/2 teaspoon

బెల్లం తురుము – 1/2 teaspoon

గ్రౌండ్ నట్స్ – 1/2 teaspoon

ఎండు మిర్చి పౌడర్ – 1/2 teaspoon

క్యారెట్ – 1/2 cup (finely chopped)

ఉల్లిపాయలు- 1/2 cup (finely chopped)

కీర – 1/2 cup (finely chopped)

నిమ్మరసం – 1/2 teaspoon

కొత్తిమీర – 4 to 5 (finely chopped)

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా, పొటాటో చిప్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేయాలి.

2. తర్వాత బ్రేక్ చేసిన పొటాటో చిప్స్ పీసెస్‌ను పెద్ద బౌల్లోకి మార్చుకోవాలి.

3. ఇప్పుడు, ఈ బౌల్లో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, వేరుశెనగపప్పు, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేయాలి.

4. తర్వాత ఇందులోనే క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగు, కీరదోస తరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈపదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేయాలి.

5. చివరగా కొత్తిమీర సేవ్ చిలకరించే సర్వ్ చేయాలి. అంతే స్పెషల్ చిప్ చాట్ రిసిపి రెడీ.

అప్పర్ లిప్ హెయిర్‌ను తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

download (15)

– షుగర్, నిమ్మరసం: ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్‌గా మారిన తర్వాత అప్పర్ లిప్ మీద అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. స్ర్కబ్ చేసిన 15నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– పసుపు, పాలు: పసుపు, పాలను ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేయాలి. పేస్ట్‌లా చేసుకున్నాక, ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయాలి. 10నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

– ఎగ్ వైట్: అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి ఎగ్ వైట్ బాగా సహాయపడుతుంది. ఎగ్ వైట్‌లో కొద్దిగా షుగర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పై పెదవుల మీద అప్లై చేసి డ్రై అయిన అరగంట తర్వాత పీలింగ్‌లా తొలగించాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– శెనగపిండి: కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. శెనగపిండిలో కొద్దిగా పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

మ్యాంగో రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (28)

కావల్సిన పదార్థాలు:

పచ్చిమామిడికాయ – 1

వండిన అన్నం – 1 Bowl

పచ్చిమిర్చి – 5 to 6

ఆవాలు – 1/4th Teaspoon

పసుపు – 1/4th Teaspoon

వేరుశెనగలు- 1/2 cup

కరివేపాకు – 8 to 10

కొత్తిమీర – 8 to 10 (finely chopped)

ఉప్పు : రుచికి సరిపడా

నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడగాలి.

2. తర్వాత పీలర్‌తో అవుటర్ స్కిన్‌ను తొలగించాలి.

3. ఇప్పుడు మామిడి కాయను గ్రేటర్‌తో తురుముకోవాలి.

4. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, పల్లీలు ఒకదానికి తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.

5. తర్వాత అందులో పచ్చిమామిడికాయ తురుము వేసి మొత్తం మిశ్రమం ఫ్రై చేసుకోవాలి.

6. పోపుతో పాటు మామిడికాయ కొద్దిసేపు వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం , ఉప్పు వేయాలి. మొత్తం మిశ్రం కలగలుపుకోవాలి.

7. చివరగా కొత్తిమీర తరగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి టేస్టీ మ్యాంగో రైస్ రెడీ.